43

🤚🏻✋🏻 🕌   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*   🕌 🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

                               *భాగము - 43* 

____________________________________________

*సులైమాన్ అలైహిస్సలామ్ : - - : క్రీ.పూ. 970-931* 

ప్రవక్త హాజ్రత్ దావూద్ (అలైహి) వివేకం మూర్తీభవించిన పాలకులు. ఆయన కుమారుడు సులైమాన్ (అలైహి) మరింత తెలివి, వివేకసంపద కలిగినవారు. సులైమాన్ (అలైహి) చిన్నపిల్లవాణిగా ఉన్నప్పుడే అపార తెలివితేటలు, వివేక విచక్షణలు ప్రదర్శించారు. రాజ దర్బారులో వివాదాలు, ఫిర్యాదుల తీర్పులు జరుగుతున్నప్పుడు మహారాజు దావూద్ (అలైహి) తన కుమారున్ని కూడా దర్బారులో పిలిచి కూర్చుండబెట్టేవారు.

ఒక రోజు రాజదర్బారులో సభ జరుగుతోంది. మహారాజు దావూద్ (అలైహి), యువరాజు సులైమాన్ (అలైహి), రాజు సలహాదారులు, రాజ సేవకులు, రాజ భటులు, మంత్రులు మరియు ప్రజలు ఆ సభలో కొలువైయ్యారు.

అపుడు ఆ సభలోకి ఒక రైతు తన ఫిర్యాదు తీసుకొనివచ్చాడు. ఆ రైతు తన పొలంలో గోధుమ, మొక్కజొన్న మొదలగు పంటలు పండించేవాడు. అతని పొలంలో ఫలవృక్షాలు కూడా ఉండేవి. ఈ రైతుకు పొరుగున మరో వ్యక్తి ఉన్నాడు. ఆ పొరుగు వ్యక్తి గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగించేవాడు.

రైతు పొలంలో పంట బాగా ఏపుగా పెరిగి కోతకు వచ్చినపుడు, ఆ పొరుగువాని మొత్తం గొర్రెలు రైతు పొలంలోకి ప్రవేశించి పండిన పంట మొత్తం విచ్చలవిడిగా ఆగం చేసి వెళ్ళేవి.

ఆ పొరుగువాని గొర్రెలు ఇలా చేయడం ఈ ఒక్కసారే కాదు, పంట కోతకు వచ్చిన ప్రతిసారి ఇలానే చేసేవి. "మీరు మీ గొర్రెలపై ఓ కన్నేసి ఉంచండి." అని  రైతు, గొర్రెల యజమానికి ఎన్ని సార్లు విన్నవించుకున్నా కూడా ఆ గొర్రెల యజమాని ఆ సమస్య గురించి పట్టించుకునేవాడు కాడు. ఆ గొర్రెల వ్యక్తికి, రైతు పదే పదే చెప్పినా తన ధోరణిని మార్చుకునేవాడు కాడు. ఇక విసుగెత్తిన ఆ రైతు న్యాయం కోసం చివరకు రాజ దర్బారును ఆశ్రయించాడు.

సమస్య పరిష్కారం కోసం రైతు మరియు గొర్రెల యజమాని రాజ దర్బారులోని సభాప్రాంగణంలోకి ప్రవేశించారు. అప్పటికే సభ ప్రారంభమయ్యింది. అపుడు రైతు మహారాజు దావూద్ (అలైహి) తో....,

రైతు : - మహారాజా! నేను ఒక సాధారణ రైతును. వ్యవసాయమే నా వృత్తి. ఆ వ్యవసాయం మీదనే నా కుటుంబం ఆధారపడి జీవిస్తోంది. నేను నా పొలంలో గోధుమ, మొక్కజొన్న మొదలగు ధాన్యాలు సేద్యం చేస్తాను. ఇతను నా పొలం పక్కన నివాసం ఉండే వ్యక్తి. నా పొలం పక్కన ఉండే ఈ పొరుగు వ్యక్తికి చెందిన గొర్రెలు మొత్తం, చేతికి అందివచ్చిన నా పంటను మొత్తం నాశనం చేసి, గడ్డిపోచ కూడా మిగలకుండా పంటను ఆరగించి వెళ్తున్నాయి. గొర్రెలు ఇలా చేయడం ఈ ఒక్కసారే కాదు కోతలు మొదలుపెడదాము అనుకునే ప్రతీ సారి పంటను నాశనం చేసేస్తున్నాయి. నేను ఆ పొరుగు వ్యక్తికి "మీ గొర్రెలు చేతికి అందివచ్చిన నా పంటను ఆగం చేసి, నా పంటను నాకు కాకుండా చేస్తున్నాయి. దయచేసి మీరు మీ గొర్రెలపై మీరు శ్రద్ధ వహించండి." అని ఎన్ని సార్లు విన్నవించుకున్నా ఆ గొర్రెల యజమాని తనకేమీ ఎరుగనట్టు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నాడు. ఈ విధంగా నా కష్టం నీరుగారిపోతోంది. దయచేసి ఈ నా సమస్యకు న్యాయం చేకూర్చండి.

దావూద్ (అలైహి) : - రైతు తన సమస్యను వివరించాడు. దీనికి నీ వివరణ ఏంటి? (ఆ గొర్రెల యజమానిని ఉద్దేశిస్తూ....,)

గొర్రెల యజమాని : - రైతు చేసిన ఫిర్యాదు నిజమే! (నిర్లక్ష్యంగా)

ఇద్దరి వాంగ్మూలాలను విన్న తర్వాత మహారాజు దావూద్ (అలైహి) తన తీర్పు ను వెల్లడిస్తూ....,

దావూద్ (అలైహి) : - రైతుకు జరిగిన నష్టానికి గాను, గొర్రెల యజమాని తన మొత్తం గొర్రెలను రైతుకు ఇచ్చివేసి, ఆ విధంగా రైతుకు నష్టపరిహారం చెల్లించాలి. తన గొర్రెలను విచ్చలవిడిగా తిరగడానికి వదిలివేసిన ఆ గొర్రెల యజమాని ఈ విధంగా ఒక గుణపాఠం నేర్చుకుంటాడు.

తన మొత్తం గొర్రెలను నష్టపరిహారం కింద రైతుకు ఇచ్చి వేయాలి అన్న తీర్పును విన్న ఆ గొర్రెల యజమాని నిర్ఘాంతపోయాడు. ఇక చేసేది ఏమీలేక అలానే నిల్చుండిపోయాడు.

ఈ సభలో దావూద్ (అలైహి) తో పాటు, ఆయన కుమారుడు సులైమాన్ (అలైహి) కుడా ఉన్నారు. అప్పటికి సులైమాన్ (అలైహి) వయసు పదకొండు సంవత్సరాలు మాత్రమే. తన తండ్రి దావూద్ (అలైహి) తీర్పుని విని సులైమాన్ (అలైహి) పైకి లేచి....,

సులైమాన్ (అలైహి) : - నాన్నగారు! ఈ తీర్పు పై మాట్లాడడానికి నేను మీ అనుమతి కోరుతున్నాను. దయచేసి అనుమతి ఇవ్వండి.

దావూద్ (అలైహి) : - అలాగే! అనుమతి ఇస్తున్నాం.

సులైమాన్ (అలైహి) : - ముందుగా, నేను ఈ తీర్పుతో ఏకీభవించడం లేదు. ఎందుకంటే ఈ శిక్ష చాలా తీవ్రంగా ఉంది. ఈ తీర్పు వల్ల గొర్రెల యజమానికి తన సర్వస్వం కోల్పోయి, అన్యాయం జరగవచ్చు. తీర్పు అతనికి అన్యాయంగా ఉండకూడదు, కానీ శిక్ష విధించేలా ఉండాలి.

బాల సులైమాన్ (అలైహి) ధైర్యంగా చెప్పిన ఈ మాటలు విని సభలో ఉన్న వారంతా నిర్ఘాంతపోయారు. సభా ప్రాంగణంలో ఉన్న మంత్రులు, రాజ సలహాదారులు మరియు ప్రజల మధ్య గుసగుసలు వ్యాపించాయి.

అపుడు రాజు దావూద్ (అలైహి) చిరునవ్వుతో తన కుమారుడిని చూస్తూ....,

దావూద్ : - సులైమాన్! ఈ వివాదానికి నీ తీర్పు ఏమిటో చెప్పు?

సులైమాన్ (అలైహి) : - ఈ సమస్యకు నా పరిష్కారం ఏమనగా!, నా తీర్పులో రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను.

మొదటి విషయం రైతుని ఉద్దేశించి; గొర్రెల వల్ల రైతుకు నష్టం జరిగింది కాబట్టి, ఆ గొర్రెలను కొంతకాలం వరకు రైతు ఆధీనం చేయాలి. ఆ విధంగా రైతు గొర్రెల ద్వారా లాభాన్ని పొందుతాడు. వాటి ఉత్పత్తుల ద్వారా, అంటే పాలు మరియు ఉన్ని మొదలగు వగైరాలతో లాభం పొంది రైతు తన నష్టాన్ని పూడ్చుకుంటాడు. గొర్రెల యజమాని ఎన్ని గొర్రెలయితే రైతు ఆధీనం చేశాడో, నిర్ణీతకాలం తర్వాత రైతుకు అప్పగించిన గొర్రెలను తిరిగి గొర్రెల యజమానికి అప్పగించాలి. అయితే రైతు దగ్గర ఉన్నంత కాలం గొర్రెలకు పుట్టిన గొర్రె పిల్లలను మాత్రం ఇవ్వనవసరం లేదు. ఈ విధంగా గొర్రెల యజమాని నిర్లక్ష్యానికి తగిన శిక్ష కూడా పడుతుంది మరియు రైతుకు జరిగిన నష్టము పూడ్చబడుతుంది.

రెండవ విషయం గొర్రెల యజమానిని ఉద్దేశించి; గొర్రెల యజమానికి ఒక సంవత్సరం పాటు రైతు పొలాన్ని అప్పగించి, ఆ సంవత్సరం పాటు రైతు పొలాన్ని సాగు చేసి, పంట పండించి, కోతకు వచ్చిన పంట కోయకుండా రైతుకు అప్పగించాలి. అలా ఒక సంవత్సరం పాటు ఎలాంటి ప్రతిఫలం లేకుండా పొలంలో పనిచేసి పంట పండించి రైతుకు అప్పగించవలసి ఉంటుంది. రైతుకు అప్పగించిన తర్వాత, కోతకు సిద్ధంగా ఉన్న పొలాన్ని రైతు ఆ పంటను కోసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అతను తన గొర్రెలను పూర్తిగా కోల్పోయే పరిస్థితి కూడా ఉండదు.

అటు రైతుకు మరియు ఇటు గొర్రెల యజమానికి, ఇద్దరికీ సమానంగా వెలువడిన ఈ తీర్పును విన్న తర్వాత సభలో ఉన్న అందరూ సులైమాన్ (అలైహి) తెలివితేటలు చూసి ఆశ్చర్యంతో నిశ్శబ్దంగా ఉండిపోయారు. సభలో ఉన్న రాజ సపహాదారులు, మంత్రులు, ప్రజలంతా పైకి లేచి చప్పట్లు కొడుతూ, కేరింతల మధ్య సులైమాన్ (అలైహి)ని ఘనంగా మెచ్చుకున్నారు.

అసలు ఈ బాల సులైమాన్ (అలైహి) కు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి అని సభలో ఉన్న వారి మధ్య గుసగుసలు అలుముకున్నాయి.

దావూద్ (అలైహి) (ఉత్సాహంతో) : - సభీకులారా! ఈ రోజు మనం సులైమాన్ నుంచి గొప్ప తీర్పును పొందాము. ఇపుడు నేను వెంటనే నా తీర్పును ఉపసంహరించుకుంటున్నాను. నా కుమారుని తీర్పును అమలు చేయాలని ఆదేశిస్తున్నాను. సులైమాన్ తీర్పు నిష్పక్షపాతంగా, న్యాయసమ్మతంగా, వివేకవంతంగా మరియు నా తీర్పు కన్నా ఉత్తమంగా ఉంది.

సులైమాన్ (అలైహి) తీర్పు విని, ఆ రైతు మరియు గొర్రెల యజమాని ఆయన తీర్పు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

సులైమాన్ (అలైహి) రాజుగా చేయాలని దావూద్ (అలైహి) కొన్ని సంవత్సరముల తర్వాత భావించినపుడు, తన వారసుల నుంచే కొన్ని సమస్యలు దావూద్ (అలైహి) కు ఎదురయ్యాయి. వీటి గురించి Insha Allah రేపటి భాగము - 44 లో తెలుసుకుందాము.

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

☆☆   ®@£€€q  +97433572282 ☆☆

No comments:

Post a Comment