53

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము - 53* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

ఇబ్లీస్ తను అనుకున్న విధంగానే అయ్యూబ్ (అలైహి) సంపదను మరియు భోగభాగ్యాలనంతా అయ్యూబ్ (అలైహి) కు కాకుండా చేశాడు. ఇక ఆ తర్వాత మిగిలినది అయ్యూబ్ (అలైహి) విశ్వాసాన్ని చెడగొట్టడం.

(అయ్యూబ్ (అలైహి) విశ్వాసాన్ని చెడగొట్టేందుకు, ఇబ్లీస్ తన పథకాలను నాలుగు కుట్రలుగా అమలుపరుస్తాడు.)

*మొదటి కుట్ర : -* 

అల్లాహ్ ఇచ్చిన స్వేచ్ఛ వల్ల అయ్యూబ్ (అలైహి) సంపద, భోగభాగ్యాలను నాశనం చేసి, ఆయన విశ్వాసాన్ని దారి తప్పించేందుకు సంతోషంతో అయ్యూబ్ (అలైహి) వద్దకు ఇబ్లీస్ వచ్చాడు. ఇబ్లీస్, తన పై అనుమానం రాకుండా ఒక వృద్ధజ్ఞాని రూపంలో అయ్యూబ్ (అలైహి) ముందు హాజరయ్యాడు. అపుడు అయ్యూబ్ (అలైహి) తో....,

ఇబ్లీస్ : - అయ్యూబ్! నీ సంపద మొత్తం పోయింది. నువ్వు దానధర్మాలకు చాలా ఖర్చు చేస్తావు, కాబట్టి అల్లాహ్ ను ప్రార్థిస్తూ నీ సమయాన్నంతా వృధా చేస్తున్నందువల్ల నీ సంపద నాశనం అయింది అని బయట కొందరు చెబుతున్నారు. నీ శత్రువులకు ఆనందం కలిగించడానికే అల్లాహ్ ఇదంతా చేశాడని మరికొందరు అంటున్నారు. నీకు నష్టం కలగకుండా కాపాడే శక్తి అల్లాహ్ కు ఉన్నట్లయితే నీ సంపదను అల్లాహ్ కాపాడి ఉండేవాడు. కాబట్టి నువ్వు నీ విశ్వాసాన్ని మానుకో!

నిజమైన విశ్వాసి అయ్యూబ్ (అలైహి) : - చూడండి వృద్ధజ్ఞాని! నా నుంచి అల్లాహ్ తీసుకున్నదంతా నిజానికి అల్లాహ్ కు చెందినదే. నాకు కేవలం కొంతకాలానికి మాత్రమే ఆ సంపద నా ఆధీనం చేయబడింది. అల్లాహ్ తనకు ఇష్టం వచ్చిన వారికి ఇస్తాడు. తనకు ఇష్టం వచ్చిన వారి నుంచి తీసుకుంటాడు. (అని చెప్పి అయ్యూబ్ (అలైహి) అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడ్డారు.)

ఇదంతా దగ్గరుండి చూసిన ఇబ్లీస్ చాలా నిరాశకు గురయ్యాడు. ఇబ్లీస్ చేసిన ఈ మొదటి కుట్ర బెడిసికొట్టడంతో, తను నిరాశ చెందకుండా మళ్ళీ ఇంకొక కుట్ర చేయడానికి సిద్ధమయ్యాడు. అందుకు అయ్యూబ్ (అలైహి) పై మరింత అధికారం కోసం మళ్ళీ అల్లాహ్ వద్దకు వెళ్లి....,

ఇబ్లీస్ : - అల్లాహ్! నేను అయ్యూబ్ (అలైహి) సంపదను అంతా నాశనం చేశాను. అయినా అయ్యూబ్ (అలైహి) మీ పట్ల విశ్వాసంగా ఉన్నాడు. కాని నిజానికి ఆయన తన నిరాశను మనసులో దాచుకుంటున్నాడు. ఎందుకుంటే అయ్యూబ్ (అలైహి) కి చాలా మంది సంతానం ఉన్నారు. వారి ద్వారా మళ్ళీ సంపద పొందాలని, సంపాదించాలని ఆశిస్తున్నాడు. కాబట్టి అతని సంతానం పై నాకు అధికారాన్ని ప్రసాదించాలని కోరుకున్నాను. ఏ తండ్రికైనా, తన సంతానం వల్లనే నిజమైన పరీక్ష ఎదురవుతుంది. అప్పుడు అయ్యూబ్ (అలైహి), మీ పై ఉన్న విశ్వాసం పై ఎలా తిరస్కారానికి పాల్పడతాడో మీరే చూస్తారు.

అల్లాహ్ : - ఇబ్లీస్! అయ్యూబ్ (అలైహి) విషయంలో నువ్వు కోరిన అధికారాన్ని నీకు ఇస్తున్నాను. నువ్వు ఎన్ని రకాలుగా కుట్రలు చేసిన అయ్యూబ్ (అలైహి) లో భక్తివిశ్వాసాలను ఇసుమంత కూడా తగ్గించలేవు. (అని హెచ్చరించారు)

ఇక ఆ తర్వాత అల్లాహ్ ఇచ్చిన ఈ స్వేచ్ఛ కు కూడా ఇబ్లీస్ సంతోషించి, తన సహాయకులందరితో కలిసి మళ్ళీ అయ్యూబ్ (అలైహి) పై రెండవ కుట్ర అమలుపరచడానికి సిద్ధమయ్యాడు.

*రెండవ కుట్ర : -* 

ఇక ఆ తర్వాత ఇబ్లీస్, అయ్యూబ్ (అలైహి) సంతానం పై అల్లాహ్ ఇచ్చిన ఈ స్వేచ్ఛ కు కూడా సంతోషించి, తన సహాయకులందరితో కలిసి మళ్ళీ అయ్యూబ్ (అలైహి) పై రెండవ కుట్ర అమలుపరచడానికి సిద్ధమయ్యాడు.

ఇబ్లీస్ తన సహాయకులందరితో కలిసి మళ్ళీ అయ్యూబ్ (అలైహి) పై కుట్రలు అమలు చేశాడు. ఈ కుట్రలో భాగంగా అయ్యూబ్ (అలైహి) పిల్లలు నివసిస్తున్న ఇంటిని కూల్చేయాలని ఇబ్లీస్ కుట్ర పన్నాడు. అయ్యూబ్ (అలైహి) సంతానం సరిగ్గా వారి ఇంటిలో ఉన్న సమయంలో ఇబ్లీస్ ఆ ఇంటిని భయంకరమైన కుదుపు కుదిపేశాడు. ఆ కుదుపులకు ఇల్లు మొత్తం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న అయ్యూబ్ (అలైహి) పిల్లలంతా కుప్పకూలిపోయిన ఆ ఇంటి శిథిలాల మధ్య చిక్కుకొని, ఆర్తనాదాలు పెడుతూ మరణించారు. అయ్యూబ్ (అలైహి) పై ఇబ్లీస్ తన రెండవ కుట్రను ఈ విధంగా అమలు పరచాడు.

ఆ పిదప ఇబ్లీస్, అయ్యూబ్ (అలైహి) వద్దకు పెద్ద సానుభూతిపరునిలాగా, మునుపటివలె వృద్ధజ్ఞాని రూపంలో నటిస్తూ వెళ్ళాడు. అపుడు ఇబ్లీస్, అయ్యూబ్ (అలైహి) ని ఓదారుస్తున్నట్లు నటిస్తూ....,

ఇబ్లీస్ : - అయ్యూబ్! మీ పిల్లలు మరణించిన సంగతి నేను విన్నాను. ఆ మరణ పరిస్థితులు చాలా విచాకరమైనవి. నిజంగా నువ్వు ప్రార్థిస్తున్న అల్లాహ్ కు నీ సంతానాన్ని కాపాడే శక్తి ఉంటే తప్పకుండా కాపాడేవాడు. నీ ప్రార్థనలకు అల్లాహ్ సరయిన ప్రతిఫలం ఇవ్వడం లేదు. కాబట్టి అల్లాహ్ పై నీకు ఉన్న విశ్వాసాన్ని ఇప్పటికైనా మానుకో!

ఈ మాటలు చెప్పి, అయ్యూబ్ (అలైహి) ఏమంటారో అని ఆతృతగా ఎదురుచూడసాగాడు తిరస్కారి ఇబ్లీస్. ఇక ఇప్పుడు అయ్యూబ్ (అలైహి) నిజంగా అల్లాహ్ ను మరియు అల్లాహ్ పై ఉన్న విశ్వాసాన్ని తిరస్కరిస్తూ మాట్లాడుతారని, అల్లాహ్ పై అపనిందలు మోపుతారని ఇబ్లీస్ ఆశపడ్డాడు. ఈ విధంగా తన పథకం విజయవంతంగా అమలు అవుతున్నందుకు ఇబ్లీస్ మనసులో సంతోషించసాగాడు. అపుడు అయ్యూబ్ (అలైహి), వృద్ధజ్ఞాని రూపంలో వచ్చిన ఇబ్లీస్ కు జవాబిస్తూ....,

తరువాత జరిగినది Insha Allah రేపటి భాగము - 54 లో తెలుసుకుందాము.

*మరి అయ్యూబ్ (స్థితిని కూడా ఓసారి మననం చేసుకోండి.). అతను "నాకు ఈ వ్యాధి సోకింది. నువ్వు కరుణించే వారందరిలోకి అపారంగా కరుణించేవాడవు" అని తన ప్రభువును మొరపెట్టుకున్నప్పుడు, మేము అతని ప్రార్థనను ఆలకించి, ఆమోదించాము. అతని బాధను దూరం చేశాము. అతనికి అతని ఇంటివారలను ప్రసాదించాము. పైగా వారితోపాటు వారిని పోలిన మరి అంతే మందిని మా ప్రత్యేక కటాక్షంతో అతనికి వొసగాము - నికార్సయిన దాసుల కొరకు ఇదొక గుణపాఠం కావాలని! (ఖురాన్ 21:83,84)*

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరిమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

☆☆ ®@£€€q +97433572282   ☆☆

No comments:

Post a Comment