83

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

          🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                   *భాగము - 83* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

 *అరబ్బుల సామాజిక పరిస్థితులు* 

అరేబియాలో స్త్రీ పురుషుల సంబంధాలకు చెందిన రకాలు కొన్ని ఖడ్గం, బరిశె మొనల నీడన ఉనికిలోనికి వచ్చేవి. అంటే తెగల పోరాటాల సందర్భంలో విజయం పొందిన తెగ, ఓడిపోయిన తెగల స్త్రీలను ఖైదు చేసి తన భార్యలుగా చేసుకోవటం అన్నమాట. అయితే, అలాంటి స్త్రీలకు జన్మించిన సంతానం జీవితాంతం దాన్ని అవమానంగా భావించేది.

అజ్ఞాన కాలములో ఎలాంటి పరిమితి లేకుండా అనేక భార్యలను కలిగి ఉండడం పరిపాటి. స్వయాన ఒకే తల్లి గర్భములో జన్మించిన అక్కాచెల్లెళ్ళను సయితం భార్యగా చేసుకోవటంలో ఆనాడు తప్పులేదు. తండ్రి విడాకులు ఇవ్వగా లేదా మరణించగా కుమారుడు తన మారు తల్లిని నికాహ్ చేసుకునేవాడు. తలాక్ (విడాకులు) ఇచ్చే అధికారం కేవలం పురుషులదే. దానికి ఒక హద్దు పద్దు అనేది లేకుండా ఉండేది.

వ్యభిచారం అన్నిరకాల వర్గాల్లోను సర్వసామాన్యమై తారాస్థాయికి చేరుకుంది. ఎలాంటి వ్యక్తికి గాని, వర్గానికిగాని ఈ విషయంలో మినహాయింపే లేదు. అయితే కొందరు స్త్రీ పురుషుల ఔన్నత్య భావన వారిని ఈ పాపపంకిలంలో పడకుండా అడ్డుకునేది. అదే కాదు, స్వతంత్ర స్త్రీలు, బానిస స్త్రీలకంటే మెరుగ్గా ఉండేవారు. వ్యభిచారానికి అసలు మూలం కేవలం బానిస స్త్రీలే. అజ్ఞాన కాలపు అరబ్బు జాతి అధిక సంఖ్య ఈ పాపంలో పడినందుకు సిగ్గుపడేదే కాదు. కాబట్టి “సునన్ అబూ దావూద్” వగైరా హదీసు గ్రంథాల్లోని కథనాల ప్రకారం, ఓ వ్యక్తి నిలబడి, “ఓ దైవప్రవక్తా (స)! ఫలానా వ్యక్తి నా కుమారుడు. నేను అజ్ఞాన కాలంలో అతని తల్లితో వ్యభిచారించాను” అని అడిగాడు. దానికి దైవ ప్రవక్త (స), ఇస్లాం ధర్మంలో ఇలాంటి ప్రశ్నలకు తావే లేదు. అజ్ఞాన కాలం నాటి విషయాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఆ పిల్లవాని తల్లి ఎవరి భార్యో లేదా ఎవరి బానిసో ఆ పిల్లవాడు అతని కుమారునిగానే తలచడం జరుగుతుంది.

అజ్ఞాన కాలంలో తండ్రీకుమారుల సంబంధం కూడా భిన్నంగా ఉండేది. కొందరయితే, “మా సంతానం భూమిపై తిరగాడే మా గుండెలు” అని సగర్వంగా చెప్పుకునేవారు.

అయితే మరోవైపు కొందరు అవమానభారంగా భావించి లేదా దారిద్ర్య భయంతో ఆడపిల్లల్ని సజీవంగా పాతిపెట్టేసేవారు. పిల్లలను దారిద్ర్యభయం వల్ల చంపడమూ జరిగేది. కాని ఈ కాఠిన్యం అందరిలోనూ ఉండేదనడం సరికాదు. కారణం ఏమిటంటే, అరబ్బులు తమ శత్రువుల నుండి రక్షణ కోసం ఇతరుల కంటే తమ సంతానంపైనే అధికంగా ఆధారపడి ఉండడం; ఈ విషయం వారికి బాగా తెలిసిన విషయం.

 *అరబ్బుల ధార్మిక పరిస్థితి* 

అరేబియా ద్వీపంపై ఇస్లాం కిరణాలు ప్రసరించినప్పుడు అక్కడ మనుచున్న మతాలు, ధర్మాలు చాలా ఉన్నాయి. అయితే ఈ మతాలన్నీ చీలిక పేలికలై ఉండేవి. ఇబ్రాహీం (అలైహి) ధర్మాన్ని అనుసరిస్తున్నాం అంటున్న ముష్రిక్ లలో (బహుదైవారాధకులు) సయితం ఆయన బోధనలకు ఆమడ దూరంలోనే ఉన్నారు. ఇబ్రాహీం (అలైహి) ఏ నైతికతలను బోధించారో అవి ఆ ముష్రిక్ లలో నామమాత్రానికైనా కానరాకపోయేవి. పాపపంకిలంలోపడి, ఓ సుదీర్ఘ కాలం గడిచిపోయినందున వారిలోనూ విగ్రహారాధనకు సంబంధించిన ఆచారాలు, సంప్రదాయాలు చోటుచేసుకున్నాయి. ఇవి కూడా ధార్మిక పుణ్యకార్యాలుగానే భావించేవారు. ఈ ఆచారసంప్రదాయాలు వారి రాజకీయ, ధార్మిక జీవితంపై గొప్ప ప్రభావం కలిగి ఉండేవి.

యూద మత పరిస్థితి కేవలం ప్రదర్శనాబుద్ధి, పెత్తనం చెలాయించడం మట్టుకే మిగిలిపోయింది. యూద మత గురువులు అల్లాహ్ కు బదులు తామే ప్రభువులై కూర్చున్నారు. ప్రజలపై తమ ఇష్టాన్ని రుద్దేవారు. ప్రజల మనస్సుల్లోని మాటలను తెలిసినట్లుగా నటిస్తూ, వారి పెదాల నుండి బయటకు వచ్చే ప్రతి మాటను పరీక్షించేవారు. సంపద, రాజ్యం ఎలా సొంతం చేసుకోవాలన్న విషయంపైనే వారి దృష్టి కేంద్రీకరించబడి ఉండేది. వారి ఈ ప్రవర్తన మూలంగా యూద ధర్మం ఎంత నాశనమైనా సరే, అవిశ్వాసం నాస్తికత్వం ఎంత ప్రబలిపోయిన సరే, ఆ మతానుయాయులకు దైవం ఇచ్చిన ఆదేశాలు, బోధనలు ఎంత దెబ్బతిన్నా సరే.

క్రైస్తవం అనుకోని విధంగా ఓ విగ్రహారాధనగా మారిపోయింది. వారు అల్లాహ్ ను మరియు మానవుణ్ణి అద్భుతంగా మిశ్రమం చేసేశారు. ఏ అరబ్బులయితే ఈ మతాన్ని స్వీకరించారో వారి పై ఈ మత ప్రభావం ఏమాత్రం లేకుండా ఉండేది. కారణం, ఈ మత భోధనలు వారికి ప్రియమైన స్వదేశ జీవితానికి సరిపోకపోవడమే. వారు తమ జీవన సరళిని మానుకోకపోవడమే.

తక్కిన అరేబియా మతాలను అవలంబించేవారి పరిస్థితి ముష్రిక్ లకు భిన్నమైనదేమీ కాదు. వారి ఊహలు, వారి నమ్మకాలు, వారి ఆచారసాంప్రదాయాలల్లో అవినాభావ సంబంధం ఉండడమే దానికి కారణం.

 *అరబ్బుల ఆర్థిక పరిస్థితి* 

ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితిని అనుసరించేది. అరబ్బులు ఉపాధిపై దృష్టిని సారిస్తే తప్ప దీనిని అంచనావేయలేము. వ్యాపారమే వారి జీవనోపాధికి, భృతికి ప్రధానమైన మార్గం గనక వ్యాపార మార్గాల్లో శాంతి వాతావరణం నెలకొంటే తప్ప ఇది సాధ్యమయ్యే విషయం కాదని అందరికీ తెలుసు. అరేబియా పరిస్థితి ఏమిటంటే; కేవలం నిషిద్ధ మాసాల్లోనే, ఉక్కాజ్, జిల్ మజాజ్ మరియు మజిన్నా పేరుగల సంతలు అరేబియాలో పెట్టడం జరిగేది.

పరిశ్రమల విషయానికొస్తే, అరబ్బులు ఈ రంగంలో ప్రపంచం మొత్తంలోనూ వెనుకబడి ఉండేవారు. బట్టలు నేయడం, చర్మానికి పదును పెట్టడం లాంటి కొన్ని పరిశ్రమలున్నా, చాలా మట్టుకు అవి యమన్, హీరా మరియు సిరియాకు పొరుగున ఉన్న అరేబియా ప్రాంతాల్లోనే ఉండేవి. అయితే అరేబియా మధ్యభాగంలో మాత్రం వ్యవసాయం, పశుపోషణ కొంతవరకు జరిగేది. అరబ్బు స్త్రీలందరూ నూలు వడికేవారు. అయితే వీరి కష్టమంతా యుద్ధాలు, పోరాటాలకు సమిధగా మారేది. ఆకలి, దారిద్య్రం అరేబియాలో రాజ్యమేలుతుండడం మూలంగా ప్రజలు తాము రోజూ తొడిగే దుస్తులు సైతం పొందలేకపోయేవారు.

 *(మనం ఇంతకు ముందు భాగము - 82 లో తెలుసుకున్న అరబ్బుల సామాజిక పరిస్థితులు మరియు ఇప్పుడు తెలుసుకున్న అరబ్బుల ధార్మిక పరిస్థితులు, అరబ్బుల ఆర్థిక పరిస్థితులు మరియు రేపు తెలుసుకోబోయే అరబ్బుల నైతిక విలువలు, ఇవన్నీ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు పుట్టక ముందు, వారి తాతల కాలంనాటి పరిస్థితులు. రేపటితో వీటి భాగము పూర్తి అవుతుంది. ఆ తర్వాత ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాము.)* 

Insha Allah రేపటి భాగము - 84 లో అరబ్బుల నైతిక విలువలు మరియు అంతిమ దైవప్రవక్త వంశావళి గురించి తెలుసుకుందాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆      
                (rafeeq)

☆☆      Salman       +919700067779   ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment