30

🤚🏻✋🏻🤚🏻✋🏻 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🤚🏻✋🏻🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

                               *భాగము - 30* 

____________________________________________

*బనీఇస్రాయీల్ ప్రజలను హెచ్చరిస్తున్న ఫిరౌన్* 

ఫిరౌన్ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి, బనీఇస్రాయీల్ ప్రజలతో సహా ఈజిప్టు ప్రజలందరినీ అక్కడకి పిలిచాడు.

ఫిరౌన్ (హెచ్చరిస్తూ) : - ప్రజలారా! మీ అందరికీ నేను ప్రభువును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మూసా (అలైహి) పచ్చి అబద్దాల కోరు, అతని మాటలు నమ్మకండి. మీ అవసరాలన్ని తీర్చేది నేనే. మిమ్మల్ని ఏ లోటు రాకుండా చూస్తోంది నేనే. నా దగ్గర వజ్ర వైఢూర్యాలు, అనంత సంపద, వెలకట్టలేని బంగారు సంపద ఉంది. కానీ మూసా (అలైహి) వద్ద ఎలాంటి బంగారు ఆభరణాలు లేవు. కనుక మీ బాగోగులు అన్ని చూసేది నేనే. నేనే దేవుణ్ణి, నేను తప్ప మీకు వేరొక ప్రభువు లేడు. మూసా (అలైహి) వెనుక ఎలాంటి దైవదూతలు లేవు. మూసా (అలైహి) ఒక నిరుపేద మాత్రమే.

చాలా కాలంగా అనచివేతలకు గురి అయి ఉన్న బనీఇస్రాయీల్ ప్రజలు తమ స్వంత ఆలోచనలను కూడా కోల్పోయిన దశలో ఉన్నారు. తాము కళ్ళతో చూసిన విషయాలను ఆధారంగా చేసుకొని మాత్రమే నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉన్నారు. తమ రాజు గారు చాలా సంపన్నుడు. తమకు అవసరమైన వాటన్నింటిని ఇచ్చే స్థితిలో ఉన్నాడు. కనుక అజ్ఞానంతో బనీఇస్రాయీల్ ప్రజలు ఫిరౌన్ కు విధేయత చూపి మూసా (అలైహి) ను నిర్లక్ష్యం చేశారు.

*రహస్య ప్రయాణం* 

మూసా (అలైహి) సందేశంలోని సత్యాన్ని చివరకు బనీఇస్రాయీల్ ప్రజలు గుర్తించారు. అల్లాహ్ ఆజ్ఞ వల్ల ఆ రాజ్యంలో సంభవించిన కరువు కాటకాలు, విరుచుకుపడిన తుఫాన్ లు, వరదలు, మిడతల దండు, నెత్తుటి వర్షం తదితర విపత్తులు అన్ని మూసా (అలైహి) వేడుకోలు వల్లే విపత్తులు దూరం అయ్యాయి. మూసా (అలైహి) వేడుకోలు వల్ల ఆగిపోయిన ఈ విపత్తులన్నింటిని తమ కళ్లారా చూసిన బనీఇస్రాయీల్ ప్రజలు మూసా (అలైహి) తెచ్చిన అల్లాహ్ సందేశాన్ని, మూసా (అలైహి) విశ్వాసాన్ని బలంగా నమ్మారు.

బనీఇస్రాయీల్ ప్రజల విశ్వాసాన్ని చూసిన ఫిరౌన్, తన ఆగ్రహాన్ని బనీఇస్రాయీల్ ప్రజలపై ప్రదర్శిస్తూ వారిని ఊచకోతలకు గురిచేసి భీభత్సాన్ని సృష్టించాడు. వారిని చిత్రవధలకు గురి చేశాడు. చిత్రహింసలు పెట్టాడు. ఎప్పుడైతే ఫిరౌన్ ఆగడాలు మితిమీరిపోయాయో, ఈజిప్టు దేశం నుంచి బనీఇస్రాయీల్ ప్రజలను వేరొక చోటుకి రహస్యంగా తన వెంట తీసుకవేళ్ళాలని మూసా (అలైహి) కు వహీ ద్వారా అల్లాహ్ తెలియజేశారు.

"ఓ మూసా! ఇపుడు నువ్వు ఈ రాత్రికిరాత్రి నా దాసుల్ని తీసుకొని ఈజిప్టు దేశాన్ని విడిచిపెట్టు. వారి కోసం సముద్రంలో ఒక నిర్జలమైన దారిని ఏర్పరుచుకో. మిమ్మల్ని ఫిరౌనీయులు వెంబడిస్తారని భయపడకండి. మరెలాంటి భయం కూడా ఉండదు." అని మూసా (అలైహి) కు సూచించారు అల్లాహ్.

ఫిరౌన్ బెదిరింపులకు భయపడని తమ నాయకుడు మూసా (అలైహి) వద్దకు వచ్చి ఆయన నుంచి మార్గదర్శకత్వాన్ని కోరారు బనీఇస్రాయీల్ ప్రజలు. ఈజిప్టు వదిలి వెళ్ళడానికి బనీఇస్రాయీల్ ప్రజలను మూసా (అలైహి) సిద్ధం చేశారు. ఈ పరిణామమే వలసగా అభివర్ణించబడింది.

అల్లాహ్ ఆజ్ఞానుసారం రాత్రి కటిక చీకటిలో మూసా (అలైహి), బనీఇస్రాయీల్ ప్రజలను వెంటబెట్టుకొని ఈజిప్టు దేశం నుంచి బయటపడాలని బయలుదేరారు. అనుక్షణం ఎంతో అప్రమత్తంగా ఉండే ఫిరౌన్ సాయుధ బలగాల సమూహం కళ్లుగప్పి, అక్కడి నుంచి ఆ రాత్రి చాలా చాకచక్యంగా తప్పించుకున్నారు మూసా (అలైహి) మరియు బనీఇస్రాయీల్ ప్రజలు. అలా వారందరు ఈజిప్టు రాజ్యం నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడటంతో అల్లాహ్ కృతజ్ఞతలు తెలిపి, ఇక నుంచి మా కొత్త జీవితం ప్రారంభమయ్యింది అని సంతోషించారు. అలా ఈజిప్టు దేశం నుంచి బయటపడిన వారందరు ఎర్రసముద్రం దిశగా బయలుదేరారు.

సూర్యోదయమవగానే ఈ సంగతి తెలిసి ఫిరౌన్ అగ్గిమీదగుగ్గిలం అయ్యాడు. ఫిరౌన్ సైనిక సమీకరణాన్ని ఏర్పాటుచేసి, పెద్ద సైనిక బలగాన్ని సిద్ధం చేసి రాజభటుల్ని పిలిచి.... "బనీఇస్రాయీల్ వారు అతి కొద్ది మంది మాత్రమే, కానీ వారు మమ్మల్ని ఆగ్రహానికి గురి చేస్తున్నారు. మనం అనుక్షణం అప్రమత్తంగా ఉండే సాయుధబలగం. మేలుకోండి సైనికులారా! మన వీరత్వం ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. ఫలిస్తీనా చేరుకోక ముందే మూసా (అలైహి)ని, అతని అనుచరులని పట్టుకోవాలి." అని ఆదేశించాడు. దేశంలోని అన్ని పట్టణాలకు వార్తాహరులని పంపాడు.

అలా ఆ రోజు ఉదయం బనీఇస్రాయీల్ ప్రజలను వెంబడించాలని, తన సైనిక బలగాల సహాయంతో ఫిరౌన్ బయలుదేరారు.

ఫిరౌన్ మరియ అతని సైన్యం పళ్ళూఫలాల తోటలు మరియు సంపదనంతటినీ వదిలి బనీఇస్రాయీల్ ప్రజలను వెంటాడుతూ ముందుకు పోయారు. అలా పోతూ పోతూ మూసా (అలైహి) ను మరియు అతని అనుచరులైన బనీఇస్రాయీల్ ప్రజలను ఎర్రసముద్రం ఒడ్డున కనుగొన్నారు. ఫిరౌనీయులు ఎర్రసముద్రం ఒడ్డునగుండా వెళ్లారు. మూసా (అలైహి) బృందం మరియు ఫిరౌన్ బృందం ఒకదానికొకటి ఎదురెదురు పడ్డాయి. మూసా (అలైహి) అనుచరులు భయపడిపోతూ "మనం ఇక పట్టుబడి పోయాం" అని కేకలు పెట్టారు.

బనీఇస్రాయీల్ ప్రజలు అసహనానికి గురి అయ్యారు. వారిలో ఒకతను "మన ముందు మనం దాటలేని ఈ సముద్రం, మన వెనుక శత్రుసైన్యం. నిజంగా మనకు ఇక చావు తప్పదు" అని అన్నాడు.

మూసా (అలైహి) (కంగారుతో) : - కాదు! అలా ఎంత మాత్రం జరగదు. నా ప్రభువు నాతో ఉన్నాడు. అల్లాహ్ తప్పకుండా నాకు దారి చుపుతాడు. అల్లాహ్ మార్గదర్శనం కోసం ఎదురుచుద్దాం.

ఈ మాటలు వినగానే బనీఇస్రాయీల్ ప్రజలు కొద్దిగా ఊరట పొందారు. కానీ మనిషి ఫలితాల కోసం తొందరపడతాడు. ఎదురుగా వేటాడడానికి ముంచుకొస్తున్న ఫిరౌన్ సైన్యాన్ని చూసి బనీఇస్రాయీల్ ప్రజలు, "మనం మళ్ళీ బానిసత్వంలోకి వెళ్లిపోవడమే మంచిది" అన్న అభిప్రాయానికి వచ్చేశారు.

ఫిరౌన్ సైన్యం దగ్గరికి వచ్చేస్తోంది. సరిగ్గా అప్పుడే అల్లాహ్, మూసా (అలైహి) కు దివ్యవిష్కృతి ద్వారా ఇలా ఆదేశించారు. "మూసా! నీ దగ్గర ఉన్న నీ చేతి కర్రతో సముద్రం మీద ఒక్క దెబ్బ కొట్టు" అని ఆదేశించారు. మూసా (అలైహి) అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం సముద్రం మీద ఒక్క దెబ్బ వేశారు. ఒక్క క్షణంలో హఠాత్తుగా సముద్రం రెండుగా చీలిపోయింది. రెండు వైపులా చీలిన కెరటాలు రెండు ఎత్తైన కొండల్లా నిలిచాయి. ఆ వెంటనే మహావేగంతో గాలి వీయడం ప్రారంభమయ్యింది. ఆ గాలి ధాటికి వారందరు స్థిరంగా నిలబడలేకపోతున్నారు. ఎండ తీక్షణంగా కాయసాగింది. సముద్ర చీలికల మధ్య ఏర్పడిన ఖాళీ స్థలంలో ఒక దారి ఏర్పడింది. ఆ దారి అంత బురదమయంగా ఉంది. అల్లాహ్ ఆజ్ఞ తో గాలి ఎండల వల్ల బురద ఎండిపోయింది. మూసా (అలైహి) తన ప్రజలను తీసుకొని ఆ మార్గాన నడిచారు. "నా ప్రభువు నాతో ఉన్నాడు" అని మూసా (అలైహి) చెప్పిన మాటలకు ఈ పరిణామం నిరూపించింది.

సముద్రంలో అల్లాహ్ ఏర్పరచిన మార్గం ద్వారా వెళుతూ వెళుతూ, మూసా (అలైహి) మరియు అతని అనుచరులు వెనుకకు తిరిగి చూశారు. సముద్రం చీలికలో అల్లాహ్ ఏర్పరచిన అదే మార్గం ద్వారా ఫిరౌన్ మరియు అతని సైన్యాలు వస్తున్నాయి. భయాందోళనతో బనీఇస్రాయీల్ ప్రజలు సముద్ర చీలికలో ఏర్పడిన ద్వారాన్ని మూసేయమని అల్లాహ్ తో ప్రార్థించవలసిందిగా మూసా (అలైహి) ని కోరారు. అయితే సముద్రాన్ని మళ్ళీ చేతికర్రతో కొట్టరాదని అల్లాహ్ మూసా (అలైహి) ని ఆదేశించారు. ఎందుకంటే అల్లాహ్ ఆదేశం అప్పటికే అమలవుతోంది.

ఫిరౌన్ మరియు అతని సైన్యాలు సముద్రం చీలిపోయే మహత్యాన్ని చూశారు. కానీ ఫిరౌన్ తన సైన్యాలను ఉద్దేశించి తన కాపాట్యాన్ని ప్రదర్శిస్తూ.... "చూశారా సైనికులారా! నా ఆజ్ఞ తో సముద్రం రెండుగా చీలిపోయింది. నేను ఆ తిరుగుబాటుదారులను వెంటాడి పట్టుకోవడానికే సముద్రం నాకోసం దారి వదిలింది. నేనే దేవుణ్ణి, మీ అందరికి నేనే ప్రభువుని" అని అన్నాడు.

ఫిరౌనీయులు, ఇస్రాయీల్ సంతతిని పట్టుకోవడానికి చీలిన సముద్ర మార్గాన ముందుకు వస్తున్నారు. కానీ ఫిరౌనీయులు సముద్రం మధ్యకు చేరుకున్న తర్వాత, తన యథాస్థానానికి, సాధారణ రూపంలోకి రావాల్సిందిగా  అల్లాహ్ ఆ సముద్రాన్ని ఆజ్ఞాపించారు. అంతే అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం సముద్రం మామూలు స్థితిలోకి రావడానికి, మరుక్షణం చీలిన ఎత్తైన కొండల్లాంటి కెరటాలు ఫిరౌనీయులు మీద విరుచుకపడ్డాయి. ఆ అలజడిలో ఫిరౌన్ మరియు అతని సేనలు చెల్లాచెదురైపోయారు. సముద్రపు కెరటాలు ఆ దుర్మార్గులకు ఊపిరి తీసుకోనీయటం లేదు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఫిరౌనీయులందరు ప్రాణభయంతో గట్టిగా కేకలు పెట్టారు.

నేనే దేవుణ్ణి నేనే దేవుణ్ణి అని విర్రవీగిన ఫిరౌన్ కూడా ప్రాణభయంతో సహాయం కోసం ఆర్థిస్తున్నాడు. భయాందోళనకు గురైన ఫిరౌన్ తన అంతం సమీపించిందని గ్రహించాడు. భీతావహుడై, సముద్రంలో మునిగిపోతూ.... "మూసా(అలైహి) మరియు ఇస్రాయీల్ సంతతి ప్రజలు విశ్వసిస్తున్న అల్లాహ్ ను నేను విశ్వసిస్తున్నాను. అల్లాహ్ తప్ప మరో దేవుడు లేడు. అల్లాహ్ తప్ప ఆరాధనలకు ఇంకెవ్వరూ అర్హులుకారు అని నేను విశ్వసిస్తున్నాను. నేను ఆ అల్లాహ్ కి విధేయత చూపిన వాడిగా మారుతున్నాను." అని అన్నాడు.

"ఇప్పుడా! నీవు విశ్వసించేది. ఇంతకు పూర్వం నీవు అవిధేయుడివై దుర్మార్గపు పనులు చేస్తుండేవాడివి. బనీఇస్రాయీల్ ప్రజలను ఊచకోతలకు గురి చేస్తుండేవాడివి. ఇపుడు నీ చావును భావితరాలకు గుణపాఠంలా మిగిలిపోవడానికి నీ శవాన్ని మాత్రమే మేము కాపాడుతాం." అని సమాధానమివ్వబడింది.

నీటిలో మునిగిపోతూ ఫిరౌన్ చేసిన విశ్వాస ప్రకటనను అల్లాహ్ స్వీకరించలేదు. మూసా (అలైహి) మరియు అతని అనుచరులని అల్లాహ్ కాపాడారు. ఫిరౌన్ మరియు అతని సైన్యాలను సముద్రజలాలు ముంచేశాయి. ఫిరౌన్ సన్మార్గం అవలంబించకుండా నిరోధించబడ్డాడు. ఫిరౌన్ పన్నిన దుష్ట పన్నాగాలన్నీ అతని వినాశనానికే దారి తీశాయి.

ఆ విధంగా ఫిరౌన్ మరియు అతని సైన్యం నాశనం చేయబడింది. అయితే నీట మునిగిపోతున్నపుడు ఫిరౌన్ సత్యాన్ని గ్రహించి, అల్లాహ్ ని విశ్వసిస్తున్నట్లుగా గొంతెత్తి పలికాడు. కానీ అది ఫిరౌన్ కు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేకపోయింది. అతని తర్వాత రాబోయే తరాలకు గుణపాఠంలా ఫిరౌన్ శవాన్ని భద్రపరిచారు. ఇహలోకంలో ఫిరౌన్ కు, అతని అనుచరులకు వేయబడిన శిక్ష నీటిలో ముంచబడటం. పరలోకంలో వారి కొరకు బాధాకరమైన శిక్ష వేచి ఉంటుంది. అగ్ని, దాని ఎదుట వారు ప్రతి ఉదయము సాయంత్రము రప్పించబడుతుంటారు. మరి ప్రళయం సంభవించిన రోజున ఫిరౌన్ ను, అతని అనుచరులను దుర్భరమైన శిక్షలో పడవేయబడుతుంది.

ప్రాచీన ఈజిప్టు చక్రవర్తులను ఫిరౌన్‌లు అంటారు. వీరిలో అనేక వంశాలుండేవి. మూసా ప్రవక్త (అలైహి)కు పూర్వం నుండి ఫిరౌన్ వ౦శరామ్సెస్ -1 తో ప్రారంభమైంది. అతని కుమారుడు సెతి రెండవ ఫిరౌన్ గా ప్రసిద్ధిచెందాడు. సెతి కుమారుడు రామ్సెస్ - 2. ఇతని కాలంలోనే మూసా (అలైహి) జన్మించారు. ఇతని పోషణలోనే పెరిగి పెద్దయ్యారు. క్రీ.శ.1886లో పురావస్తుశాఖ చేపట్టిన త్రవ్వకాల్లో ఒక పిరమిడ్ నుంచి ఓ శవం బయల్పడింది. దానిపై వున్న వస్త్రాలు తీసిచూస్తే శరీరానికి చుట్టబడిన ఆఖరి వస్త్రం పై “ రామ్సెస్ - 2” అని రాయబడి ఉంది. ఇతని పరిపాలనా కాలం క్రీ.పూ.1304 లో ప్రారంభమై ఉంటుందని పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం. రామ్సెస్ - 2 చనిపోయిన తర్వాత అతని కొడుకు “మిన్ఫతాహ్‌” అధికారంలోకి వచ్చాడు. ఇతనే మూసా ప్రవక్త అందజేసిన దైవసందేశాన్ని తిరస్కరించి, ఎర్రసముద్రంలో మునిగి చనిపోయిన ఫిరౌన్ చక్రవర్తి.

భయంకర నీటి ప్రవాహం నుండి బయటపడిన బనీఇస్రాయీల్ ప్రజలు ఎక్కడికి వెళ్లారు? వారి కొత్త జీవితం గురించి Insha Allah రేపటి భాగము - 31 లో తెలుసుకుందాము.

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్రను మన ముస్లిం సోదరులు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

☆☆  ®@£€€q +97433572282   ☆☆

No comments:

Post a Comment