46

🤚🏻✋🏻 🕌   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*   🕌 🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

                               *భాగము - 46* 

____________________________________________

హుపో పక్షి సులైమాన్ (అలైహి) ఆజ్ఞ ప్రకారం, అతను ఇచ్చిన ఆ లేఖను తీసుకెళ్లి సబా రాణి బిల్కిస్ ముందు పడవేసి ఎగిరిపోయింది. ఆ పక్షి అక్కడి నుంచి వెళ్లిపోకుండా ఓ మూలన దాక్కుని చూడసాగింది.

సబా రాణి బిల్కిస్ ఆ లేఖను ఆశ్చర్యంగా తీసుకొని చదివింది. 

బిల్కిస్ : - సభాసదులారా! నా దగ్గరకు అతి ముఖ్యమైన ఒక ఉత్తరం విసిరివేయబడింది. లేఖ యొక్క సారాంశం ఏమనగా....,

"అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ఈ లేఖ సులైమాన్ (అలైహి) నుంచి పంపబడింది. నాకు వ్యతిరేకంగా బలప్రదర్శనకు దిగవద్దు. నా పట్ల తిరుగుబాటు వైఖరికి పాల్పడవద్దు. తక్షణమే విధేయురాలివై లొంగిపోయిన మనిషి మాదిరిగా నా వద్దకు రావాలి. " అనేది లేఖ యొక్క సారాంశం.

ఈ లేఖ చదివి రాణి చాలా ఆందోళనకు గురయ్యింది. వెంటనే తన సలహాదారులను పిలిపించింది.

బిల్కిస్ : - సలహాదారులారా! ఇది ఈ లేఖ యొక్క సారాంశం. ఈ వ్యవహారంలో నాకు ఏదైనా సలహా ఇవ్వండి. ఏ విషయంలోనూ నేను మిమ్మల్ని సంప్రదించకుండా నిర్ణయం తీసుకోను.

సలహాదారులు : - మేము శక్తిమంతులం, గొప్ప సమరయోధులం. మేము కేవలం సలహా మాత్రమే ఇవ్వగలం. ఆదేశాలిచ్చి చర్యలు తీసుకోవలసినది రాణి గారు మాత్రమే. ఏం నిర్ణయం తీసుకోవాలో మీరే ఆలోచించి ఆజ్ఞాపించండి.

వారి ఉద్దేశాన్ని ఆమె గ్రహించింది. ఆ సలహాదారులంతా సులైమాన్ (అలైహి) తో యుద్ధరంగంలో ఢీకొనాలని భావిస్తున్నారు. కానీ ఆమె వారితో....,

బిల్కిస్ : - రాజులు ఏదైనా రాజ్యంలోకి జొరబడితే, ఆ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తారు. గౌరవనీయుల్ని పరాభవం చేస్తారు. వారు మనల్ని ఇలానే చేస్తారు. స్నేహం మరియు శాంతి, యుద్ధం కన్నా మంచివి మరియు వివేకవంతమైనవి. యుద్ధం వల్ల పరాభావాలు వాటిల్లుతాయి. ప్రజలు బానిసలవుతారు. సంపద నాశనం అవుతుంది.
         ..... నేను సులైమాన్ (అలైహి) కు కానుకలు పంపించాలని భావిస్తున్నాను. మన ఖజానా లో విలువైన వస్తువుల్ని పంపుదాం. ఈ కానుకలు తీసుకునివెళ్లే మన రాయబారులు, రాజప్రతినిధులు సులైమాన్ (అలైహి) గురించి కూడా తెలుసుకోవచ్చు. అతని సైనిక బలాన్ని కూడా అంచనా వేయవచ్చు. చూద్దాం మన వాళ్ళు ఏం సమాధానం తీసుకవస్తారో!

కానీ, తన మాటలన్నింటిని హుపో పక్షి వింటున్నదన్న విషయం ఆ బిల్కిస్ రాణి కు తెలియదు. హుపో పక్షి వెంటనే సులైమాన్ (అలైహి) వద్దకు వెళ్లి, అక్కడ జరిగిన విషయాలన్నింటిని చేరవేసింది.

విషయం తెలుసుకున్న సులైమాన్ (అలైహి) వెంటనే తన ఆధీనంలో ఉన్న ఒక జిన్నుతో ఒక మహాప్రాసాదాన్ని నిర్మించమని ఆదేశించారు. ఆ మహాసౌధంలో సబా రాణి బిల్కిస్ రాయబారులను, అతిథిలుగా స్వాగతించాలని అనుకున్నారు.

*సులైమాన్ అలైహిస్సలామ్ వద్దకు విచ్చేసిన రాయబారులు* 

సబా రాణి వద్ద నుంచి వచ్చిన రాజ ప్రతినిధులను సులైమాన్ (అలైహి) చాలా ఆదరంగా స్వాగతించారు. అద్భుతమైన ఆ భవనాలను చూసి రాయబారులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

తర్వాత ఆ రాజ ప్రతినిధులు తమ రాణి పంపించిన విలువైన కానుకలను సులైమాన్ (అలైహి) కు అందజేశారు.

రాయబారులు : - మహారాజ సులైమాన్! మా రాణి బిల్కిస్ పంపిన ఈ విలువైన ఆభరణములు, కానుకలను స్వీకరించండి. స్నేహానికి గుర్తుగా బిల్కిస్ రాణి ఈ కానుకలను పంపించింది. మీరు తప్పకుండా వీటిని స్వీకరించాలి.

సులైమాన్ (అలైహి) : - మీరు నాకు సిరి సంపదలతో సహాయం చేయదలచుకున్నారా? అల్లాహ్ మీకు ఇచ్చిన సంపద కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా నాకు పుష్కలంగా ప్రసాదించారు. ఒక పెద్ద రాజ్యాన్ని ఇచ్చారు. ప్రవక్త పదవిని ఇచ్చారు. కాబట్టి నేను లంచాలకు లోంగే అవకాశం లేదు. మీ కానుకలు మీకే చెల్లు. నా లక్ష్యం ఒక్కటే, అది తౌహీద్ (ఏకదైవారాధన)ను వ్యాపింపజేయడం. అంతే కాదు, ఆ కానుకలను మిమ్మల్ని పంపించిన వారి దగ్గరికి తిరిగి తీసుకవేళ్ళాలని ఆదేశిస్తున్నాను. మీరు మరియు మీ రాణి విశ్వప్రభువు, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ ను వదిలి, అల్లాహ్ సృష్టిలో ఒక భాగమైన సూర్యుడుని ఆరాధిస్తున్నారు. కనుక మీరు, మీ రాణి మీ ఆరాధనా పద్ధతిని మార్చుకోనట్లయితే మీ సబా రాజ్యాన్ని వశపరచుకుంటాను. మీ పైకి బ్రహ్మాండమైన సైన్యం తెస్తాను. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సైన్యాన్ని ఎదిరించలేరు. మీ రాజ్యపు ప్రజల్ని పరాభవంపాలుజేసి సబా రాజ్యం నుంచి కఠినంగా వెల్లగొడతాను. మీరు ఇక తుఛ్ఛులుగా ఉండిపోతారు.

*బిల్కిస్ రాణి రాయబారుల తిరుగు ప్రయాణం* 

సబా రాణి ప్రతినిధులు ఆ కానుకలను తీసుకొని ఆమె వద్దకు చేరుకొని, సులైమాన్ (అలైహి) చెప్పిన మాటలు చెప్పారు. అంతేకాదు, సులైమాన్ (అలైహి) రాజ్యంలో తాము చూసిన అద్భుతాలను కూడా వివరించారు. సులైమాన్ (అలైహి) ఆదేశం పట్ల ఆమె ఆగ్రహం ప్రదర్శించే బదులు సులైమాన్ (అలైహి) రాజ్యాన్ని సందర్శించాలని నిర్ణయించుకుంది. తనకు విశ్వాసపాత్రులైన నౌకర్లతో ఆమె సబా రాజ్యాన్ని వదిలి సులైమాన్ (అలైహి) రాజ్యానికి బయలుదేరింది. ఒక సందేశహారుడితో సులైమాన్ (అలైహి) వద్దకు తాను వస్తున్నట్టు వర్తమానం ముందుగానే పంపించింది.

సందేశహరుడితో తన వద్దకు సబా రాణి బిల్కిస్ వస్తోందన్న వార్తను సులైమాన్ (అలైహి) తెలుసుకున్నారు.

*సులైమాన్ (అలైహి) ఆదేశపాలన కోసం జిన్నుల పోటీ* 

సులైమాన్ (అలైహి) తన ఆధీనంలో ఉన్న జిన్నులను పిలిచి, ఇలా అన్నారు.

సులైమాన్ (అలైహి) : - జిన్నులారా! సబా రాణి బిల్కిస్ మన రాజ్యాన్ని సందర్శించడానికి వస్తున్నారు. ఆమె ఇక్కడికి రాకముందే ఆమె సింహాసనాన్ని నా వద్దకు మీలో ఎవరూ తీసుకువస్తారు.

ఒక జిన్ను : - మహారాజా! ఈ సమావేశం ముగిసేలోపే ఆ సింహాసనాన్ని మీ ముందు ఉంచుతాను. నిస్సందేహంగా నేను బలం కలవాడిని. నాకు ఆ బలం ఉంది. ఇలాంటి పనులు చేయడానికి నమ్మకస్తుడిని.

కానీ ఈ పని చేయడానికి జిన్నుల పోటీపడ్డారు. ఇంతలో విశేష గ్రంథజ్ఞానం కలిగిన ఒక జిన్ను "మీరు కళ్ళుమూసి తెరిచేలోగా మీరు కోరిన సింహాసనాన్ని మీ ముందు ఉంచుతాను." అని అన్నాడు. అనడం ఏమిటి! మరుక్షణం ఆ సింహాసనం సులైమాన్ (అలైహి) ముందు ఉంచాడు. దీన్ని చూసిన సులైమాన్ (అలైహి)....,

సులైమాన్ (అలైహి) : - ఇది నా ప్రభువు అనుగ్రహం. నేను విశ్వాస వైఖరితో కృతజ్ఞత చూపుతానా లేక అవిశ్వాస వైఖరితో కృతఘ్నుడైపోతానా అని నన్ను పరీక్షించడానికే అల్లాహ్ ఇలా చేశారు. ఎవరైనా కృతజ్ఞత చూపుతున్నాడంటే అది అతనికే లాభదాయకమవుతుంది. కృతఘ్నుడైపోతే అది అతనికే చేటు. నా ప్రభువు నిరుపేక్షాపరుడు. దేనిని ఖాతరు చేయనివాడు.

ఆ తర్వాత సులైమాన్ (అలైహి) ఆ జిన్నుతో....,

సులైమాన్ (అలైహి) : - సబా రాణి వచ్చిన తర్వాత ఈ సింహాసనాన్ని ఆమె ముందు ఉంచాలి. అయితే ఇపుడు వెంటనే సింహాసనం ఆకారాన్ని మార్చు. ఆ సింహాసనాన్ని చూసి ఆమె సరైన నిర్ణయానికి వస్తుందో లేక మార్గవిహీనుల్లో పడి ఉంటుందో చూద్దాం.

*సబా రాణి బిల్కిస్ ఆగమనం* 

సబా రాణి బిల్కిస్ సులైమాన్ (అలైహి) రాజ్యానికి చేరుకుంది. సులైమాన్ (అలైహి) రాజప్రాసాదంలోకి బిల్కిస్ వచ్చినప్పుడు ఆమెను ఘనంగా స్వాగతించడం జరిగింది. ఆ తర్వాత సులైమాన్ (అలైహి) తన వద్ద ఆకారం మార్చి ఉన్న ఆ సింహాసనాన్ని ఆమెకు చూపించి....,

సులైమాన్ (అలైహి) : - మీ సింహాసనం కూడా ఇలానే ఉంటుందా?

ఆమె ఆ సింహాసనాన్ని పదేపదే చూసింది. ఆ సింహాసనం తన సింహాసనం అయ్యే అవకాశం లేదని భావించింది. ఎందుకంటే తన సింహాసనం తన రాజ భవనంలో ఉంది. కానీ తన సింహాసనానికి ఈ సింహాసనానికి పోలీకలు చాలా ఉండటం చూసి ఆమె ఆశ్చర్యంగా....,

బిల్కిస్ : - ఇది అచ్చం అలానే ఉంది. ఈ సింహాసనం నా సింహాసనాన్ని చాలా విధాలుగా పోలి ఉంది.

ఆమె చాలా తెలివైన, దౌత్యపరమైన నైపుణ్యం ఉన్న మహిళగా సులైమాన్ (అలైహి) గుర్తించారు.

ఆమె అవిశ్వాస జాతికి చెందిన స్త్రీ. అందుచేత ఆమె నిజ దైవాన్ని వదిలి మిధ్యాదైవాల్ని పూజిస్తుండేది. ఈ అలవాటే ఆమెను సత్యాన్ని విశ్వసించకుండా నిరోధించింది.

ఆ తర్వాత సులైమాన్ (అలైహి), బిల్కిస్ రాణిని ఒక పెద్ద రాజమహల్ లోకి ఆహ్వానించారు. ఆమె ఆ మహల్ లోపలికి ప్రవేశించగానే అక్కడ నీటి కొలను ఉన్నట్లు ఆమెకు కనిపించింది. ఆమె అక్కడ అడుగుపెట్టేటప్పుడు తన దుస్తులు తడవకుండా కొద్దిగా కాలిమడమల పైకి లాక్కుంది.

సులైమాన్ (అలైహి) ఆమెను చూస్తూ....,

సులైమాన్ (అలైహి) : - మహారాణి బిల్కిస్! మీరు ఈ నేలను చూసి అదంతా నీరుగా భ్రమ పడుతున్నారు. ఇక్కడ నీరు లేదు గాజుతో నిర్మించిన నున్నటి నేల. ఈ గదిలో నేల అంతా గాజుతో పరచబడి ఉంది. 

బిల్కిస్ రాణి ఆశ్చర్యపోయింది. అలాంటి నిర్మాణాన్ని ఆమె అంతకుముందు ఎన్నడూ చూడలేదు.

దాంతో సబా రాణి బిల్కిస్ సత్యాన్ని గ్రహించి....,

బిల్కిస్ : - ప్రభు! నేను ఆత్మద్రోహానికి పాల్పడ్డాను. ఇపుడు నేను సులైమాన్ (అలైహి) పాటు సర్వలోక ప్రభువుకు విధేయురాలిని అయిపోయాను. నా ముందు ఉన్నది విజ్ఞానవివేకాలు మూర్తీభవించిన అసాధారణ వ్యక్తి అని నేను గుర్తిస్తున్నాను. సులైమాన్ (అలైహి) కేవలం ఒక రాజ్యానికి పాలకుడు మాత్రమే కాదు, దైవ ప్రవక్త కూడా అని తెలుసుకుంటున్నాను. నేను నా తన ఆరాధన పద్ధతులలోని తప్పులకు పశ్చాత్తాప పడుతున్నాను. (అని అరిచింది)

సత్యాన్ని విశ్వసించాక బిల్కిస్ రాణి సూర్యుడిని పూజించే అలవాటు మానుకుంది. అల్లాహ్ ను విశ్వసించింది. తన రాజ్యంలోని ప్రజలు కూడా అదే విధంగా చేయాలని కోరింది.

Insha Allah రేపటి భాగము - 47 లో సులైమాన్ (అలైహి) మరణం గురించి తెలుసుకుందాము.

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

☆☆   ®@£€€q  +97433572282 ☆☆

No comments:

Post a Comment