69

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము - 69* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

*హజ్రత్ ఈసా అలైహిస్సలామ్* 

మర్యం (అలైహి) దైవగృహంలో అల్లాహ్ ఆరాధనలో ఉన్నప్పుడు ఒక దైవదూత పురుషుని రూపంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. మర్యం (అలైహి) భయంతో వణుకుతూ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. అపుడు మర్యం (అలైహి), ఆ పురుషుని రూపంలో వచ్చిన దైవదూతను ఉద్దేశించి....,

మర్యం (అలైహి) : - నీవే గనుక అల్లాహ్ కి భయపడేవానివైతే నా దగ్గరకు రాకు (ఇక్కడి నుంచి వెళ్లిపో), నేను నీబారి నుంచి కరుణామయుడైన అల్లాహ్ శరణు కోరుతున్నాను. (అంటూ అల్లాహ్ ని ప్రార్థించింది.)

దైవదూత : - మర్యం (అలైహి)! భయపడవద్దు. నీకు ఎలాంటి ప్రమాదమూ లేదు. నేను నీ ప్రభువు పంపగా వచ్చిన దూతను మాత్రమే. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్, నన్ను నీ వద్దకు పంపారు. నీకు సన్మార్గుడైన మరియు పరిశుద్ధుడైన ఒక కుమారుడిని ప్రసాదించే ఉద్దేశ్యంతో విశ్వప్రభువు అల్లాహ్, నన్ను నీ వద్దకు పంపారు.

ఈ మాటలు విని మర్యం (అలైహి) నిర్ఘాంతపోయింది. అపుడు ఆమె, దైవదూత చెప్పిన మాటలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ....,

మర్యం (అలైహి) : - ఏమిటీ! నాకు కుమారుడు ఎలా పుడతాడు. నన్ను ఏ పురుషుడూ తాకనైనా తాకాలేదే. నేను శీలంలేని స్త్రీని కూడా కాదే!! (అని అన్నది కంగారుపడుతూ....)

దైవదూత : - (మర్యం!) అలాగే అవుతుంది. నీ ప్రభువుకు ఇలా చేయడం చాలా తేలిక. అల్లాహ్, నీ కుమారుడిని మానవాళికి ఒక నిదర్శనంగా, తన తరుపున కారుణ్యమూర్తిగా రూపొందించాలని నిర్ణయించారు. అందుకే ఇలా చేయబోతున్నారు. ఈ పని జరిగితీరవలసి ఉంది.

ఈ మాటలు పలికిన దైవదూత అదృశ్యమయ్యాడు.

*ఆందోళనకు గురవుతున్న మర్యం అలైహిస్సలామ్* 

దైవదూత రాక వల్ల మర్యం (అలైహి) చాలా ఆందోళనకు గురయ్యారు. నెలలు గడిచినకొద్దీ ఆమె ఆందోళన ఎక్కువయ్యింది. "భర్త లేకుండా బిడ్డకు జన్మనివ్వడం ఎలా? ఎలా సమాధానం ఇచ్చుకోగలను?" అన్న ఆలోచనలు ఆమె నిండా ముసురుకున్నాయి.

ఆమెలో మరో ప్రాణి ఊపిరి పోసుకుంటుందన్న విషయం (గర్భం దాల్చిన విషయం) త్వరలోనే మర్యం (అలైహి) కు తెలిసింది. ఆమె బరువెక్కిన హృదయంతో దైవగృహాన్ని వదలి నజరేత్ కు వెళ్లిపోయారు. నజరేత్ పట్టణంలోని ఆమె జన్మించారు. ప్రజలకు దూరంగా ఒక చిన్న ఇంట్లో ఆమె నివసించసాగారు.

కాని భయం, ఆందోళన మర్యం (అలైహి) ను వదిలిపెట్టలేదు. ఆమె ఒక ఉన్నత కులీన కుటుంబానికి, ధర్మపరాయణుల కుటుంబానికి చెందిన స్త్రీ. ఆమె కుటుంబ చరిత్ర ఘనమైనది. ఆమె తండ్రి హజ్రత్ ఇమ్రాన్ ని చెడ్డవాడిగా చెప్పే ధైర్యం ఎవరూ చేయలేదు. ఆమె తల్లి హజ్రత్ హన్నా ని ఎవరూ వ్రేలెత్తి చూపలేదు. కానీ ఇప్పుడు ఆమె గురించి ప్రశ్నించే వారికి ఏమని జవాబు చెప్పగలదు. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. మర్యం (అలైహి), ఈ మానసిక ఒత్తిడిని భరించలేకపోయారు. గర్భంలో బిడ్డను మోస్తూ ఆమె నజరేత్ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఎక్కడికి వెళ్లాలన్నది ఆమెకు తెలియదు. ఎక్కడికో అక్కడికి ఈ ప్రాంతం నుంచి, ఈ వాతావరణం నుంచి దూరంగా వెళ్లిపోవాలని బయలుదేరారు.

*ప్రారంభమైన పురిటినొప్పులు* 

అలా నజరేత్ పట్టణాన్ని విడిచి, అక్కడి నుంచి బయలుదేరగానే ఆమె ఎక్కువ దూరం వెళ్ళక ముందే పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆ ప్రసవ వేదనతోనే మర్యం (అలైహి) ఒక ఖర్జూరపు చెట్టును ఆనుకుని కూర్చుండిపోయారు. అపుడు ఆమె (లోలోన బాధపడుతూ)...., "అయ్యో! (ఏమిటి నాకీ పరీక్ష) నేను ఈ ప్రసవానికి ముందే చనిపోయి నామరూపాల్లేకుండా పోతే బాగుండు!!" అన్నది.

అక్కడే మర్యం (అలైహి) ఒక మగ శిశువుకు జన్మనిచ్చారు. ఆయనే *ప్రవక్త హజ్రత్ ఈసా అలైహిస్సలామ్.* అపుడు మర్యం (అలైహి), తన అందమైన కుమారుడి ముఖాన్ని తదేకంగా చూడసాగారు. తండ్రి లేకుండా పుట్టిన ఆ శిశువును ఈ లోకంలోకి తీసుకువచ్చినందుకు ఆమెకు చాలా బాధ కలిగింది. అపుడు మర్యం (అలైహి) కు హఠాత్తుగా ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం దైవదూతది. ఆ దైవదూత ఆమె కింది వైపు నుండి పిలుస్తూ ఇలా అన్నాడు....,

"మర్యం! దుఃఖించవద్దు, నీ ప్రభువు ఇక్కడికి సమీపంలో ఒక సెలయేరును ఏర్పాటు చేశారు. ఇక ఆహారం విషయానికి వస్తే, ఈ ఖర్జూరం చెట్టు మొదలు పట్టుకొని ఊపితే ఖర్జూరాలు రాలతాయి. వాటిని తిని, సెలయేటి నీరు తాగి, నీవు కోల్పోయిన బలాన్ని తిరిగి పొందు. సంతోషంగా ఉండు. నీవు చూస్తున్నది అల్లాహ్ శక్తిసామర్థ్యాల ప్రభావాన్ని. వాటి వల్ల ఎండిపోయిన ఖర్జూరం చెట్టు నీ కోసం ఫలాలను ఇస్తోంది." అని అన్నాడు.

అల్లాహ్ తరఫున వినిపించిన ఆ స్వరం ఆమెకు ధైర్యాన్నిచ్చింది. ఆమె స్వచ్ఛమైన నడవడికకు, వ్యక్తిత్వానికి ఇది నిదర్శనం. ఆ తర్వాత మర్యం (అలైహి) తిరిగి తన జాతి ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాని ఆమెలోని భయాలు మళ్ళీ ఆమెను చుట్టుముట్టాయి.

"నేను నా జాతి ప్రజల వద్దకు వెళ్ళి ఈ పసిబిడ్డ గురించి ఏమని జవాబు చెప్పగలను?" అని మర్యం (అలైహి) ఆందోళన పడసాగింది. తన తల్లి పడుతున్న ఆందోళనను గుర్తించిన ఆ పసిబిడ్డ ఈసా (అలైహి) తానే స్వయంగా మాట్లాడటం ప్రారంభించాడు.

"(తల్లీ!) నీవు ఎవరినైనా కలిస్తే వారితో.... 'కరుణామయుడైన అల్లాహ్ కోసం నేను ఈ రోజు ఉపవాసం ఉంటానని మొక్కుకున్నాను. అందుచేత నేను ఈ రోజు ఎవరితోనూ మాట్లాడను.' అని పలకాలని చెప్పాడు."

ఈ అసాధారణ సంఘటన, అప్పుడే పుట్టిన బిడ్డ మాట్లాడిన సంఘటన చూసి మర్యం (అలైహి) లోని భయాలు చాలా వరకు తగ్గిపోయాయి.

*తన జాతి ప్రజల వద్దకు వెళ్లిన మర్యం (అలైహి)* 

ఆ తర్వాత మర్యం (అలైహి), తన బిడ్డతో తన జాతి ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకొని వెళ్ళింది. మర్యం (అలైహి), తన జాతి ప్రజల వద్దకు చేరుకున్న తర్వాత, ఆమె అనుకున్నట్లే ఆ జాతి ప్రజలు ఆమెను, ఆమె ఒడిలో ఉన్న బిడ్డను అనుమానంగా చూడటం ప్రారంభించారు. ఆమెను నిందించడం ప్రారంభించారు. ఆమె పవిత్రమైన స్త్రీగా పరిగణించబడుతున్నందువల్ల, మర్యం (అలైహి) తో ఉన్న బిడ్డను చూసి ఆ జాతి ప్రజలు ఆశ్చర్యపడ్డారు. అపుడు వారు....,

మర్యం (అలైహి) జాతి ప్రజలు : - మర్యం! ఈ బిడ్డకు తండ్రి ఎవరు? (అన్నారు ఆశ్చర్యంగా)

కానీ ఇందుకు ఆమె సమాధానం ఏమీ చెప్పలేదు.

మర్యం (అలైహి) జాతి ప్రజలు : - ఓ హారూన్ సోదరి మర్యం! నువ్వు చాలా ఘోరమైన పాపం చేశావు. నీ తండ్రి చెడ్డవాడు కాదు. నీ తల్లి కూడా శీలం చెడిన స్త్రీ కాదే! నువ్వు ఇలా ఎందుకు తయారయ్యావు. (అంటూ నిలదీయడం ప్రారంభించారు.)

దానికి మర్యం (అలైహి) నోటితో సమాధానం ఇవ్వకుండా ఒడిలో తన బిడ్డ వైపు సైగ చేసింది.

మర్యం (అలైహి) జాతి ప్రజలు : - (మర్యం!) మేము ఆ పసిబిడ్డతో ఎలా మాట్లాడగలం? (ఆశ్చర్యంతో అన్నారు)

కాని వారిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఆ బిడ్డ స్పష్టంగా మాట్లాడటం ప్రారంభించాడు.

*“(వెంటనే) ఆ పిల్లవాడు ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు: ‘నేను అల్లాహ్ దాసుడ్ని. ఆయన నాకు దివ్యగ్రంథం ప్రసాదించాడు. ప్రవక్తగా నియమించాడు. నేను ఎక్కడున్నా నన్ను శుభప్రదమైనవాణ్ణిగా చేశాడు. నేను బ్రతికున్నంతకాలం నమాజ్, జకాత్‌ విధులు పాటిస్తుండాలని ఆదేశించాడు. నాతల్లి పట్ల నేను విధేయతకలవాడ్నిగా చేశాడు. ఆయన నన్ను దుర్మార్గుడిగా, దౌర్భాగ్యుడిగా చేయలేదు. నేను పుట్టినప్పుడు, చనిపోయేటప్పుడు, తిరిగి బ్రతికించి లేపబడేటప్పుడు నాపై శాంతి అవతరించు గాక!” (ఖుర్‌ఆన్ 19:30-33)* 

అని ఆ పసిబిడ్డ ఈసా (అలైహి) ఈ విధంగా పలికాడు.

ఆ బిడ్డ విశిష్టమైనదని ఆ ప్రజలు గ్రహించారు. అల్లాహ్ తాను అనుకున్నది జరగడానికి కేవలం "అయిపో" అంటే చాలు. అల్లాహ్ తలచినది జరిగిపోతుందని తెలుసుకున్నారు. కానీ ఇదంతా ఒక కనికట్టు విద్యగా భావించిన వారు కూడా కొందరున్నారు. అయితే, పసిబిడ్డ మాట్లాడిన ఈ పరిణామం తర్వాత మర్యం (అలైహి) నజరేత్ పట్టణంలో ఎలాంటి వేధింపులు లేకుండా నివసించడం సాధ్యపడింది.

_ఇక్కడ హారూన్ (అలైహి) సోదరి అనగా...., ప్రవక్త మూసా (అలైహి) సోదరుడు, హారూన్ (అలైహి) సంతతికి చెందిన స్త్రీ అని అర్థం._ 

మిగిలినది Insha Allah రేపటి భాగము - 70 లో తెలుసుకుందాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment