74

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము - 74* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

*ఈసా అలైహిస్సలామ్ ను చంపాలన్న యూదుల కుట్రల గురించి కొన్ని ఉల్లేఖనాలు ఇలా ఉన్నాయి.* 

*షేఖ్ అబూబకర్ నజార్ గారి రచన నుంచి : -* 
      

తమ మార్గానికి వ్యతిరేకంగా ప్రవక్త హజ్రత్ ఈసా (అలైహి) చేస్తున్న హితోపదేశాలను సహించలేని యూదులు, రోమన్ సామ్రాజ్యపు అధినేత రోమ్ చక్రవర్తి వద్దకు వెళ్ళి, ఈసా (అలైహి) పై లేని పోనీ అబద్ధపు ప్రచారాలు కల్పించారు. పుణ్యపురుషుడైన ఈసా (అలైహి) కు మరణ శిక్ష విధించడం ఆ రోమ్ చక్రవర్తికి కూడా ఇష్టం లేదు. అతి కష్టం మీద ఆయనకు ముళ్ళ కిరీటం ధరింపజేసి, శిలువ ఎక్కించాలని తన సైనికులకు ఆజ్ఞాపిస్తారు. అక్కడి నుంచి ఆ యూదులు, ఆ రోమన్ సైన్యాన్ని తీసుకొని ప్రవక్త ఈసా (అలైహి) ను చంపడానికి బయలుదేరారు.

యూదులు, ఈసా (అలైహి) దైవసందేశాన్ని ఆపేందుకు విఫలమైనప్పుడు, వారు ఈసా (అలైహి) ని చంపాలని నిర్ణయించుకున్నారు. రోమన్ సామ్రాజ్యపు చక్రవర్తి అనుమతి తీసుకొని ఈసా (అలైహి) ను వధించాలని బయలుదేరారు. కానీ ప్రవక్త ఈసా (అలైహి) వారికి ఎక్కడ కూడా కనపడలేదు. ఈసా (అలైహి), దైవసందేశాన్ని ప్రచారం చేస్తూ దూరప్రదేశాల్లో తిరుగుతున్నారు.

ప్రవక్త ఈసా (అలైహి) ఆచూకీ చెప్పినవారికి భారీ బహుమానం ఇస్తామని యూద మతపెద్దలు, ప్రజల్లో చాటింపు వేయించి ప్రలోభపెట్టారు. యూద మతపెద్దలు, ఈసా (అలైహి) ఆచూకీ తెలుసుకోవడానికి రహస్య సమావేశాలను నిర్వహించారు. అలాంటి ఒక సమావేశంలో, ఈసా (అలైహి) యొక్క పన్నెండు మంది శిష్యులతో ఒకడైన "జుడా"ను కలుస్తారు యూద మతపెద్దలు. అపుడు జూడా వారితో....,

జూడా : - (యూదులరా!) నేను మీకు ఆయనను అప్పగించినయెడల మీరు నాకు ఏమి ఇస్తారు?

ఆ విధంగా జూడా, తన గురువు ప్రవక్త ఈసా (అలైహి) ఆచూకీ తెలపడం వల్ల, యూదులు ఆయనకి ముప్పై, షెకెల్స్ అని పిలువబడే వెండి ముక్కలు ఇవ్వాలని ఒప్పుకున్నాడు.

యూదుల ఈ ప్రలోభానికి ప్రవక్త ఈసా (అలైహి) శిష్యుల్లో ఒకడైన "జూడా" లొంగియాడు. తన గురువుకు ద్రోహం చేయడానికి సిద్ధమయ్యాడు.

ఆ తర్వాత జూడా, తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడానికి వేషం మార్చుకుని రోమన్ సైనికులతో కలిసి ప్రవక్త ఈసా (అలైహి) ను వెతకడంలో పాలుపంచుకున్నాడు. చాలా సేపు వెతికిన తర్వాత చీకటి పడుతున్న సమయంలో ప్రవక్త ఈసా (అలైహి) రాత్రి గడపడానికి బసచేయాలనుకున్న తోటకు యూదులు, రోమన్ సైనికులు చేరుకున్నారు. ఆ ప్రదేశాన్ని రోమన్ సైనికులు చుట్టుముట్టడాన్ని చూసిన ఈసా (అలైహి) శిష్యులు పారిపోయారు. ప్రవక్త ఈసా (అలైహి) ఒంటరిగా శత్రువుల వలయంలో మిగిలిపోయారు. కాని అల్లాహ్ ఈసా (అలైహి) ను వదిలిపెట్టలేదు. ఈసా (అలైహి) ను అక్కడ సైనికులకు ఎవరికీ కనపడకుండా అల్లాహ్ అదృశ్యమయ్యేలా చేశారు.

ఆ తర్వాత ప్రవక్త ఈసా (అలైహి) కోసం వెతుకుతున్న రోమన్ సైనికులకు ఒక వ్యక్తి కనపడ్డాడు. అతని రూపురేఖలు ఈసా (అలైహి) ను పోలిఉన్నాయి. సైనికులు తక్షణం ఆ వ్యక్తిని నిర్బంధించారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రలోభానికి లొంగిన ఈసా (అలైహి) శిష్యుల్లో ఒక్కడైన "జూడా". జూడా ఎంతగా నిర్ఘాంతపోయాడంటే, తనను అన్యాయంగా నిర్బంధిస్తున్నారని చెప్పడానికిగాని, తన వాదన వినిపించడానికిగాని అతని నోరు పెగలలేదు. తన గురువు ఈసా (అలైహి) కు ద్రోహం చేసిన ఫలితమిది.

ఆ విధంగా జూడా కుట్ర బెడిసికొట్టేలా చేశారు అల్లాహ్. సైనికులు ఈసా (అలైహి) అనుకొని జూడాను ఈడ్చుకొని శిలువ వేసే ప్రదేశానికి తీసుకుపోయారు. చిత్రవధకు, పరాభవంతో కూడిన మరణానికి గురయ్యాడు జూడా.

*ఇబ్నె కసీర్, ఫత్ హుల్ ఖదీర్* 
      

యూదులు,రోమన్ సైనికులు తనను చంపాలన్న కుట్రను గురించి తెలుసుకున్న హజ్రత్‌ ఈసా (అలైహి), తను విడిది చేసిన ఆశ్రమంలో తన అనుచరురైన శిష్యులను సమావేశపరచారు. ఆ శిష్యులు సంఖ్య 12 లేక 17 మాత్రమే. అపుడు వారిని ఉద్దేశించి....,

ఈసా (అలైహి) : - (నా అనుచరులారా!) మీలో ఎవరయినా నా స్థానంలో ఉరికంబం ఎక్కడానికి సిద్దంగా ఉన్నారా? నా స్థానంలో చంపబడినవారు నాతో పాటు ఉంటారు (స్వర్గంలో). ఈ త్యాగానికి సిద్ధమయ్యే వారికి అల్లాహ్ నా రూపురేఖలను ప్రసాదిస్తారు.

అపుడు ఆ శిష్యుల్లో ఒక యువకుడు స్వచ్ఛందంగా ఈ పనికి సిద్ధం అయ్యాడు.

ఈసా (అలైహి) : - కూర్చో! (చిన్నవాడు అయినందున ఆ యువకుడికి అలా చెప్పారు.)

ఈసా (అలైహి) : - నా స్థానంలో మరెవరైనా ప్రాణత్యాగనికి సిద్ధమా?

మళ్ళీ ఆ యువకుడు స్వచ్ఛందంగా లేచి నిలబడ్డాడు.

ఈసా (అలైహి) : - కూర్చో! (అని మళ్ళీ ఆ యువకుడికి చెప్తారు.)

మళ్ళీ ఈసా (అలైహి) ప్రశ్నించడం, మళ్ళీ ఆ యువకుడు లేచి నిలబడటం జరుగుతుంది.

