3

🕋🕋🕋🕋 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕋🕋🕋🕋

🛐🛐🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన *అల్లాహ్* పేరుతో ప్రారంభిస్తున్నాను 🛐🛐🛐🛐 

------------------------------------------------

☪☪☪☪ *ఇస్లాం చరిత్ర* ☪☪☪☪

భాగము - 3                 Date : 13/11/2017

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*నూహ్ అలైహిస్సలామ్* 

*మేము ( అల్లాహ్ ) నూహ్ అలైహిస్సలామ్ ను అతని జాతి ప్రజల వద్దకు పంపి , వారిపై వ్యధాభరిత శిక్ష వచ్చివడక ముందే వారిని హెచ్చరించాలని ఆదేశించాము.* 

అతను( నూహ్ ) తన జాతి ప్రజల వద్ద కు వెళ్లి ఇలా అన్నాడు "ఓ నా జాతి ప్రజలారా ! నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరిస్తున్నాను. మీరు అల్లాహ్ ను ఆరాధించండి. ఆయనకు మాత్రమే భయపడండి. నా మాట వినండి, నన్ను అనుసరించండి. అప్పుడు అల్లాహ్ మీ పాపాలను క్షమిస్తాడు. ఒక నిర్ణీత గడువు వరకు మీకు అవకాశం ఇస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ నిర్ణయించిన గడువు వచ్చేసిందంటే ఇక అది వాయిదా పడటమంటూ ఉండదు. ఈ సంగతిని మీరు తెలుసుకోగలిగితే చాలా బావుంటుంది.” (ఖురాన్71:2-4).

"వినండి ! నేను మీ వైపుకు పంపబడిన నమ్మకస్తుణ్ణి అయిన దైవప్రవక్తను. కనుక మీరు అల్లాహ్‌కు భయపడండి, నేను చెప్పినట్లు వినండి. దీనికిగాను నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలమిచ్చే బాధ్యత సర్వలోకాల ప్రభువుది. కాబట్టి మీరు అల్లాహ్‌కు భయపడండి. నాకు విధేయత చూపండి." (ఖురాన్ 26:107-110).

దానికి అతని జాతి పెద్దలు, ''నువ్వు స్పష్టమైన అపమార్గానికి గురైనట్లు మాకు కనిపిస్తోంది''అన్నారు. ''ఓ నా జాతి ప్రజలారా ! నేనేమాత్రం దారి తప్పలేదు. నిజానికి నేను సర్వలోక ప్రభువు తరఫున పంపబడిన ప్రవక్తను. నా ప్రభువు సందేశాన్ని మీకు అందజేస్తున్నాను. నేను మీ మేలుకోరేవాడిని. మీకు తెలియని విషయాలు అల్లాహ్‌ తరఫు నుంచి నాకు తెలుసు. ఏమిటీ ? మిమ్మల్ని హెచ్చరించటానికి, మీరు భయభక్తుల వైఖరిని అవలంబించి తద్వారా మీరు కరుణించబడేటందుకు మీ వద్దకు స్వయంగా మీ నుంచే ఒక వ్యక్తి ద్వారా మీ ప్రభువు తరఫు నుండి 'ఉపదేశం' అందటం మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తిందా?'' అని నూహ్‌ (అలైహి) అన్నాడు. (ఖురాన్7:60-63).

దానికి అవిశ్వాసులైన అతని జాతి సర్దారులు ఇలా అన్నారు "ఇతను కూడా మీలాంటి ఒక మానవమాత్రుడే. అయితే ఇతను మీ పై పెద్దరికాన్నికోరుకుంటున్నాడు. అల్లాహ్ గనక తలిస్తే తన ప్రవక్తగా ఏ దైవదూతనో పంపి ఉండేవాడు. ఇతను చెప్పే దానిని మేము ఇదివరకెన్నడూ,మా తాత ముత్తాతల కాలంలో వినలేదు. నిజంగానే ఇతనికి పిచ్చిపట్టినట్లుంది. కాబట్టి ఇతని విషయంలో మరి కొంత కాలం వేచి ఉండండి." (ఖురాన్23:24-25).

దానికి అతని జాతివారు, "ఏమిటీ ? మేము నిన్ను విశ్వసించాలా ? చూడబోతే అధములు మాత్రమే నిన్ను అనుసరిస్తున్నారు" అని సమాధానమిచ్చారు. దానికి నూహ్‌ ఇలా అన్నాడు "లోగడ వారేం చేసేవారో నాకేం తెలుసు ? మీరు గనక అర్థం చేసుకోగలిగితే, వారి లెక్క తీసుకునే బాధ్యత నా ప్రభువుది. నేను మాత్రం విశ్వాసులను గెంటివేసే వాణ్ణికాను. నేను ప్రజలను స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే." దానికి నూహ్ జాతి వారు ఇలా పలికారు "ఓ నూహ్ ! నువ్వు గనక ఈ పనిని మానుకోకపోతే, నిన్ను రాళ్లతో కొట్టడం చంపటం ఖాయం." (ఖురాన్ 26:111 -116).

ఈ విధంగా నూహ్ ప్రవక్త (అలైహి) వందలాది సంవత్సరాలు ప్రజలకు హితబోధ చేసినా కొందరు తప్ప ఎవరూ దైవ ధర్మాన్ని విశ్వసించలేదు . ఆయన కుమారుల్లో కూడా ఒకతను విశ్వసించలేదు . చివరికి నూహ్ ఇలా ప్రార్థించాడు " ప్రభు ! ఈ తిరస్కారులలో ఏ ఒక్కర్నీ ఈ భూ మండలం పైన సజీవంగా వదలిపెట్టకు , నీవు గనక వీరిని వదిలేస్తే వీరు నీ దాసుల్ని దారి తప్పిస్తారు . వీరి సంతతి నుండి పుట్టే ప్రతి వ్యక్తి దుర్మార్గుడిగా , కరుడుగట్టిన తిరస్కారిగా మారుతాడు . ప్రభూ ! నన్నూ నా తల్లిదండ్రుల్ని , నా ఇంట్లో విశ్వాసిగా ప్రవేశించిన ప్రతి మనిషి ని , విశ్వశించిన యావత్తు స్త్రీ పురుషుల్ని క్షమించు , దుర్మార్గులకు మాత్రం వినాశంలో తప్ప మరెందులోనూ వృధ్ధి కలిగించకు . (ఖురాన్ 71:26-28) .

నూహ్‌కు దివ్యావిష్కృతి ద్వారా ఇలా సూచించబడింది " నీ జాతిలో విశ్వసించవలసిన వారంతా విశ్వసించారు . ఇక కొత్తగా విశ్వాషించేవారెవరూ లేరు . కనుక వారి అకృత్యాలను గురించి నీవు బాధ పడకు , ఇపుడు మా పర్యవేక్షణలో మా సహకారంతో ఒక ఓడ తయారుచేసుకో , అయితే దుర్మార్గులు గురించి నా దగ్గర సిఫారసు చేయకూడదు . వారంతా ఇప్పుడు మునిగిపోనున్నారు. " ( ఖురాన్ 11:36,37).

అప్పుడు మేమిలా సూచించాము " మా పర్యవేక్షణలో మా సూచన ప్రకారం ఒక ఓడ నిర్మించుకో . మా ఆజ్ఞ తో మహా ఉపద్రవం పొంగిపొర్లగానే ప్రాణులలో ప్రతి జాతిలో ఒక్కొక్క జంట ను తీసుకొని ఓడ ఎక్కు , నీ భార్య పిల్లల్ని కూడా వెంటపెట్టుకో , అయితే శిక్షకు గురైపోతారని ము౦దే మేము నిర్ణయించిన వారిని ఓడలో ఎక్కించుకో వద్దు . దుర్మార్గులు గురించి నాదగ్గర ఏమీ మాట్లాడకూడదు , వారిప్పుడు మునిగి పోనున్నారు . నీవు నీ సహచరులతో పాటు ఓడలోకి ఎక్కిన తర్వాత " మమ్మల్ని దుర్శార్గుల బారినుండి కాపాడిన అల్లాహ్ కి కృతజ్ఞతలు " అని చెప్పు . ప్రభూ! నన్ను శుభప్రదేశంలో దించు . " నీవెంతో మంచి చోటు ప్రసాదించేవాడవు " అనికూడా వేడుకో ( ఖురాన్ 23:27-29) .

చివరికి మా ఆజ్ఞ రానే వచ్చింది , మహా ఉపద్రవం కుంపటి పొంగి పొర్లింది. అపుడు మేమిలా ఆదేశించాము " ప్రతి జాతికి చెందిన ఒక్కొక్క జతను నీ నౌక లోకి తీసుకో " , అలాగే  " ఎవరెవరి గురించి నీకు ముందే తెలియజేశామో వారిని వదలి మిగిలిన వారిని , నీ కుటుంబసభ్యుల్ని , ఇతర విశ్వాసుల్ని కూడా నౌక లోకి ఎక్కించుకో . " 

నూహ్ తో విశ్వాసులు కొద్ది మందే ఉన్నారు ,  నూహ్‌ తన అనుచరులతో " అల్లాహ్ పేరు స్మరించి ఓడ లోకి ఎక్కండి " అని అన్నారు  . అది నడవడం , ఆగిపోవడం అన్నీ అల్లాహ్ చేతిలో ఉన్నాయి , నా ప్రభువు గొప్ప క్షమాశీలి , అమిత దయామయుడు అని అన్నాడు . ఓడ వారిని తీసుకొని ముందుకు సాగింది . కొండల్లాంటి సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి . నూహ్ అలైహిస్సలామ్ దూరానవున్న తన కుమారున్ని పిలిచి " బాబు ! ఇటు వచ్చేయ్ మాతోపాటు ఓడ లోకి ఎక్కు , అవిశ్వాసులతో కలిసి ఉండకు " అని అన్నారు . ( ఖురాన్ 11:40-42 ) .

దానికి నూహ్ అలైహిస్సలామ్ కుమారుడు " ఇదిగో చూడు , ఇపుడు నేను ఒక కొండ పైకి ఎక్కుతాను , అది నన్ను ఈ నీటి నుండి కాపాడుతుంది " అన్నాడు . దానికి నూహ్ అలైహిస్సలామ్ " అల్లాహ్ కరుణిస్తే తప్ప ఈ రోజు ఆయన ఆజ్ఞ నుండి ఏ శక్తి కాపాడలేదు " అన్నాడు. అంతలో వారిద్దరి మధ్య ఒక పెద్ద కెరటం వచ్చింది , దాంతో నూహ్ కుమారుడు కూడా మునిగిపోయే వారి జాబితాలో చేరిపోయాడు . ( ఖురాన్ 11:43 ) .

అపుడు అల్లాహ్ నుండి " భూ మండలమా ! నీ నీటినంతటిని మింగేయ్ , ఆకాశమా ! ఆగిపో " అని ఆజ్ఞ అయింది . అపుడు నీరంతా నేలలోకి ఇంకిపోయింది , జరగవల్సింది జరిగిపోయింది . ఓడ జూది పర్వతం మీద నిలిచిపోయింది . దాంతో దుర్మార్గులు పీడ విరగడైపోయిందని ప్రకటన వెలువడింది . ( ఖురాన్ 11:45 ) .

ఆర్మేనియా నుండి కుర్దిస్తాన్ వరకు వ్యాపించి ఉన్న అరారాత్ అనే  పర్వతశ్రేణుల్లో “ జూది ” అనే పేరుతో నేటికి ఒక పర్వతం ఉంది . ఆరిస్టాటిల్ అనుచరుడు ఎబడినస్ కూడా దీనిపై నూహ్ అలైహిస్సలామ్ ఓడ దిగిన విషయాన్ని ధృవీకరించారు . ఇరాక్ లో అనేకమంది ప్రజలు దీవి శిథిలాలకు చెందిన ముక్కలు భద్రపరచుకొని వారిని అరగదీసి రోగులకు మందుగా వాడుతున్నారని అతను ( అరిస్టాటిల్ అనుచరుడు ) తన చరిత్ర గ్రంథంలో రాసినట్లు తెలుస్తోంది .
నూహ్ అలైహిస్సలామ్ వారి మధ్య యాభై తక్కువ వెయ్యి సంవత్సరాలు గడిపాడు . చివరికి వారు దుర్మార్గంలో పడి ఉన్న స్థితిలో వారి పైకి ఒక భయంకరమైన తుఫాన్ వచ్చిపడింది . ఆ తర్వాత మేము నూహ్ ని , అతనితో పాటు ఓడ లో ఎక్కిన వారిని రక్షించాము . దీనిని ప్రపంచ మానవులకు ఒక సూచకంగా , ఒక గుణపాఠం గా చేసి ఉంచాము . ( ఖురాన్ 29:14,15 ) . 

యావత్ సమాజానికే గొప్ప నాయకుడైన ఇబ్రహీం అలైహిస్సలామ్ గురించి మరియు అతని కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలామ్ గురించి Insha Allah రేపటి భాగము - 4 లో తెలుసుకుందాము .

ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-

ప్రియమైన ముస్లిం సోదరులారా!  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి , ఇదేదో 10 మందికి send చేస్తే మంచి జరుగుతుంది , send చేయకపోతే చేడు జరుగుతుంది అనుకునే msg లు కావు . కాబట్టి మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .

3 comments: