42

🤚🏻✋🏻 🕌   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*   🕌 🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

                               *భాగము - 42* 

____________________________________________

*దావూద్ అలైహిస్సలామ్ పరిపాలనలో తన నిబద్ధత* 

దావూద్ (అలైహి) తన రోజువారీ కార్యక్రమాలను నాలుగు భాగాలుగా విభజించుకున్నారు.

○ తన ఉపాధి సంపాదించుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఒక భాగం కేటాయించేవారు.

○ అల్లాహ్ ను ఆరాధించడానికి ఒక భాగం కేటాయించేవారు.

○ ప్రజల సమస్యలు వినడానికి ఒక భాగం కేటాయించేవారు.

○ తన ప్రసంగాల కోసం ఒక భాగాన్ని కేటాయించేవారు.

ఈ విధంగా తన రోజువారీ కార్యక్రమాలను నాలుగు భాగాలుగా విభజించుకున్నారు.

ప్రజల ఫిర్యాదులను స్వీకరించడానికి దావూద్ (అలైహి) కొంతమంది అధికారులను కూడా నియమించారు. ఆ విధంగా తాను లేనపుడు ప్రజల సమస్యలు నిర్లక్ష్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

*దావూద్ అలైహిస్సలామ్ ను పరీక్షించిన అల్లాహ్, దావూద్ (అలైహి) పశ్చాత్తాపం* 

ఒక రోజు ఇద్దరు అన్నదమ్ములు తమ సమస్య గురించి మహారాజు దావూద్ (అలైహి) కు తెలియపరచి, సమస్యకు తగిన పరిష్కారం కోసం రాజ దర్బారులోకి ఫిర్యాదులు స్వీకరించే సమయంలో వచ్చారు. కానీ సమయం మించి పోయినందువల్ల ఆ సోదరులను రాజప్రాసాదంలోకి ప్రవేశించకుండా రాజభటులు అడ్డుకున్నారు.

ఆ తర్వాత వారిద్దరూ రాజప్రాసాదం చుట్టూ తిరిగారు. ఒక చోట ఎక్కడానికి వీలుగా ఉన్న ప్రహరీ గోడ ఎక్కి, రాజమందిరం లోకి అక్రమంగా చొరబడి, రాజుగారి అంతరంగిక గదిలోకి ప్రవేశించారు. ఆ అపరిచితులు తన గదిలోకి రావడం చూసి దావూద్ (అలైహి) కంగారుపడ్డారు. తనకు హాని కలిగించడానికి వచ్చిన వారని భావించారు. కానీ అంత అత్యవసరంగా వారు ఎందుకు వచ్చారో తెలిసిన తర్వాత దావూద్ (అలైహి) కు నెమ్మది కలిగింది. అపుడు వారు దావూద్ (అలైహి) తో సంభాషిస్తూ....,

సోదరులలోని ఒకడు : - మహారాజా! భయపడకండి. మిమ్మల్ని హాని కలిగించడానికి మేము ఇక్కడికి రాలేదు. మేమిద్దరం ఒక వ్యాజ్యానికి సంబంధించిన వాది మరియు ప్రతివాదులం. మాలో ఒకడు రెండవవాడి పై అన్యాయానికి పాల్పడ్డాడు. మేమిద్దరం ఒక ఫిర్యాదును మీ వద్దకు తీసుకవచ్చాము. మా మధ్య ఒక వివాదం ఉంది. ఆ సమస్యకు తగిన పరిష్కారం మీ వద్దనే లభిస్తుందని మేము భావిస్తున్నాము. మీరు మా ఇద్దరి గురించి న్యాయంగా తీర్పు ఇవ్వండి. అన్యాయం చేయకండి. మాకు సరైన మార్గం చూపండి.

రెండవవాడు : - ఇతను నా సోదరుడు. ఇతనికి తొంభైతొమ్మిది గొర్రెలు ఉన్నాయి. నా వద్ద కేవలం ఒకే ఒక గొర్రె ఉంది. ఇతను నాకు మాయ మాటలు చెప్పి నా ఒకే ఒక్క గొర్రెను కూడా తనకు ఇవ్వమంటున్నాడు. దయచేసి న్యాయనిర్ణేయతలైన మీరే దీనికి తీర్పు ఇవ్వాలి.

దావూద్ (అలైహి) : - నీ సోదరుని వద్ద చాలా గొర్రెలు ఉన్నప్పటికీ, నీ వద్ద ఉన్న ఒక్క గొర్రె ని తన గొర్రెల్లో కలుపుకుంటాను అని అడిగి నీకు చాలా అన్యాయం చేశాడు. కలిమెలిసి పని చేసేవాళ్ళు సాధారణంగా ఒకరికొకరు అన్యాయానికి పాల్పడతారు. కానీ సత్యాన్ని విశ్వసించి సత్కార్యాలు చేసే వారు, అల్లాహ్ పట్ల విశ్వాసం కలిగినవారు, మంచి పనులు చేసేవారు తప్ప. కానీ అలాంటి నిజాయితీపరులు లోకంలో బహుకొద్దిమంది మాత్రమే ఉంటారు.

ఈ మాటలు చెప్పిన వెంటనే దావూద్ (అలైహి) కు, తను చెప్పిన మాటల్లోని తప్పు గుర్తుకువచ్చింది. దావూద్ (అలైహి) రెండవవాని కథనం వినకముందే తన తీర్పు చెప్పేశారు. తన తీర్పును ఇలా వెల్లడిస్తున్నపుడే, అల్లాహ్ తనని పరిక్షిస్తున్నాడని దావూద్ (అలైహి) గ్రహించారు.

ఆ వెంటనే ఆయన అల్లాహ్ ముందు సాష్టాంగపడి క్షమాపణ వేడుకున్నారు. అల్లాహ్ దావూద్ (అలైహి) తప్పును క్షమించారు. విధి బాధ్యతల నిర్వహణలో ఆయనకు మార్గదర్శనాన్ని ప్రసాదించాడు. అల్లాహ్ గొప్ప క్షమాశీలి, అమిత కరుణామయుడు.

_[నిశ్చయంగా దావూద్ (అలైహి) అన్ని విషయాల్లోనూ మరియు అల్లాహ్ వైపు పశ్చాత్తాప పడుతూ ఉంటాడు.]_ 

*గ్రహించవలసిన పాఠాలు : -* 

»----› దావూద్ (అలైహి) అల్లాహ్ కు చాలా భయపడేవారు. రాజుగా ఉన్నప్పటికీ, ప్రజా ఖజానా సొమ్ము వాడుకునే హక్కు తనకు ఉన్నప్పటికీ తన స్వంత సంపాదనతోనే జీవించేవారు.

»----› (మార్పు చేర్పులకు గురైన) బైబిల్ ప్రకారం, దావీదు తన సైన్యాధికారుల్లో ఉరైహ్ అనే సైన్యాధికారి భార్యను ప్రేమించారు. ఫలితంగా ఆమె గర్భవతి అయ్యింది. దావీదు, ఉరైహ్ ని ఒక ప్రమాదకరమైన యుద్ధ మైదానానికి పంపించి వేశారు. ఆ యుద్ధ మైదానంలో ఉరైహ్ చంపబడతాడని భావించారు. అపుడు ఆ సైన్యాధికారి భార్యను తాను వివాహం చేసుకోవచ్చు అనుకున్నారు. కానీ, ఈ కథనం చాలా వక్రీకరణతో, బురదజల్లే కథనంలా ఉంది. బైబిల్ లో అనేక మంది ఇతర ప్రవక్తల గురించి కూడా ఇలాంటి బురదజల్లే కథనాలు ఉన్నాయి. ఈ విధంగా అక్రమ సంబంధాలు, అమాయకుడిని హతమార్చే కుట్రలు ఒక దైవప్రవక్తకు అంతగట్టడం దారుణం.

»----› దావూద్ (అలైహి)కు, ఆయన ప్రయోజనం కోసం అల్లాహ్ యుద్ధ కవచాలను తయారు చేసే విధానం నేర్పించారు. ఆ కవచాలతో ఇస్రాయీల్ సైన్యం ఒకరి దాడి తో మరొకరు కాపాడుకోవడానికి, శత్రు సైన్యం నుంచి తమ ను కాపాడుకోవడానికి.

»----› ఇనుముతో చేసిన కవచాలను తయారుచేయాలని అల్లహ్ దావూద్ (అలైహి) కు ఆదేశించారు.

»----› లోహ యుగం క్రీ.పూ. 1200-1000 సం" మధ్య కాలం లో ప్రారంభమైనట్లు చరిత్రకారులు నిర్ధారించారు. ఈ కాలమే దావూద్ (అలైహి) దైవప్రవక్తగా ప్రభవించిన కాలం.

»----› ఈ పుడమి పై ఇనుమును తయారుచేసిన మొట్టమొదటి వ్యక్తి దావూద్ (అలైహి).

»----› ఖురాన్ ఆయత్ లను బట్టి అల్లాహ్ దావూద్ (అలైహి) కు, ఇనుప ఖనిజం నుంచి స్వచ్ఛమైన ఇనుము, ఉక్కు తీసేవిధానాన్ని నేర్పించాడని తెలుస్తోంది.

Insha Allah రేపటి భాగము - 43 లో, దావూద్ అలైహిస్సలామ్ కుమారుడు సులైమాన్ అలైహిస్సలామ్ గురించి తెలుసుకుందాము.

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి, మన ముస్లిం సోదరులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

☆☆   ®@£€€q +97433572282 ☆☆

No comments:

Post a Comment