4

🕋🕋🕋🕋 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕋🕋🕋🕋

🛐🛐🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన *అల్లాహ్* పేరుతో ప్రారంభిస్తున్నాను 🛐🛐🛐🛐

------------------------------------------------

       ☪☪☪☪ *ఇస్లాం చరిత్ర* ☪☪☪☪

    భాగము - 4          Date : 14/11/2017

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

         *ఇబ్రాహీం అలైహిస్సలామ్* 

ఇబ్రహీం అలైహిస్సలామ్ యావత్ సమాజానికి గొప్ప నాయకుడు . అల్లాహ్ పట్ల పూర్తి విధేయతతో కూడిన అంకిత భావం గల భక్తుడు . అతను ఏనాడూ దైవేతరశక్తుల్ని ఆరాధించినవాడు కాదు . అల్లాహ్ చేసిన మహొపకారాల పట్ల ఆయనకు సదా కృతజ్ఞుడై ఉండేవాడు . అల్లాహ్ అతడ్ని ఎన్నుకొని రుజుమార్గం చూపాడు . ప్రపంచంలో అతనికి మంచిని ప్రసాదించాడు . పరలోకం లో అతను తప్పక సజ్జనులలో పరిగణించబడతారు . (ఖుర్‌ఆన్‌ 16:120-122) .

*సత్యసందర్శనం, ధర్మ ప్రచారం* 

ఒకరోజు అతనిపై చీకటి కమ్ముకోగానే అతనొక సక్షత్రం చూసి " ఇతను నా ప్రభుపు " అన్నాడు . కాని ఆ నక్షత్రం అస్తమించగానే  " ఇలాంటి అస్తమించేవాటిని నేను ప్రేమించను " అన్నాడు . తర్వాత చంద్రుడు ప్రకాశిస్తూ కన్పించగానే " ఇతనే నాప్రభువు " అన్నాడు . చంద్రుడు కూడా అస్తమించడంతో  " ఇతనూ నాప్రభుపు కాదు " . నా ప్రభుపు నాకు మార్గం చూపకపోతే నేను మార్గ భ్రష్టుణ్ణయిపోతాను అన్నాడు . (ఖుర్‌ఆన్‌-6:74-77) .

 ఆ తర్వాత మరునాడు ఉదయం సూర్యుడు దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపించాడు , అప్పుడు ఇబ్రాహీం  " ఇతనే నాప్రభువు , అందరికంటే గొప్ప ప్రభుపు " అన్నాడు . అయితే సూర్యుడు కూడా అస్తమించడం తో అతనికి జ్ఞానోదయం అయింది .

అతను తన జాతితో  " నాజాతి ప్రజలారా ! మీరు అల్లాహ్ కి సాటికల్పిస్తున్న మిథ్యా దైవాలతో నేను విసిగిపోయాను . నేనిప్పుడు పూర్తి ఏకాగ్రతతో భూమి , ఆకాశాల్ని సృష్టించినవాని వైపుకు మరలాను . నేను ఏ మాత్రం బహుదైవారాధకుడ్ని కాను " అని అన్నాడు . ( ఖురాన్ 6:78,79 )  

ఇబ్రహీం ఇలా అన్నాడు " మీరు అల్లాహ్ ని మాత్రమే ఆరాధించండి . ఆయనకే భయపడండి . ఈ విషయం తెలుసుకుంటే ఇందులోనే మీ శ్రేయస్సు ఉంది . మీరు అల్లాహ్ ని వదలి పూజిస్తున్న వస్తువులు విగ్రహాలు మాత్రమే , మీరు ఒక అసత్యాన్ని కల్పించుకున్నారు . అల్లాహ్ ని వదలి మీరు పూజిసున్న ఈ విగ్రహాలు మీకు ఎలాంటి ఉపాధి ఇవ్వలేవు . కనుక మీరు అల్లాహ్ సన్నిధిలో ఉపాధి గురించి అర్థించండి . అల్లాహ్ నే ఆరాధించండి , అల్లాహ్ కే కృతజ్ఞతలు తెలుపుకోండి . చివరికి మీరు అల్లాహ్ సన్నిధికే మరలిపోవలసి ఉంది . మీరు నా మాటలు తిరస్కరిస్తే మీకు పూర్వం కూడా అనేక జాతులు తిరస్కరించాయి . దైవ సందేశాన్ని స్పష్టంగా అందజేయడం తప్ప దైవప్రవక్త పై మరెలాంటి బాధ్యత లేదు .  (ఖురాన్ 29:16-18 ) .

ఇలా సాగింది ఇబ్రాహీం ప్రవక్త (అలైహి) ధర్మ ప్రచారం .

*తండ్రి తో వాగ్వాదం : -* 

ఇబ్రహీం అలైహిస్సలామ్ తండ్రి కూడా విగ్రహారాధకుడే. అతను ఒక మంచి శిల్పి. దేవతా విగ్రహాలు చెక్కి బజారులో అమ్మేవాడు. తన తండ్రి అవిశ్వాసం ఇబ్రహీం (అలైహి) ను ఇబ్బంది పెట్టేది. తన తండ్రి ఒంటరిగా ఉన్న సమయం చూసుకొని అతనికి ఇలా హితోపదేశం చేశాడు.

ఇబ్రహీం : - ఓ నాన్నా ! వినలేని, చూడలేని, మీకు ఏమాత్రం ఉపయోగపడలేని వాటిని ఎందుకు పూజిస్తారు ? ఓ పితామహా ! చూడండి మీ వద్దకు రాని జ్ఞానం నా వద్దకు వచ్చింది.కనుక మీరు నన్ను అనుసరించండి. నేను మీకు సరైన మార్గం వైపుకు దర్శకత్వం వహిస్తాను. ఓ తండ్రీ ! మీరు షైతాను దాస్యాన్ని విడనాడండి. నిశ్చయంగా షైతాన్‌ కరుణామయుడైన అల్లాహ్‌కు అవిధేయుడు. తమరు ఎక్కడ కరుణామయుని ఆగ్రహానికి గురవుతారోనని, షైతాను సహవాసి అయిపోతారోనని నాకు భయంగా ఉంది. (ఖురాన్ 19:42-45).

ఇబ్రహీం తండ్రి : - ఓ ఇబ్రాహీం ! నువ్వు నా దైవాలకే విముఖత చూపుతున్నావా ? విను ! నువ్వు నీ వైఖరిని మానుకోకపోతే నేను నిన్ను రాళ్లతో కొడతాను. మర్యాదగా నన్ను నా మానాన వదలిపెట్టు. (ఖురాన్ 19:46).

ఇబ్రహీం : - సరే నాన్నా మీకు సలాం ! నేను మాత్రం మీ మన్నింపు కోసం నా ప్రభువును వేడుకుంటూనే ఉంటాను. నిశ్చయంగా ఆయన నాపై ఎంతో జాలి కలవాడు. నేను మిమ్మల్నీ, అల్లాహ్‌ను విడిచి మీరు మొరపెట్టుకునే వారందరినీ వదలి పోతున్నాను. కేవలం నా ప్రభువును మాత్రమే వేడుకుంటాను. నా ప్రభువుని వేడుకుని విఫలుణ్ణి కానన్న నమ్మకం నాకుంది." (ఖురాన్ 19:47-48).

ఇబ్రహీం (అలైహి) హేతుబద్ధంగా ఎన్నో విషయాలు విశదీకరించారు , కాని ఆయన జాతి ప్రజలకు సత్యం చెవులకెక్క లేదు . 

*అగ్నిపరీక్ష* 

అంతకు పూర్వం మేము ( అల్లాహ్ ) ఇబ్రాహీం కు విచక్షణాజ్ఞానం ప్రసాదించాము . అతడి గురించి మాకు బాగా తెలుసు . అతను తన తండ్రిని , తన జాతి ప్రజల్ని ఉపదేశిస్తూ " మీరంతగా అభిమానిన్తున్న ఈ విగ్రహాల సంగతేమిటీ ? " అనడిగాడు . ( ఖురాన్ 21:51,52 ) .

“మా తాతముత్తాతలు వీటిని పూజిస్తుండేవారు . అందుచేత మేమూ వీటిని పూజిస్తున్నాం " అన్నారు వారు . ( ఖురాన్ 21:53) .

“అయితే మీరు దారి తప్పారు , మీ తాతముత్తాతలు అంతకన్నా ఘోరంగా దారితప్పారు " అన్నాడు ఇబ్రహీం . ( ఖుర్‌ఆన్ 21:54 ).

“నువ్వు మా ముందు నీ అసలు భావాలు వ్యక్తపరున్తున్నావా లేక పరిహాసమాడుతున్నావా ? " అడిగారు వారు . ( ఖురాన్ 21:55 ).

 “ కాదు , నిజం గానే చెబుతున్నాను . భూమి , ఆకాశాల ప్రభువే మీ ప్రభువు . ఆయనే వాటిని సృష్టించాడు . అందుకు నేను మీ ముందు సాక్ష్యమిన్తున్నాను . దైవసాక్షి గా ! మీరు లేనప్పుడు నేను తప్పక మీ విగ్రహాల సంగతేమిటో తేల్చుకుంటాను " అని అన్నాడు ఇబ్రహీం ( అలైహి ) . (ఖుర్ఆన్‌ 21:56,57 ) .

“తర్వాత అతను ( ఇబ్రహీం ) నక్షత్రాల వైపు చూసి నాకు వంట్లో బాగాలేదు " అన్నాడు . అందువల్ల వారు ఇబ్రహీం ను వదలి వెళ్ళిపోయారు . వారు అలా పోగానే ఇబ్రాహీం వారి దేవతల విగ్రహాలు ఉన్న చోటులోకి జొరబడి విగ్రహాలతో ఇలా అన్నారు " మీరు ఏమీ తినరేమిటీ ? ఏమైంది మీకు కనీసం మాట్లాడనైనా  మాట్లాడండి ? " అన్నాడు . ఆ విగ్రహాలు ఏమీ మాట్లాడలేదు , తర్వాత అతను ఆ విగ్రహాల పై విరుచుకుపడి కుడిచేత్తో వాటిని గట్టిగా బాది విరగొట్టాడు . ” ( ఖురాన్ 37:88-93 ) .

వాటిలో ఒక పెద్ద విగ్రహాన్ని మాత్రం వదలిపెట్టాడు , వారు మారతారన్న ఉద్దేశ్యం తో ఆ పెద్ద విగ్రహాన్ని వదిలిపెట్టారు . ( ఖురాన్ 21:58 ) .

జనం తిరిగివచ్చిన తర్వాత ఈ ఘటనను చూసి , "మన దైవాలకు ఈ దుస్ధితి కలిగించింది ఎవరో చూస్తే పరమదుర్మార్గుడిలా ఉన్నాడు " అని అన్నారు . కొద్ది దూరంలో ఉన్న కొంత మంది " మేము ఇబ్రాహీం అనే యువకుడు వాటిని గురించి ప్రస్తావిస్తుంటే విన్నాము " అని అన్నారు . (ఖురాన్ 21:59,60 ) .

“ అయితే అతడి ని పట్టి తీసుకురండి జనం ముందుకు అందరూ అతని సంగతి చూస్తారు " అన్నారు వారు . ఇబ్రహీం వచ్చిన తరువాత "ఇబ్రాహీం! నువ్వేనా మా దేవతల పట్ల ఇలా ప్రవర్తించింది ? " అని అడిగారు వారు. దానికి ఇబ్రహీం "అసలు ఇదంతా వాటి నాయకుడే ( అంటే మిగిలిఉన్న ఆ పెద్ద విగ్రహం ) చేసి ఉంటాడు . అడిగి చూడండి ఆ విగ్రహాన్ని , ఎవరు ధ్వంసం చేశారో ఆ విగ్రహమే చెబుతుంది" అన్నాడు . దానికి వారు " ఆ విగ్రహం ఎలా చెబుతుంది , అది మాట్లాడలేదు కదా " అన్నారు . ( ఖురాన్ 21:61-63 ) .

ఈ మాట వినగానే వారు తమ అంతరాత్మల వైపుకు మరలి “నిజంగా మనం చాలా దుర్మార్గులం , ఈ విగ్రహాలు ను పూజించడం తప్పు , ఇవి తమని తాము కాపాడుకోలేవు ఇక మనల్ని ఎలా కాపాడుతాయి " అని అనుకున్నారు . కాని ఆ తరువాత వారి బుద్ధి వక్రీకరించింది. వారు ఇబ్రహీం తో " ఇవి మాట్లాడలేవని నీకు తెలుసు కదా ? " అన్నారు . దానికి ఇబ్రహీం " మీరు అల్లాహ్ ని వదలి మీకెలాంటి లాభం గాని , నష్టం గాని కలిగించలేని ఈ విగ్రహాలను ఎందుకు పూజిన్తున్నారు ? మీకు కాస్తయినా ఇంకిత జ్ఞానం, బుద్ధి జ్ఞానం ఉందా " అని అన్నాడు ఇబ్రహీం ( ఖురాన్ 21:64-68 )

దానికి వారి అహం దెబ్బతింది. అపుడు వారు పరస్పరం సంప్రదించుకొని ఇబ్రహీం కోసం ఓ భారీ కొలిమి లాంటి అగ్ని గుండం తయారు చేసి మండే ఆ అగ్నిగుండంలో అతడ్ని విసిరేయాలని నిర్ణయించుకున్నారు.” ( ఖురాన్ 37:97).

తర్వాత జరిగినదాని విషయమై Insha Allah రేపటి భాగము - 5 లో తెలుసుకుందాము ------------

ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-

ప్రియమైన సోదరులారా !  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు  " అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ " ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు . పై వన్నీ తెలుసుకోవాలంటే ముందు మన ఇస్లాం చరిత్ర ఏమిటో తెలుసుకోవాలి . నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపిస్తూ , మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .

No comments:

Post a Comment