50

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

💐🌷🌹🥀🌺🌸🌼💐🌷🌹🥀🌺🌸🌼

                                *50 వ భాగము* 

💐🌷🌹🥀🌺🌸🌼💐🌷🌹🥀🌺🌸🌼

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

*మహావివేకి లుక్మాన్ అలైహిస్సలామ్* 

అల్లాహ్ పట్ల కృతజ్ఞుడయి ఉండమని చెబుతూ అల్లాహ్ లుక్మాన్ (అలైహి) కు వివేకాన్ని ప్రసాదించారు. ఎవరైనా (అల్లాహ్ కి) కృతజ్ఞత చూపితే, ఆ కృతజ్ఞత అతనికే ప్రయోజనం చేకూర్చుతుంది. దీనికి భిన్నంగా క్ఫతఘ్నుడైపోతే, అల్లాహ్ కి కలిగే నష్టమేమీ లేదు. అల్లాహ్ నిరపేక్షాపరుడు, స్వతహాగా ప్రశంసనీయుడు.

హజ్రత్ లుక్మాన్ (అలైహి) అరబ్ జగత్తులో అత్యంత వివేకవంతుడైన వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. లుక్మాన్ (అలైహి) మాతృభూమి, జాతీయతలను గురించి పండితులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు లుక్మాన్ (అలైహి) నీగ్రో జాతీయుడని, మరికొందరు సూడాన్ దేశస్థుడని అంటారు. ఏమైనప్పటికీ లుక్మాన్ (అలైహి) అరేబియాలో తన నీతినడవడికలు, వివేకవంతమైన మాటలతో ఎంతో వినుతికెక్కారు.

లుక్మాన్ (అలైహి) ఆఫ్రికా ఖండంలో జన్మించారు. ఆయన అడవుల్లో పెరిగి పెద్దయ్యారు. అడవుల్లో కాలికి చెప్పులు లేకుండా కూడా తిరిగేవారు. కేవలం ఒక వస్త్రాన్ని చుట్టుకొని అడవుల్లో వన్యమృగాలతో పాటు ఉండేవారు. అడవిలో జీవితం, రోజు అడవి మృగాలతో తలపడడం. ఈ విధంగా లుక్మాన్ (అలైహి) కఠినమైన జీవితాన్ని గడిపేవారు. భయం అంటే ఎరుగని వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు. తన చుట్టూ ఉన్న ప్రకృతి గురించి దీర్ఘంగా ఆలోచించేవారు. ఈ ఆలోచనల వల్ల అనేక కొత్త విషయాలను లుక్మాన్ (అలైహి) తెలుసుకున్నారు.

*లుక్మాన్ అలైహిస్సలామ్ బానిసత్వం* 

ఒకసారి కొంతమంది బానిస వ్యాపారులు ఆఫ్రికా పై అంటే లుక్మాన్ (అలైహి) ఉన్న ప్రాంతం పై దండెత్తారు. ఆ బానిస వ్యాపారులు చేసే ఈ దండయాత్రలో దొరికిన వారిని తీసుకెళ్లి బానిసలుగా అమ్మీ వేస్తారు. ఈ తిరుగుబాటులో లుక్మాన్ (అలైహి) ఆ బానిస వ్యాపారుల చేతికి చిక్కారు. తరువాత ఆయనను నిర్బంధించారు. లుక్మాన్ (అలైహి) ను తీసుకెళ్లి ఒక బానిసగా అమ్మివేశారు.

ఆ తర్వాత, వేరొకరి దగ్గర బానిసగా అయిపోయిన లుక్మాన్ (అలైహి) తన స్వేఛ్ఛా, స్వాతంత్ర్యాలు పూర్తిగా కోల్పోయారు. స్వేచ్ఛగా తిరగడానికి లేదు. ఎవరితో మాట్లాడటానికి లేదు. జీవితంలో ఎదురైన ఈ కష్టాన్ని లుక్మాన్ (అలైహి) భరించారు. సహనం వహించారు. అల్లాహ్ అనుగ్రహం కోసం ఎదురుచూడసాగారు.

లుక్మాన్ (అలైహి) ను కొనుగోలు చేసిన యజమాని చాలా మంచి మనిషి. తెలివి, వివేకం కలిగినవారు. నౌకర్లతో మర్యాదపూర్వకంగా మసులుకునేవారు మరియు ప్రేమతో చూసుకునేవారు. ఆ యజమాని లుక్మాన్ (అలైహి) ను దయగా చూసేవాడు.

లుక్మాన్ (అలైహి) సాధారణమైన వ్యక్తి కాదని ఆ యజమాని గుర్తించాడు. లుక్మాన్ (అలైహి) వివేకానికి ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఆ పరీక్షలో భాగంగా ఒక రోజు లుక్మాన్ (అలైహి) ను పిలిచి....,

యజమాని : - లుక్మాన్! నేను నీకు ఒక పనిని అప్పగిస్తున్నా. ఆ పని ఏమనగా; నువ్వు ఒక మేకను కోసి, కోసిన ఆ మేకలో నుంచి అత్యంత నీచమైన రెండు అవయవాలను నా వద్దకు తీసుకునిరా!

తన యజమాని చెప్పిన ప్రకారం లుక్మాన్ (అలైహి) ఒక మేకను కోసి, దాని నుండి గుండెను మరియు నాలుకలను తీసుకుని యజమాని వద్దకు వెళ్లారు.

లుక్మాన్ (అలైహి) తీసుకొచ్చిన వాటిని చూసి యజమాని మెచ్చుకోలుగా చిరునవ్వు నవ్వాడు. శరీరంలో అత్యంత నీచమైన అవయవాలుగా గుండె మరియు నాలుకలను తీసుకువచ్చిన ఎన్నిక ఆ యజమానికి నచ్చింది. లుక్మాన్ (అలైహి) చాలా లోతైన విషయాన్ని ఈ విధంగా చెప్పారని ఆ యజమాని అర్థం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ యజమాని లుక్మాన్ (అలైహి) పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం ప్రారంభించాడు. లుక్మాన్ (అలైహి) ను మరింత ఆదరంగా చూడసాగాడు.

కొన్ని రోజుల తరువాత ఆ యజమాని లుక్మాన్ (అలైహి) ను మళ్ళీ పిలిచి....,

యజమాని : - లుక్మాన్! నేను నీకు మళ్ళీ ఇంకొక పనిని అప్పగిస్తున్నా. ఆ పని ఏమనగా; ఈ సారి కూడా ఒక మేకను కోసి, కోసిన ఆ మేకలో నుంచి అత్యంత శ్రేష్ఠమైన రెండు అవయవాలను నా వద్దకు తీసుకురా!

లుక్మాన్ (అలైహి) యజమాని చెప్పినట్టు, ఒక మేకను కోసి అందులో నుంచి అత్యంత శ్రేష్ఠమైన రెండు అవయవాలను తన యజమాని వద్దకు తీసుకొనివెళ్లారు. కాని విచిత్రంగా ఈసారి కూడా గుండె మరియు నాలుకలనే తీసుకొని వెళ్లారు.

వాటిని చూసిన ఆ యజమాని ఆశ్చర్యంగా....,

యజమాని : - లుక్మాన్! ఏమిటిది! శరీరంలో అత్యంత నీచమైన అవయవాలు మరియు అత్యంత శ్రేష్ఠమైన అవయవాలు రెండూ కూడా గుండె మరియు నాలుకలే ఎలా అవుతాయి?

లుక్మాన్ (అలైహి) : - యజమాని! గుండె మరియు నాలుకలు సవ్యంగా, సక్రమంగా ఉంటే, ఇవి ఉత్తమమైన అవయవాలు. అలా కాకుండా గుండె మరియు నాలుకలు సవ్యంగా లేకున్నా మరియు సక్రమంగా లేకున్నా, వాటికి మించిన నీచమైన అవయవాల ఉండవు. (ఇది జంతువులకు గాని, మనుషులకు గాని)

ఈ సంఘటన జరిగిన తర్వాత నుంచి ఆ యజమాని లుక్మాన్ (అలైహి) పట్ల అత్యంత గౌరవాదరాలు చూపడం ప్రారంభించారు. చాలా మంది లుక్మాన్ (అలైహి) వద్దకు సలహా కోసం కూడా వచ్చేవారు. లుక్మాన్ (అలైహి) వివేక, విచక్షణలు మరియు తెలివితేటలు యావత్తు ఆ రాజ్యంలో మారు మోగిపోసాగాయి.

హజ్రత్ లుక్మాన్ (అలైహి) వద్దకు సలహా కోసం వచ్చిన కొందరు ఇలా అడిగారు : - మహా వివేకి లుక్మాన్! మీకు ఈ విజ్ఞతా వివేచనాలు, భావచైతన్యాలు ఎలా లభించాయి?

ఇందుకు సమాధానంగా లుక్మాన్ (అలైహి) : - నీతి నిజాయితీలను అవల౦బి౦చడ౦, పనికిమాలిన పనులు మరియు పనికిమాలిన మాటలు మానేసి మౌనం పాటించడం వల్ల లభించాయి. (అని జవాబిచ్చారు)

*లుక్మాన్ అలైహిస్సలామ్ కు బానిసత్వం నుంచి స్వేచ్ఛ* 

యజమాని, లుక్మాన్ (అలైహి) గురించి తన కుటుంబసభ్యులతో....,

యజమాని : - కుటుంబసభ్యులారా! నా ప్రియ సేవకుడు అయినటువంటి లుక్మాన్ (అలైహి) గురించి నేను మీకు కొన్ని స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. నా మరణానంతరం లుక్మాన్ (అలైహి) కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. అతడు మహాజ్ఞాని, వివేకవిచక్షణలు, బుద్ధికుశలతలు నిండిన మనిషి. లుక్మాన్ (అలైహి) ఈ బానిస పనికి అనర్హుడు. అందువల్ల నేను చనిపోయిన తర్వాత ఈ బానిసత్వం నుంచి విముక్తి కల్పించండి. ఇది నా ఆదేశం.

కొన్ని రోజుల పిదప ఆ యజమాని మరణించిన తర్వాత లుక్మాన్ (అలైహి) కు స్వాతంత్య్రం లభించింది. అక్కడి నుంచి ఆయన విముక్తి పొందారు. లుక్మాన్ (అలైహి) అక్కడి నుంచి బయలుదేరి చాలా ప్రాంతాలు తిరిగి తిరిగి చివరకు బనీ ఇస్రాయీల్ వద్ద స్థిరపడ్డారు. దావూద్ (అలైహి) పాలనా కాలంలో లుక్మాన్ (అలైహి) న్యాయమూర్తిగా నియమించబడ్డారు. మహావివేకంతో, విచక్షణతో, నిష్పక్షపాతంగా లుక్మాన్ (అలైహి) ఇచ్చే తీర్పులు చాలా ప్రసిద్ధి పొందాయి. అక్కడే లుక్మాన్ (అలైహి) పెళ్లి చేసుకుని సంసార జీవితాన్ని గడిపారు.

*తన కుమారుడి హితబోధ చేసిన లుక్మాన్ అలైహిస్సలామ్* 

లుక్మాన్ (అలైహి) తన కుమారుడికి చేసిన బోధ దివ్య ఖురాన్ లో ఇలా ప్రస్తావించబడింది.

*లుక్మాన్ తన కుమారునికి హితబోధ చేసిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో, అప్పుడు అతను ఇలా అన్నాడు: "కుమారా! అల్లాహ్ కు భాగస్వాములను ఎవరినీ చేర్చుకు. నిజం ఏమిటంటే, ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములు గా చేర్చడం పరమ దుర్మార్గం.* 

*కుమారా! ఒక వస్తువు, అది ఆవగింజంతటిదైనప్పటికీ కొండ రాయి లో గాని, ఆకాశాలలో గాని, భూమిలో గాని, ఎక్కడ దాగి ఉన్నప్పటికీ అల్లాహ్ దానిని బయటకు తీసుకువస్తాడు. ఆయన సూక్ష్మగ్రాహి మరియు సర్వజ్ఞుడు. కుమారా! నమాజును స్థాపించు, మంచిని ఆజ్ఞాపించు, చెడు పనుల నుంచి నిరోధించు, ఏ కష్టం కలిగినా దానికి సహనం వహించు. ఈ విషయాలు ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన విషయాలు. ప్రజలతో ముఖం ప్రక్కకు తిప్పి మాట్లాడకు, భూమి పై నిక్కుతూ నడవకు. అహంభావి, బడాయికోరు అయిన ఏ వ్యక్తినీ అల్లాహ్ ప్రేమించడు. నీ నడకలో సమమైన తూకం పాటించు. నీ కంఠస్వరం కాస్త తగ్గించుకో. అన్ని స్వరాలకంటే గాడిద స్వరం అత్యంత కఠోరమైనది.* *( ఖురాన్ 31:13-19)* 

*గ్రహించవలసిన పాఠాలు : -* 

◇ మనిషి మంచివాడు లేదా చెడ్డవాడు అన్నది అతని హృదయం, నాలుకల వల్ల తెలుస్తోంది. ఈ రెండు అవయవాలను ఎలా వాడాలన్నది మనిషి చేతుల్లో ఉంది.

◇ మంచి యజమాని తన వద్ద ఉన్న వివేకవంతులైన నౌకర్లను గౌరవించాలి.

◇ లుక్మాన్ (అలైహి) తన కుమారునికి ఇచ్చిన సలహాను అల్లాహ్ దివ్య ఖురాన్ లో ప్రస్తావించి మానవాళికి ఒక ఉదాహరణ చూపించారు. ఈ సలహాను యావత్తు మానవాళి మార్గదర్శక సూత్రంగా అనుసరించవలసి ఉంది.

Insha Allah రేపటి భాగము - 51 లో హజ్రత్ ఇల్యాస్ అలైహిస్సలామ్ గురించి తెలుసుకుందాము.

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆

No comments:

Post a Comment