82

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

          🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                   *భాగము - 82* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

 *అజ్ఞాన కాలంనాటి అరబ్బుల సామాజిక తీరుతెన్నులు* 

ఆనాటి అరేబియా ద్వీపం యొక్క రాజకీయ, ధార్మిక పరిస్థితులను చర్చించుకున్న తరువాత ఇప్పుడు అక్కడి సామాజిక, ఆర్థిక మరియు నైతిక పరిస్థితులు ఎలా ఉండేవో క్లుప్తముగా తెలుసుకుందాము.

 *సామాజిక పరిస్థితులు : -* అరేబియా జనసంఖ్య వివిధ వర్గాల కలగాపులగం. ప్రతి వర్గం పరిస్థితి, ఇంకో వర్గం పరిస్థితి కంటే భిన్నంగా ఉండేది. ఉన్నత వర్గంలోని స్త్రీ పురుషులు నడుమగల సంబంధ బాంధవ్యాలు చెప్పుకోదగినంత ఆధునికంగా ఉండేవి. స్త్రీకి ఆ సమాజంలో చాలా మట్టుకు స్వాతంత్ర్యం ఉండేది. ఆమె సలహాను పాటించటం జరిగేది. ఒక్కోసారి ఆమె సంరక్షణ, గౌరవం విషయములో యుద్ధాలు కూడా జరిగేవి. అరబ్బులకు తమ శౌర్యప్రతాపాలను చాటుకోవటం అంటే మహా ఇష్టం. దీని కోసం ఓ అరబ్బు వ్యక్తి తన కీర్తిని చాటుతూ స్త్రీనే సంబోధించేవాడు. అప్పుడప్పుడు స్త్రీ అనుకుంటే తెగలన్నిటిని సంధి కోసం ఏకత్రం చేయగలిగేది. కావాలంటే తన ఒక్క సైగ పై యుద్ద జ్వాలలు రగల్చి రక్తపాతం జరిగేటట్లు కూడా ప్రవర్తించేది. ఏది ఏమైనప్పటికి పురుషుడే కుటుంబానికి పెద్దగా తలచబడేవాడు. అతని మాటే తీర్పు. ఈ వర్గంలో స్త్రీ పురుషుల సంబంధం నికాహ్ (వివాహం) ద్వారా ఏర్పడేది. ఈ నికాహ్ ను స్త్రీ సంరక్షకులు తమ చేతుల మీదనే జరిపేవారు. సంరక్షకుడు లేకుండా ఏ స్త్రీ అయినా తాను సొంతముగా నికాహ్ చేసుకోవటానికి వీలు లేదు.

ఓ వైపు ఉన్నత తరగతి పరిస్థితి ఇలా ఉంటే, మరో వైపు ఇతర తరగతుల్లో స్త్రీ పురుషుల విచ్చలవిడి కలయికకు సంభంధించిన అనేక పద్ధతులు కూడా ఉండేవి. ఈ కలివిడితనానికి అశ్లీలం, వ్యభిచారం తప్ప మరో పేరు పెట్టడానికి వీలు లేదు. హజ్రత్ అయిషా (ర.అ.) కథనం ప్రకారం, అజ్ఞాన కాలంలోని అరబ్బుల్లో నికాహ్ (వివాహం) నకు సంబంధించిన రకాలు నాలుగు....,

 *మొదటి రకం నికాహ్ : -* నేడు (ప్రస్తుతం) సాధారణముగా అమలులో ఉన్న ఆచారం. ఇది, ఓ వ్యక్తి మరో వ్యక్తికీ అతని సంరక్షణలో ఉన్న అమ్మాయిని వివాహము చేసుకుంటానని కబురు పంపడం. అతని ఈ సంబంధం స్వీకరించబడినప్పుడు ఆ వ్యక్తి మహర్ (స్త్రీ ధనం) చెల్లించి ఆ అమ్మాయిని పెళ్ళాడేవాడు.

 *రెండవ రకం నికాహ్ : -* రెండవ రకం వివాహం ఎలా జరిగేదంటే, ఋతుస్రావం నుండి పరిశుద్ధత పొందిన స్త్రీని, ఆమె భర్త ఫలానా వ్యక్తి దగ్గరకు పంపిస్తూ, ఈమె మర్మాంగాన్ని పొందమని (అంటే ఈమెతో వ్యభిచరించమని) చెప్పి పంపేవాడు. భర్త మాత్రం ఆ వ్యక్తి ద్వారా ఈమె గర్భం దాల్చింది అని తెలిసేతంట వరకు ఆమెకు దూరంగా ఉండేవాడు. నెలలు నిండిన తరువాత భర్త అనుకుంటే ఆమెతో సంభోగించేవాడు. ఇలా చేయడానికి కారణం పుట్టబోయే బిడ్డ యోగ్యుడుగా ఉండాలన్నదే. ఈ రకం నికాహ్ “నికాహె ఇస్తెబ్ జా” గా పిలువబడేది (దీన్నే భారత దేశములో నియోగ్ అంటారు).

 *మూడవ రకం నికాహ్ : -* నికాహ్ కు సంబంధించిన మూడవ రకం, పది మంది పురుషులకు తక్కువ సంఖ్య గల సమూహం ఓ చోట చేరేది. అందరూ ఒకరి తరువాత మరొకరు ఆ స్త్రీతో సంభోగించేవారు. ఆ స్త్రీ గర్భవతి అయి శిశువు జన్మించగా ప్రసవం అయిన కొన్ని రోజుల తరువాత అందరిని పిలువనంపేది. అందరూ తప్పని సరిగా అక్కడ చేరాలన్న నిబంధన ఉన్నందున వారంతా ఆమె దగ్గర చెప్పిన సమయానికి వచ్చి చేరేవారు. ఆ తరువాత ఆమె వారితో జరిగిన విషయం మీకందరికి తెలిసినదే. నా గర్భం నుండి జన్మించిన ఈ బిడ్డ మీలోని ఓ ఫలానా వ్యక్తి బిడ్డ అని వారిలో ఓ వ్యక్తి పేరు చెప్పేది. ఆ బిడ్డ అతని సంతానంగా అందరు గుర్తించేవారు.

 *నాలుగవ రకం నికాహ్ : -* ఈ వివాహంలో చాలా మంది కూడి ఒకే స్త్రీని సంభోగించేవారు. ఆమె తన వద్దకు వచ్చిన ఏ పురుషుణ్ణి కాదనకపోయేది. ఇలాంటి స్త్రీలు కులటలు. ఈ రకం స్త్రీలు తమ ఇంటి ముందు, “ఇది ఫలానా వ్యభిచారిణి ఇళ్ళు, ఎలాంటి సంకోచం లేకుండా ఎవరైనా రావచ్చు” అని తెలియడానికి జెండాలు కట్టి ఉంచేవారు. ఇలాంటి స్త్రీ గర్భం దాల్చి బిడ్డకు జన్మనిస్తే ఆమెతో వ్యభిచరించిన వారంతా ఆమె దగ్గరకు వచ్చి చేరేవారు. అప్పుడు ఓ ముఖ సాముద్రికుణ్ణి (ముఖ లక్షణములను బట్టి తండ్రి ఎవరో నిర్ణయించేవాడు) పిలిపించేవారు. ఆటను తన అంచనా ప్రకారం ఆ బిడ్డను అందులోని ఓ వ్యక్తికీ అంటగట్టేవాడు. ఆ తరువాత ఆ బిడ్డ అతని బిడ్డగానే చెలామణి అయ్యేది. అతడు ఆ తీర్పును తప్పకుండా శిరసావహించవలసిందే.

అల్లాహ్, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ప్రభావింపజేసిన తరువాత అజ్ఞాన కాలం నాటి ఈ రకం నికాహ్ లన్ని రద్దు చేయబడ్డాయి. కేవలం నేడు (ప్రస్తుతం) ఆచరణలో ఉన్న ఒక్క నికాహ్ మాత్రమే మిగిలి ఉంది.

Insha Allah రేపటి భాగము - 83 లో అరబ్బుల ధార్మిక పరిస్థితి, ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకుందాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆      
                (rafeeq)

☆☆      Salman       +919700067779   ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment