5

🕋🕋🕋🕋 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕋🕋🕋🕋

🛐🛐🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన *అల్లాహ్* పేరుతో ప్రారంభిస్తున్నాను 🛐🛐🛐🛐

------------------------------------------------

       ☪☪☪☪ *ఇస్లాం చరిత్ర* ☪☪☪☪

    భాగము - 5          Date : 15/11/2017

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఇబ్రహీం తో వాదన లో పూర్తిగా ఓడిపోయిన ఆ జనం పరస్పరం సంప్రదించుకొని ఇబ్రహీం కోసం ఓ అగ్ని గుండం తయారు చేసి మండే ఆ అగ్ని గుండంలో ఇబ్రహీం ని విసిరేయాలని నిర్ణయించుకున్నారు. ( ఖురాన్ 37:97 ).

వారు పెద్ద పెద్ద దుంగలను జమ చేసి, భయంకరమైన మంటను
రాజేశారు. దాని అగ్ని జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయా
అనిపించేంత ఎత్తుకు ఎగిసినాయి. మంటలు బాగా అంటుకున్న తర్వాత, వారు ఇబ్రహీమ్ అలైహిస్సలామ్ ని ఆ మంటలో పడవేశారు. ఆ మంటల్లో ఉన్న ఇబ్రహీం ఇలా పలికారు “ హస్బి అల్లాహు వ నేమల్ వకీల్ ( నా కొరకు అల్లాహ్ చాలు మరియు ఆయన విషయాలను చక్కబెట్టడంలొ సాటి లేనివాడు ). ” అపుడు అల్లాహ్ ఆయనను కాపాడినాడు , అప్పుడు అల్లాహ్ " " అగ్ని " ఇబ్రహీం కోసం శాంతించు, చల్లబడిపో "  అని ఆదేశించారు. అలా ఆ అవిశ్వాసుల పన్నాగాన్ని నిర్వీర్యం చేశాడు అల్లాహ్.( ఖురాన్ 21:69,70 ).

*రాజు తో భేటి* 

"ఉర్" ఇబ్రహీం అలైహిస్సలామ్ పుట్టి పెరిగిన పట్టణం. ఈ పట్టణం ఆనాటి రాజు నమ్రూద్ పాలించిన రాజ్యానికి ( ప్రస్తుత ఇరాఖ్ ) రాజధానిగా గా ఉండేది. అగ్ని పరీక్ష తర్వాత ఆ రాజు ఇబ్రహీం తో మాట్లాడాలని, ఇబ్రహీం ని పిలిపించారు. తర్వాత రాజు ఇలా అన్నాడు;

రాజు :- అల్లాహ్ విషయం లో వాదనకు దిగిన వ్యక్తి గురించి నీవు ఆలోచించావా ! దేవుడు అతనికి రాజ్యాధికారం ప్రసాదించాడు. అందుచేత అతను అధికార గర్వంతో విర్రవీగుతూ అల్లాహ్ విషయం లో వాదనకు దిగాడు.

ఇబ్రహీం :- ఎవరి అధీనం లో జీవన్మరణాలున్నాయో ఆయనే నా ప్రభువు.

రాజు :- చావు బ్రతుకులు నా ఆధీనంలో కూడా ఉన్నాయి.

ఇబ్రహీం :- అలాగనా ! అయితే అల్లాహ్ సూర్యుడ్ని తూర్పు నుండి ఉదయింపజేన్తున్నాడు కదా, నీవు సూర్యున్ని పడమర నుండి ఉదయింపజెయ్యి చూద్దాం.

దానికి ఆ తిరస్కారి సమాధానం ఇవ్వలేక తెల్లమొహం వేశాడు. అల్లాహ్ దుర్మార్గులకు ఎన్నటికీ సన్మార్గం చూపడు. ( ఖురాన్-2:258 ).

*పునర్జీవ పరీక్ష :-* 

ఇబ్రహీం : - ఓ ప్రభూ ! నీవు మృతులను ఎలా బ్రతికిస్తావో కాస్త నాకు చూపవా ?

అల్లాహ్ : - నీకు నమ్మకం లేదా !

ఇబ్రహీం : - ఎందుకులేదు ! నాకు పూర్తి నమ్మకం ఉంది. కాకపోతే ఆత్మ తృప్తికై ఇలా అడిగాను .

అల్లాహ్‌ : - నాలుగు పక్షులను తీసుకోని, వాటిని మచ్చిక చేసుకో. ఆ తర్వాత వాటిని కోసి ముక్కలు ముక్కలుగా చెయ్యి. తరువాత ఒక్కో పర్వతంపై దాని ఒక్కో మాంసపు ముక్కను ఉంచి, నువ్వు కిందకి వచ్చేసి ఆపైన ఆ పక్షులను పిలువు. అవి నీవద్దకు పరుగెత్తుకుంటూ వస్తాయి.

"అల్లాహ్‌ సర్వశక్తిమంతుడు, వివేకవంతుడన్న సంగతిని బాగా తెలుసుకో'' అని అన్నాడు అల్లాహ్. (ఖురాన్ 2:260).

*అగ్ని పరీక్ష తర్వాత* 

అగ్ని నుండి ఇబ్రహీమ్ అలైహిస్సలాం ను కాపాడిన తర్వాత, మెసపుటోమియాను విడిచి పెట్టి, ఫలస్తీనా లోని పవిత్ర స్ధలం వైపుకు వలస వెళ్ళమని ఇబ్రహీమ్ అలైహిస్సలాం ను అల్లాహ్ ఆఙ్ఞాపించాడు.

ఆయన తన పినతండ్రి కుమార్తె అయిన ‘సారహ్’ ను పెళ్ళాడినారు. ఆమెను మరియు తన సోదరుని కుమారుడైన లూత్ అలైహిస్సలాం ను వెంటబెట్టుకుని, షామ్ ( సిరియా, జోర్డాన్, ఫలస్తీనా, లెబనాన్ మొద" ) వైపు నకు ప్రయాణించారు. “ మేము ఇబ్రహీం ను, లూత్ అలైహిస్సలామ్ ను కాపాడి, లోకవాసుల కొసం శుభాలను పొందు పరిచిన భూభాగం వైపుకు తీసుకువెళ్ళాము. ( ఖురాన్ 21:71 ).

అపుడు షామ్ దేశం గడ్డ పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండటం వలన, ఆయన తన భార్య " సారహ్ " తో కలిసి ఈజిప్టుకు చేరుకున్నారు. కొన్నాళ్లకు ఆయన తన భార్యతో మరియు తన భార్యకు బానిసగా లభించిన ‘హాజరా’ అనే బానిసతో ఫలస్తీనా మరలివచ్చారు.

సంతానం కోసం ఇబ్రహీం అలైహిస్సలామ్ ఎంతో కృషి చేశారు. కానీ భార్య గొడ్డుతనం మరియు ముసలితనం వలన ఆయనకు పిల్లలు కలుగలేదు. సంతానం కొరకు తన భర్త చూపుతున్న ఆసక్తిని గమనించిన తర్వాత, తన బానిస హాజరాను ఆమె తన భర్తకు ఇచ్చి పెళ్లి చేసింది సారహ్.

ఇబ్రహీం నీ అల్లాహ్ కొన్ని విషయాల్లో ఇబ్రహీం ని పరీక్షించగా అందులో అతను కృతార్ధుడయ్యాడు. అప్పుడు అల్లాహ్ అతనితో " నేను నిన్ను యావత్తు మానవజాతికి నాయకుడిగా నియమించబోతున్నాను " అన్నాడు. దానికి ఇబ్రహీం " ప్రభూ ! మరి నా స౦తాన౦లో కూడా ఎవరికైనా ప్రపంచ నాయకత్వం ప్రసాదిస్తావా ? "అని అడిగాడు. దానికి అల్లాహ్ " అలాగే మాటిస్తున్నాను , నీ సంతానం సన్మార్గం లో ఉంటే మా ఈ వాగ్దానం వర్తిస్తుంది , దుర్మార్గం లో ఉంటే వర్తించదు అన్నాడు. ” (ఖురాన్-2:124).

ప్రభూ ! నాకు ఒక సద్గుణ సంపన్నుడైన కుమారుడ్ని ప్రసాదించు అని అల్లాహ్ ని వేడుకున్నాడు ఇబ్రహీం. మేము అతనికి సహనశీలుడైన ఒక పిల్లవాడు ఇస్మాయిల్ కలుగుతాడని శుభవార్త తెలియజేశాము. (ఖురాన్ 37:99-101).

*సంతాన శుభవార్త ను తెచ్చిన దైవ దూతలు* 

ఇక పోతే ఇబ్రహీం దగ్గరకు మా దూతలు సంతాన శుభవార్త తీసుక వెళ్లారు.

దైవ దూతలు :- మీకు శాంతి శ్రేయాలు కలుగుగాక.

ఇబ్రహీం :- మీకు కూడా శాంతి శ్రేయాలు కలుగుగాక.

ఆ తర్వాత కాసేపటికి ఇబ్రహీం అతిథు ల కోసం ఆవుదూడను కాల్చి తెచ్చి, వారికి భోజనం వడ్డించారు, కాని వారి చేతులు భోజనం మీదికి పోవడంలేదు. దాంతో అనుమానం ఇబ్రహీం లోలోన భయపడసాగాడు. దానికి దైవ దూతలు ‘భయపడకు...’ ( ఖురాన్ 11:69,70).

"మేము ఒక నేరజాతి దగ్గరకు పంపబడ్డాము. ఒక్క లూత్ కుటుంబానికి మాత్రమే మినహాయింపు ఉంది. వారిని మేము కాపాడుతాం, అయితే అతని భార్యను మాత్రం కాపాడము. ఆమె వెనుక ఉండిపోయేవారిలో చేరిపోతుందని మేము ముందుగానే నిర్ణయించాం" అన్నారు దైవదూతలు. (ఖురాన్ 15:58-60).

ఆ తర్వాత ఇబ్రహీం " ఓ నా ప్రభూ! నాకు గుణవంతుడైన కుమారుణ్ణి ప్రసాదించు "అని ప్రార్థించాడు. అందువలన మేము ( అల్లాహ్ ) అతనికి సహనశీలుడైన ఒక పసిబిడ్ద గురించిన శుభవార్తను దైవదూతల ద్వారా అందజేశాము. ( ఖురాన్ 37:100-101 ).

ఆ తర్వాత కొన్నాళ్ళకు హాజరాకు పండంటి మగబిడ్డ ఇస్మాయిల్ జన్మించాడు. ఇస్మాయిల్ జన్మించిన తర్వాత సారహ్ లో అసూయాగ్ని రగులుకోవటం మొదలైంది. హాజరాను, ఇస్మాయిల్ ను తన నుండి దూరంగా పంపించి వేయమని ఇబ్రహీం ను కోరింది. అపుడు హాజరాను మరియు పసిబిడ్డ ఇస్మాయిల్ ను తీసుకుని, మక్కాలో వదిలి పెట్టమని అల్లాహ్ ఇబ్రహీం అలైహిస్సలాం ను ఆదేశించాడు.

ఆ కాలంలొ మక్కా ప్రాంతంలో నీళ్ళు కూడా దొరకని, జనసంచారం లేని ఒక నిర్మానుష్య ప్రాంతంగా ఉండేది. ఇబ్రహీం అల్లాహ్ ఆజ్ఞను అనుసరించి, హాజరాను మరియు ఇస్మాయిల్ ను తీసుకుని మక్కా ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వారిని వదిలి పెట్టి, రెండు అడుగులు వెనక్కి వేసి ఫలస్తీనా వైపుకు తిరుగు ప్రయాణం మొదలు పెట్టారు. అపుడు హాజరా ఆయనతో “ ఎవరి కోసం మమ్మల్ని ఈ నిర్మానుష్య లోయలో ఒంటరిగా వదిలివెళుతున్నారు?  అని ప్రశ్నించసాగింది. కానీ ఇబ్రహీం అలైహిస్సలాం ఏమీ జవాబివ్వకుండా నిశ్శబ్దం గా ఉండిపోయారు. అపుడు హాజరా “ ఇలా చేయమని అల్లాహ్ మిమ్మల్ని ఆజ్ఞాపించాడా ? ” అని అడుగగా , “అవును ” అని ఆయన జవాబిచ్చారు.

అపుడు హాజరా “ అలా అయితే మాకేమీ హాని కలుగకుండా అల్లాహ్ యే చూసుకుంటాడు ” అని పలికింది. తన ప్రభువు ఆజ్ఞకు ఇబ్రహీం అలైహిస్సలామ్ సమర్పించుకున్నారు.

తన భార్య మరియు లేక లేక కలిగిన పసిబిడ్డ దూరమవటాన్ని ఎంతో సహనంతో ఓర్చుకున్నారు. కొంత దూరం వచ్చిన తర్వాత ఆయన హాజరా , ఇస్మాయిల్ ను వదిలి పెట్టిన లోయ వైపు కు తిరిగి ( నేటి కాబా గృహం వైపు తిరిగి ) అల్లాహ్ ను ఇబ్రహీం ఇలా వేడుకున్నాడు " ప్రభూ! ఈ మక్కా నగరాన్ని శాంతి నగరంగా చెయ్యి. నన్ను, నా సంతానాన్ని విగ్రహారాధన నుండి కాపాడు. ప్రభూ ! ఈ విగ్రహాలు అనేకమందిని దారి తప్పించాయి. నా సంతానాన్ని కూడా దారి తప్పించే ప్రమాదముంది. కనుక వారిలో నా విధానాన్ని అనుసరించే వారు నా వారవుతారు. నా విధానానికి వ్యతిరేకంగా నడిచేవారికి నీవే దిక్కు. నీవు క్షమించేవాడవు, కరుణించేవాడవు. (ఖురాన్14:35,36).

“ ప్రభూ ! నేను నా సంతానాన్ని ఎలాంటి చెట్టూ , పుట్టా లేని ఎడారి ప్రాంతంలోకి తీసుకొచ్చి వశింపజేశాను, భవిష్యత్తులో వీరిక్కడ నమాజు వ్యవస్థ ను నెలకొల్పుతారన్న ఆశతో వదిలి వెళ్తున్నాను. కనుక వీరిపట్ల నీవు ప్రజల హృదయాల్లో ఆసక్తి అభిమానాలు కలిగించు. వీరికి తినడానికి పండ్లు, ఫలాలు ప్రసాదించు, బహుశా అందుకు వీరు నీకు కృతజ్ఞులై ఉంటారు. ప్రభూ ! మేము దాస్తున్నది, బహిర్గతం చేస్తున్నది అంతా నీకు తెలుసు. అల్లాహ్ కు భూమి , ఆకాశాలతో ఏదీ కనుమరుగుగా లేదు. (ఖురాన్ 14:37,38 ).

ఇబ్రహీమ్ అలైహిస్సలాం తమ కొరకు వదిలి పెట్టి వెళ్ళిన అన్నపానీయాలు సేవిస్తూ హాజరా, ఇస్మాయిల్ మక్కా లోయలో నివసించసాగారు. కొన్నాళ్ళకు వారి దగ్గర ఉన్న నీళ్లు అయిపోయాయి. దాహం తో ఆమె మరియు ఆమె పసిబిడ్డ ఇస్మాయిల్ తపించసాగారు. అపుడు ఆమె నీటి  కోసం వెతకడం ప్రారంభించింది. ఇస్మాయిల్ ను లోయలో పడుకోబెట్టి ఇరువైపులా ఉన్న సఫా మరియు మర్వా కొండలపై ఎక్కి కనుచూపు మేర నీటి కోసం చూసింది. అయితే, ఆమెకు నీటి అనవాళ్ళేమీ ఆ దరిదాపులలో కనబడలేదు. అలా ఆమె ఏడు సార్లు సఫా మరియు మర్వా కొండలపై ఎక్కి నీటి కోసం అన్వేషించింది. అపుడు నిస్పృహ తో ఇస్మాయిల్ వైపు తిరిగి చూడగా, ఆయన పాదాల క్రింద వేగంతో సాగుతున్న నీటి ఊట ఆమె కళ్ళబడింది. ఎంతో సంతోషంతో తను కొంత నీరు త్రాగి, తన పసిబిడ్దకు కూడా త్రాగించింది. ఆ తర్వాత నీటి ఆనవాళ్ళ కనిబెట్టి జుర్హుమ్ అనే తెగ అక్కడకు చేరుకుని, తాము కూడా ఆ నీటి ప్రవాహం ప్రక్కనే నివసించేందుకు ఆమె అనుమతి కోరింది, ( ఈ నీటి ఊట ఇప్పటివరకు ఇలానే ఉంది , ఈ నీటినే జమ్ జమ్ నీరు అంటారు ) ఆమె అనుమతితో వారు కూడా అక్కడ నివసించసాగారు, ఆ తెగ వారి నుండి హాజరా మరియు ఇస్మాయిల్ అరబీ భాష నేర్చుకున్నారు.

అపుడపుడు ఇబ్రహీమ్ అలైహిస్సలాం అక్కడికి వచ్చి, తన కుమారుడిని, భార్య ని చూసుకునేవారు. ఒకసారి అలా వచ్చినపుడు, ఇబ్రహీమ్ అలైహిస్సలాం కు ఒక కల వచ్చింది. దానిలో ఆయన తన  కుమారుడైన ఇస్మాయీల్ ను బలివ్వమని అల్లాహ్ తనను ఆజ్ఞాపించినట్లుగా ఆయన చూశారు. 

ప్రవక్తల స్వప్నాలు నిజ స్వప్నాలై ఉంటాయి. కాబట్టి, అప్పటికే తను ముసలివాడై చావుకు దగ్గరలొ ఉన్నా మరియు ఇస్మాయీల్ తన ఏకైక సంతానమై ఉన్నా కూడా, ఆయన అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించి , తన కుమారున్ని బలివ్వాలని నిర్ణయించుకున్నారు.

తరువాత జరిగిన విషయమై Insha Allah రేపటి భాగము - 6 లో తెలుసుకుందాము.

ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-

ప్రియమైన ముస్లిం సోదరులారా!  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి , ఇదేదో 10 మందికి send చేస్తే మంచి జరుగుతుంది , send చేయకపోతే చేడు జరుగుతుంది అనుకునే msg లు కావు . కాబట్టి మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .

No comments:

Post a Comment