44

🤚🏻✋🏻 🕌   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*   🕌 🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

                               *భాగము - 44* 

____________________________________________

*సులైమాన్ అలైహిస్సలామ్ ను రాజుగా నియమించాలని దావూద్ అలైహిస్సలామ్ నిర్ణయం* 

ప్రవక్త హాజ్రత్ దావూద్ (అలైహి), తన తర్వాత తన కుమారుడు సులైమాన్ (అలైహి) ను రాజుగా చేయాలని నిర్ణయించారు. కానీ, దావూద్ (అలైహి) మరో కుమారుడు అబ్సాలోమ్, సులైమాన్ (అలైహి) కన్నా పెద్దవాడు. పెద్దవాడు అయినప్పటికీ రాజ భాద్యతలు నిర్వర్తించే యోగ్యతలు అబ్సాలోమ్ కు లేవు.

తన తండ్రి దావూద్ (అలైహి) తదుపరి రాజుగా సులైమాన్ (అలైహి) ని చేయాలని నిర్ణయించడం అబ్సాలోమ్ కు నచ్చలేదు. "సులైమాన్ (అలైహి) కన్నా వయసులో నేను పెద్దవాడిని, అలాంటపుడు రాజబాధ్యతలు నాకు అప్పగించకుండా వాడికి అప్పగిస్తున్నారు." అని కపట బుద్ధితో ఆలోచించసాగాడు. అతనిలో ఈర్ష్యాద్వేషాలు బుసలు కొట్టాయి. ఎలాగైనా రాజసింహాసనాన్ని తన హస్తగతం చేసుకోవాలని అతను కుట్రపన్నాడు.

ముందుగా అబ్సాలోమ్ రాజ్యంలోని ప్రజలను మభ్యపుచ్చి తన పక్షానికి వచ్చేలా చేయాలనుకున్నాడు. ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి ఒక పథకం వేశాడు. తమ పథకం అనుకున్నది అనుకున్నట్టుగా జరగటానికి తన కుట్రకు పనికివచ్చే కొంత మంది దుర్మార్గులను తన అనుచరులుగా చేర్చుకున్నాడు. అపుడు అబ్సాలోమ్ తన అనుచరులను ఉద్దేశిస్తూ....,

అబ్సాలోమ్ : - నా అనుచరులారా! విన్నారా నా తండ్రి ప్రకటన. సులైమాన్ కన్నా నేను పెద్దవాడిని. అయిన కూడా రాజ్యపు పగ్గాలు నాకు అప్పజెప్పకుండా వాడిని రాజుగా చేస్తున్నారు. అందుకే మిమ్మల్ని నా సహచరులుగా నియమించుకున్నాను. మీ సహాయంతో నేను సింహాసనాన్ని అధిష్టించాలి. సింహాసనం నాకే దక్కాలి. అందుకు మీ మద్దతు నాకు అవసరం. నేను అనుకున్నది జరిగితే మీరు ఇలాగే నా సహచరులుగా ఉండిపోతారు.

అనుచరులు : - చెప్పండి! మమ్మల్ని ఏం చేయమంటారు?

అబ్సాలోమ్ : - ముందుగా మనం ప్రజల్ని మన వైపుకు తిప్పుకోవాలి. అది ఎలాగంటే ప్రజలు తమ వివాదాల పరిష్కారానికి సులైమాన్ (అలైహి) దర్బారుకు వస్తున్నప్పుడు వారిని అక్కడకి వెళ్లకుండా అడ్డుకొని నా వద్దకు వచ్చేలా చేయండి. ఆ విధంగా నేను చాలా వివేకవంతుడిని అన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించవచ్చు.

ఒక రోజు అబ్సాలోమ్, తన తండ్రి దావూద్ (అలైహి) తో....,

అబ్సాలోమ్ : - నాన్నగారు! గిబియన్ పట్టణంలో నేను చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. నేను గిబియన్ పట్టణానికి వెళ్ళడానికి మీ అనుమతి కోరుతున్నాను. దయచేసి అనుమతి ఇప్పించండి.

