27

🤚🏻✋🏻🤚🏻✋🏻 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🤚🏻✋🏻🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

                               *భాగము - 27* 

____________________________________________

*దుర్మార్గుడు ఫిరౌన్ తో భేటి* 

అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం మూసా అలైహిస్సలామ్ మరియు అతని సోదరుడు హారూన్ దివ్యసందేశాన్ని ఫిరౌన్ కు తెలియజేయాలని ఈజిప్టుకు వెళ్లి ఫిరౌన్ తో భేటి అయ్యారు. అపుడు ఫిరౌన్ రాజదర్బారులోని సభలో ఉన్నారు.

మూసా (అలైహి) : - ఫిరౌన్! నేను విశ్వప్రభువు అయిన అల్లాహ్ వైపున వచ్చిన ప్రవక్తను. అల్లాహ్ తరుపున నీ వద్దకు వచ్చిన సందేశహరున్ని. నేను అల్లాహ్ పేరుతో ఏది మాట్లాడిన సత్యమే మాట్లాడటం నా విద్యుక్త ధర్మం. నేను మీ దగ్గరికి మీ ప్రభువు నుండి స్పష్టమైన నిదర్శనం తీసుకొని వచ్చాను. కాబట్టి నువ్వు బనీఇస్రాయీల్ ప్రజలను క్రూరంగా వేధించడం మానేయ్. మా ప్రజలను విడిచిపెట్టు, వారిని మా ప్రభువు వాగ్ధానం చేసిన ప్రాంతానికి మేము తీసుకొనిపోతాము.

ఫిరోన్ : - అయితే మూసా! మీ ఇద్దరి ప్రభువు ఎవరంటా? నేను తప్ప మీకు మరో దేవుడు లేడు.

మూసా (అలైహి) : - ప్రతి వస్తువును తగినవిధంగా సృష్టించి, దానికి ఒక నిర్దిష్టమార్గం చూపినవాడే మా ప్రభువు.

ఫిరౌన్ : - అయితే ఇంతకు పూర్వం గతించిన తరాల సంగతేమిటి?

మూసా : - వారి సంగతేమిటో నా ప్రభువు దగ్గర ఓ గ్రంథంలో నమోదై సురక్షితంగా ఉంది. నా ప్రభువు ఎలాంటి పొరపాటు చేయడు. మరచిపోడు.

ఫిరౌన్ (కోపంతో మండిపడ్డాడు) : - మూసా! నిన్ను పసితనం నుంచి మేము పెంచి పెద్ద చేశాము. నీ జీవితంలో చాలా సంవత్సరాలు నీవు మా వద్ద గడిపావు. నీవు నా జాతి ప్రజలలో ఒకరిని చంపావు. ఇపుడు నీ జాతి ప్రజలను తీసుకపోవడానికి వచ్చావు. మేము చేసిన మేలులు అన్ని మరచిపోయి ఇపుడు మాకే ఎసరు పెట్టడానికి వచ్చావ్ అన్న మాట. నిజంగా నీవు చాలా కృతఘ్నుడివి.

మూసా (అలైహి) : - నేను ఆ పని అజ్ఞానాధకారంలో ఉండి తెలియక చేశాను. పొరపాటున చేశాను. తర్వాత మీకు భయపడి పారిపోయాను. అల్లాహ్ నన్ను క్షమించాడు.అల్లాహ్ నన్ను కాపాడాడు. నాకు వివేకాన్ని ప్రసాదించాడు. నీ వద్దకు నన్ను సందేశహరునిగా పంపాడు. నా ప్రభువు నాకు జ్ఞాన కాంతి ప్రసాదించి నన్ను ప్రవక్తల జాబితాలో చేర్చాడు. ఇక నువ్వు మేలు చేశావని ఎత్తిపొడుస్తున్న విషయానికొస్తే అందులో విశేషం ఏమి లేదు. నీవు నా జాతి వారైనా బనీఇస్రాయీల్ సంతతిని కట్టుబానిసలుగా చేసుకున్నావు. నీ భూభాగంలో నా ప్రజలను నీవు బానిసలుగా చేశావు. నిస్సందేహంగా అల్లాహ్ నిన్ను శిక్షిస్తాడు. కాబట్టి నీవు చేసిన అపరాధాలకు గాను అల్లాహ్ తో క్షమాపణ వేడుకో. నా జాతి ప్రజలను నాతో పంపించు. వారికి అల్లాహ్ ఒక కొత్త భూభాగాన్ని ఇచ్చే వాగ్దానం చేశాడు.

ఫిరౌన్ : - సరే! మీ ఇద్దరూ సర్వలోకప్రభువు మరియు అల్లాహ్ అని అంటున్నారు. ఎవరు ఈ సర్వలోకప్రభువు, ఈ అల్లాహ్ ఎవరు? ఏమిటా కథ?

మూసా (అలైహి) : - నీవు విశ్వసించేవాడివి అయితే విను. భూమి ఆకాశాలను, వాటి మధ్య ఉన్న సమస్త సృష్టిరాశులకు ప్రభువు అల్లాహ్ నే.

ఫిరౌన్ : - చూడండి నా సభలోని ప్రజలారా! వింటున్నారా ఈయన గారి వింతమాటలు.

మూసా (అలైహి) : - అల్లాహ్ మాకు ప్రభువు మరియు మీకు ప్రభువు. మీకు పూర్వం గతించిన మీ తాతముత్తాతల ప్రభువు.

ఫిరోన్ : - చూశారా సభాసదులారా! మీ వద్దకు పంపబడిన ఈ ప్రవక్త మహాశయులుగారిని చూస్తే మహా తలతిక్క మనిషిలా కనిపిస్తున్నాడు.

మూసా (అలైహి) : - ప్రజలారా! మీరు విజ్ఞత వివేచనలు కలవారయితే వినండి. తూర్పు పడమరలకు, వాటి మధ్య ఉన్న సమస్తానికి అల్లాహ్ నే ప్రభువు.

ఫిరౌన్ (మరింత కోపంగా) : - ఇక చాలించు మూసా, ఇంకోసారి "నేను తప్ప మరో దేవుడు ఉన్నాడు" అని చెప్పిన, నీవు నన్ను తప్ప వేరొకరికి దేవునిగా అంగీకరించిన నిన్ను కూడా జైళ్లలో పడవేసి మగ్గుతున్న వారి దగ్గరకు చేరుస్తా (జాగ్రత్త!). (అని బెదిరించాడు)

కానీ మూసా (అలైహి) లక్ష్యపెట్టలేదు.

మూసా (అలైహి) : - ఫిరౌన్! నీ సందేహాలను తొలగించే మహత్యాన్ని, నా దౌత్యానికి సంబంధించి ఒక వస్తువును ప్రదర్శిస్తే నువ్వు నమ్ముతావా? తర్వాత కూడా నీవు ఈ విధంగా బెదిరింపులకు దిగుతావా?

ఫిరౌన్ : - మూసా! నువ్వు అబద్దాలరాయుడివి. నువ్వు చెప్పేది నిజమైతే, నువ్వు సత్యవంతుడివైతే నీ ప్రభువు నుంచి నువ్వు తీసుకవచ్చిన ఆ మహత్యాన్ని నాకు చూపించు.

అపుడు మూసా (అలైహి) తన మొదటి మహత్యాన్ని ప్రదర్శించారు. ఆయన తన దగ్గర ఉన్న చేతికర్రను నేలపైకి విసరగానే అల్లాహ్ ఆజ్ఞ తో అది ఒక పాము గా మారిపోయింది.

ఇది చూసిన ఫిరౌన్ ఆశ్చర్యపోయాడు. అయిన కూడా తమ ఆహాన్ని వదలలేదు. మూసా (అలైహి) ప్రదర్శించ గలిగినది ఒకే ఒక్క మాయాజాలం అనుకున్నాడు.

మూసా (అలైహి) : - నువ్వు నాకు ఇంకా ఏం చూపించాలనుకుంటున్నావ్.

తర్వాత మూసా (అలైహి) తన రెండవ మహత్యాన్ని ప్రదర్శించారు. ఆయన తన చేతిని చంకలో ఉంచి గట్టిగా అదిమి బయటకు తీయగానే ఆ చేయి మిరుమిట్లుగోలుపుతూ కాంతివంతంగా ప్రకాశించింది.

ఇది చూసిన రాజు ఫిరౌన్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన అధికారానికి ప్రమాదం ముంచుకొచ్చేలా ఉందని భయపడ్డాడు. వెంటనే తన సర్దారులతో, సలహాదారులతో సంప్రదించాడు. ఫిరౌన్ తన అధికారులను ఉద్దేశించి ......

ఫిరౌన్ : - నా సభాధికులారా! నిజంగా వీళ్ళిద్దరూ ఆరితేరిన గొప్ప మంత్రగాళ్ళు అయిపోయారు. మన ఘనమైన సంప్రదాయాలను నాశనం చేసి, తమ మంత్రతంత్రాలతో ఈ దేశం నుంచి వెల్లగొట్టగలరు. ఇపుడు ఏం చేయాలో మీరే చెప్పండి.

తన సభాధికులు ఫిరౌన్ కు సలహా ఇస్తూ ..., "మహారాజా! మనదేశంలో పెద్ద పెద్ద మంత్రగాళ్ళు ఉన్నారు. మీరు మూసా (అలైహి) ను, అతని సోదరుడు హారూన్ ను జైల్లో ఉంచండి. దేశంలోని వివిధ పట్టణాలకు రాజభటుల్ని పంపించండి. మన భటులు కాకలుతీరిన మాంత్రికులను మీ దగ్గరికి పిలుచుకవస్తారు. ఆ మంత్రగాళ్ళు వచ్చి తమ మంత్రాలను ప్రదర్శించి కర్రలను పాములుగా మార్చడం చేస్తారు. ఆ విధంగా ప్రజలపై మూసా (అలైహి) ప్రభావాన్ని తగ్గించగలం." అని సలహా ఇచ్చారు.

తర్వాత, ఫిరౌన్ మూసా (అలైహి) ను ఉద్దేశిస్తూ .......

ఫిరౌన్ : - మూసా! నీ మంత్రశక్తితో మమ్మల్ని మా దేశం నుండి వెల్లగొట్టడానికి మా దగ్గరికి వచ్చావా? అలాగైతే మేము కూడా నీకు పోటీగా అలాంటి మంత్రశక్తినే (మంత్రగాళ్లను) తీసుకవస్తాము. ఈ పోటీకి నువ్వు సిద్ధమా?

మూసా (అలైహి) : - మీరు చెప్పిన పోటీకి మేము కూడా సిద్ధమే.

ఫిరౌన్ : - మేము ఈ మాట నుండి వెనక్కి మరలము. నీవు కూడా మరలకూడదు. రా బహిరంగ మైదానంలోకి మా ముందుకు రా. (అని సవాలువిసిరాడు)

ఫిరౌన్ : - అయితే పోటీ ఎప్పుడు, ఎక్కడ జరగాలో నిర్ణయించుకో!

మూసా (అలైహి) : - ఈజిప్టు సామ్రాజ్యంలోని ప్రజలందరూ పాల్గొనే జాతర దినాన పోటీ పెట్టుకుందాం. పొద్దెక్కిన తర్వాత జనం అందరూ బహిరంగసభలోకి రావాలి.

బహిరంగపోటీ ఎపుడో నిశ్చయమైపోయాక ఫిరౌన్, తన రాజ్యంలోని ప్రజల వద్దకు వెళ్లి రకరకాల పన్నాగాలు పన్నాడు. "నేనే మీకు అందరికంటే పెద్ద ప్రభువుని." అని ఈ విధంగా ప్రచారం చేసుకున్నాడు.

అయితే రాజభటులు, తమ రాజ్యంలో ఇలా ప్రచారం చేశారు. "ప్రజలారా! మీరందరూ సభాస్థలికి వస్తున్నారా? అయితే మాంత్రికులు గెలిస్తే మనం మన మతంలోనే ఉండిపోవచ్చు. లేకుంటే మనకు ఇక్కడ పుట్టగతులుండవు." అని విస్తృత ప్రచారం చేశారు.

ఫిరౌన్ తన సభాధికుల మాటల ప్రకారం మూసా (అలైహి), హారూన్ లను జైల్లో వేయించాడు. దేశవ్యాప్తంగా గొప్పగా చాటింపులు వేయించి పెద్ద పెద్ద మంత్రగాళ్లను పిలిపించాడు. గెలుపొందిన మంత్రగాడికి ఘనమైన సత్కార్యాలు, కానుకలతో పాటు రాజదర్బారులో ఉన్నత స్థానం ఇస్తామని హామీ ఇచ్చాడు.

*ప్రారంభమైన పోటీ* 

ఫిరౌన్ తరుపున దేశంలోని పెద్ద పెద్ద మంత్రగాళ్ల గుంపుకు మరియు దైవ ప్రవక్తగా చెప్పుకుంటున్న ఒకే ఒక్క వ్యక్తి మూసా (అలైహి) కు మధ్య జరుగుతున్న పోటీ గురించి ప్రజల్లో అప్పటికే ప్రచారం జరిగింది. ప్రజలు ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాలకు హాజరయ్యారు.

ఒకప్పుడు నైలు నదిలో కొట్టుకవచ్చిన శిశువు మూసా (అలైహి), ఫిరౌన్ రాజా ప్రాసాదంలో ప్రవేశించి, రాజకుమారుని మాదిరిగా పెరగడం గురించి కూడా రాజ్యంలోని ప్రజలు విని ఉన్నారు. కానీ ఆ రాజకుమారుడు ఒక ఈజిప్టు వ్యక్తిని ఒకే ముష్టిఘాతానికి హతమార్చి దేశం వదిలి పారిపోయాడని కూడా విని ఉన్నారు. అలా అపుడు దేశం వదిలి పారిపోయిన ఆ రాజకుమారుడే ఇపుడు వచ్చి ఫిరౌన్ తోనే పోటీ పడ్డాడని తెలిసి రాజ్యంలోని ప్రజలు చాలా ఆతృతగా పోటీ చూడటానికి వచ్చారు.

మాంత్రికులు, ప్రజలు, మూసా (అలైహి), ఫిరౌన్ మొద" వారు అందరూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పోటీ మొదలుకాకముందే మూసా (అలైహి) లేచి నిలబడ్డారు. గుమిగూడిన ప్రజల్లో గుసగుసలు మొదలయ్యాయి. తర్వాత మూసా (అలైహి) ఆ మంత్రగాళ్లను ఉద్దేశించి.... "దౌర్భాగ్యులరా! అల్లాహ్ సూచనలను మయాజాలంగా వర్ణించి అల్లాహ్ గురించి మీరు అసత్యాలు పలికితే, అల్లాహ్ ను మీరు విశ్వసించకపోతే మీకు వినాశనం తప్పదు. సత్యానికి, అసత్యానికి మధ్య గల భేదాన్ని తెలుసుకోండి. లేకపోతే మీరు నాశనం అవుతారు. ఒక మాహోపద్రవం ద్వారా అల్లాహ్ మిమ్మల్ని సర్వనాశనం చేస్తాడు. అబద్ధం ఎవడు కల్పించిన వాడికి మూడినట్లే. అల్లాహ్ మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తాడు." అని హెచ్చరించారు.

మూసా (అలైహి) నిజాయితీగా మాట్లాడిన మాటలు పునరాలోచనను రేకెత్తించాయి. కానీ ఫిరౌన్ ఇస్తానన్న సంపద, పేరు ప్రతిష్టల ప్రలోభం వారిని ముంచెత్తాయి. వారు పరస్పరం రహస్యసమాలోచనలు జరుపుకున్నారు. చివరికి వారిలో కొందరు ఇలా అన్నారు. " మన మాయజాలంతో ప్రజలను ఆకట్టుకోవాలి. మూసా (అలైహి) ను ఒక మోసగాడిగా నిరూపించాలి. వీరిద్దరు మంత్రగాళ్ళు మాత్రమే. వారు తమ మంత్రబలంతో మిమ్మల్ని మీ దేశం నుంచి వెల్లగొట్టాలని, మీ మతాన్ని, మీ ఉదాత్తసంస్కృతిని తుడిచిపెట్టాలని భావిస్తున్నారు. కనుక ఈ రోజు మీ శక్తియుక్తిలన్నీ సమీకరించుకొని, సేనావాహినిగా బరిలోకి దిగండి. గుర్తుంచుకోండి, ఈ రోజు ఎవరిది పైచేయి అవుతుందో వారిదే గెలుపు."

ప్రత్యర్థి మాంత్రికులు పోటీకి సిద్ధమయ్యారు. పోటీ ప్రారంభమైంది వారు మూసా (అలైహి) ని ఉద్దేశిస్తూ ..... "మూసా! ముందు నువ్వు పడేస్తావా లేక మమ్మల్ని పడేయమంటావా?"

మూసా : - లేదు. ముందు మీరే పడేయండి.

తరువాత జరిగిన విషయమై Insha Allah రేపటి భాగము - 28 లో తెలుసుకుందాము.

*ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-* 

ప్రియమైన ముస్లిం సోదరులారా!  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి , ఇదేదో 10 మందికి send చేస్తే మంచి జరుగుతుంది , send చేయకపోతే చేడు జరుగుతుంది అనుకునే msg లు కావు . కాబట్టి మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .

®@£€€q          +97433572282

No comments:

Post a Comment