255

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌  *ఇస్లాం చరిత్ర - 255*   🕌🛐🕋☪

🇸🇦🇸🇦  *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 170*  🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

*గజ్వయె బనూ నజీర్ : - 3*

*బనూ నజీర్ తెగ యూదులు మదీనాలో వదిలేసిన ఆస్తిపాస్తుల పంపకాలు : -*

మహాప్రవక్త (సల్లం), బనూ నజీర్ కు చెందిన ఆయుధాలు, భూములు, ఇళ్ళు మరియు తోటలను తన ఆధీనంలో ఉంచుకున్నారు. ఆయుధాల్లో యాభై కవచాలు, యాభై శిరస్త్రణాలు, మూడు వందల నలభై ఖడ్గాలు ఉన్నాయి.

బనూ నజీర్ కు చెందిన తోటలు, భూములు మరియు ఇళ్ళపై హక్కు కేవలం దైవప్రవక్త (సల్లం) గారిదే. వాటిని తామే ఉంచుకునే లేదా ఇతరులకు పంచిపెట్టే అధికారం ఆయన (సల్లం)కే ఉంది. కాబట్టి ఆయన (సల్లం), (యుద్ధ ధనంలా) ఈ సంపద నుండి 'ఖమ్స్' (అయిదో వంతు) తీయలేదు. ఎందుకంటే అల్లాహ్ ఆయన (సల్లం)కు ఈ ధన సంపద 'ఫై' ధనంగా బహూకరించినది. ఎందుకంటే ఈ సంపదను పొందడానికి ముస్లిములు గుర్రాలను, ఒంటెలను పరుగుదీయించి దాన్ని (ఖడ్గబలంతో) జయించలేదు గనుక. మహాప్రవక్త (సల్లం) తన ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి ఈ ధన సంపదను ప్రథమంగా హిజ్రత్ చేసి వచ్చిన ముహాజిర్లకు పంచి పెట్టారు. అయితే ఇద్దరు అన్సారులకు చెందిన సహాబా (రజి)లు 'హజ్రత్ అబూ దుజానా (రజి)' మరియు 'సహల్ బిన్ హునైఫ్ (రజి)'లకు ఇచ్చారు.

అదే కాకుండా ఆయన (సల్లం) కొంత భూభాగాన్ని తన కోసం ఉంచుకున్నారు. దీని ద్వారా ఆయన (సల్లం) తనకు, తన భార్యామణులకు కావలసిన వార్షిక బత్తెం అందుండే వచ్చేది. అందులో మిగిలినదంతా జిహాద్ కోసం, గుర్రాల కొనుగోలు కోసం ఖర్చుపెట్టేవారు.

గజ్వయె బనూ నజీర్, రబీ ఉల్ అవ్వల్ మాసం హిజ్రీ శకం - 4, అంటే క్రీ.శ - 625, ఆగష్టు మాసంలో సంభవించింది. అల్లాహ్ దానికి సంబంధించి పూర్తి ఒక సూరా, 'సురయె హష్ర్'నే అవతరింపజేశాడు. అందు యూదుల దేశ బహిష్కరణను వివరిస్తూ, వంచకుల వైఖరిని కూడా బట్టబయలు చేయడం జరిగింది. అందులోనే 'ఫై' ధనం గురించిన ఆదేశాలు జారీ చేస్తూ, ముహాజిర్లు మరియు అన్సారులను పొగడడం జరిగింది. అదే కాకుండా యుద్ధవ్యూహం ప్రకారం శత్రువుల చెట్లను కూడా నరకవచ్చని, వాటిని కాల్చవచ్చనే అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. ఇలా చేయడం భూమిలో సంక్షోభాన్ని లేవనెత్తడం కాదు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ముస్లింలను, దైవభీతిని అవలంబిస్తూ పరలోక జీవితం గురించి సిద్ధపడవలసిందిగా తాకీదు చేయడం జరిగింది. చివరిగా అల్లాహ్ స్తోత్రాలతో తన నామాలను, సుగుణాలను చెబుతూ ఆ అధ్యాయాన్ని ముగించాడు.

ఇబ్నె అబ్బాస్ (రజి) ఈ అధ్యాయం (హష్ర్ సురా) ప్రస్తావన వచ్చినప్పుడల్లా, *"దీన్ని 'సూరయె బనీయిన్నజీర్' అనండి"* అనేవారు.

*వేరొక సీరత్ కితాబ్ ప్రకారం, బనూ నజీర్ తెగ యూదులు మదీనాలో వదిలేసిన ఆస్తిపాస్తుల పంపకాలు : -*

బనీ నజీర్ యూదులు తమ ఆస్తిపాస్తులన్నిటినీ మదీనాలో వదిలేసి వెళ్ళిపోయారు. వాటిలో అనేక ఆయుధాలు కూడా ఉన్నాయి. సారవంతమైన పొలాలు, సస్యశ్యామలమైన తోటలు కూడా ఉన్నాయి. అవన్నీ సమరసొత్తు రూపంలో ముస్లింల లభించాయి.

*"ఆయనే గ్రంథవహులలోని అవిశ్వాసులను వారి ఇండ్ల నుండి తొలి (సారి) సమీకరణలోనే తీసివేశాడు. వారు వెళ్ళిపోతారని మీరు (సయితం) ఊహించలేదు. (పటిష్టమైన) తమ కోటలు తమను అల్లాహ్ (దెబ్బ) నుండి రక్షిస్తాయని వారు అనుకున్నారు. అయితే వారు ఊహించని చోటునుంచి అల్లాహ్ దెబ్బ వారిపై విరుచుకుపడింది. ఇంకా అల్లాహ్ వారి గుండెల్లో దడ పుట్టించాడు. వారు తమ ఇండ్లను చేజేతులా కొల్లగొట్టసాగారు. ముస్లింల చేతుల మీదుగా కూడా (ధ్వంసం చేయించుకున్నారు). కాబట్టి ఓ కళ్ళున్నవారలారా! దీని ద్వారా గుణపాఠం నేర్చుకోండి." (ఖుర్ఆన్ 59:2).*

దైవప్రవక్త (సల్లం) అన్సార్ ముస్లింలను సమావేశపరిచారు. వారు ముహాజిర్ ముస్లింలకు చేసిన మహోపకారాన్ని ప్రశంసించారు. అన్సార్ ముస్లింలు ముహాజిర్ ముస్లింలను సొంత సోదరులకన్నా ఎక్కువ అభిమానంతో చూసుకొని వారికి తమ ఇళ్ళలో ఆశ్రయం కల్పించారు. వాడుకోవడానికి కావలసిన సామగ్రి కూడా ఇచ్చారు. అన్నివిధాలా వారికి సౌకర్యాలు కల్పించారు. అన్సార్ ముస్లింలు చేసిన ఈ త్యాగనిరతిని మెచ్చుకుంటూ దైవప్రవక్త (సల్లం) వారికి నిండు హృదయంతో కృతజ్ఞతలు చెప్పారు. ఆ తరువాత ఇలా అన్నారు....; ↓

*"మీరు కోరితే బనీ నజీర్ యూదులు వదిలిపెట్టిన ఆస్తులు అందరికీ పంచుదాం. లేదా వాటిని ముహాజిర్లకు ఇచ్చివేద్దాం. ముహాజిర్లు మీ ఇళ్ళను ఖాళీ చేసి వెళ్ళిపోతారు."*

ఖజ్రజ్ తెగ తరఫున 'సఅద్ బిన్ ఉబాదా (రజి)' లేచి నిలబడ్డారు. అవస్ తెగ తరఫున 'సఅద్ బిన్ ముఆజ్ (రజి)' లేచారు.

*"దైవప్రవక్తా! మరో విషయం కూడా ఉంది. అదే అన్నిటికంటే మంచిదని నా అభిప్రాయం. మీరు ఈ ఆస్తులన్నిటినీ ముహాజిర్లకే ఇచ్చివేయండి. వారు మా ఇళ్ళను ఖాళీ చేసి వెళ్ళిపోనవసరమూ లేదు."* అన్నారు వారిద్దరూ.

*"బాగుంది. చాలా బాగుంది. దైవప్రవక్తా! ఇలా చేయడం మాకందరికీ ఇష్టమే"* అన్నారు అన్సార్ ముస్లింలంతా ముక్తకంఠంతో.

ఈ మాటలు విని దైవప్రవక్త (సల్లం) ముఖారవిందం వికసించింది.

*"ప్రభూ! అన్సార్ ముస్లింలను ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉంచు. వారిని నీ అనుగ్రహ ఛాయాలోకి తీసుకో. ప్రభూ! వారి కొడుకులు, మనవళ్ళకు కూడా సుఖసంతోషాలు ప్రసాదించు."* అన్నారు ఆయన (సల్లం) ఆనందపారవశ్యంతో.

*"ఇంకా - అల్లాహ్ తన ప్రవక్తకు అందజేసిన వారి సొమ్ముల కోసం మీరు మీ గుర్రాలనుగానీ, ఒంటెలనుగానీ పరుగెత్తించలేదు. అల్లాహ్ తన ప్రవక్తలకు తాను కోరిన వారిపై అధికారం వొసగుతాడు. అల్లాహ్ కు అన్నింటిపై అధికారం ఉంది." (ఖుర్ఆన్ 59:6).*

*"(మీరు చెమటోడ్చకుండానే ఇతర) పుర ప్రజల నుండి అల్లాహ్ తన ప్రవక్తకు స్వాధీనపరచిన సొమ్ము అల్లాహ్ కు, ప్రవక్తకు, బంధువులకు, అనాథలకు, నిరుపేదలకు, బాటసారులకు వర్తిస్తుంది. ఈ సంపద మీలోని ధనిక వర్గాల మధ్యనే పరిభ్రమిస్తూ ఉండరాదన్న ఉద్దేశ్యంతో ఈ విధంగా నిర్ణయించటం జరిగింది. దైవప్రవక్త మీకు ఇచ్చిన దానిని (సంతోషంగా) పుచ్చుకోండి. ఆయన ఏ విషయం నుండైనా మిమ్మల్ని వారిస్తే, దాన్ని వదిలిపెట్టండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ కఠినంగా శిక్షించగలవాడు." (ఖుర్ఆన్ 59:7).*

*"(ముఖ్యంగా ఈ 'ఫై' సొమ్ము) తమ ఇల్లూ వాకిలి నుండి, తమ ఆస్తిపాస్తుల నుండి గెంటివేయబడిన నిరుపేద ముహాజిర్లకు వర్తిస్తుంది. (ఎందుకంటే) వారు దైవానుగ్రహాన్ని, దైవప్రసన్నతను ఆశిస్తూ, దైవానికీ, ఆయన ప్రవక్తకు తోడ్పడుతున్నారు. వారే అసలు సిసలు సత్యసంధులు." (ఖుర్ఆన్ 59:8).*

*"ఇకపోతే వీరికంటే ముందే ఈ ప్రదేశం (మదీనా)లోనూ, విశ్వాసంలోనూ స్థానికులై ఉన్నవారు (వారికి కూడా ఈ సొమ్ము వర్తిస్తుంది); వారు ఇల్లూ వాకిలిని వదలి తమ వైపుకు వలస వచ్చే ముహాజిర్లను ప్రేమిస్తారు. వారికి ఏమి ఇవ్వబడినా దానిపై తమ ఆంతర్యాలలో ఏ కాస్త అసూయను కూడా రానివ్వరు. తాము అమిత అవసరంలో ఉన్నప్పటికీ తమ పైన వారికే ప్రాధాన్యతనిస్తారు. వాస్తవానికి తమ స్వార్థప్రియత్వం (పేరాశ) నుండి రక్షించబడినవారే కృతార్థులు." (ఖుర్ఆన్ 59:9).*

*"వారి తరువాత వచ్చినవారు (వారికీ ఈ సొమ్ము వర్తిస్తుంది), వారిలా వేడుకుంటారు : "మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను క్షమించు. విశ్వాసులు యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్నీ కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగినవాడవు, కనికరించేవాడవు." (ఖుర్ఆన్ 59:10).*

ఆ తరువాత మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) బనీ నజీర్ యూదుల పంట భూములు, ఇతర స్థిరచరాస్తులన్నిటినీ ముహాజిర్ ముస్లింలకు పంచిచ్చారు. ఇద్దరు నిరుపేద అన్సార్ ముస్లింలు ఉంటే వారికి కూడా కొంత పంచిపెట్టారు. ఇద్దరు యూదులు ఇస్లాం స్వీకరించినందుకు వారి ఆస్తుల జోలికిపోకుండా వాటిని వారికే వదిలిపెట్టారు. ఈ విధంగా ముహాజిర్ ముస్లింలు అన్సార్ ముస్లింలపై ఆధారపడవలసిన అవసరం లేకుండా సొంత ఇంటివాళ్ళయ్యారు.

*6. గజ్వయె నజద్ : - ↓*

*In Sha Allah రేపటి భాగంలో....; →*

✏✏ *®@£€€q  +97433572282* ✏✏ 
             *(rafeeq)*

✏✏  *Salman    +919700067779* ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment