85

🛐 🕋 ☪     *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*     ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

          🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                   *భాగము - 85* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

*ప్రవక్త మహమ్మద్ ( సల్లల్లాహు అలైహి వసల్లం) గారి పుట్టుక (జీవితం) గురించి తెలియజేయక ముందే వారి ఆఖరి ఘడియలలో  ఎలా ఉన్నారో మీ ముందుకు తీసుకురావడానికి ముఖ్య కారణం ఏమిటంటే ,👇*

*1.ఆయన ప్రవక్తల్లో కెల్లా గొప్ప ప్రవక్త అయినప్పటికీ ప్రాణం తోడే ఈ బాధను సులభతరం చెయ్యమని ప్రార్తించారు.*

*2.ప్రాణం పోతున్న సమయంలో సైతం నమాజు పట్ల ఎంతో శ్రద్ద చూపారు.*

↓     ↓ ↓     ↓

 *ముహమ్మద్ (సల్లం) మరణానికి ఒక రోజు ముందు : -* 

మరణానికి ఒక రోజు ముందు ఆదివారంనాడు దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) తన దగ్గర ఉన్న బానిసలందరిని స్వతంత్రులుగా చేశారు. తన ఆయుధాలను ముస్లిములకు ఇచ్చేశారు. ఆ రాత్రి దీపం వెలిగించడానికి హజ్రత్ ఆయిషా (రజి) తన పొరుగున ఉన్న స్త్రీ దగ్గర నుండి నూనెను అరువుగా తీసుకున్నారు. ముహమ్మద్ (సల్లం) యొక్క జిరాహ్ (కవచం), ఓ యూదుని వద్ద ముప్పై సాఆల ఓట్ల (అంటే 75 కిలోల ఓట్లు) క్రింద తాకట్టులో ఉంది.

దైవప్రవక్త (సల్లం) దగ్గర ఏడు దీనార్లు బైతుల్ మాల్ (ప్రజాధనాగారం) లో ఉన్నాయి. అవి గుర్తుకువచ్చి తాను చనిపోతే ఈ డబ్బు తన దగ్గరే ఉండిపోతుందేమోనని ఆయన భయపడ్డారు. తక్షణమే దైవప్రవక్త (సల్లం) ఆ డబ్బు నిరుపేదలకు దానం చేయాలని ఆయిషా (రజి) ను ఆదేశించారు.

ముహమ్మద్ (సల్లం) గారి కూతురు హజ్రత్ ఫాతిమా (రజి), తన తండ్రి అనారోగ్యం పాలయిన దగ్గర్నుంచి ఆమె రోజూ ఆయనను చూడటానికి వస్తుండేవారు. కూతుర్ని చూడగానే దైవప్రవక్త (సల్లం) లేచి ఆమెకు ఎదురుపోయి ఆమె పై ప్రేమామృతం కురిపించేవారు. ఆ తరువాత పడకపై తన పక్కన కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్పేవారు.

ప్రొద్దు ఎక్కిన తర్వాత (చాష్త్ సమయం) ముహమ్మద్ (సల్లం), తన ముద్దుల పట్టి ఫాతిమా (రజి) ను పిలువనంపారు. హజ్రత్ ఫాతిమా (రజి) పరామర్శించడానికి తన తండ్రి ఇంటికి వచ్చారు. ముహమ్మద్ (సల్లం) కూతుర్ని చూసి లేవలేకపోయారు. అప్పుడు స్వయంగా ఫాతిమా (రజి)యే తండ్రి దగ్గరికెళ్ళి, ఆయన నుదుటి పై ముద్దాడి పక్కన కూర్చున్నారు. 

ఆ రోజు ఆ తండ్రికూతుళ్ళు ఎన్నెన్నో కబుర్లు చెప్పుకున్నారు. మాటల ముహమ్మద్ (సల్లం) కూతురి చెవిలో ఏదో గుసగుసలాడారు. అది విని హజ్రత్ ఫాతిమా (రజి) భోరున ఏడవడం ప్రారంభించారు . అది చూసిన ముహమ్మద్ (సల్లం), తిరిగి ఆమెను పిలిచి చెవిలో ఏదో రహస్యంగా మళ్ళీ చెప్పారు. ఆ మాట విని హజ్రత్ ఫాతిమా (రజి) నవ్వడం ప్రారంభించారు.

ఆ సమయంలో అక్కడే ఈ సన్నివేశం చూసిన హజ్రత్ ఆయిషా (రజి) కు విషయం ఏమిటో అర్థం కాలేదు. అపుడు ఆయిషా (రజి), ఫాతిమా (రజి) ను పిలిచి....,

ఆయిషా (రజి) : - ఫాతిమా! మొదట దైవప్రవక్త (సల్లం), నీ చెవిలో ఏదో చెప్పగా ఏడ్చావు, దైవప్రవక్త (సల్లం) గారు ఏం చెప్పారు?

ఫాతిమా (రజి) : - మొదటిసారి దైవప్రవక్త (సల్లం) నాతో గుసగుసలాడి చెప్పింది...., "ఫాతిమా! నేను ఇక ఎంతో కాలం బ్రతకను. నేను ఈ వ్యాధితో చనిపోతాను. నన్ను ఆరిపోయే దీపంగా మాత్రమే భావించాలి." అని అన్నారు. దానికి నేను దుఃఖం ఆపుకోలేక ఏడ్చాను.

ఆయిషా (రజి) : - తదుపరి దైవప్రవక్త (సల్లం) తిరిగి నీ చెవిలో ఏదో చెప్పగా అంతలోనే మళ్ళీ సంతోషంతో నవ్వావు. అదేమిటి?

ఫాతిమా (రజి) : - ఆ తర్వాత దైవప్రవక్త (సల్లం) నాతో చెప్పింది...., "ఫాతిమా! నేను చనిపోయిన తర్వాత నా కుటుంబంలో అందరికంటే ముందు మొట్టమొదటగా వచ్చి కలిసేది నువ్వే!" అని చెప్పారు. దానికి నేను ఆనందం పట్టలేక నవ్వాను.

మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం), హజ్రత్ ఫాతిమా (రజి) కు...., "నీవు ప్రపంచ స్త్రీలకు సయ్యిదా (నాయకురాలు)వి." అనే శుభవార్త కూడా ఇచ్చారు.

 *ముహమ్మద్ (సల్లం) జీవితపు చివరిరోజు : -* 

సోమవారం రోజు తెల్లవారుజామున ముహమ్మద్ (సల్లం) కొంచెం కొలుకున్నట్టే కనిపించారు. ఆయిషా (రజి) గారి ఇంటిని అనుకునే మస్జిద్ ఉంది. ముహమ్మద్ (సల్లం) పడక పై నుంచి లేవకుండానే కిటికీ పై వేసి ఉన్న పరదాను తొలగించి మస్జిద్ లోకి తొంగిచూశారు. ముస్లిములంతా ఫజ్ర్ నమాజులో నిలబడి ఉన్నారు. హజ్రత్ అబూ బక్ర్ (రజి) వారికి నమాజు చేయించడానికి ఉపక్రమిస్తున్నారు.

అనుచరులంతా ఫజ్ర్ నమాజ్ లో లీనమైఉండడం చూసిన ముహమ్మద్ (సల్లం), చివరికి తాను ఆశించిన సమాజం అల్లాహ్ పుడమిపై ఆవిర్భవించిందని తలచి, తృప్తిగా నిట్టూర్పు విడిచారు. తన బోధనలకు సజీవ ఉదాహరణగా రూపొందిన దైవాదాసుల్ని చూసి ఆయన హృదయం ఆనందంతో పరవశించిపోయింది.

కిటికీ దగ్గర అలజడి విన్న అబూ బక్ర్ (రజి), ముహమ్మద్ (సల్లం) మస్జిద్ లోకి వస్తారేమోనని భావించారు. అందుచేత అబూ బక్ర్ (రజి) వెనుకకు జరిగి వరుసలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. అంతలో, మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) నమాజ్ ఆపవద్దని, మీ నమాజును పూర్తి చేసుకోండి అని సైగ చేసి తిరిగి తన హుజ్రా గుమ్మం పై పరదా పడవేసి లోనికి వెళ్ళిపోయారు.

(ఆ తరువాత అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) కు మరో నమాజు చేసే సమయమే చిక్కలేదు.)

అలా దైవప్రవక్త (సల్లం) లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు దైవప్రవక్త (సల్లం) మనస్సు శాంతితో మరియు సంతృప్తితో నిండిపోయింది. తనపై, సర్వలోకాల సృష్టికర్త, విశ్వప్రభువు అయిన అల్లాహ్ మోపిన బరువు, బాధ్యతలు తీరిపోయినందుకు ముహమ్మద్ (సల్లం) పరమానంద భరితులయ్యారు. అయితే మరో బాధ్యత మిగిలి ఉంది. (అదే తన తర్వాత తన సమాజానికి ఖిలాఫత్ ను ఎన్నుకోవడం. దీని గురించి ముహమ్మద్ (సల్లం) జీవిత చరిత్రలో తెలుసుకుందాము.)

 *ముహమ్మద్ (సల్లం) గారి తుదిశ్వాస : -* 

ఆ తర్వాత తుది శ్వాసలు ఆరంభమయ్యాయి. హజ్రత్ ఆయిషా (రజి), ముహమ్మద్ (సల్లం) ను తనపై వాల్చుకొని ఆధారంగా కూర్చున్నారు. ఆయిషా (రజి) గారి పై అల్లాహ్ కారుణ్యాలలో ఓ కారుణ్యం ఏదంటే మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) ఆమె ఇంట, ఆమె వంతు రోజున, ఆమె వక్షస్థలం పై తలవాల్చి పరమపదించడం. దైవప్రవక్త (సల్లం) మరణ సమయాన అల్లాహ్ ఆయిషా (రజి) ఉమ్మిని ఆయన ఉమ్మితో కలిపాడు.

కాసేపటికి, ఆయిషా (రజి) సోదరుడు హాజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ అబీ బక్ర్ (రజి), ముహమ్మద్ (సల్లం) వద్దకు వచ్చారు. అబ్దుర్రహ్మాన్ చేతిలో మిస్వాక్ ఉంది. అప్పుడు ఆయిషా (రజి) దైవప్రవక్త (సల్లం) కు ఆధారంగా కూర్చుని ఉన్నారు. ముహమ్మద్ (సల్లం) ఆ మిస్వాక్ వైపు తదేకంగా చూడడాన్ని ఆయిషా (రజి) గమనించారు. అపుడు ఆయిషా (రజి), ముహమ్మద్ (సల్లం) తో....,

ఆయిషా (రజి) : - మీ కోసం ఈ మిస్వాక్ ని తీసుకోనా?

ముహమ్మద్ (సల్లం) "అవును" అన్నట్లు తల పంకించారు.

అప్పుడు, ఆయిషా (రజి) అబ్దుర్రహ్మాన్ నుంచి ఆ మిస్వాక్ ను అడిగి తీసుకున్నారు. ఆయిషా (రజి), ఆ మిస్వాక్ ను తీసుకొని ముహమ్మద్ (సల్లం) కు ఇవ్వగా అది నమలడానికి వీలులేనంత గట్టిగా ఉంది. "మిస్వాక్ ని మెత్తగా చేసి ఇవ్వనా?" అని ఆయిషా (రజి) అడగగా, ముహమ్మద్ (సల్లం) "అవును" అన్నట్లు తల ఊపారు.

ఆయిషా (రజి) ఆ మిస్వాక్ ను నమిలి మెత్తగా చేసి ఆయన నోటికి అందించారు. దైవప్రవక్త (సల్లం) దానితో తనివితీరా దంతధావనం చేశారు. 

శరీరం కాలిపోతుంది. అవయవాలు ఎక్కడికక్కడ బలహీనమైపోయాయి.
దైవప్రవక్త (సల్లం) ముందు ఓ పాత్రలో నీళ్ళు ఉన్నాయి. ఆయన తన రెండు చేతుల్ని ఆ పాత్రలో ముంచి తన ముఖం పై చల్లుకొని తుడుచుకోవడం ప్రారంభించారు. దైవప్రవక్త (సల్లం) ఇలా అనేక సార్లు చేశారు. అలా తుడుచుకుంటూనే "లా ఇలాహ ఇల్లల్లాహ్" (అల్లాహ్ తప్ప మరే ఆరాధ్యుడు లేడు), "మరణంతో యాతన ఉంది" అని పలుకనారంభించారు. తర్వాత ఆయన దుప్పటిని కాసేపు ముఖం మీద కప్పుకోవడం, కాసేపు తీసివేయడం చేయసాగారు. అలా చేస్తూ...., 

"అల్లాహ్! ఈ ప్రాణం తోడే బాధను సులభతరం చెయ్యి" అన్నారు. ఆ సమయాన ముహమ్మద్ (సల్లం) తీవ్రమైన బాధకు గురయి ఉన్నారు. ఈ పరిస్థితిని చూసి హజ్రత్ ఫాతిమా (రజి) తల్లడిల్లిపోయారు. "అయ్యయ్యో! మా నాన్న ఎంత బాధపడుతున్నారు!!" అని తీవ్రమైన ఆందోళన, ఆవేదన వెలిబుచ్చారు. ఇది చూసిన దైవప్రవక్త (సల్లం), ఫాతిమా (రజి) తో...., "అమ్మా! బాధపడకు. నీ తండ్రికి ఈ రోజు తరువాత మరే బాధ ఉండదు." అని కూతుర్ని ఓదార్చుతూ సెలవిచ్చారు.

దైవప్రవక్త (సల్లం) తమ ముద్దుల మనుమలు హజ్రత్ హాసన్ మరియు హజ్రత్ హుసైన్ (రజి) లను పిలిపించి వారిని ముద్దాడారు. వారి యెడల మేలుగా ప్రవర్తించమని వసీయ్యత్ చేశారు. తమ సతీమణులను పిలిచి వారికి హితబోధగావించారు.

ఇటు క్షణక్షణానికి బాధ పెరుగుతూనేపోతుంది. ఖైబర్ లో ఆయన (సల్లం) కు తినిపించబడిన విషప్రభావం కూడా బయటపడింది. మహాప్రవక్త (సల్లం) హజ్రత్ ఆయిషా (రజి) తో...., "ఓ ఆయిషా! ఖైబర్ లో ఏ ఆహారాన్నయితే భుజించానో దాని బాధ ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఆ విషప్రభావం వల్ల నా ప్రాణం తెగిపోతుందని అనిపిస్తోంది." అని చెప్పారు.

సహాబ (రజి) కు వసీయ్యత్ చేస్తూ...., "అస్సలాత్, అస్సలాత్ వమా మలకత్ అయి మానుకుం" (నమాజు, నమాజు. మీ ఆధీనంలో ఉన్న బానిసలు) అంటూ ఈ పదాలను పదే పదే వల్లించారు.

 *మరొక ఉల్లేఖనంలో....,* 

మిస్వాక్ చేయడం పూర్తికాగానే ఆయన తన చేతిని లేదా తన చూపుడు వ్రేలిని పైకి లేపారు. చూపు ఇంటి పైకప్పు పై నిలిచింది. రెండు పెదాలు ఏదో చెబుతున్నట్లుగా కదిలాయి. హజ్రత్ ఆయిషా (రజి) ఆ పలుకులేమిటో విందామని చెవిని ఆయన దగ్గరకు చేర్చారు. అపుడు ముహమ్మద్ (సల్లం) చెప్పిన తుది పలుకులు ఇలా ఉన్నాయి....,

"ఓ అల్లాహ్! ఏ ప్రవక్తలు, సిద్దీఖులు (సత్యసంధులు), ఏ షుహదా (అమరగతినొందిన వారు), మరే సాలిహీన్ (సత్పురుషులు) లను నీవు బహుకరించావో అలానే నాకు కుడా బహుకరించు. ఓ ప్రభూ! నాకు నీ మన్నింపును ప్రసాదించు. నన్ను కరుణించు. నన్ను నీ ఆప్తుల్లో చేర్చుకో. ఓ అల్లాహ్! ఓ రఫీకెఆలా! (పరమ ఆప్తుడా!)"

ఈ చివరి పదం "ఓ రఫీకెఆలా" (ఓ పరమ ఆప్తుడా) అనే పదం మూడుమార్లు వల్లించారు. అప్పుడే దైవప్రవక్త (సల్లం) నోట ఈ అమృత పలుకులు వెలువడిన మరుక్షణమే పైకెత్తిన చెయ్యి క్రిందికి వాలిపోయింది. కనుగుడ్లు అలాగే నిలిచిపోయాయి. శరీరం చల్లబడిపోయింది. అశాశ్వతమైన మట్టిముద్దలో అరవై మూడేండ్లు కాపురముండిన ఓ దివ్యతేజం నేడు దైవ సన్నిధికేగింది. ముహమ్మద్ (సల్లం) "రఫికెఆలా" ను కలుసుకున్నారు.

 *"ఇన్నాలిల్లాహి వ ఇన్నా రాజిఊన్"* 

దాంతో అనుచరుల గుండెలు పగిలిపోయాయి. మొత్తం ప్రపంచమే వారికి అంధకారం అయినట్లు అనిపించింది. ఈ విషాద వార్త విన్న ప్రతి ముస్లిం ఎక్కడ నిల్చున్నవాడు అక్కడ నోరు తెరచి కొయ్యబారిపోయాడు.

*ఇక్కడ మనం గ్రహించవలసినది ఏమిటంటే అంత గొప్ప ప్రవక్త అయినప్పటికీ ఆయన పాపాలన్నీ అల్లాహ్ క్షమించాను అని వాగ్దానం చేసినప్పటికీ  , ప్రాణం వదిలే సమయంలో కూడ ఇస్లాం , నమాజ్ , నమాజ్ పట్ల హితోపదేశం , దేవుని స్మరణ విషయాలలో ఎలా ఉన్నారు అనేది మనం గమనించాలి*
*మనం ఈ  రోజు చిన్న చిన్న కారణాల వల్ల , అసలు కారణం అనేదే లేకుండా నమాజ్ లను , దీన్ ను, దావత్ పనిని ,అల్లాహ్ నామస్మరణ వదిలేస్తున్నాము*
*అల్లాహ్ క్షమించుగాక ఆమీన్.*

సోదరులారా గ్రహించండి 👇

۞ قُلْ يَتَوَفَّىٰكُم مَّلَكُ ٱلْمَوْتِ ٱلَّذِى وُكِّلَ بِكُمْ ثُمَّ إِلَىٰ رَبِّكُمْ تُرْجَعُونَ

*(ఓ   ప్రవక్తా!)వారికి   చెప్పు :"మీపైనియమించబడివున్న   మృత్యుదూత మీ ప్రాణాలను వశపరచుకుంటాడు.ఆ   తరువాత మీరంతా మీ ప్రభువు వైపునకు మరలించబడతారు."*
*(Quran - 32 : 11)*

*మరణానికి  : వయసు కి సంబంధమే లేదు.*

కాబట్టి సోదరులారా నేను పలానా సమయం నుండి అలా ఉంటాను , ఇలా ఉంటాను , అలా మారిపోతాను అని అనకండి .
ఎందుకంటే *ఆ పలానా సమయం లోపే మీరు చనిపోతే అంతం కాని ఆ పరలోకంలో మీ పరిస్థితులు ఎలా ఉంటాయి ?????*

ఇక తర్వాతి భాగము - 86 ను 15/02/2018 నుండి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆      
                (rafeeq)

☆☆      Salman       +919700067779   ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment