72

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

          🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                   *భాగము - 72* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

తన శిష్యుల కోరిక మేరకు హజ్రత్ ఈసా (అలైహి), వడ్డించిన ఆహార పదార్థాల విస్తరిని ఒకదాన్ని దించమని అల్లాహ్ కు మొరపెట్టుకున్నాడు. అల్లాహ్, ఆయన మొరను ఆలకించారు. ఆ మరుక్షణం వారందరి ముందు ఆహార పదార్థాలు వడ్డించిన ఒక విస్తరి ప్రత్యక్షమయ్యింది.

ఆ తర్వాత వారంతా ఆ ఆహార పదార్థాలను కడుపారా భుజించారు. ఈ విందులో చుట్టుప్రక్కల ప్రజలు చాలా మంది వచ్చి పాల్గొన్నారు. అందరూ తిన్నారు. దైవికంగా అక్కడకు వచ్చిన ఆ ఆహారపదార్థాలను, ఎంతమంది తిన్నా కూడా తరగలేదు. ఆ తర్వాత కూడా చాలా కాలం వరకు ఆ మహత్యం గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకున్నారు. ఈ మహత్యం తర్వాత చాలా మంది ప్రవక్త ఈసా (అలైహి) సందేశాన్ని విశ్వసించారు.

 *బైబిల్ లో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రస్తావన.* 

 *"ఈసా (ఇస్రాయీలీలతో) 'నా తరువాత మరో ప్రవక్త రానున్నాడని మీకు శుభవార్త అందజేస్తున్నాను. అతని పేరు 'అహ్మద్' అవుతుంది.' అని అన్నాడు." (ఖుర్ఆన్ 61:6)* 

ఇక్కడ ఈసా అలైహిస్సలామ్ తన తర్వాత రాబోయే ప్రవక్త పేరు *'అహ్మద్'* అని స్పష్టంగా తెలియజేశారు. అంతిమ దైవప్రవక్త *ముహమ్మద్ (స)* కు *'అహ్మద్'* అనే మరో పేరు కూడా ఉందన్న సంగతి జగద్విదితం. ఈసా (అలైహి), తన తర్వాత *'అహ్మద్'* అనే ప్రవక్త రానున్నాడని పేరుపెట్టి ప్రకటించారంటే ఆయనపై అవతరించిన *"ఇంజీల్"* గ్రంథంలో ఈ పేరు తప్పక ఉండి ఉంటుంది. ఈ గ్రంథం రెండువేల సంవత్సరాల క్రితం ఆనాడు పాలస్తీనా ప్రజలు మాట్లాడుకునే 'సిరియక్' భాషలో అవతరించి ఉండవచ్చని తెలుస్తోంది. హెబ్రూభాష దానికి రెండు మూడు వందల సంవత్సరాలకు పూర్వమే అంతరించిపోయింది.

ఈనాటి బైబిల్ ఈసా (అలైహి), ఆయన అనుచరుల నిష్క్రమణ తర్వాత క్రీ.శ. 80-120 మధ్య కాలంలో వ్రాయబడింది. అప్పుడు ఈసా (అలైహి) బోధనలను సేకరించడానికి వెళ్ళిన క్రైస్తవపండితులు, వాటిని 'సిరియక్' మాట్లాడే క్రైస్తవప్రజల నోట విని గ్రీకు భాషలో వ్రాసుకున్నారు.

అయితే ఆనాడు గ్రీకు భాషలో వ్రాయబడిన బైబిల్ అసలు ప్రతి కూడా ఈనాడు లేకుండా పోయింది. దాని అనువాదాలు, ఆ అనువాదాల అనువాదాలు మాత్రమే ఇప్పుడున్నాయి. అవి కూడా ఎన్నో మార్పులకు, చేర్పులకు గురైపోయాయి. పైగా ప్రస్తుత బైబిల్ లో ఈసా (అలైహి) నిష్క్రమణ తర్వాత జరిగిన స౦ఘటనలు, ఆయన అనుచరులని చెప్పబడే వారి మాటలు కూడా చోటు చేసుకున్నాయి. *"ఇంజీల్"* అనువాదం సైతం ఇంతగా మార్పులకు, చేర్పులకు గురికావడం వల్లనే అల్లాహ్ తన వాణిని తిరిగి *"ఖుర్ఆన్"* రూపంలో అవతరింపజేశారు.

 *అల్లాహ్, ఈసా (అలైహి)కు తీర్పుదినాన వేయబడే ప్రశ్న....,* 

అల్లాహ్ : - మర్యం పుత్రుడవైన ఓ ఈసా! నన్ను కాదని నిన్ను, నీ తల్లిని దేవుళ్లుగా చేసుకొని ఆరాధించాలని నీవు ప్రజలకు బోధించావా?

ఈసా (అలైహి) : - (ఓ అల్లాహ్!) మీరు ఎంతో పవిత్రులు, పరిశుద్ధులు. నాకు అధికారంలేని విషయం గురించి నేనెలా అనగలను? నేనలాంటి మాటేదయినా అని ఉంటే అది తప్పకుండా మీ దృష్టికి వచ్చేది. నా అంతరంగంలో (మనసులో) ఏముందో మీకు బాగా తెలుసు. కానీ మీ అంతరంగంలో ఏముందో నాకేమాత్రం తెలియదు. మీరు సమస్త అగోచర విషయాలు ఎరిగినవారు.

         మీరు ఆదేశించిన విషయాలే నేను వారికి బోధించాను. నాప్రభువు, మీ ప్రభువు కూడా అయిన అల్లాహ్ ని మాత్రమే ఆరాధించండని నేను వారికి చెప్పాను. వారి మధ్య జీవించి ఉన్నంతవరకే నేను వారిని కనిపెట్టుకుని ఉన్నాను. మీరు నన్ను పైకి ఎత్తుకున్న తర్వాత వారిని మీరే కనిపెట్టుకొని ఉన్నారు. మీరు అందరినీ, అన్ని విషయాల్ని (అన్ని వేళలా) కనిపెడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు వారిని శిక్షిస్తే వారు మీ దాసులే. ఒకవేళ క్షమిస్తే, మీరు ఎంతో శక్తిమంతులు, మహా వివేకవంతులు.

అల్లాహ్ : - (ఈసా!) సత్యవ్రతులకు వారి సత్యసంధత ప్రయోజనం చేకూర్చే రోజు వస్తుంది. అలాంటివారికి (ఆ రోజు) సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలు లభిస్తాయి. అక్కడ వారు కలకాలం (సుఖంగా) ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడవుతాడు. వారు అల్లాహ్ పట్ల సంతోషిస్తారు. ఇదే ఘనవిజయం.

 *భూమ్యాకాశాలలో, వాటి మధ్య, సర్వత్రా అల్లాహ్ రాజ్యమే సాగుతోంది. ఆయన సమస్త విషయాలపై అధికారంగల సమర్థుడు, సర్వశక్తిమంతుడు.* 

 *ఏసుక్రీస్తు హెచ్చరిక : -* 

ఏసుక్రీస్తు (ఆయనపై శాంతి ఉండును గాక) ఆయనను అనుసరించే "క్రైస్తవులను" ఇలా హెచ్చరించాడు. దయచేసి హెచ్చరిక జాగ్రత్తగా వినండి :

 *ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపపడుగాని పరలోకమందున్న నా తండ్రి (యెహోవా, అనగా అల్లాహ్) చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి - ప్రభువా, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు - నేను మిమ్మును ఎన్నడునూ ఎరుగను, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. (మత్తయి 7:21-23)* 

బైబిల్ గ్రంథం ప్రకారం ఏసుక్రీస్తు (ఆయనపై శాంతి ఉండును గాక) ల వారు, "నన్ను కాదు యెహోవా (అల్లాహ్) ను ఆరాధించండి" అని ఇంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ, చాలా మంది క్రైస్తవులు యెహోవా (అల్లాహ్) ను కాదని ఏసుక్రీస్తునే ఆరాధిస్తూ, ఆయన బోధనలనే అతిక్రమిస్తున్నారు.

అల్లాహ్, క్రైస్తవ సోదరులకు మరియు సోదరీమణులకు సన్మార్గబుద్ధిని, సద్బుద్ధిని, సంపూర్ణ ఇస్లాం జ్ఞానాన్ని, దాని మీద జీవించే భాగ్యాన్ని, సత్యాన్ని గ్రహింపజేసి మరియు హిదాయత్ ను ప్రసాదించుగాకా ---- ఆమీన్

ఈసా (అలైహి) ను చంపడానికి పన్నిన పన్నాగాలను Insha Allah రేపటి భాగము - 73 లో తెలుసుకుందాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment