24

🤚🏻✋🏻🤚🏻✋🏻 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🤚🏻✋🏻🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

                               *భాగము - 24* 

____________________________________________

*మూసా అలైహిస్సలామ్ : - - : క్రీ.పూ.1400-1250. లుక్మాన్ అలైహిస్సలామ్ కాలం వరకు.*

హజ్రత్ మూసా అలైహిస్సలామ్ అల్లాహ్ ఎంచుకున్న ప్రత్యేక దాసుడు. దివ్య ఖురాన్ లో ఉన్న ప్రవక్తల కథలలో మూసా అలైహిస్సలామ్ గారిది పెద్ద కథ. అనేక ప్రస్తావనకు వచ్చింది. మూసా అలైహిస్సలామ్ గాధ వివిధ అధ్యాయాల్లో ఎంతో వివరంగా ఉంది.

[ప్రవక్త యాఖూబ్ అలైహిస్సలామ్ నుంచి బనీఇస్రాయీల్ ప్రారంభమైంది. బనీఇస్రాయీల్ అంటే ఇస్రాయీల్ తెగ లేదా ఇస్రాయీల్ సంతానం అని అర్థం. యాఖూబ్ సంతానం లోని అన్ని తెగలను ఈ పేరు సూచిస్తుంది. బనీఇస్రాయీల్ అంటే యాఖూబ్ అలైహిస్సలామ్ సంతానం]

*దుర్మార్గుడు ఫిరౌన్ గురించి* 

ఈజిప్టు ను పరిపాలించిన ఫిరౌన్ పరమ దుర్మార్గుడు. అతను ధరణిలో తలెత్తి అహంకారంతో విర్రవీగుతున్నాడు. ఫిరౌన్ తన దేశ పౌరుల్ని విభిన్న వర్గాలుగా విభజించాడు. ఆ వర్గాలలో ఒక వర్గం (బనీఇస్రాయీల్) ను అతి నీచంగా చూస్తున్నాడు. బనీఇస్రాయీల్ ల పై ఫిరోన్ అతిదారుణంగా అత్యాచారాలకు, అణచివేతలకు పాల్పడ్డాడు. వారిని పరాభవించడానికి, అన్ని విధాలా త్రొక్కి వేయడానికి ఫిరౌన్ తనకు అందుబాటులో ఉన్న మార్గాలన్నింటిని ఉపయోగించాడు. వారిని బానిసలుగా చేసుకున్నాడు. నామ మాత్రంగా జీతభత్యాలు ఇస్తూ, కొన్ని సందర్భాలలో అస్సలు ఏమీ ఇవ్వకుండా వారితో బండచాకిరి చేయించుకునేవాడు. నిశ్చయంగా ఫిరౌన్ కల్లోలాన్ని రేకెత్తించిన వారి కోవకు చెందినవాడు. ఫిరౌన్ ఇలాంటి అఘాయిత్యాలకు ఒంటరిగా పాల్పడటం సాధ్యం కాదు, ఫిరౌన్ తో పాటు అతని అనుచరులు అనేక మంది ఈ దౌర్జన్యాలలో పాలు పంచుకునేవారు. వీరంతా కలిసి అణగారిన బనీఇస్రాయీల్ ప్రజలపై దౌర్జన్యాల పరంపర కొనసాగించేవారు. కనుక ప్రపంచంలో అణిచివేయబడిన ఈ దళిత జనాన్ని కనికరించాలని అల్లాహ్ నిర్ణయించుకున్నారు. వారికి ప్రపంచ నాయకత్వం ప్రసాదించి, భూమికి వారసులుగా చేయాలని సంకల్పించారు. వారికి ప్రపంచంలో పాలనాధికారం ఇవ్వాలని అల్లాహ్ భావించారు.

*పసిబాబులను హతమార్చే ఫిరౌన్* 

ఒక సందర్భంలో తన దర్బారులో ఉన్న పూజారులు చెప్పిన మాటల వల్ల ఫిరౌన్ పసిపిల్లల హత్యాకాండకు పాల్పడ్డాడు.

పూజారులు : - ఓ మహారాజా! బనీఇస్రాయీల్ లో జన్మించే ఒక యువకుడి వల్ల తమకు, తమ రాజ్యానికి పతనం వాటిల్లుతుంది. మిమ్మల్ని హతమార్చడం జరుగుతుంది.

(ఆ మాటలు విన్న ఫిరౌన్ మండిపడ్డాడు. తన భటులతో ఇలా ఆదేశించాడు.)

ఫిరౌన్ : - బనీఇస్రాయీల్ ప్రజల్లో ఎవరికైనా మగపిల్లవాడు జన్మిస్తే వెంటనే హతమార్చండి. అంతే కాదు బనీఇస్రాయీల్ ప్రజల్లోని మహిళలను, పురుషులను కలవనీయకుండా దూరం చేయండి.

రాజుగారి ఆదేశంతో సైనికులు విచ్చలవిడిగా దుర్మార్గాలకు పాల్పడ్డారు. పసిబాబుల సుకుమారమైన శరీరాలలోకి కత్తులను దిగేశారు. గర్భిణీలపై నిఘా వేసి ఉంచడం జరిగేది. వారికి ప్రసవం అయిన వెంటనే పుట్టింది మగపిల్లవాడు అయితే వెంటనే ముక్కలుముక్కలుగా చేసేవారు. ఆడపిల్ల జన్మిస్తే వదిలిపెట్టేవారు.

*మూసా అలైహిస్సలామ్ జననం* 

బనీఇస్రాయీల్ లపై ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్న కాలంలో, ఒక ఇస్రాయీల్ కుటుంబంలో ఒక మగపిల్లవాడు జన్మించాడు. ప్రవక్త యాఖూబ్ (అలైహి) కుమారుడు లావి సంతతికి చెందిన ఇమ్రాన్, యుకాబిద్ ల కుమారుడే మూసా అలైహిస్సలామ్ (మూసా అనేది తన తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు). ఈ దంపతులకు మూసా (అలైహి) కన్నా ముందు ఒక అబ్బాయి హారూన్, ఒక అమ్మాయి మర్యం జన్మించారు.

[ మేము మూసా (అలైహి) తల్లి యుకాబిద్ కు దివ్యవిష్కృతి ద్వారా ఇలా సూచించాము "నీవు మూసా కు పాలు తాగిస్తూ ఉండు, మూసా ప్రాణాలకు ముప్పు వాటిల్లే సూచనలు కన్పిస్తే నదిలో వదిలి పెట్టు, నువ్వేమి భయపడకు, దిగులుపడకు. ఆ తరువాత మేము మూసా ను తిరిగి నీ దగ్గరికే చేరుస్తాము. మూసా ని దైవ ప్రవక్తగా చేస్తాం.]

మూసా (అలైహి) జన్మించిన తర్వాత, ఫిరౌన్ రాజభటుల హత్యాకాండ నుంచి ఎలాగైనా తన చిన్న కుమారున్ని కాపాడాలనుకొని రహస్యంగా పిల్లవాని ఆలనాపాలనా చూసింది తల్లి యుకాబిద్. ఏదో ఒక విధంగా, అతి కష్టం మీద మూడు నెలలపాటు పిల్లవానికి పాలు ఇవ్వగలిగింది. ఆ తర్వాత తనకు దైవికంగా తోచిన భావాన్ని ఆచరణలో పెడుతూ,యుకాబిద్ ఒక బుట్టలో మూసా (అలైహి) ను ఉంచి, ఆ బుట్టను నైలు నదిలో విడిచిపెట్టింది.

నైలు నదిలో ఆ విధంగా తన కుమారున్ని విడిచిపెట్టిన యుకాబిద్, తన కుమార్తె మర్యం తో ఆ బుట్ట ఏ దిశగా పోతుందో వెంటవెళ్లి చూడమని చెప్పింది. మర్యం నదీ తీరం వెంబడి వెళుతూ బుట్ట ఎటు కొట్టుకపోతుందో గమనించసాగింది. ఆ నీటి ప్రవాహం రాజభవనం ఆవరణలోని తోటలో నుంచి ప్రవహిస్తూ వెళ్ళింది. మర్యం ఆశ్చర్యంతో తన కళ్ళ ముందు కనబడిన దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయింది. ఆ నీటి ప్రవాహం లోని బుట్ట రాజభవనం వద్ద తీరానికి చేరుకుంది.

రాజసేవకులు ఆ నీటిలో ఉన్న బుట్ట ను, బుట్టలు ఉన్న శిశువును చూశారు. ఆ శిశువును తీసుకొని ఫిరౌన్ దంపతులవద్దకు వెళ్లారు. మహారాణి ఫిరౌన్ భార్య ఆసియా ఆ ముద్దులొలికే పసిబిడ్డను చూసి ముగ్ధురాలయ్యింది. అల్లాహ్ ఆసియా హృదయంలో ఆ శిశువు పట్ల ప్రేమ పుట్టుకవచ్చేలా చేశాడు. ఆసియా తన భర్త ఫిరౌన్ తో "ఈ పిల్లవాడు మన కంటిచలువ, పిల్లవాడిని చంపకండి. ఈ పసివాడిని మనకు ప్రయోజనకారి కావచ్చు లేదా పిల్లవాడిని మన కొడుకుగానైనా చేసుకుందాం." అని చెప్పింది. ఫిరౌన్ కి కూడా ఆ పసివాని పై అభిమానం కలిగింది. పిల్లవాడిని పెంచుకునే అనుమతి మహారాణికి ఇచ్చాడు. ఆ పిల్లవానికి "మూసా" అని పేరు పెట్టారు. మూసా అంటే నీళ్లలో నుంచి తీయబడిన (లేక) కాపాడబడినవాడు అని అర్థం.

[ ఫిరౌన్ భార్య ఆసియా అల్లాహ్ పై భక్తి కలిగిన విశ్వాసి. ఆమె ఎల్లప్పుడూ అల్లాహ్ తో తన సాఫల్యం కోసం, దుర్మార్గుడైన తన భర్త నుంచి, అతని దుర్మార్గాల నుంచి, అతనితో దుష్టుల నుంచి విముక్తి కోసం అల్లాహ్ ను ప్రార్థించేది. ]

*మూసా (అలైహి) సోదరి మర్యం ని బంధించిన రాజభటులు* 

తన తల్లి ఆజ్ఞ ప్రకారం, నదిలో వదిలిన తన సోదరున్ని గమనించుకుంటూ రాజభవనం ఆవరణం లోకి వెళ్ళింది మర్యం , తన సోదరుడు మూసా (అలైహి) ను ఫిరౌన్ దంపతులు తీసుకొనడం చూసి, ఈ విషయాన్ని తన తల్లి కి చెప్పాలని ఇంటికి తిరుగుముఖం పట్టింది.

మర్యం రాజభవన ఆవరణం వదిలి బయటకి వెళ్లేముందు ఫిరౌన్ మహామంత్రి హామాన్ మర్యంను గమనించాడు. ఆమె ను బంధించి ఫిరౌన్ వద్దకు తీసుకవేళ్ళాడు. అపుడు మర్యం చాలా భయపడింది. అయినా ధైర్యాన్ని కోల్పోకుండా చాలా నిబ్బరంగా వ్యవహరించింది. రాజభవనం లో ఏం చేస్తున్నావంటూ గుచ్చి గుచ్చి ప్రశ్నించినా, మర్యం ఒక్క మాట కూడా చెప్పలేదు.

ఈలోగా పసివాడైన మూసా (అలైహి) కు పాలు త్రాగించడానికి ఆయాలను పిలవవలసిందిగా మహారాణి ఆసియా ఆజ్ఞాపించింది. చాలా మంది ఆయాలు వచ్చారు. కానీ మూసా (అలైహి) ఎవరి వద్ద కూడా పాలు తాగడం లేదు. మహారాణి ఆసియా నిరాశగా ఇంకా ఎవరైనా ఆయాలు ఉంటే పిలుచుకరమ్మని సేవకులను పంపింది. ఇదంతా చూస్తూ అక్కడే ఉన్న మూసా (అలైహి) అక్క మర్యం ఆందోళనగా చూడసాగింది. పసివాడైనా మూసా (అలైహి) పాలు తాగి చాలా సేపయ్యింది. మహారాణి కూడా చాలా ఆందోళనగా ఆయాల కోసం సేవకులను పంపుతుండడాన్ని చూసిన మర్యం, ధైర్యం చిక్కబట్టుకొని మహారాణి తో నెమ్మదిగా "ఈ బాబుకు పాలు తాగించగలిగిన వారు ఎవరో, పిల్లవాడి పోషణభారం వహించేవారు ఎవరో, వారి ఇల్లు ఎక్కడో నేను మీకు తెలుపనా? వారు బాబు ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు కూడా" అని చెప్పింది.

అపుడు వాళ్ళు మర్యం ను "నీటిలో తేలియాడే బుట్టను అనుసరించి ఎందుకు వచ్చావు" అని నిలదీశారు. దానికి మర్యం "ఆ బుట్టలో ఏముందో చూడాలని కుతూహలంతో వచ్చాను" అని చెప్పింది. మర్యం చెప్పిన సమాధానము వారికి నమ్మశక్యంగానే కనబడింది. ఆ తర్వాత వాళ్ళు "అయితే వెంటనే వెళ్లి ఈ బాబు కు పాలుపట్టగల వారు ఎవరో తీసుకురా... వెళ్లు" అని పంపించారు.

ఇంటి వద్ద ఉన్న మూసా (అలైహి) తల్లి యుకాబిద్ హృదయం తల్లడిల్లిపోసాగింది. తీవ్రమైన దుఃఖం తో ఉంది. పసిబాబు కు ఏమైందో అన్న ఆందోళనతో ఎదురుచూస్తోంది. ఆ సమయంలో ఇంటికి తిరిగివచ్చింది కుమార్తె మర్యం. ఇంటికి వచ్చిన మర్యం తన తల్లితో , తను చూసిన విషయాలతో పాటు రాజభవనం నుంచి వచ్చిన ఆదేశాన్ని మరియ శుభవార్తను తల్లికి తెలిపింది. పిల్లవాడు క్షేమంగా ఉన్నాడు, పిల్లవానికి పాలుపట్టడానికి రాజభవనానికి రమ్మని యుకాబిద్ కి ఆదేశం వచ్చింది. యుకాబిద్ తక్షణం పరుగు పరుగున రాజభవనానికి చేరుకున్నది.

ఎవరి వద్ద పాలు తాగని ఆ పిల్లవాడు, యుకాబిద్ పాలుపట్టగానే పుష్కలంగా పాలు తాగాడు. ఇది చూసిన ఫిరౌన్ ఆశ్చర్యంగా .......

ఫిరౌన్ : - ఎందరో ఆయాలు వచ్చి పిల్లవానికి పాలు తాపేందుకు ప్రయత్నించారు. కానీ ఈ బాబు ఎవరి వద్ద పాలు తాగలేదు. నువ్వు పాలుపట్టగానే తాగుతున్నాడు. ఎవరు నువ్వు? ( అంటూ నిలదీశాడు)

(ఈ పిల్లవాడు నా కొడుకే అని యుకాబిద్ చెప్పినట్లైతే, ఫిరౌన్ కు ఆ పిల్లవాడు ఇస్రాయీల్ జాతి వాడని తెలిసేది, ఆ వెంటనే హతమార్చి ఉండేవాడు. కానీ అల్లాహ్ యుకాబిద్ కు సమాధానం ఇచ్చే స్థయిర్యాన్ని ప్రసాదించాడు.)

యుకాబిద్ : - అల్లాహ్ దయ వల్ల నా పాలు చాలా తీయగా ఉంటాయి. అందువల్ల ఏ శిశువైనా నా పాలు తాగుతాడు.

ఈ జవాబు ఫిరౌన్ కు సంతృప్తినిచ్చింది. ఆ రోజు నుంచి యుకాబిద్ ను మూసా (అలైహి) కు పాలు పట్టే ఆయాగా రాజభవనంలో నియమించడం జరిగింది. యుకాబిద్ తన పిల్లవాడిని చాలా కాలం అక్కడ కనిపెట్టుకుని ఉన్నది. పిల్లవాడు పెరిగి పెద్దయిన తర్వాత, పాలు తాగడం మానేసిన తర్వాత, అపుడపుడు వచ్చి మూసా (అలైహి) ను చూసి వెళ్లే అనుమతి యుకాబిద్ కు లభించింది. రాజభవనంలో మూసా (అలైహి) రాకుమారుని మాదిరిగా పెరిగారు.

[ అల్లాహ్ ముందుగానే పిల్లవానికి పాలుపట్టే స్త్రీల పాలిండ్లను నిషేధించారు. అందువల్ల పిల్లవాడు ఏ స్త్రీ దగ్గర పాలు తాగడానికి సిద్ధం కాలేదు. తర్వాత ఇలా అల్లాహ్ మూసా (అలైహి) ను తిరిగి తన తల్లి వద్దకు చేర్చారు. ఆమె కళ్ళు చల్లబడాలని, ఆమె దిగులుపడకూడదని. అది కాక అల్లాహ్ వాగ్దానం నిజమైన వాగ్దానం అని యుకాబిద్ తెలుసుకోవాలని అల్లాహ్ ఇలా చేశారు. కానీ చాలా మందికి ఈ సంగతి తెలియదు.
మూసా అలైహిస్సలామ్ యౌవన దశకు చేరి, పరిపూర్ణ వికాసం చెందిన తర్వాత అల్లాహ్ మూసా (అలైహి) కు జ్ఞానం, వివేకం ప్రసాదించారు. ఇలా సత్పురుషులకు అల్లాహ్ తగిన బహుమానం అందజేశారు.]

ఆ తర్వాత యాదృచ్చిక హత్య, కొన్ని కారణాల వల్ల మూసా (అలైహి) తమ రాజ్యాన్ని వదిలి పారిపోతారు. ఇందులోని వివరణను Insha Allah రేపటి భాగము - 25 లో తెలుసుకుందాము.

*ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-* 

ప్రియమైన ముస్లిం సోదరులారా!  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి , ఇదేదో 10 మందికి send చేస్తే మంచి జరుగుతుంది , send చేయకపోతే చేడు జరుగుతుంది అనుకునే msg లు కావు . కాబట్టి మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .

®@£€€q       +97433572282

No comments:

Post a Comment