తన కుమారుని అనుమతిని దావూద్ (అలైహి) ఆమోదించారు.

ఈ విధంగా అబ్సాలోమ్, తను పన్నిన కుట్రలో భాగంగా బయటకు వెళ్లేందుకు పని ఉందని సాకులు చెప్పి అనుమతి పొందాడు.

ఆ తర్వాత అబ్సాలోమ్ గిబియన్ పట్టణానికి తనతో పాటు తన అనుచరులను కూడా వెంట తీసుకొనివెళ్ళాడు. వారంతా గిబియన్ పట్టణానికి చేరుకోగానే అక్కడ నివసిస్తున్న బనీఇస్రాయీల్ లోని వివిధ తెగలకు రహస్య సందేశాలు పంపించాడు. ఆ రహస్య సందేశం ఏమనగా!

"ప్రజలారా! నా తండ్రి దావూద్ (అలైహి), వయసులో పెద్దవాడిని అయిన నన్ను కాదని నా కంటే చిన్నవాడైన సులైమాన్ (అలైహి) ను రాజుగా నియమించాలని అనుకుంటున్నారు. ఇది సమంజసమైనా విషయం కాదు. మిమ్మల్ని పాలించే రాజులలో నేను అగ్రభాగాన నిలవాలనుకుంటున్నాను. నగారా శబ్దం వినగానే నన్ను రాజుగా ప్రకటించండి."

కానీ, ఆ తెగల ప్రజలు దావూద్ (అలైహి) పట్ల విశ్వాసం పట్ల అబ్సాలోమ్ ఆదేశాన్ని లక్ష్యపెట్టలేదు.

తెగల ప్రజలు : - అబ్సాలోమ్! మహారాజు దావూద్ (అలైహి) ఆదేశాన్ని మేము ఎన్నటికీ ధిక్కరించము. నీ వక్రబుద్ధిని మానుకో. నీకు అనుగుణంగా ఉన్న నీ ఆదేశాలను మేము ఎన్నటికీ ఒప్పుకోము.

ఈ విధంగా ఆ తెగల ప్రజలు అబ్సాలోమ్ ఆదేశాన్ని ధిక్కరించారు. ఆ ప్రజల నిర్ణయం విని అబ్సాలోమ్ తీవ్ర కోపోద్రికుడయ్యాడు.

అబ్సాలోమ్ : - నా అనుచరులారా! నా ఆదేశాన్ని ధిక్కరించిన ఈ తెగల ప్రజలపై విరుచుకపడండి.

ఈ ఆదేశాన్ని విన్న వెంటనే అబ్సాలోమ్ అనుచరులు వారిపై క్రూరంగా దాడి చేయసాగారు. ఆ దాడిని తెగల ప్రజల కూడా ప్రతిఘటించారు. అపుడు అబ్సాలోమ్ అనుచరులకు మరియు వివిధ తెగలకు తీవ్రమైన పోరాటం జరిగింది. ఆ పోరాటంలో పట్టణం అంతా దాదాపుగా నాశనం అయ్యింది.

*విషయం తెలుసుకున్న దావూద్ అలైహిస్సలామ్* 

తన కుమారుడు అబ్సాలోమ్ చేసిన అరాచకం గురించి దావూద్ (అలైహి) కు తెలిసింది. తన స్వంత కుమారుడు ఇలా చేశాడని తెలిసి దావూద్ (అలైహి) చాలా బాధకు గురయ్యారు. అయినా ఆయన సంయమనాన్ని కోల్పోలేదు. తన రాజ్యంలో అశాంతిని, అహింసని, రక్తపాతాన్ని దావూద్ (అలైహి) ఇష్టపడలేదు. అబ్సాలోమ్, ఆ పట్టణాన్ని బలవంతంగా వశపరచుకోవచ్చు అని దావూద్ (అలైహి) భయపడ్డారు. అపుడు దావూద్ (అలైహి) తన అనుచరులను ఉద్దేశిస్తూ....,

దావూద్ (అలైహి) : - నా అనుచరులారా! నా కుమారుడు చేసిన ఈ ద్రోహాన్ని చూసి నా మనసు కకావికలమయ్యింది. అబ్సాలోమ్ అక్కడ ప్రజలపై పోరాటం చేస్తూ రక్తపాతం సృష్టిస్తున్నాడు. అందువల్ల మీరు వెళ్లి అక్కడ ఉన్న తెగల ప్రజల్ని వెంటనే పట్టణాన్ని వదిలివేయమని చెప్పండి. వారికి హాని కలగకముందే అక్కడి నుంచి తప్పించుకోమని చెప్పండి. ఇది నా ఆదేశం అని కూడా చెప్పండి.

దావూద్ (అలైహి) ఆలివ్ కొండను ఎక్కి ఈ సమస్య గురించి అల్లాహ్ ను ప్రార్థించారు. ఆ తెగల ప్రజలను కాపాడమని అల్లాహ్ తో వేడుకున్నారు. 

మహారాజు దావూద్ (అలైహి) ఆదేశాన్ని, ఆయన అనుచరుల ద్వారా తెగల ప్రజల తెలుసుకున్నారు. ఆ వెంటనే చాలా మంది ప్రజలు పట్టణాన్ని వదిలి జోర్డాన్ నది దాటి వచ్చేశారు. ఆ తెగలలోని కొంత మంది ప్రజలు తమ ఈ దుస్థితికి మహారాజు దావూద్ (అలైహి) కారణమని విమర్శించారు. కానీ, చాలా మంది ప్రజలు దావూద్ (అలైహి) పక్షాన విశ్వాసంగా నిలబడ్డారు. అపుడు దావూద్ (అలైహి) వారితో....,

దావూద్ (అలైహి) : - నా స్వంత కుమారుడు నాకు ద్రోహం చేసినపుడు పరులు వ్యతిరేకమయ్యారని నేను ఎలా చెప్పగలను.

దావూద్ (అలైహి) తన సభలోని సహచరులను ఉద్దేశిస్తూ....,

దావూద్ (అలైహి) : - సభీకులారా! వివిధ తెగల ప్రజలపై పోరాటం జరుగుతున్న పట్టణానికి, పరిస్థితి చేయి దాటక ముందే పరిస్థితుల్ని చక్కబెట్టేందుకు కొంత మంది అధికారులను మరియు సైనికులను అక్కడికి పంపించండి. కానీ అబ్సాలోమ్ కు ఎలాంటి హాని చేయవద్దు.

మహారాజు ఆదేశం విన్న వెంటనే అనుచరులు, సైనికులు అక్కడి పరిస్థితుల్ని సరిదిద్దేందుకు బయలుదేరి వెళ్లారు. అక్కడికి చేరుకోగానే అనుచరులు మరియు సైనికులు ఆ తిరుగుబాటును కఠినంగా అణచివేశారు. అబ్సాలోమ్ వారిపై ప్రతిఘటించాడు. అపుడు ఆ సైనికులు అబ్సాలోమ్ ను హతమార్చారు. ఈ విధంగా ఈ పోరాటంలో అబ్సాలోమ్ హతమయ్యాడు.

ఆ తర్వాత పట్టణంలో మళ్ళీ శాంతి భద్రతలు పునరుద్ధరించబడ్డాయి. దావూద్ (అలైహి) రాజుగా పరిపాలించడం అలాగే కొనసాగింది.

Insha Allah రేపటి భాగము - 45 లో పాలనా పగ్గాలు చేపట్టిన సులైమాన్ (అలైహి) రాజ్యపాలన గురించి తెలుసుకుందాము.

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్రను మన ముస్లిం సోదరులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

☆☆   ®@£€€q +97433572282  ☆☆

No comments:

Post a Comment