13

🕋🕋🕋🕋 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్  🕋🕋🕋🕋

🛐🛐🛐🛐 అనంత కరుణామయుడు అపారా కృపాశీలుడు అయిన *అల్లాహ్*  పేరుతో ప్రారంభిస్తున్నాను 🛐🛐🛐🛐

------------------------------------------------

      ☪☪☪☪  *ఇస్లాం చరిత్ర*  ☪☪☪☪

భాగము - 13              Date  : 23/11/2017

                                 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*యూసుఫ్ ను వదించుకోవాలన్న తన సోదరుల పన్నాగం : -* 

తన 10 మంది కొడుకుల, గొర్రెలు మేపడానికి తమతో యూసుఫ్ ని కూడా పంపించమని చాలా బలవంతపెట్టారు, వారి ఒత్తిడి కి యాఖూబ్ అలైహిస్సలామ్, యూసుఫ్ ను వారితో పంపించేందుకు అయిష్టంగానే అంగీకరించారు. ఇపుడు యూసుఫ్‌ ను, బావిలో పడవేసి తనను వదిలించుకోవచ్చని యూసుఫ్ సోదరులు చాలా చాలా సంబరపడ్డారు. ఇక నుంచి తండ్రి ప్రేమ తమకే లభిస్తుందని భావించారు వారి సోదరులు. ఇక అందరూ గొర్రె లను మేపడానికి వెళ్లేందుకు , యూసుఫ్ ని వదిలించుకునేందుకు అందరూ సిద్ధం అయ్యారు.

గొర్రెలను బయటికి వదిలి, ఊరి బయటకు వచ్చేసారు. కొద్దిసేపు అందరూ ఏమి ఎరగనట్టుగా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కాసేపటి తర్వాత యూసుఫ్ ని బావి లో పడేయాలని పన్నిన పన్నాగం ప్రకారం నీళ్ళు తాగాలన్న సాకుతో బావి దగ్గరకు యూసుఫ్ ని తీసుకువెళ్లారు. బావి దగ్గరకు వెళ్లిన తర్వాత, తన సోదరులలో ఒకడు యూసుఫ్ ను గట్టిగా పట్టుకున్నాడు. ఉలిక్కిపడిన యూసుఫ్, పట్టుకున్న తన సోదరున్ని వదలించుకోవడానికి ఇద్దరూ పెనుగులాడారు. మిగిలిన సోదరులు కూడా వచ్చి యూసుఫ్ ను తప్పించుకునేందుకు వీల్లేకుండా గట్టిగా పట్టుకున్నారు. అందులో ఒకడు యూసుఫ్ చొక్కా విప్పి తీసుకున్నాడు. యూసుఫ్ తన సోదరులతో "సోదరులారా ! మనమంతా అన్నదమ్ములం, ఒక తండ్రి బిడ్డలం, దయచేసి మీరు ఈ పని చేయకండి, నన్ను వదిలి పెట్టండి" అని ఎంత ప్రాధేయపడినా వారి రాతిమననులు కరగలేదు. అందరూ కలిసి అలా పెనుగులాడుతూ పెనుగులాడుతూ యూసుఫ్ ను అమాంతం బావి లోకి విసిరేశారు.

తర్వాత వారు ఒక గొర్రెను చంపి ఆ రక్తంలో యూసుఫ్ చొక్కాను తడిపారు. తాము చేసిన ఈ పని ని రహస్యంగా ఉంచాలని అందరూ ప్రమాణాలూ చేసుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రక్తంతో తడిసిన చొక్కాను తండ్రికి చూపించి మొసలి కన్నీరు కార్చడం ప్రారంభించారు.

తర్వాత అందరూ కలుసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి “నాన్నగారూ ! మీరు భయపడినట్టే జరిగింది. మేము అటూ ఇటూ పరుగులు తీస్తూ, మా వస్తువుల వద్ద యూసుఫ్‌ ను ఉంచాము. మేము లేనప్పుడు ఒక తోడేలు వచ్చి యూసుఫ్‌ ను తినేసింది” అని కథ అల్లి చెప్పారు. వారు అబద్ధం ఆడుతున్నారని యాఖూబ్ (అలైహి) కు తెలుసు, తన కుమారుడు బ్రతికే ఉన్నాడన్నది కూడా ఆయన మనసుకు తెలుసు. యాఖూబ్ వారి మాటలు విని "అలా జరగదు, మీరే ఏదో కథ అల్లి చెపుతున్నారు, సరే కానివ్వండి నేను దీనిని మౌనంగా భరిస్తాను. మీరు అల్లిన ఈ కట్టుకథ చిక్కుముడి నుంచి బయటపడాలంటే అల్లాహ్ సహాయమే అర్థించాలి. రక్తం తో తడిసిన చొక్కాను ఆయన తన చేతుల్లోకి తీసుకున్నారు. దాన్ని నేల పై పరచి, “విచిత్రమైన ఆ తోడేలు“ నా కుమారుడిని తినేసింది, కాని చొక్కాను అస్సలు చింపలేదు" అన్నారు. దానికి వారి ముఖాలు మారిపోయాయి. వారిని యాకూబ్‌(అలైహి) గుచ్చి గుచ్చి ప్రశ్నించే సరికి వారు తాము నిజమే చెబుతున్నామని అల్లాహ్ పేరు మీద అబద్ధపు ప్రమాణాలు చేశారు. వారి మాటలు విన్న ఆ తండ్రి హృదయం బ్రధ్దలైంది. కన్నీళ్ళతో, నిరుపమాన సహనాన్ని ప్రదర్శిస్తూ ఆయన అల్లాహ్ తో తన కుమారుని కోసం ప్రార్థించారు. (ఖురాన్ 12:15-18).

*చీకటి బావి లో యూసుఫ్* 

ఆ చీకటి బావిలో ఒక రాతిని పట్టుకుని యూసుఫ్ (అలైహి) దాని పై కూర్చున్నారు. అలా ఆ రాత్రంతా ఆయన ఆ రాతి పైనే కూర్చున్నారు. ఆయన చుట్టూ కటిక చీకటి, చీమ చిటుక్కుమన్నా వినిపించే నిశ్శబ్దం తాండవిస్తోంది. యూసుఫ్ (అలైహి) మనసులో భయం గొలిపే ఆలోచనలు రాసాగాయి. ఇపుడు ఏం కానుంది ? ఆహారం ఎలా లభిస్తుంది ? తన సొదరులే తనపై ఎందుకు కుట్ర చేశారు ? తన పరిస్థితి గురించి తండ్రికి తెలుసా ? తన తండ్రి చిరునవ్వు ఆయన కళ్ళ ము౦దు కదలాడింది. తన పట్ల తండ్రి చూపిన ప్రేమాభిమానాలు గుర్తుకువచ్ఛాయి. యూసుఫ్ (అలైహి) అల్లాహ్ ని ప్రార్థించడంలో మునిగిపోయారు. నెమ్మదిగా ఆయనలో భయం తగ్గు ముఖం పట్టింది. సృష్టికర్త అయినటువంటి ఆ అల్లాహ్ ఆ యువకుడిని పెద్ద ఆపదకు గురిచేసి పరీక్షిన్తున్నాడు. అతనిలో అనితర సాధ్యమైన స్థైర్యాన్ని, సహనాన్ని పుట్టించడానికి ఈ పరీక్ష పెట్టాడు. యూసుఫ్(అలైహి) దైవా భీష్టానికి తలొగ్గారు.

ఆ మరుసటి రోజు యూసుఫ్ ఉన్న బావి కి దగ్గర గా గల దారి గుండా వర్తకుల బృ౦ద౦ ఒంటెలతో, గుర్రాలతో వెళుతూ ఉంది. ఆ బావి ని చూసిన తర్వాత నీరు తీసుకోవాలని ఆ వర్తకులు బృందంలో నుంచి ఒక వర్తకుడు నీరు తోడుకొవడానికి బావి దగ్గరకు వచ్చి, నీటిని తోడే చెద బావి లోకి వేశాడు. ఆ శబ్దానికి యూసుఫ్ (అలైహి) ఉలిక్కిపడ్డారు. యూసుఫ్ ఆ చెద ని గట్టిగా పట్టుకున్నారు. ఆ వర్తకుడు చెద ని పైకి లాగడం ప్రారంభించాడు. ఎంత బలంగా లాగినా కూడా ఆ చెద చాలా బరువుగా ఉండటం తో బావిలోకి తొ౦గిచూశాడు. ఆ వర్తకుడు లోపలి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఒక మనిషి (యూసుఫ్ అలైహిస్సలామ్) తాడును గట్టిగా పట్టుకుని కనపడ్డాడు. ఆ వర్తకుడు తాడు గట్టిగా పట్టుకుని మిగిలిన వారిని కేకవేసి పిలిచాడు. "కాస్త చేయి వేయండి, ఇక్కడ మనకు ఒక ఖజానా దొరికినట్లుంది" అంటూ పిలిచాడు. అతని తోటివారు పరుగు పరుగున బావి వద్దకు వచ్చారు. బావి నుంచి యూసుఫ్(అలైహి) ను బయటకు లాగడానికి సహాయం చేశారు. బయటకు లాగి చూస్తే, ఒక అందమైన, దృఢమైన యువకుడు యూసుఫ్ (అలైహి) కనపడ్డాడు. అతడిని బానిసగా అమ్మితే చాలా డబ్బు వస్తుందని అందరూ భావించారు. 

యూసుఫ్ ని బయటకు తీసిన వె౦టనే ఇనుప సంకెళ్ళ తో నిర్బంధించారు. ఆయనను అక్కడి నుంచి సుదూరాన ఉన్న ఈజిప్టుకు తీసుకుని వెళ్లారు. ఈజిప్టు నగరంలో ఈ వార్త దావనం లా వ్యాపించింది. చాలా అ౦దమైన, దృఢమైన ఒక బానిస యువకుడు అమ్మకానికి ఉన్నాడన్న వార్త నగరమంతా పాకిపోయింది. బానిసల బజారు లో వందలాది మంది గుమిగూడారు. కొందరు కేవలం వేలం పాట ను చూడటానికి వచ్చారు, కొందరు వేలం పాడటానికి వచ్చారు, కులీనులు, సంపన్నులు అందరూ మెడలు నిక్కించి యూసుఫ్ (అలైహి) ని చూస్తున్నారు. వేలం పాట ప్రారంభమయి చాలా హోరాహోరీగా సాగుతోంది. వేలం పాట లో ప్రతి కొనుగోలుదారుడు, వేరొక కొనుగోలుదారుడిని అధిగమిస్తారు. (ఖురాన్-12:19,20).

చివరకు గవర్నరు అజీజ్ గారు (ఇక్కడ అజీజ్ అనేది పేరు కాదు , ఈజిప్టు దేశ అధికారిక బిరుదు) యూసుఫ్ (అలైహి)ను కొనుక్కున్నాడు. యూసుఫ్‌ (అలైహి) ను ఆయన తన భవనానికి తీసుకునివెళ్ళాడు. గవర్నరు అజీజ్ కు పిల్లలు లేరు, అతను తన భార్యతో ఈ కుర్రాడిని జాగ్రత్తగా చూసుకొ. ఈ కుర్రాడు ఒక రొజు మనకు చాలా పెద్ద అదృష్టాన్ని కలుగజేస్తాడని నా నమ్మకం. కనీసం మనం అతడిని మన పుత్రుడిగానయినా దత్తత తీసుకోవచ్చు అని చెప్తాడు. యూసుఫ్‌ (అలైహి) ను బ౦ధి౦చి ఉన్న సంకెళ్లను విప్పమని అజీజ్‌ తన సేవకులను ఆదేశించడం చూసి యూసుఫ్ (అలైహి) ఆశ్చర్యపోయారు. యూసుఫ్‌ (అలైహి) తో మాట్లాడుతూ, తన నమ్మకాన్ని వమ్ము చేయవద్దని, మంచిగా మసలుకుంటే ఆయన్ను బాగానే చూడడం జరుగుతుందని అజీజ్ హామీ ఇచ్చాడు. యూసుఫ్ (అలైహి) చిరునవ్వుతో తనను కొనుక్కుని ఆదరించిన గవర్నరు కు కృతజ్ఞతలు చెప్పారు. తాను విశ్వాసపాత్రునిగా ఉంటానని చెప్పారు. (ఖురాన్-12:21,22).

ఇక్కడ యూసుఫ్ (అలైహి) కు కాస్త ఆశ్రయం లభించింది, బాగా చూసుకునే అదరువు లభించింది. ఆయన అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జీవితం లో ఎదురయ్యే సంఘటనల పట్ల ఆలోచించసాగారు. కొన్ని రోజుల క్రితం తాను ఒక చీకటి బావిలో, బ్రతికే ఆశ లేని పరిస్థితిలో ఉన్నారు. తర్వాత తనను కొందరు కాపాడారు, కాని ఇనుప సంకెళ్లతో బంధించారు. ఇప్పుడు ఒక విలాసవంతమైన భవనం లో తాను స్వేచ్ఛగా తిరుగాడుతున్నారు. ఆహారానికి ఎలాంటి కొదువ లేదు. కాని ఆయన తన తల్లితండ్రుల కోసం, సోదరుడు బిన్‌యామిన్‌ కోసం పరితపించసాగారు. వారిని గుర్తుచేసుకుని రోజు దుఃఖించేవారు.

గవర్నరు గారి భార్యకు వ్యక్తిగత సేవకునిగా ఆయన నియమించబడ్డారు. ఆయన చాలా విధేయంగా పని చేసేవారు. నమ్రత, సహనం, మృదు వైఖరి కలబోసిన ఆయన , అ౦దరి హృదయాలు చూరగొన్నాడు. గవర్నరు అజీజ్ కూడా యూసుఫ్ (అలైహి) ను చాలా అభిమానించసాగాడు.

త్వరలోనే ఆయనకు జీవితం లో మరో పరీక్ష ఎదురైంది. అందమైన యూసుఫ్ (అలైహి) సౌందర్యం గవర్నరు భార్య జులేఖాను నిలువనీయలేదు. యూసుఫ్ (అలైహి) పట్ల వెర్రి వ్యామోహం వల్ల ఆమె నిద్రలేని రాత్రులు చాలా గడిపింది. యూసుఫ్ (అలైహి) పట్ల ప్రేమలో మునిగిపోయింది. తాను అమితంగా ప్రేమించే వ్యక్తి అంత దగ్గరగా ఉన్నప్పటికీ కనీసం తాకడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఆమెకు భరించారానిది అయింది.

యూసుఫ్ (అలైహి) పట్ల ఆకర్షణను తట్టుకోలేని జులేఖా ఒక రోజు అ౦ద౦గా ముస్తాబు చేసుకుని యూసుఫ్ (అలైహి) ను తన గదిలోకి రమ్మని పిలిపిచింది. యూసుఫ్ (అలైహి) గదిలోకి రాగానే లోపలి నుంచి తలుపులు మూసి వేసి, నేను నీ కోసమే ఉన్నానని తన కోరికను వెళ్లగక్కింది. యూసుఫ్ (అలైహి) నిర్ఘాంతపోయారు. ఈ ప్రలోభం చాలా బలమైనది. దీన్ని తిరస్కరించడం సాధారణమైన విషయం కాదు. పూర్తి యవ్వనం లో ఉన్న యూసుఫ్‌ (అలైహి) మనసులో నైతికమైన ఆలోచనలే కదలాడాయి. " నన్ను కన్న కొడుకులా చూసుకుంటున్న గవర్నరు గారి గౌరవ మర్యాదలను ఎలా భంగపరచగలను, అల్లాహ్ క్షమించుగాక ! మీ భర్త నాకు యజమాని. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. చెడుగా వ్యవహరించిన వారికి ఎలాంటి మంచి జరగదు " అని జవాబిచ్చారు. (ఖురాన్-12:23).

అయినప్పటికీ ఆమె తీవ్రమైన కోరికతో యూసుఫ్ (అలైహి) వైపు రాసాగింది. యూసుఫ్ తన ప్రభువు చూపిన హేతువు చూడకపోతే అతను తీవ్రమైన కోరిక తో ఆమె వైపు కదిలేవాడు. అల్లాహ్ యూసుఫ్ (అలైహి) ని చెడుకు, అశ్లీలత కు దూరంగా ఉండదలిచాడు. అందువల్ల యూసుఫ్ (అలైహి) ఆ చేష్ట కు వడిగట్టలేదు. అతను అల్లాహ్ ప్రత్యేకంగా ఎంచుకున్న దాసుడు. (ఖురాన్-12:24).

స్త్రీ ల దుర్మార్గపు ఆలోచనల నుంచి తనను కాపాడమని ఆయన అల్లాహ్ శరణు కోరారు. యూసుఫ్ (అలైహి) తిరస్కారం ఆమె కామ వాంఛను మరింత పెంచింది. చివరకు యూసుఫ్ (అలైహి), అతని వెనుక జులేఖా ఇద్దరూ పరిగెడుతూ తలుపు దగ్గరకు చేరుకున్నారు. యూసుఫ్ చొక్కా ను వెనుక నుంచి జులేఖా లాగి చింపివేసింది. అపుడే యూసుఫ్ (అలైహి) తలుపు తెరిచారు. ఎదురుగా జులేఖా భర్త, గవర్నరు అజీజ్ నిలబడి ఉన్నాడు. తెలివైన జులేఖా వెంటనే తన స్వరాన్ని మార్చి " దుష్టసంకల్పం తో నీ భార్య పట్ల చెడుగా వ్యవహరించిన వ్యక్తికి శిక్ష ఏమిటి? అలాంటి వాడిని జైల్లో పెట్టడమో లేక కఠిన యాతలు గురి చేయడమో తప్ప మరే శిక్ష కాగల్గుతుంది?" అని ప్రశ్నించింది. (తాను ఏ పాపం ఎరుగనట్టు). (ఖురాన్-12:25).

తరువాత జరిగిన విషయమై Insha Allah రేపటి భాగము - 14 లో తెలుసుకుందాము.

ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-

ప్రియమైన ముస్లిం సోదరులారా!  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి , ఇదేదో 10 మందికి send చేస్తే మంచి జరుగుతుంది , send చేయకపోతే చేడు జరుగుతుంది అనుకునే msg లు కావు . కాబట్టి మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .

No comments:

Post a Comment