90

☪☪☪       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐              *ఇస్లాం చరిత్ర* *- 90*              🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 05* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

 *అబ్దుల్ ముత్తలిబ్, తన చిన్న కుమారుడు అబ్దుల్లాహ్ ను బలి ఇచ్చే సందర్భం : -* 

సర్వత్రా దుఖః చాయలు అలుముకున్నాయి. జనంలో అబ్దుల్లాహ్ మీద అమితమైన సానుభూతి పెల్లుబికింది. ఏ నోట విన్నా ఒకటే మాట...., “వద్దు వద్దు. అబ్దుల్లాహ్ ను బలివ్వకండి అతనికి బదులు పరిహారంగా ఏదైనా ఇవ్వండి. ఎన్ని ఒంటెలు బలివ్వడానికైనా లేదా ఎంత డబ్బు కానుకగా సమర్పించుకోవడానికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం." అన్నారు ప్రజలు.

కాని ఆ మొండి మనిషి అబ్దుల్ ముత్తలిబ్ ఎవరి మాట వినేలా లేడు. అబ్దుల్లాహ్ తల్లి తరపు బంధువులు ఎలాగైనా ఈ పనిని చేయనీయకుండా అబ్దుల్ ముత్తలిబ్ ని వారించాలని మరోసారి ప్రయత్నించారు. “అబ్దుల్ ముత్తలిబ్! ఆపండి, అబ్దుల్లాహ్ ను బలివ్వడానికి ఎంతమాత్రం వీల్లేదు. కావాలంటే ముందు మా మెడలపై కత్తి పెట్టండి. తరువాతే అబ్దుల్లాహ్ జోలికి పొండి” అన్నారు వారు ఈసారి గట్టిగానే.

అబ్దుల్ ముత్తలిబ్ : - లోకం తల్లకిందులైనా సరే ఈ నా నిర్ణయం మారదు. (అని అన్నాడు గంభీరంగా కత్తికి మరింత సానబెడుతూ)

బంధువులు కూడా గట్టి పట్టుబట్టారు. ఉభయుల్లో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. మరో వైపు ప్రజలు కూడా అబ్దుల్లాహ్ ను బలి ఇవ్వవద్దని ఒత్తిడి చేస్తున్నారు.

అబ్దుల్ ముత్తలిబ్ ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయాడు. అతను ఓ సారి గతంలోకి తొంగి చూసాడు....,

తనకు ఒకే ఒక సంతానం ఉన్నపుడు దేవుడు తనకు పదిమంది కొడుకులు ప్రసాదించాడు. దేవుని దయవల్ల అందరూ పెరిగి పెద్దయ్యి తనకు తోడ్పడుతున్నారు. కనుక తానూ చేసుకున్న మొక్కుబడి ప్రకారము ఇప్పుడు వారిలో ఒకడ్ని దేవునికి సమర్పించుకోక తప్పదు. హుబల్ దేవతకు అందరిలో చిన్నవాడైన అబ్దుల్లాహ్ ఇష్టమయ్యాడు. అందుకే మొక్కుబడి రీత్యా అబ్దుల్లాహ్ నే హుబల్ దేవుడికి అర్పించాలి. కాని ప్రజలంతా అబ్దుల్లాహ్ ను బలి ఇవ్వవద్దని వారిస్తున్నారే! ఇప్పుడెలా? అంతలో ఓ వృద్ధుడు....,

వృద్ధుడు : - ఖురైష్ నాయకా! ఓ మాట చెబుతా వింటావా?

అబ్దుల్ ముత్తలిబ్ : - నేనిప్పుడు ఎటువంటి మాటా ఇవ్వలేను. నువ్వు చెప్పదలచుకున్నది ఏమిటో చెప్పు వింటాను.

వృద్ధుడు : - బనూఆమీర్ వాడలో ఉంటున్న మంత్రగత్తె (అర్రాఫా) తెలుసు కదా?

అబ్దుల్ ముత్తలిబ్ : - తెలియకేమి! పట్టణ ప్రజలందరికి తెలుసు. యమన్, నజద్ ప్రాంతాల నుంచి కూడా జనం ఆ అర్రాఫా దగ్గరకు వస్తుంటారు జ్యోతిష్యం చెప్పించుకోవటానికి. అంతే కాదు గస్సాన్, సైమానీ రాజులు కూడా ఆమెకు కానుకలు పంపిస్తుంటారు.
         అయితే ఏం చేద్దామంటావు? (అని అడిగాడు అసహనంగా) 

వృద్ధుడు : - ఆ అర్రాఫా దగ్గరకు వెళ్ళి ఈ సమస్యకు పరిష్కారం అడుగుదాం. ఆమె ఎలాంటి భయప్రలోభాలకు లోనయ్యే మనిషి కాదు. ఆమె చెప్పినదానికి తిరుగుండదు.

అబ్దుల్ ముత్తలిబ్ మెత్తబడ్డాడు. మంత్రగత్తె దగ్గరకు వెళ్లేందుకు అంగీకరించాడు. దానితో మక్కా ప్రజలు చల్లగా ఊపిరి పీల్చుకున్నారు. కాని అతని చేతిలో కత్తి ఇంకా అలేగే వుంది.

“ఇక ఆ కత్తి తీసి ఇంట్లో పెట్టేయండి” అన్నాడు ఓ బంధువు.

అబ్దుల్ ముత్తలిబ్ : - మంత్రగత్తె పరిష్కారం చూపే దాకా ఈ కత్తిని వదిలి పెట్టేదిలేదు. ప్రతి విషయములో నాపై ఒత్తిడి తీసుకురాకండి. (అని అన్నాడు చిరు కోపంతో)

మొత్తం మీద ఎలాగో ప్రజలు అతడ్ని మంత్రగత్తె దగ్గరకు తీసుకెళ్ళారు. భక్తుల, అభిమానుల మధ్య తైలసంస్కారంలేని జుట్టు విరబూసుకుని కూర్చున్నది మాంత్రికురాలు. ఆమె ముఖం దుమ్ము కొట్టుకుని ఉంది. శరీరముపై బట్టలు నామ మాత్రంగా వున్నాయి. మెడలో ఓ పొడుగాటి ఎముకల దండ ఉంది. కాళ్ళకు, చేతులకు పెద్ద పెద్ద ఇనుప కడియాలున్నాయి. చేతిలో నల్లటి పట్టుకర్ర ఉంది. ముడిపడిన భృకుటి, నిప్పు కనాల్లాంటి ఎర్రటి కళ్ళు, నల్లటి పెదాలతో ఆమె ఎంతో భయానకంగా ఉంది.

అబ్దుల్ ముత్తలిబ్ రాగానే కుర్చోమన్నట్లు కర్రతో సైగ చేసింది. అబ్దుల్ ముత్తలిబ్ కత్తిని నేలపై గుచ్చి ఓ పక్కన కూర్చున్నాడు. ఆయన బంధువుల్లో ఒకతను ముందుకొచ్చి విషయం పూర్తిగా వినిపించాడు. మాంత్రికురాలు అంతా విని ఓ క్షణం పాటు కళ్ళు మూసుకున్నది. అంటా నిశ్శబ్దం!

ఆమె కళ్ళు తెరువగానే ఓ వ్యక్తి నిశ్శబ్దాన్ని చీల్చుతూ...., “ఎలాగైనా సరే అబ్దుల్లాహ్ ను కాపాడి....”

అబ్దుల్ ముత్తలిబ్ : - వీరి మాటలేవీ పట్టించుకోకండి. మీ జ్ఞానం, అంతరాత్మ ఏది చెబుతాయో అదే చెప్పండి. (అని అన్నాడు అతని మాటలకు అడ్డు తగులుతూ)

మంత్రగత్తె ఓ భయంకరమైన నవ్వు నవ్వింది.

మంత్రగత్తె : - మొక్కుబడి మరో విధంగా కూడా తీర్చుకోవచ్చు.

అబ్దుల్ ముత్తలిబ్ : - ఏమిటది?

మంత్రగత్తె : - అబ్దుల్లాహ్ పేరుకు, పది ఒంటెలకు పాచికలు వేసి చూడండి. అందులో ఒంటె పేరు వస్తే సరి. దానికి బదులు అబ్దుల్లాహ్ పేరు వస్తే మరో పది ఒంటెల్ని ఎక్కువ చేయండి. అప్పటికి అబ్దుల్లాహ్ పేరే వస్తే ఇంకో పది ఒంటెలు పెంచండి. ఇలా మీ దేవత ప్రసన్నమయ్యే వరకూ పదేసి చొప్పున ఒంటెల్ని పెంచుతూ పాచికలు వేయండి. ఒంటెల పేరు పై చీటీ వస్తే, అప్పుడు అబ్దుల్లాహ్ కు బదులు ఆ ఒంటెల్ని బలివ్వండి.

ఆ మంత్రగత్తె చెప్పినట్లే, అబ్దుల్ ముత్తలిబ్ తిరిగివచ్చి అబ్దుల్లాహ్ మరియు పది ఒంటెల నడుమ చీటీ వేశారు. కానీ చీటీ అబ్దుల్లాహ్ పేరునే పడింది. ఆ తరువాత పదేసి ఒంటెల్ని పెంచుతూపోయారు. అయినా అబ్దుల్లాహ్ పేరే రానారంభించింది. ఇక పూర్తి వంద ఒంటెలకు చేరుకున్న తర్వాత చీటీ వేయగా, చీటీ ఒంటెల పేరు మీద పడింది.

దాంతో జనం సంతోషంతో గంతులేశారు. అబ్దుల్ ముత్తలిబ్ కూడా తన ముద్దుల కొడుకు దక్కినందుకు చాలా సంతోషించాడు.

అప్పుడు అబ్దుల్ ముత్తలిబ్, అబ్దుల్లాహ్ కు బదులుగా ఆ వంద ఒంటెల్ని జిబహ్ చేశారు. వాటిని మనుషులు, పక్షులు, క్రూరమృగాల కోసం వదిలేశారు.

ఈ సంఘటనకు పూర్వం అరేబియాలో రక్తపరిహారం (దీత్) పరిమాణం పది ఒంటెలే ఉండేది. దీని తర్వాత అది నూరు ఒంటెలుగా నిర్ణయించబడింది. ఇస్లాం కూడా ఈ పరిమితినే యధాతథంగా కొనసాగించింది.

ఈ సంఘటన తర్వాత అబ్దుల్లాహ్ పేరు పట్నంలో మార్మోగిపోయింది. ఏ ఇంట్లో విన్నా అబ్దుల్లాహ్ గురించిన చర్చలే. నలుగురు గుమికూడిన చోటల్లా ఆయన్ని గురించిన గుసగుసలే. యువతుల సంగతి అయితే చెప్పనవసరం లేదు. ఇరవై నాలుగు వసంతాలు నిండి, నవయవ్వనంతో మిస మిసలాడుతున్న అబ్దుల్లాహ్ కోసం వారి హృదయాలు తహ తహలాడసాగాయి. ఆయన సౌందర్యం, శరీర సౌష్టవాలు యువతుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. మరి ఈ అందాల రేడు ఏ అదృష్టతారకు దక్కుతాడో!!......

Insha Allah రేపటి భాగములో అబ్దుల్లాహ్ వివాహం గురించి తెలుసుకుందాము.

 *దైవప్రవక్త (సల్లం) గారి ప్రవచనం ఇలా ఉంది : నేను ఇద్దరి జిబహ్ ల సంతానాన్ని. ఒకరు హజ్రత్ ఇస్మాయీల్ (అలైహి), రెండవ వారు నా తండ్రి అబ్దుల్లాహ్.* 

🖊🖊     ®@£€€q +97433572282      🖊🖊
                    (rafeeq)

🖊🖊      Salman       +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment