26

🤚🏻✋🏻🤚🏻✋🏻 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🤚🏻✋🏻🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

                               *భాగము - 26* 

____________________________________________

మూసా (అలైహి) వృద్ధుని ఇద్దరు అమ్మాయిలలో ఒక అమ్మాయి ని వివాహం చేసుకొని వృద్ధుని పశువుల సంరక్షణ చూడసాగారు. ఆ విధంగా తన ఒప్పందం కన్నా రెండు సంవత్సరాలు ఎక్కువగా పది సంవత్సరాల పాటు అక్కడ పని చేశారు.

*ఈజిప్టు కి తిరుగు పయనం* 

మూసా (అలైహి) ఎలాంటి సమస్య లేని జీవితం గడుపుతున్నప్పటికి ప్రశాంతంగా ఉండలేకపోయారు. ఆయనకు ఎల్లప్పుడూ తన ప్రజల కష్టాలు, సమస్యలే గుర్తుకువచ్చేవి. శిక్ష గురించిన భయం వెంటాడుతున్నప్పటికి, నిర్ణీత సమయం ముగిశాక అల్లాహ్ పై భారం వేసి తన భార్య తో సహా ఈజిప్టు రాజ్యానికి బయలుదేరారు. తనను అల్లాహ్ కాపాడుతాడనే నమ్మకంతో ప్రయాణమయ్యారు. మూసా (అలైహి) కు వ్యక్తిగత స్వార్థాలు ఏవీ లేవు. ఆయన కోరేది బానిసత్వంలో మగ్గుతున్న తన ప్రజలను రక్షించడం.

*ప్రయాణం ప్రారంభం* 

మూసా (అలైహి) మరియు తన కుటుంబసభ్యులు ఎడారిలో చాలా దూరం ప్రయాణించి సినాయ్ పర్వతం వద్దకు చేరుకున్నారు. తాము దారి తప్పినట్లు మూసా (అలైహి) కు అక్కడికి వచ్చిన తర్వాత అర్థమయ్యింది. ఆయన అల్లాహ్ ను మార్గదర్శనం కోసం ప్రార్థించారు. మూసా (అలైహి) కు దైవికంగా మార్గం కనిపించింది. అలా ప్రయాణిస్తూ, ఒక రాత్రి తూర్ పర్వతం వద్దకు చేరుకున్నారు. మూసా (అలైహి) కు దూరంగా ఒక మంట కనిపించింది. మూసా (అలైహి) తన ఇంటివారితో "ఇక్కడే ఉండండి, దూరంగా మంట కనిపిస్తోంది. నేను అక్కడికి వెళ్లి ఏదైనా సమాచారం తెస్తాను. అక్కడ మనకు దారి చూపే వారు ఎవరైనా దొరకవచ్చు. ఇక్కడి నుండి ముందుకు వెళ్లే దారి కుడా తెలుస్తుంది. లేదా అక్కడి నుండి మండే కట్టె ఏదైనా తీసుకువస్తాను. ఇక్కడ చలిలో కాస్త మనకు వేడి దొరుకుతుంది." అని అన్నారు.

*ప్రవక్తలలో ఏ ప్రవక్తకి దొరకని అదృష్టం, మూసా అలైహిస్సలామ్ తో సంభాషించిన అల్లాహ్* 

అక్కడి నుంచి మూసా (అలైహి) మంట దగ్గరికి చేరుకున్నారు. మూసా (అలైహి) అక్కడికి చేరుకోగానే లోయ కుడివైపున్న పవిత్రస్థలంలోని ఓ చెట్టు నుండి అదృశ్యవాణి (వహీ) నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. ఆ స్వరం మూసా (అలైహి) ను పిలిచింది.

"ఓ మూసా! నేను అల్లాహ్ ను, సర్వలోక ప్రభువును."

ఈ స్వరాన్ని విన్న మూసా (అలైహి) దిగ్భ్రాంతి చెందారు. ఆ స్వరం ఎవరిదా అని నలుదిక్కులా చూశారు.

అల్లాహ్ : - మూసా! నేను నీ ప్రభువును. నీ చెప్పులు విడిచిపెట్టు. నీవు ఇపుడు పవిత్రమైన తువా లోయలో ఉన్నావు. నేను నిన్ను ఓ మహాకార్యం కొరకు ఎన్నుకున్నాను. నీకు వహీ ద్వారా అందజేస్తున్న విషయాన్ని శ్రద్ధగా విను. నిశ్చయంగా నేనే అల్లాహ్ ని, నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు. కనుక నీవు నన్నే ఆరాధించు, నన్ను స్మరించడానికి నమాజ్ స్థాపించు.

           ప్రళయం తప్పకుండా రానున్నది. ప్రతి మానవుడు తన కృషి కి తగిన ప్రతిఫలం పొందడానికి ఆ ప్రళయ సమయాన్ని రహస్యంగా ఉండదలిచాను. కనుక ప్రళయదినాన్ని నమ్మకుండా మనోవాంఛలకు బానిసలైపోయేవారి విషయంలో దాన్ని గురించిన ఆలోచన నిన్న మా సందేశం ప్రచారం నుండి నిరోధించకూడదు సుమా! అలా జరిగితే నీవు నాశనమై పోతావు."

తర్వాత అల్లాహ్ మూసా (అలైహి) కు కొన్ని మహిమలు చూపారు.

అల్లాహ్ : - నీ కుడి చేతిలో ఏముంది మూసా?

మూసా (అలైహి) (వణుకుతున్న గొంతుతో) : - ఇది నా చేతికర్ర, నేను ఈ కర్రను ఆనుకొని నిలబడతాను. దీనిని ఊతగా చేసుకొని నిలబడతాను. ఈ కర్రతో గొర్రెలకు చెట్లు యొక్క ఆకులను రాల్చుతాను...., ఇంకా ఇలాగే ఇంకొన్ని విధాలుగా పనికివస్తుంది.

అల్లాహ్ : - మూసా! నీ దగ్గర ఉన్న ఆ కర్రని కింద పడవేయ్యి.

      అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం మూసా (అలైహి) తన దగ్గర ఉన్న కర్రను కింద పడవేశారు. అంతే ఆ కర్రని కింద పడవేయగానే అది ఎకాఎకిన పాముగా మారి మెలికలు తిరుగుతూ పరిగెత్తసాగింది. ఆ పాము ని చూడగానే మూసా (అలైహి) భయపడి పరుగు లంకించుకున్నాడు. వెనక్కి తిరిగైనా చూడలేదు.

అల్లాహ్ : - మూసా! భయపడకు వెనక్కి వచ్చేయ్, నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. మేము ఆ పామును తిరిగి పూర్వస్థితికి మారుస్తాం.

       ఆ పాము మళ్ళీ చేతికర్రగా మారిపోయింది. మూసా (అలైహి) లో ఆందోళన తగ్గు ముఖం పట్టింది. సత్యాన్ని కనుగొన్న ఎరుక మూసా (అలైహి) లో ప్రశాంతతను కలుగజేసింది. ఆ తర్వాత అల్లాహ్ మూసా (అలైహి) ను ఆదేశిస్తూ.........

అల్లాహ్ : - మూసా! నీ చేతిని కాస్త చొక్కా క్రింద చంకలో పెట్టి గట్టిగా నొక్కి బయటకి తీసేయ్. ఆ చేయి నీకు ఎటువంటి బాధ కలుగజేయకుండా ప్రకాశిస్తూ బయటకు వస్తుంది.

            అలా చేసి చేతిని బయటకు తీయగానే, ఆ చేయి మిరుమిట్లు గొలిపే కాంతితో ప్రకాశించింది. 

అల్లాహ్ : - మూసా! ఈ రెండు మహిమలు ఫిరౌన్ మరియు అతని సభాసదుల ముందు ప్రదర్శించడానికి నీ ప్రభువు తరుపున ఇవ్వబడిన మహిమలు. ఇపుడు నువ్వు ఫిరౌన్ వద్దకు, అతని సర్దారుల వద్దకు వెళ్లు. వారు పరమ దుర్మార్గులు. అన్ని హద్దులను అతిక్రమించారు వారు.

(కానీ మూసా (అలైహి) కు ఫిరౌన్ తనను నిర్బంధిస్తాడన్న భయం ఉంది.)

మూసా (అలైహి) : - ప్రభు! నేను వారి వ్యక్తి ఒకడిని హత్య చేశాను. అందుచేత వాళ్ళు నన్ను హతమారుస్తారు అని భయపడుతున్నాను.

ఎలాంటి ప్రమాదం జరగదని అల్లాహ్ మూసా (అలైహి) కు హామీ ఇచ్చారు. ఆ విధంగా మూసా (అలైహి) భయాన్ని పోగొట్టారు.

మూసా (అలైహి) : - ప్రభు! నాకు మనోస్థైర్యం ప్రసాదించు. ప్రవక్త బాధ్యతలు నిర్వర్తించడానికిగాను నా మనసును విశాలంగా చేయి...., నా మార్గంలో కష్టాలను తొలగించి నా కర్తవ్యాన్ని సునాయాసంగా మార్చు..., నా పనులు సులభంగా నెరవేరేలా చెయ్యి, ప్రజలు నా మాట గ్రహించడానికి మంచి వాక్పటిమ ప్రసాదించు, తద్వారా నా మాటలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలను. నా మాటలు వారి మనసులో నాటుకునేలా చెప్పగలను. నాకు సహాయకునిగా నా కుటుంబంలో ఒకరిని మంత్రిగా నియమించు.నా సోదరుడు హారూన్ ను నాకు సహాయకునిగా ప్రసాదించు.
హారూన్ ద్వారా నాకు బలం చేకూర్చు, హారూన్ ను నా పనిలో భాగస్వామిగా చేయి. మేమిద్దరం నీ పవిత్రత ను ఘనంగా కొనియాడుతాం. మీ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తాం. మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని కనిపెట్టుకుని ఉంటున్నారు.

అల్లాహ్ మూసా (అలైహి) విజ్ఞప్తి ని మన్నించారు. అప్పటికి ఈజిప్టు లో ఉన్న తన సోదరుడు హారూన్ కు దైవికంగా సమాచారం అందడంతో, హారూన్ సినాయ్ వద్దకు వచ్చి మూసా (అలైహి) ను కలుసుకున్నారు. అల్లాహ్ వారిని ఉద్దేశించి..........

అల్లాహ్ : - మూసా! నీవు కొరినవన్నీ ఇచ్చాము. మేము నీకు మరోసారి మేలు చేశాము. నీ బాల్యం సంగతి గుర్తుకు తెచ్చుకో, మేము నీ తల్లికి ప్రత్యేక సూచన చేశాం. దివ్యవిష్కృతి ద్వారా మాత్రమే ఇలాంటి సూచన చేయడం వీలవుతుంది.మేము మీ తల్లి కి ఇలా సూచించాము "పిల్లవాడిని ఒక పెట్టెలో ఉంచి నదిలో వదిలిపెట్టు. నది ఆ పెట్టెను ఒడ్డుకు చేర్చుతుంది. నాకు, ఈ పిల్లవాడికి విరోధి అయినవాడు ఆ పెట్టె ను తీసుకుంటాడు."

             మూసా! నేను నా వైపు నుంచి నీ మీద మమతా మమకారాలు అవతరింపజేశాను. నీవు నా పర్యవేక్షణలో పోషించబడేలా ప్రత్యేక ఏర్పాటు చేశాను. నీ సోదరి మర్యం ఫిరౌన్ దగ్గరికి వెళ్లిన సంగతి కూడా జ్ఞాపకం తెచ్చుకో. నీ సోదరి ఫిరౌన్ దగ్గరికి వెళ్లి "నేను ఈ పిల్లవాడిని బాగా పోషించేవారెవరో మీకు చూపన?" అన్నది. ఈ విధంగా మేము నిన్ను మళ్ళీ నీ తల్లి దగ్గరికి చేర్చాము. నీ తల్లి సంతోషించాలని, దిగులుచెందకుడదని ఇలా చేశాము.

         మరో సంఘటన, నీవు ఒక వ్యక్తిని చంపావు. మేము నిన్ను ఆ సమస్య నుంచి బయటపడేశాము. ఎన్నో సార్లు నిన్ను పరీక్షకు గురి చేశాము. నీవు మద్యన్ ప్రజల్లో అనేక సంవత్సరాలు గడిపావు. ఇపుడు తగిన సమయానికి వచ్చావు. మూసా! నేను నిన్ను నా పని కోసం యోగ్యుడిగా చేశాను. ఇక నీవు, నీ సోదరుడు హారూన్ నా నిదర్శనాలు తీసుకవెళ్లండి. గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను స్మరించుకోవడంలో అలసత్వం చేయకూడదు.

      మీరిద్దరూ ఇపుడు ఫిరౌన్ దగ్గరికి వెళ్ళండి. అతను గర్విష్ఠుడై హద్దు మీరిపోయాడు. మరీ బరితెగించిపోయాడు. మీరు ఫిరౌన్ తో మృదువుగా మాట్లాడండి. దాని వల్ల అతను మా హితులు పాటించవచ్చు లేదా మా శిక్షకు భయపడవచ్చు.

మూసా! నీవు, నీ సోదరుడు హారూన్ ముందుకు సాగండి. నా సూచనలు తీసుకవెళ్లండి. ఫిరౌన్ కు, అతడి ప్రజలకు నా సందేశాన్ని నెమ్మదిగా వినిపించండి. అల్లాహ్ యొక్క సందేశహరులుగా వచ్చామని, బనీఇస్రాయీల్ ప్రజలను బానిసత్వం నుంచి, అణచివేతల నుంచి విడుదల చేయమన్న అల్లాహ్ సందేశం తీసుకవచ్చామని చెప్పండి. అక్కడికి వెళ్లిన తర్వాత ఫిరౌన్ తో "నీవు పవిత్ర జీవితం గడపడానికి సిద్ధంగా ఉన్నావా? నేను నీకు నీ ప్రభువు మార్గం చూపుతాను. దాని వల్ల నీలో దైవభీతి ఏర్పడవచ్చు" అని చెప్పండి.

మూసా (అలైహి) : - ప్రభు! ఫిరౌన్ మాపై దౌర్జన్యం చేస్తాడేమోనని లేదా తిరగబడతాడేమోనని భయంగా ఉంది.

అల్లాహ్ : - మీరు ఏ మాత్రం భయపడకండి. నేను మీకు తోడుగా ఉన్నాను. సమస్తం వింటున్నాను, చూస్తున్నాను. మీరు అక్కడికి వెళ్లిన తర్వాత ఫిరౌన్ తో ఇలా అనండి........

            "నిశ్చయంగా మేము నీ ప్రభువు పంపిన సందేశహరులము. నీవు బనీఇస్రాయీల్ సంతతిని మా వెంట పంపు. వారిని పీడించకు. మేము నీ ప్రభువు తరుపున నీ వద్దకు సూచన తెచ్చాము. సన్మార్గాన్ని అనుసరించిన వారికి మాత్రమే శాంతి ఉంటుంది."

      అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం మూసా అలైహిస్సలామ్, అతని సోదరుడు హారూన్ దివ్యసందేశాన్ని ఫిరౌన్ కు తెలియజేయాలని ఈజిప్టుకు వెళ్లి, ఫిరౌన్ తో భేటి అయ్యారు.

        తరువాత జరిగిన విషయంలోని వివరణను Insha Allah రేపటి భాగము - 27 లో తెలుసుకుందాము.

ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-

ప్రియమైన ముస్లిం సోదరులారా!  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి , ఇదేదో 10 మందికి send చేస్తే మంచి జరుగుతుంది , send చేయకపోతే చేడు జరుగుతుంది అనుకునే msg లు కావు . కాబట్టి మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .

®@£€€q           +97433572282

No comments:

Post a Comment