64

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము - 64* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

*ముగ్గురు ప్రవక్తలు* 

హాబీబ్ నజ్జార్ ఒక వడ్రంగి. ఒక క్రూరమైన రాజు పరిపాలిస్తున్న రాజ్యంలో ఆయన నివసించేవారు. ఆ రాజు కాని, ఆ రాజ్యంలోని ప్రజలు కాని అల్లాహ్ ను ఆరాధించేవారు కాదు. హాబీబ్ మాత్రం తన తాత తండ్రులు ఆచరించిన ధర్మానికి కట్టుబడ్డారు. ఒకే దేవుడైన అల్లాహ్ ను ఆరాధించే ధర్మం ఉంది. సత్యమార్గాన్ని తాను అనుసరించడం మాత్రమే కాదు, రాజును, ప్రజలను కూడా ఒకే దేవుని ఆరాధనకు పిలిచేవారు. కాని, ఆ రాజ్యంలోని ప్రజలు, ఆయన పిలుపును పట్టించుకోలేదు, ఆయనను పిచ్చివాడనేవారు. కానీ హాబీబ్ నిరాశపడలేదు. ఒకే దేవుని సందేశాన్ని ప్రచారం చేయడం మానుకోలేదు. చివరకు రాజభటులు ఆయనగారి వడ్రంగపు కార్ఖానాకు తాళం వేసేశారు. ప్రజలు ఆయనపై దాడి చేయడం కూడా ప్రారంభించారు. చివరకు ఆయన నగరాన్ని విడిచి పారిపోవలసి వచ్చింది.

నగరం బయట ఉన్న ఒక గుహలో ఆయన ఆశ్రయం పొందారు. దగ్గరలోని దట్టమైన అడవిలో ఆయన ఆకలిని తీర్చడానికి కావల్సిన పండ్లు, పక్షులు, చిన్న చిన్న జంతువులు లభించాయి. ఇక్కడ ఆయన అల్లాహ్ ను స్వేచ్ఛగా ఆరాధించుకునే వీలు కలిగింది. ఒక రాత్రి ఆయన కలలో, తను స్వర్గంలో ఉన్నట్లు చూశారు. తన పట్ల అల్లాహ్ ప్రసన్నుడైనట్లు కలగాంచారు.

*సాదిక్ మరియు మస్ దూక్* 

ఈలోగా సాదిక్, మస్ దూక్ అనబడే ఇద్దరూ ఆ రాజ్యంలోకి వచ్చారు. అక్కడి రాజు, ప్రజలు చేస్తున్న విగ్రహారాధన పట్ల వారు చాలా వ్యాకులపడ్డాడు. వారిద్దరు ప్రజలకు ధర్మబోధ చేయడం ప్రారంభించారు. ప్రజలను రుజుమార్గానికి పిలవడం మొదలుపెట్టారు. అల్లాహ్ ను ఆరాధించాలని, ఆయన ఆదేశాలనే శిరసావహించాలని ఉద్బోధించసాగారు. వారెక్కడి నుంచి వచ్చారు? అసలు వాళ్ళెవరని ప్రజలు అడగటం ప్రారంభించారు. తాము అల్లాహ్ తరఫున ప్రవక్తలుగా వచ్చామని వారిద్దరూ చెప్పారు. కానీ ప్రజలు వారి మాట వినలేదు.

"మీరు కూడా మా వంటి సాధారణ మనుష్యులే. మీకు కూడా మృత్యువు వస్తుంది. అలాంటి మిమ్మల్ని అల్లాహ్ మావద్దకు ప్రవక్తలుగా పంపాడా? మీరు అబద్ధాలు చెబుతున్నారు" అని మండిపడ్డారు. హాబీబ్ నజ్జార్ ను వదిలించుకోవడం ద్వారా తాము హాయిగా ఉన్నామని భావిస్తుంటే, మళ్లీ ఈ ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారని రాజు ఆగ్రహించాడు. పైగా ఈ ఇద్దరూ చాలా తెలివితో ప్రచారం చేస్తున్నారు. కనుక వీరు మరింత ప్రమాదం కాగలరని అనుకున్నాడు. ఈ ప్రచారాన్ని మానుకోకపోతే రాళ్లతో కొట్టి చంపిస్తామని హెచ్చరికలు చేశాడు. ఈ హెచ్చరికలను బహిరంగంగా, అందరిముందు చేయడం జరిగింది. ఆ విధంగా ఈ ఇద్దరి మాటలు వినకుండా ప్రజలను కూడా భయ పెట్టడం జరిగింది.

*తిరిగి వచ్చిన హాబీబ్* 

హాబీబ్, తన రాజ్యానికి వచ్చిన సాదిక్, మస్ దూక్ ల గురించి విన్నారు. ప్రజలను సంస్కరించడానికి వారిద్దరు చేస్తున్న ప్రయత్నాల గురించి తెలుసుకున్నారు. తక్షణం ఆయన వెనుదిరిగి పట్టణానికి వచ్చారు.

సాదిక్, మస్ దూక్ లు చేస్తున్న హితబోధను ప్రజలు వినాలని, సన్మార్గం ఏదో తెలుసుకోవాలని హాబీబ్ కూడా ప్రచారం చేయడం ప్రారంభించారు. వారిద్దరూ తమ స్వార్థం కోసం ఏదీ చేయడం లేదు. ప్రజల నుంచి వారేమి ఆశించడం లేదు. పైగా ప్రజలకు సహాయపడాలి అని అనుకుంటున్నారు. ఈ వాస్తవాలను ప్రజలకు చెప్పి నచ్చజెప్పడానికి శతవిధాలా ప్రయత్నించారు. కానీ ప్రజల హృదయాలు బండబారిపోయాయి. వారి చెవులకు మంచి మాటలు ఎక్కలేదు. హాబీబ్ పై ఆగ్రహంతో మండిపడుతూ మాకుమ్మడిగా ఆయనపై పడి అమానుషంగా కొట్టడంతో ఆయన చనిపోయారు. ఆ విధంగా ఆయన అమరుడు  (షహీద్) ఆయ్యారు. మిగిలిన ఇద్దరు ప్రవక్తలను కూడా ఆ దుర్మార్గులు హింసించక ముందే దైవదూత జిబ్రాయిల్ (అలైహి) కు అల్లాహ్ వద్ద నుంచి ఆదేశం అందింది. దుర్మార్గులపై లపై శిక్ష విరుచుకుపడనుంది. శిక్ష రాకముందే ఇద్దరు ప్రవక్తలను తక్షణం ఆ పట్టణం వదిలి వెళ్లిపోవలసిందిగా ఆదేశించడం జరిగింది. వారు వెంటనే ఆ పట్టణం వదిలి వెళ్లిపోయారు.

ఆ తర్వాత ఒక మహాప్రేలుడు ఆ పట్టణాన్ని కుదిపేసింది. మహావృక్షాలు కూకటి వ్రేళ్ళతో తలక్రిందులయ్యాయి. పట్టణంలోని భవనాలన్నీ సర్వనాశనమయ్యాయి. శిథిలాలు తప్ప మరేమీ మిగల్లేదు. అందరూ ఆ శిథిలాల క్రింద నలిగిపోయారు. సన్మార్గానికి కట్టుబడిన హబీబ్ ఆత్మ శరీరాన్ని వదిలి స్వర్గానికి చేరుకుంది. అల్లాహ్ స్వాగతం పలికి దానిని స్వర్గంలో ప్రవేశపెట్టారు. అంతా హాబీబ్ తన కలలో చూసిన మాదిరిగానే జరిగింది.

*షహీద్ అంటే అమరగతిపొందినవాడు. సత్యం కోసం నిలబడి, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఆసత్యానికి, అన్యాయానికి వ్యతిరేకంగా మొక్కవోని దీక్షతో నిలబడి సత్యానికి సాక్ష్యం పలికిన వ్యక్తిని, ఆ క్రమంలో ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తిని "షహీద్" అంటారు. షహిద్ కు అల్లాహ్ స్వర్గం ప్రసాదిస్తారు.*

Insha Allah రేపటి భాగము - 65 లో మహా సాహసవంతుడు జుల్ ఖర్ నైన్ గురించి తెలుసుకుందాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment