73

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము - 73* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

*ప్రవక్త ఈసా (అలైహి) ను చంపడానికి కుట్ర పన్నిన యూద మతపెద్దలు : - - : అబద్ధపు ఆరోపణలు* 

యూద మతపెద్దల వాదనలను తప్పుగా నిరూపిస్తూ, సత్యం ఏదో! అసత్యం ఏదో! తేటతెల్లం చేస్తుండటంతో ఈసా (అలైహి), ఆ యూద మతపెద్దలకు కంటగింపయ్యారు. ఈసా (అలైహి) పట్ల వారు వైరం పెంచుకున్నారు. ఆయన వాదనలకు వ్యతిరేకంగా యూద మతపెద్దలు సమర్థవంతంగా వాదించలేకపోయారు. అందువల్ల ఈసా (అలైహి) ను ఒక మోసగానిగా, ఒక అబద్ధాలకోరుగా ప్రచారం చేయడం ప్రారంభించారు. ప్రవక్త ఈసా (అలైహి) ప్రదర్శించిన అనేక మహత్యాలను చూసిన తర్వాత కూడా యూదులు తమ వైఖరిని మార్చుకోలేదు. మోసాలకు, ద్రోహాలకు పూనుకున్నారు. తమ మార్గంకు అడ్డువస్తున్న ఈసా (అలైహి) ను చంపేయాలని యూద మతపెద్దలు భావించారు.

అపుడు ఆ యూద మతపెద్దలు, ఆ ప్రాంతం పాలకుని వద్ద ఈసా (అలైహి) కు వ్యతిరేకంగా ఒక తప్పుడు ఫిర్యాదు నమోదు చేశారు. అప్పట్లో అక్కడ రోమన్ ప్రభుత్వం పాలిస్తోంది. ఆ మహనీయుడిని చంపడానికి రకరకాల కుట్రలు పన్నారు. ఆనాడు సిరియా రాజ్యపరిధిలో ఒక భూభాగంగా ఉండిన పాలస్తీనా, రోమ్ చక్రవర్తి పాలనలో ఉండేది. ఆ రోమ్‌ చక్రవర్తి, ఆయన జాతీయులంతా ఆనాడు బహుదైవారాధకులుగా ఉండేవారు. అయితే, యూదులు తమ జాతికి చెందిన ప్రవక్త ఈసా (అలైహి) ను తమ మార్గం నుండి తొలగించుకోవడానికి రోమ్ చక్రవర్తికి లేనిపోని మాటలు కల్పించి చెప్పారు.

"ఈసా (అలైహి) ప్రజలను రెచ్చగొడుతున్నారు, విదేశి పాలకులపై తిరగబడేలా చేస్తున్నారు, ఈసా (అలైహి) చర్యలు యూద ధర్మంపై తిరుగుబాటుకు దారితీస్తున్నాయి. ఈసా (అలైహి) ఒక మంత్రగాడు. అనేక మంత్రతంత్రాలు చేస్తున్నాడు. ఆయన తండ్రి లేనివాడు (అనగా అక్రమ సంబంధానికి పుట్టినవాడు), కల్లోలకారకుడు. " అని ఆ రోమ్ చక్రవర్తి వద్దకు యూద మతపెద్దలు వెళ్ళి ఫిర్యాదు చేశారు.

పిలాతిస్ న్యాయస్థానం నుండి అసత్యసాక్షుల్ని తెచ్చి, ఈ వ్యవహారాన్ని రోమ్ చక్రవర్తి ముందుంచారు. రోమన్ పాలకులను కూడా ఈ పరిణామాలు కలవరానికి గురిచేశాయి. ప్రజల్లో సమానత్వం వంటి విప్లవాత్మక భావాలు వ్యాపించడాన్ని వాళ్ళు కూడా సహించలేరు.

పుణ్యపురుషుడైన ఈసా (అలైహి) కు మరణశిక్ష విధించడం రోమ్ చక్రవర్తికి ఏ మాత్రం ఇష్టంలేదు. అందువల్ల ఆ రోమ్ చక్రవర్తి, మొదట ఈ మరణశిక్షను వ్యతిరేకించాడు. కాని నక్కజిత్తుల యూదులు, తమ నిర్ణయాన్ని అమలుజరపకపోతే దేశంలో అంతర్ యుద్ధం జరుగుతుందని బెదిరించారు. అందువల్ల రోమ్‌ చక్రవర్తి, ఆ యూదుల ఒత్తిడికి లొంగిపోయాడు. చివరకు ఈసా (అలైహి) ను నిర్బంధించడానికి రోమ్ చక్రవర్తి అంగీకరించారు.

రోమ్ న్యాయాధిపతి యూదుల్ని సంబోధిస్తూ...., “మేము మీ కోరికపై ఈసా (అలైహి) కు మరణశిక్ష విధిస్తున్నాము. కానీ, ఏ పాపం ఎరుగని ఈ మానవోత్తముడి హత్యాబాధ్యత మాపై ఎంతమాత్రం లేదు." అని అన్నాడు.

ఈ మాటలు పలికిన ఆ న్యాయాధిపతి, ఆ నిండుసభలో నీళ్ళు తెప్పించి చేతులు కడుక్కొని ఈసా (అలైహి) వధకు సంబంధించిన అనుమతి పత్రం యూదులకు ఇచ్చివేశాడు.

ఆ వెంటనే యూదులు కొందరు రోమ్ సైనికుల్ని వెంటబెట్టుకొని హజ్రత్ ఈసా (అలైహి) ను వెతకడం ప్రారంభించారు. కానీ ప్రవక్త ఈసా (అలైహి) వారికి ఎక్కడ కూడా కనపడలేదు. ఈసా (అలైహి), దైవసందేశాన్ని ప్రచారం చేస్తూ దూరప్రదేశాల్లో తిరుగుతున్నారు. పరిస్థితులకు అనుగుణంగా బహిరంగంగా లేదా రహస్యంగా ఆయన ప్రచారం కొనసాగుతోంది. 

ఆ పిదప ఆయన ఆచూకీ తెలిసిన తర్వాత, ఈసా (అలైహి) విడిదిచేసిన తాత్కాలిక ఆశ్రమంలోకి యూదులు, రోమన్ సైనికులు జొరబడ్డారు. అయితే వారు లోపల చొరబడక ముందే ఈసా (అలైహి) అల్లాహ్ ని ప్రార్థించారు. అపుడు అల్లాహ్....,

అల్లాహ్ : - ఓ ఈసా! నేను నిన్ను యూదుల కుట్ర నుంచి కాపాడి, నిన్ను పూర్తిగా నా వైపుకు, ఆకాశాల పైకి ఎత్తుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ ప్రపంచంలోకి దింపినప్పుడు నీకు మరణం ఇస్తాను. ఇప్పుడు యూదుల చేతుల్లో నీకు మరణం రాదు. నీవు సహజమైన మరణమే మరణిస్తావు.

ఆ తర్వాత అల్లాహ్, ఈసా (అలైహి) ను సజీవంగా, సశరీరంగా ఆకాశం పైకి ఎత్తుకోవడం జరిగిపోయాయి. అపుడు అల్లాహ్, ప్రవక్త ఈసా (అలైహి) ను అక్కడ సైనికులకు ఎవరికీ కనపడకుండా అదృశ్యమయ్యేలా చేశారు.

ఆ తర్వాత ఆశ్రమంలోకి యూదులు, రోమ్‌ సైనికులు జొరబడ్డారు. వారిలోనే సైమన్ అనే ఒక వ్యక్తికి అల్లాహ్ ఈసా (అలైహి) రూపం కల్పించారు. ఈసా (అలైహి) ఆకారంలో ఉన్న సైమన్ ని చూసిన యూదులు, అతడే ఈసా (అలైహి) అనుకోని, అతడిని పట్టుకెళ్ళి శిలువ ఎక్కించారు.

తాము ఈసా (అలైహి) ని చంపి, శిలువపైకి ఎక్కించామని యూదులు తలపోశారు. ఈ విధంగా సైమన్ అనే ఆ వ్యక్తిని చంపిన యూదులు, సిగ్గు ఎగ్గూ లేకుండా “మేము దైవప్రవక్త మసీహ్ ఇబ్నె మర్యంని సంహరించాం.” అని మహాగర్వంగా చెప్పుకున్నారు.

ఈ సంఘటన జరిగిన అనేక సంవత్సరాలకు ఈసా (అలైహి) ను విశ్వసించి క్రైస్తవులైనవారు దీన్ని గురించి ఎన్నో భేదాభిప్రాయాలకు గురయ్యారు. 

Insha Allah వీటి గురించి రేపటి భాగము - 74 లో తెలుసుకుందాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment