10,11,12

🕋🕋🕋🕋 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్  🕋🕋🕋🕋


🛐🛐🛐🛐 అనంత కరుణామయుడు అపారా కృపాశీలుడు అయిన *అల్లాహ్*  పేరుతో ప్రారంభిస్తున్నాను 🛐🛐🛐🛐


---------------------------------------------------


      ☪☪☪☪  *ఇస్లాం చరిత్ర*  ☪☪☪☪


భాగము - 10,11,12              Date  : 22/11/2017


                                 


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


*యూసుఫ్ అలైహిస్సలామ్* 


దివ్య ఖురాన్ లో ఈ కథ చాలా వివరంగా, చాలా ఆసక్తిదాయకంగా చెప్పడం జరిగింది. ఇందులో హాస్యం, మానవ బలహీనతలు, ఉన్నత గుణ గణాలు, ఈర్ష్య అసూయలు, విద్వేషం, అహం, వాంఛలు, మోసం, కుట్ర, క్రూరత్వం, భీభత్సం, సహనం, విశ్వాసం, ధైర్యం, సద్వర్తనం, సానుభూతి వంటి అనేక గుణగణాలు మన ముందుకు వస్తాయి. పాచ్య దేశాల కవులపై ఈ కథ చాల గొప్ప ప్రభావాన్ని వేసింది. ఈ కథ ఆధారంగ అల్లిన కొన్ని కవితలు సాహిత్యంలో అత్యుత్తమ కళాఖండాలుగా నిలిచిపోయాయి. దివ్య ఖురాన్ లో ఈ కథ ప్రస్తావించబడిన తీరు నైతికంగా మనిషిని తీర్చి దిద్దేదిగా ఉంది.


ప్రవక్త యాఖూబ్ అలైహిస్సలామ్ యొక్క 4 గురు భార్యాలలో , 
మొదటి భార్య లియా తో 6 గురు అబ్బాయి లు , 1 అమ్మాయి.
లియా బానిస తో 2 రు అబ్బాయి లు.
రాహిల్ బానిస తో 2 రు అబ్బాయి లు కలిగారు.


               వీరి ముగ్గురికి పిల్లలు కలిగారు , తనకి పిల్లలు కలగలేదు అని రాహిల్ చాలా బాధపడింది. తర్వాత తనకి ఒక మంచి కొడుకు ని ప్రసాందించండి అని అల్లాహ్ తో దుఆ చేసింది , అల్లాహ్ రాహిల్ దుఆ ని ఆలకించి ఒక అందమైన కొడుకు యూసుఫ్ అలైహిస్సలామ్ ని ప్రసాదించాడు , ఆ తర్వాత రెండవ కొడుకు గా బెన్యామీన్ ను ప్రసాదించాడు.

*యూసుఫ్ బాల్యం : -*        


ఒక రోజు సూర్యుడు తూర్పున లేత కిరణాలను వర్షిన్తున్నప్పుడు ప్రవక్త యాకూబ్ (అలైహి) కుమారుడు యూసుఫ్ (అలైహి) నిద్ర లేచారు. ఆయనకు నిద్రలో ఒక మంచి కల వచ్చింది. సంతోషంగా యూసుఫ్ తన తండ్రి వద్దకు పరుగున వెళ్లి తనకు వచ్చిన కలను చెప్పారు. “నాన్నా! పదకొండు నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు నా ముందు సాష్టాంగపడినట్లు కల కన్నాను” అన్నారు. తండ్రి ముఖం లో సంతోషం విప్పారింది. తన తాతగారు ప్రవక్త ఇబ్రహీమ్‌ అలైహిస్సలామ్ చెప్పిన భవిష్య వాణి నెరవేరేది యూసుఫ్ అలైహిస్సలామ్ వల్లనే అని యాఖూబ్ అలైహిస్సలామ్ గ్రహించారు. తన సంతానంలో దైవసందేశాన్ని ప్రజలకు చేరవేసే వారు జన్మిస్తారని ఇబ్రహీమ్ ప్రవక్త (అలైహి) ముందే చెప్పి ఉన్నారు.


             “నీకు గొప్ప భవిష్యత్తు ఉందని నీ కల సూచిస్తుంది” అని యాఖూబ్ (అలైహి) తన కుమారుడైన యూసుఫ్ కి చెప్పారు. అయితే యూసుఫ్‌ కు ఉన్న అనేక మంది సోదరుల అసూయ గురించి ఆయన భయపడ్డారు. అందువల్ల ఈ కల గురించి సోదరులకు ఎవరికీ చెప్పవద్దని అన్నారు. ఈ కల గురించి చెబితే వారు నీకు వ్యతిరేకంగా కుట్రలు చేయవచ్చని హెచ్చరించారు. మానవాళికి శత్రువైన షైతాన్ సోదరుల మధ్య వైరాన్ని రెచ్చ గొట్టగలడు, నీవు కలగన్నట్లు గానే జరుగుతుంది. నీ ప్రభువు ఓ మహాకార్యం కోసం నిన్ను ఎంచుకున్నాడు. అందుకు అల్లాహ్ నీకు విషయ లోతుపాతుల్ని తరచిచూడగల విశేషాజ్ఞానం ప్రసాదిస్తాడు. గతం లో మా తాత గారు అయిన ఇబ్రహీం అలైహిస్సలామ్, మా నాన్న గారు అయిన ఇస్ హాఖ్ అలైహిస్సలామ్ లకు అల్లాహ్ ఎలా మహాభాగ్యాలు అనుగ్రహించాడో అలాగే ఇపుడు నీకు మహాభాగ్యాలు అనుగ్రహిస్తాడు. "నీ ప్రభువు సర్వజ్ఞాని , మహా వివేకవంతుడు" అని అన్నారు యాఖూబ్ అలైహిస్సలామ్. (ఖురాన్ 12:4,5,6).


యూసుఫ్‌ (అలైహి) 18 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఆయన దృఢమైన, అందమైన యువకునిగా ఎదిగారు. చాలా నమ్రత కలిగిన వారిగా పేరుపడ్డారు. యూసుఫ్ గౌరవంగా వ్యవహరించేవారు. దయ సానుభూతులతో ప్రవర్తించేవారు. ఆయన సోదరుడు బిన్‌యామిన్‌ కూడా అలాంటి గుణగణాలు కలిగినవాడే. వీరిద్దరూ ఒకే తల్లి రాహిల్ కుమారులు. సుగుణ సంపన్నులైన ఈ ఇరువురు కుమారుల పట్ల తండ్రి యాఖూబ్ (అలైహి) ఎక్కువగా ఇష్టం ప్రదర్శించేవారు. వీరిద్దరిని తన దృష్టి నుంచి పక్కకు వెళ్ళనిచ్చెవారు కాదు. వారిని పరిరక్షించడానికి గాను ఇంటి తోటలొనే వారిని పనిచేసేలా నిర్దేశించారు. 


*సవతి సోదరుల కుట్ర* 


అసూయ అగ్ని వంటిది. అది సోదరుల గుండెల్లో పొగలు కక్కడం ప్రారంభించింది, విద్వేషంగా మారింది. ఒక రోజు ఒక సోదరుడు మిగిలిన 9 మంది సోదరులతో “నాన్నగారు మనందరికన్నా యూసుఫ్, బిన్‌యామిన్‌ల పట్ల ఎక్కువ ప్రేమ చూపుతున్నారు. నిజానికి వారిద్దరికన్నా మనం బలంగా ఉన్నాం. మన అమ్మల కన్నా వారి అమ్మనే ఆయన ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇది న్యాయం కాదు” అన్నాడు. వారందరూ తమకు అన్యాయం జరిగిపోతొందని భావించారు.


వారి మనసు లో చెడు ఆలోచనలు మొలకెత్తి పెనువృక్షాలు కాసాగాయి. యూసుఫ్ (అలైహి)ను చంపేయాలని వారు కుట్రపన్నారు. కాని వారిలో పెద్దవాడు, తెలివిగలవాడు అయిన యహూదా మాత్రం చంపడానికి అంగీకరించలేదు. “హత్య చేయడానికి విశ్వాసులకు అనుమతి లేదు. యూసుఫ్ ఎలాంటి నేరం చేయలేదు. అతను మనకు ఎలాంటి హాని కలిగించలేదు. మనం ఒక పని చేద్దాం. వర్తక బృందాలు వెళ్లే దారిలో ఏదైనా బావిలో అతడిని తోసేద్దాం. నీటి కోసం బావి దగ్గరకు వచ్చే ప్రయాణికులు, బావి లో ఉన్న యూసుఫ్ ని చూసి , తమతో తీసుకుపోయి దూర ప్రాంతాల్లో బానిసగా అమ్మేస్తారు. ఈ విధంగా మనం యూసుఫ్ ని వదిలించుకోవచ్చు." అని యహూదా సలహా ఇచ్చాడు. (ఖురాన్ 12:8,9,10).


ఒక రోజు గొర్రెలను మేపడానికి అడివికి వెళుతూ యూసుఫ్ ని కూడా తమతో పంపమని వారు తండ్రిని కోరారు. అతణ్ణి జాగ్రత్తగా చూసుకుంటామని తండ్రికి హామీ ఇచ్చారు. యూసుఫ్‌ తాను కూడా వెళ్ళాలని చాలా సరదా పడ్డారు. బిన్యామిన్ కూడా వెళ్ళాలని ఉ౦ది. కాని యాఖూబ్ అలైహిస్సలామ్ అందుకు ఒప్పుకోలేదు. తండ్రి పంపనందు వల్ల యూసుఫ్ చాలా నిరాశపడ్డాడు.
కొద్దిరోజుల తర్వాత మళ్ళీ అందరూ మాట్లాడుకుని వారి తండ్రి యాఖూబ్ ని కలిసి "యూసుఫ్ విషయం లో మీరు మమ్మల్ని నమ్మరేమిటి ? నిజంగా మేము అతని శ్రేయోభిలాషులం. రేపు యూసుఫ్ ని మా వెంట పంపండి, మేమంతా కలిసి యూసుఫ్ ని జాగ్రత గా చూసుకుంటాము. యాకూబ్‌ (అలైహి) తన భయాన్ని వెలిబుచ్చుతూ, మీరు గొర్రెలపై దృష్టి పెట్టి ఉన్నప్పుడు ఏదైనా క్రూర జంతువు వచ్చి యూసుఫ్‌ కు హాని తలపెట్టవచ్చన్నారు. కాని వారు ఆయనకు హామీ ఇస్తూ తాము చాలా మందిమి ఉన్నామని, ఎలాంటి క్రూర జంతువు వల్ల ప్రమాదం ఉండదని అన్నారు. (ఖురాన్ 12:11-14).


చివరకు ఆ 10 మంది కొడుకుల మాయ మాటలు విని యాఖూబ్ అలైహిస్సలామ్, యూసుఫ్ ను వారితో పంపడానికి అయిష్టంగానే అంగీకరించారు. ఇపుడు యూసుఫ్‌ ను వదిలించుకోవచ్చని వారు చాలా చాలా సంబరపడ్డారు. ఇక నుంచి తండ్రి ప్రేమ తమకే లభిస్తుందని భావించారు. ఇక అందరూ గొర్రె లను మేపడానికి వెళ్లేందుకు , యూసుఫ్ ని వదిలించుకునేందుకు అందరూ సిద్ధం అయ్యారు. గొర్రెలను బయటికి వదిలి, ఊరి బయటకు వచ్చేసారు. కొద్దిసేపు అందరూ ఏమి ఎరగనట్టుగా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కాసేపటి తర్వాత యూసుఫ్ ని బావి లో పడేయాలని పన్నిన పన్నాగం ప్రకారం నీళ్ళు తాగాలన్న సాకుతో బావి దగ్గరకు యూసుఫ్ ని తీసుకువెళ్లారు.


తర్వాత జరిగిన విషయమై Insha Allah రేపటి భాగము - 13 లో తెలుసుకుందాము.


ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-


ప్రియమైన ముస్లిం సోదరులారా!  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి , ఇదేదో 10 మందికి send చేస్తే మంచి జరుగుతుంది , send చేయకపోతే చేడు జరుగుతుంది అనుకునే msg లు కావు . కాబట్టి మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .

No comments:

Post a Comment