ఈసా (అలైహి) : - నా స్థానంలో చంపబడే వ్యక్తివి నువ్వు అవుతావా? (ఆ యువకుడితో)

ప్రాణ త్యాగానికి సిద్ధమైన ఆ యువకుడికి అల్లాహ్, ఈసా (అలైహి) రూపం కల్పిస్తారు.

ఆ పిదప హజ్రత్‌ ఈసా (అలైహి), ఆ ఇంటి పైకప్పుకు ఉన్న ఒక రంధ్రం నుంచి ఆకాశ మార్గాల ద్వారా పైకి ఎత్తుకోబడ్డారు.

ఆ తరువాత అక్కడికి యూదులు, ఈసా (అలైహి) ఆకారంలో ఉన్న ఆ యువకుడ్ని తీసుకువెళ్ళి, ముళ్ళ కిరీటం ధరింపజేసి శిలువపైకి ఎక్కించారు. తాము ఈసా (అలైహి) ని చంపి, శిలువపైకి ఎక్కించామని యూదులు తలపోశారు. కాని, వాస్తవానికి హజ్రత్‌ ఈసా (అలైహి) అక్కడ లేరు. ఆయన సజీవ స్థితిలోనే ఆకాశం పైకి ఎత్తుకోబడ్డారు.

*అహ్ సనుల్ బయాన్ ఖుర్ఆన్ అనువాదం నుంచి* 
      

ఈసా (అలైహి) విడిదిచేసిన తాత్కాలిక ఆశ్రమంలోకి యూదులు, రోమన్ సైనికులు జొరబడ్డారు. అయితే వారు లోపల చొరబడక ముందే ఈసా (అలైహి) అల్లాహ్ ని ప్రార్థించారు. అపుడు అల్లాహ్....,

అల్లాహ్ : - ఓ ఈసా! నేను నిన్ను యూదుల కుట్ర నుంచి కాపాడి, నిన్ను పూర్తిగా నా వైపుకు, ఆకాశాల పైకి ఎత్తుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ ప్రపంచంలోకి దింపినప్పుడు నీకు మరణం ఇస్తాను. ఇప్పుడు యూదుల చేతుల్లో నీకు మరణం రాదు. నీవు సహజమైన మరణమే మరణిస్తావు.

అల్లాహ్, ఈసా (అలైహి) ను సజీవంగా, సశరీరంగా ఆకాశం పైకి ఎత్తుకోవడం జరిగిపోయాయి. అపుడు అల్లాహ్, ప్రవక్త ఈసా (అలైహి) ను అక్కడ సైనికులకు ఎవరికీ కనపడకుండా అదృశ్యమయ్యేలా చేశారు.

*ముహమ్మద్ ఖాసీం ఖాన్, తన వాఖ్యానసహిత ఖుర్ఆన్ అనువాదం* *నుంచి*
      

ఆ తర్వాత ఆశ్రమంలోకి యూదులు, రోమ్‌ సైనికులు జొరబడ్డారు. ఆ రోమన్ సైనికులలోనే సైమన్ అనే ఒక వ్యక్తికి అల్లాహ్ ఈసా (అలైహి) రూపం కల్పించారు. ఈసా (అలైహి) ఆకారంలో ఉన్న సైమన్ ని చూసిన యూదులు, అతడే ఈసా (అలైహి) అనుకోని, అతడిని పట్టుకెళ్ళి శిలువ ఎక్కించారు.

తాము ఈసా (అలైహి) ని చంపి, శిలువపైకి ఎక్కించామని యూదులు తలపోశారు. ఈ విధంగా సైమన్ అనే ఆ వ్యక్తిని చంపిన యూదులు, సిగ్గు ఎగ్గూ లేకుండా “మేము దైవప్రవక్త మసీహ్ ఇబ్నె మర్యంని సంహరించాం.” అని మహాగర్వంగా చెప్పుకున్నారు.

ఈ సంఘటన జరిగిన అనేక సంవత్సరాలకు ఈసా (అలైహి) ను విశ్వసించి క్రైస్తవులైనవారు దీన్ని గురించి ఎన్నో భేదాభిప్రాయాలకు గురయ్యారు. 

Insha Allah ఈ భేదాభిప్రాయాల గురించి రేపటి భాగము - 75 లో తెలుసుకుందాము.

హజ్రత్ ఈసా అలైహిస్సలామ్ ను చంపాలని శత్రువులు ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు...., ఆ సందర్భం గురించి ఉల్లేఖనాలు ఇలా ఉన్నాయి. ఈ ఉల్లేఖనాలలోని వివరణకు, మేము సౌదీ అరేబియాలో ఉన్న ఒక పెద్ద ఆలీమ్ సాబ్ గారిని సంప్రదించడం జరిగింది. ఇందుకు వారి సమాధానం....,

"సోదరా! ఆ సమయంలో ఏం జరిగిందన్నది మనకు అనవసరం. మరి తెలుసుకోవలసినదేంటి...., మనం దివ్యఖుర్ఆన్ ను పరిగణలోకి తీసుకోవాలి. మరి దివ్యఖుర్ఆన్ లో ఏముంది...., 'ఈసా (అలైహి) గారు శిలువ వేయబడలేదు మరియు చంపబడలేదు. యూదులు, ఈసా (అలైహి) ను వధించామని భ్రమపడ్డారు. నిజమేంటంటే, ఆయన సజీవంగా ఆకాశం పైకి ఎత్తుకోబడ్డారు.' అని ఉంది. కావున మనం దివ్యఖుర్ఆన్ అనుసరించాలి." అని చెప్పడం జరిగింది.

ఇందులోని మరింత వివరణకు *"ముఖ్య విజ్ఞప్తి"* అని, క్రింద వేరొక msg రూపంలో ప్రచురించడం జరిగింది.

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

*ముఖ్య విజ్ఞప్తి :-*  
                           యేసు వారి శిలువ విషయాల వాస్తవాలు బైబిల్ లో సరియైన విధంగా లేకపోవడంతో , కల్పితాలకు గురియైన కారణంగా  *( ఖురాన్ & బైబిల్ )* వెలుగులో సత్యాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది.
                               ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో యేసుక్రీస్తు వారి విషయంలో *( ఇస్లాం చరిత్ర అను మా MSG )*లలో పొరపాటు ఉంటే దాన్ని బైబిల్ నుండి సేకరించింది అని గమనించి మమ్మల్ని క్షమిస్తారని ఆశిస్తున్నాము.

*సోదరులారా జాగ్రత్తగా గమనించండి దయచేసి మమ్మల్ని తప్పు పట్టకండి .👇*

*బైబిల్ లొనే ఒకదానికి మరొకటి అసలు సంబంధమే లేకుండా అనేక విషయాలు , లేఖనాలు వారికి ( క్రైస్తవులు )అనుకూలంగా వక్రీకరణం జరిగి ఉన్నాయి.*
            కాకపోతే మనందరికి అర్థమయ్యేందుకు మాత్రమే బైబిల్ నుండి కూడా కొంచం సమాచారాన్ని అందించడం  జరిగింది. *అందులో బైబిల్ నుండి సేకరించిన సమాచారంలో సత్యాలు , అసత్యాలు ఉన్నాయి.*

*బైబిల్ లో ఒకదానికి , మరొకటి విరుద్ధ విషయాలున్నాయని ఉదాహరణ:-*👇
యేసు వారు *చనిపోయారని చెబుతోంది , మరల చనిపోలేదు* అని చెబుతుంది.

*చనిపోయారని లేఖనాలు :-*👇

మత్తయి 27: 50
యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను.

మార్కు 15: 37
అంతట యేసు గొప్ప కేకవేసి ప్రాణము విడిచెను.

*చనిపోలేదు రక్షించబడ్డాడు అనే లేఖనాలు:-*👇
యోహాను 19: 36
అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను.
*👆ఒక్క ఎముక కూడా విరగకుండా కాపాడుకుంటాను అని దేవుడు ఒక లేఖనములో  సెలవిచ్చాడు. అది అలాగే జరిగిందని యేసు వారి శిష్యుడు యోహాను సాక్షమిచ్చాడు*

బైబిల్ లో నీతి , నిజాయితీ , సత్యవంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తారు అని ఉంది . 
*మరి యేసు వారు సత్యవంతుడు ఆయన ప్రార్థనను దేవుడు ఆలకించారు.👇*
మత్తయి 26: 39
కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.

( సిలువను యేసు వారు గిన్నె గా వర్ణించారు )

కీర్తనలు 116: 3
మరణబంధములు నన్ను చుట్టుకొని యుండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను.

కీర్తనలు 116: 4
అప్పుడుయెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొఱ్ఱపెట్టితిని.

కీర్తనలు 116: 5
యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యతగలవాడు.

కీర్తనలు 116: 6
యెహోవా సాధువులను కాపాడువాడు. *నేను క్రుంగియుండగా ఆయన నన్ను రక్షించెను.*

ఈ ప్రస్తావనలు యేసు వారిని సిలువపై వేయాలని యూదులు అనుకుంటున్న సమయంలో జరిగినవి.
*ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుడు ఆయన్ని రక్షించాడు అంటే చనిపోయిన తరువాత రక్షించాడు అని అర్థమా ? మీరు ( క్రైస్తవులు )అనుకుంటున్నది ఎంత మాత్రం నిజం కాదు.*
👆 ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇంకా అనేక లేఖనాలు ఆయన చనిపోడు అని చెప్పుచున్నాయి.
యేసు క్రీస్తు వారిని దేవుడు సజీవంగా పైకి లేపుకున్నారు.

*ఖురాన్ కూడా ఇదే విషయం బోధిస్తుంది 👇*
*ఇంకా   - ''మర్యమ్   పుత్రుడగు దైవప్రవక్త   ఈసాను మేము హతమార్చాము''   అని అనటం వల్ల - (వారు   శిక్షను చవిచూశారు). నిజానికి   వారు ఆయన్ని చంపనూలేదు, శిలువ   పైకి ఎక్కించనూ లేదు. నిజం ఏమిటంటే,   వారి కొరకు ఆయన్ని పోలిన వ్యక్తి రూపొందించబడ్డాడు.   ఈసా విషయంలో విభేదిం చినవారు ఆయన వ్యవహారంలో సందేహానికి   లోనయ్యారు. అంచనాలను అనుసరించటం తప్ప వారికి ఈ విషయమై ఖచ్చితంగా   ఏమీ తెలియదు. అసలు వారు ఆయన్ని చంపలేదు,*
*(Quran - 4 : 157)*

*పైగా   అల్లాహ్   ఆయన్ని తన   వైపునకు ఎత్తుకున్నాడు.   అల్లాహ్ సర్వాధిక్యుడు, మహావివేకి.*
*(Quran - 4 : 158)*

చాలా మంది క్రైస్తవ సోదరులు ఇలా అంటారు. 👇
*మీ ముస్లింలు బైబిల్ ని తప్పు పడతారు , కానీ అది అల్లాహ్ ఇచ్చిన గ్రంథం ,అందులో ఉన్న దేవుడు యెహోవాయే : అల్లాహ్ అంటారని చెప్తారు.*

*మేము (ముస్లిం)లు బైబిల్ ను దైవ గ్రంథముగా విశ్వసిస్తున్నాము. (కానీ ఆనాటి బైబిల్ లో ఉన్న అనేక విషయాలు ఇప్పడున్న బైబిల్ లో తారుమారు అయ్యాయని అని)ఇదే  వాస్తవం*

No comments:

Post a Comment