89

☪☪☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐              *ఇస్లాం చరిత్ర* *- 89*              🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 04* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

 *అబ్దుల్ ముత్తలిబ్ మొక్కుబడి : -* 

“దేవా! నాకు పదిమంది కొడుకులను ప్రసాదించు. నా జీవితంలోనే వారందరూ పెరిగి పెద్దయ్యక నాకు చేదోడువాదోడుగా తయారైతే, ఆ పది మంది కుమారులలో ఒక కుమారున్ని నీకు బలి సమర్పించుకుంటాను.” అని అబ్దుల్ ముత్తలిబ్ మొక్కుకున్నాడు.

దేవుడు అతని మొరాలకించి పదిమంది కొడుకులని ప్రసాదించాడు. ఆ పది మంది పెరిగి పెద్దయ్యి, తమ తండ్రి ఆస్తిపాస్తులను సంరక్షించే వయస్సుకు చేరుకున్నారు. కాని అబ్దుల్ ముత్తలిబ్ దైనందిన కార్యకలాపాలలో తలమునకలైపోయి మొక్కుబడి సంగతి మరచిపోయాడు.

అయితే ఓ రోజు నడిరాత్రి సమయంలో..... అబ్దుల్ ముత్తలిబ్ తన ఇంట్లో, తన రోజువారి కార్యకలాపాలను ముగుంచుకొని గాఢ నిద్రావస్థలో ఉన్నాడు. అంతలో ఓ గద్గస్వరం...., “అబ్దుల్ ముత్తలిబ్! లే.... లేచి నీ మొక్కుబడి తీర్చుకో.” అబ్దుల్ ముత్తలిబ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. చూస్తే ఎవరు కనిపించలేదు. అయితే మొక్కుబడి మాట వినగానే, అబ్దుల్ ముత్తలిబ్ కు గతంలో తాను మొక్కుకున్న మొక్కుబడి గుర్తుకు వచ్చింది. అలా ఆలోచిస్తూ.... కాస్సేపటికి కళ్ళు మూతలు పడ్డాయి. మళ్ళీ అంతలో...., “అబ్దుల్ ముత్తలిబ్! లే....లేచి నీ మొక్కుబడి తీర్చుకో.” అని మళ్లీ ఆ విచిత్ర స్వరం.

అబ్దుల్ ముత్తలిబ్ మళ్ళీ ఉలిక్కిపడి లేచాడు. “కలలో ఎవరో మహనీయుడు కనిపించి తన మొక్కుబడి సంగతి గుర్తు చేసాడు." మొక్కుబడి తీర్చుకోవలసిన సమయం ఆసన్నమయ్యింది అని అబ్దుల్ ముత్తలిబ్ తన మనసులో అనుకున్నాడు.

ఇక ఆ తర్వాత పడుకుందామనుకుంటే నిద్ర రావడం లేదు. గత జరిగిన విషయాల గురించిన ఆలోచనలు ముసురుకున్నాయి అతనికి. ఆ ఆలోచనలతోనే రాత్రి గడచింది.

ఉదయం కాగానే అబ్దుల్ ముత్తలిబ్ తన పది కొడుకుల్ని పిలిపించాడు. వారందరికీ బలిదానం గురించి వివరిస్తూ....,

“నాయనలారా! దేవుడు నాకు పదిమంది కొడుకులు ప్రసాదించి, వారంతా నా కళ్ళెదుట పెరిగి పెద్ద వాళ్ళు అయితే నేను వారిలో ఒకడ్ని ఆయనకు బలి ఇస్తాను అని మొక్కుకున్నాను. ఆ ప్రభువు దయ వళ్ళ నాకు పదిమంది కొడుకులు పుట్టి పెద్దవాళ్ళయ్యారు. ఇప్పుడు నా మొక్కుబడి నెరవేర్చుకునే సమయం వచ్చింది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి”.

ఈ మాట విని ఆ పది మంది కొడుకులు ఏ మాత్రం కంగారుపడలేదు. పైగా వారు ఉత్సాహంతో ఒకరి తరువాత మరొకరు తమ అంగీకారం తెలుపుతూ ఇలా అన్నారు....,

“నాన్న! మేమిందుకు సిద్దముగా ఉన్నాం. మా పూర్వీకులైన తాత ఇస్మాయిల్ (అలైహి), వారి తండ్రి ఇబ్రాహీం (అలైహి) ఇచ్చిన ఆజ్ఞ ముందు తలవంచారు బలిపీఠం మీద. అలాగే మేము కూడా మా ప్రాణాలను అర్పించి మమ్మల్ని బలిచ్చుకోవడానికి సిద్దంగా వున్నాం. మేమందరం దీన్ని మా అదృష్టంగా భావిస్తున్నాం." అని అన్నారు.

ఈ మాటలు విని అబ్దుల్ ముత్తలిబ్ ఎంతో సంతోషించాడు. వినయవిధేయతలు కలిగిన కొడుకుల్ని ప్రసాదించినందుకు అతను దేవునికి కృతఙ్ఞతలు చెప్పుకున్నాడు. ఈ విధంగా ఆ పది మంది  కుమారులు తండ్రి మాటను శిరసావహించారు.

అబ్దుల్ ముత్తలిబ్ : - సరే, మీలో ఎవరిని బలి ఇవ్వాలో మీరే చెప్పండి?

కొడుకులు : - నాన్నగారు! మీరు ఎవరిని ఆజ్ఞాపిస్తే అతను సిద్ధం (అని అన్నారు ముక్త కంఠంతో)

అబ్దుల్ ముత్తలిబ్ : -“నేను ప్రత్యేకముగా ఎవరి పేరు సూచించను. హుబల్ దేవత పూజారి ద్వారా పాచికలు వేసి చూద్దాం. అందులో ఎవరి పేరు వస్తే అతడ్ని బలిస్తాను.

అబ్దుల్ ముత్తలిబ్ ఈ మాట చెప్పి, తన పది మంది కొడుకుల్ని కాబా మందిరానికి తీసుకెళ్ళాడు. అక్కడ హుబల్ దేవత పూజారికి విషయం తెలియజేసాడు. అతను పది బాణాలు తీసుకుని వాటిలో ఒక్కొక్క దానిపై ఒక్కొక్క కొడుకు పేరు వ్రాయించాడు. తరువాత ఆ బాణాలు హుబల్ దేవత ముందుంచి ఓ ప్రత్యేక తీరులో వాటిని తిప్పాడు. ఆ తర్వాత అందులో నుంచి ఒక బాణాన్ని తీయగా, ఎంతో ప్రియమైన కొడుకు “అబ్దుల్లాహ్” పేరు వచ్చింది. దాంతో అబ్దుల్లాహ్ నే బలివ్వడానికి నిర్ణయించుకున్నాడు అబ్దుల్ ముత్తలిబ్.

ఈ నిర్ణయం సంగతి అబ్దుల్లా తల్లి వైపు బంధువులకు (బనూ మక్జూమ్ తెగవారు) తెలిసి వారు తీవ్ర ఆందోళన చెందారు. వారంతా అబ్దుల్లాహ్ ను బలివ్వకుండా, అబ్దుల్ ముత్తలిబ్ ని వారించడానికి ప్రయత్నించారు, శతవిధాల నచ్చజెప్పి చూశారు. కాని అబ్దుల్ ముత్తలిబ్ వారి మాటలు త్రోసిపుచ్చుతూ...., "నా నిర్ణయం అమలుపరచక తప్పదు." అని అన్నాడు. బనూ మక్జూమ్ తెగవారు కూడా తమ పట్టును ఏ మాత్రం సడలించుకోలేదు.

చీకటి పడింది. ఈ సమస్య ఓ కొలిక్కి రాకముందే అందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు.

 *తరువాతి రోజు : -* 

తెల్లవారింది. అబ్దుల్ ముత్తలిబ్ ఎటో చూస్తూ తీవ్రమైన ఆలోచనల్లో నిమగ్నుడై ఉన్నాడు. అతని ముఖ కవళికలు క్షణక్షణానికి మారుతున్నాయి. ఒక్కొక్కప్పుడు అతని కళ్ళలో ఏదో కాంతి కిరణం కనిపించినట్లే కనిపించి అంతలొనే అదృశ్యమైపోతున్నది. అతనికి కొ౦చె౦ దూరంలో అతని కుటుంబసభ్యులు కూడా ఏదో ఆలోచిస్తూ నిలబడ్డారు. అతని ముందు మాట్లాడే ధైర్యంలేక వారు మౌనంగా ఓ పక్కన నిల్చున్నారు.


కొంత సమయం తర్వాత, అబ్దుల్‌ ముత్తలిబ్‌ మధ్యమధ్యలో మాటిమాటికి పిడికిళ్లు బిగించి వదిలేస్తూ ఉన్నాడు. కాస్సేపటికి నుదుటి మీది చెమట తుడుచుకొని ఏదో నిర్ణయానికి వచ్చినవాడిలా తల ఫైకెత్తాడు. “ఏడి అబ్దుల్లాహ్? ఎక్కడికి పోయాడు? అతడిని కాబా దగ్గరికి పిలుచుకురండి. ఈరోజు అతడ్ని హుబల్‌ దేవతకు బలి ఇచ్చి నా మొక్కుబడి తీర్చుకోవాలి." అని అన్నాడు దిగ్గున పైకిలేస్తూ....

అతని దృఢ నిర్ణయం విని అతని కుటుంబీకులు తీవ్రంగా ఆందోళన చెందారు. ఏమీ చేయాలో పాలుపోక ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు. ఆ ఇంట్లో గోడకున్న ఓ గూటిలో రకరకాల తాళ్ళు, కత్తులు, ఖాళీ గోతాలు, విరిగిన కవచాలు, పాత వన్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. అబ్దుల్ ముత్తలిబ్ ఆ ఇంట్లోకి వెళ్ళి గూట్లో ఉన్న ఆ వస్తువుల్లో ఓ కత్తిని తీసుకున్నాడు. తర్వాత సరాసరి కాబా మందిరానికి వెళ్ళాడు. కాసేపటికి అతని కుటుంబసభ్యులు కూడా అతని వెనకాలే కాబా వైపు నడిచారు. వారిలొ కొందరు అబ్దుల్ ముత్తలిబ్ కి నచ్చజెప్పడానికి ఎంతగానో ప్రయత్నించారు. కాని వారి మాటలు ఖాతరుచేయకుండా, అబ్దుల్ ముత్తలిబ్ విరిగిపోయిన ఓ ఉక్కు కవచం పై కత్తికి పదును పెట్టడం ప్రారంభించాడు.

అంటే అతని నిర్ణయానికి తిరుగులేదన్నమాట! అబ్దుల్లాహ్ ను బలివ్వక తప్పదన్నమాట!! అంతే, ఈ మాట క్షణాల్లో దావానలంలా మక్కా పట్టణమంతా వ్యాపించిపోయిది. జనం తండోపతండాలుగా వచ్చి కాబా మందిరం దగ్గర గుమిగూడటం మొదలెట్టారు.

సర్వత్రా దుఖః చాయలు అలుముకున్నాయి. జనంలో అబ్దుల్లాహ్ మీద అమితమైన సానుభూతి పెల్లుబికింది. ఏ నోట విన్నా ఒకటే మాట...., “వద్దు వద్దు. అబ్దుల్లాహ్ ను బలివ్వకండి అతనికి బదులు పరిహారంగా ఏదైనా ఇవ్వండి. ఎన్ని ఒంటెలు బలివ్వడానికైనా లేదా ఎంత డబ్బు కానుకగా సమర్పించుకోవడానికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం." అన్నారు ప్రజలు.

కాని ఆ మొండి మనిషి అబ్దుల్ ముత్తలిబ్ ఎవరి మాట వినేలా లేడు. అబ్దుల్లాహ్ తల్లి తరపు బంధువులు ఎలాగైనా ఈ పని నుండి అతడ్ని వారించాలని మరోసారి ప్రయత్నించారు. “అబ్దుల్ ముత్తలిబ్! ఆపండి, అబ్దుల్లాహ్ ను బలివ్వడానికి ఎంతమాత్రం వీల్లేదు. కావాలంటే ముందు మా మెడలపై కత్తి పెట్టండి. తరువాతే అబ్దుల్లాహ్ జోలికి పొండి” అన్నారు వారు ఈసారి గట్టిగానే.

అబ్దుల్ ముత్తలిబ్ : - లోకం తల్లకిందులైనా సరే నా నిర్ణయం మారదు. (అని అన్నాడు గంభీరంగా కత్తికి మరింత సానబెడుతూ)

బంధువులు కూడా గట్టి పట్టుబట్టారు. ఉభయుల్లో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. మరో వైపు ప్రజలు కూడా అబ్దుల్లాహ్ ను బలి ఇవ్వవద్దని ఒత్తిడి చేస్తున్నారు. అబ్దుల్ ముత్తలిబ్ ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయాడు.అతను ఓ సారి గతంలోకి తొంగి చూసాడు....,

Insha Allah మిగిలినది రేపటి భాగములో తెలుసుకుందాము.

🖊🖊     ®@£€€q +97433572282      🖊🖊
                    (rafeeq)

🖊🖊      Salman       +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment