🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐
🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋
◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆
🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌
*భాగము - 58*
◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆
*మత్స్య బాధితుడి సంగతి జ్ఞాపకం తెచ్చుకో. అతడు కోపం వచ్చి వెళ్ళిపోయాడు. మేము తనని నిలదీయబోమని భావించాడు. (ఖుర్ఆన్ 21:87)*
*అప్పుడతను దైవాన్ని స్మరించి ఉండకపోతే పునరుత్థానదినం దాకా ఆచేప కడుపులోనే ఉండిపోయేవాడు. చివరికి మేమతడ్ని వ్యాధిగ్రస్త స్థితిలో ఇసుక మైదానంలో విసిరేశాం. అతని నీడ కోసం అక్కడ ఒక తీగచెట్టు మొలిపించాం. తర్వాత అతడ్ని మేము లక్షమంది లేక అంతకు పైగాఉన్న ప్రజల దగ్గరికి పంపాము. వారు సత్యాన్ని విశ్వసించారు. కనుక మేము ఓ నిర్ణీతకాలం దాకా వారిని వదలిపెట్టాం. (ఖుర్‌ఆన్ 37:143-148)*
*యూనుస్ (అలైహి) తప్పిదం*
పడవలో ఉన్న ప్రయాణీకులందరి పేర్లు చీటీలపై వ్రాసి, చీటీలో ఎవరి పేరు అయితే వస్తుందో వారిని సముద్రంలోకి విసిరివేయాల్సిందిగా నిబంధన పెట్టుకుంటారు.
అలా మొదటిసారి చీటీ తీయగానే యూనుస్ (అలైహి) పేరు వచ్చింది. నిబంధనల ప్రకారం ఇపుడు ఆయనను సముద్రంలోకి విసిరేయాలి.
యూనుస్ (అలైహి) గురించి వారికి తెలుసు. చాలా మంచివారు, గౌరవనీయుడు. అటువంటి మనిషి సముద్రంలోకి విసిరివేయడానికి వారు ఇష్టపడలేదు. అందువల్ల వారు మళ్ళీ చీటీలు వేశారు. రెండవసారి కూడా యూనుస్ (అలైహి) పేరు వచ్చింది. చివరిసారిగా చూద్దామని మూడవసారి చీటీలు వేశారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు కూడా యూనుస్ (అలైహి) పేరే వచ్చింది. ఇందులో అల్లాహ్ అభీష్టం ఉందని యూనుస్ (అలైహి) గుర్తించారు.
విగ్రహాలను ఆరాధిస్తున్న అసీరియా జాతి ప్రజలకు, పూర్తిగా అల్లాహ్ ను ఆరాధించేలా తీర్చిదిద్దే బాధ్యత యూనుస్ (అలైహి) కు అల్లాహ్ అప్పగించారు. కానీ యూనుస్ (అలైహి), అల్లాహ్ అనుమతి లేనిదే తన పనిని మధ్యలో వదిలివేశారు. ఈ విధంగా యూనుస్ (అలైహి) తీవ్రమైన తప్పిదానికి పాల్పడ్డారు.
*సముద్రంలోకి దూకేసిన యూనుస్ (అలైహి)*
యూనుస్ (అలైహి) సముద్రం వైపు చూస్తూ పడవ యొక్క అంచున నిలిచారు. రాత్రి సమయం కాబట్టి, ఎదురుగా చంద్రుడు మెరుస్తూ ఉన్నాడు. నక్షత్రాలు, ఒక నల్ల పొగమంచు వెనుక దాగి ఉన్నాయి.
యూనుస్ (అలైహి) సముద్రంలోకి దూకే ముందు అల్లాహ్ పేరును స్మరిస్తూ సముద్రంలోకి దూకేశారు. ఉగ్రరూపం దాల్చిన ఆ సముద్రంలోని భారీ అలల మధ్య యూనుస్ (అలైహి) కనుమరుగైపోయారు.
*యూనుస్ (అలైహి) ను మింగేసిన తిమింగలం*
యూనుస్ (అలైహి) సముద్రంలోకి దూకిన వెంటనే, యూనుస్ (అలైహి) కు ఎటువంటి హాని కలిగించకూడదని, అల్లాహ్ సముద్రంలోని చేపలను ఆజ్ఞాపించారు. సముద్రంలో ఉన్న భారి చేపలు అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించాయి.
సముద్రంలోకి దూకిన వెంటనే, భారీ అలల ధాటికి యూనుస్ (అలైహి) స్పృహ తప్పి ఉంటారు. అపుడు మహా సముద్రంలోని ఒక తిమింగలం, యూనుస్ (అలైహి) ను మింగేస్తుంది. అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం, ఆ తిమింగలం యూనుస్ (అలైహి) శరీరాన్ని కత్తిరించకుండా, అతని ఎముకలను బంధించకుండా, చివరకు తన యొక్క అపారమైన దవడలతో కూడా హాని కలిగించకుండా తన కడుపులో ఉంచుకుంటుంది. యూనుస్ (అలైహి) ఎటువంటి ప్రాణహాని లేకుండా తిమింగలం కడుపులో ఉండిపోయారు.
*నేను చనిపోలేదు, తిమింగలం కడుపులో ఉన్నాను*
తిమింగలం కడుపులో యూనుస్ (అలైహి) స్పృహ నుండి లేచి, కళ్ళు తెరిచారు. అపుడు ఆయన; నేను చనిపోయానని, చీకటి సమాధిలో పడి ఉన్నానని అనుకున్నారు. కానీ, తన హృదయ స్పందన తనకు తెలుస్తోంది. కాళ్ళు, చేతులు మెల్లగా కడలాడుతున్నాయి. గొంతు శ్వాస ఆడుతోంది. ఈ విధంగా తన కదలికలను, తను గుర్తించినపుడు అప్రమత్తం అయ్యాడు. అపుడు యూనుస్ (అలైహి), "నేను చనిపోలేదు" అని గ్రహించారు.
యూనుస్ (అలైహి) తాను తడితడిగా మెత్తగా ఉన్న నేలపై ఉన్నట్లు భావించారు. తన చుట్టూ ఉన్న ప్రదేశం అంతా మూసివేయబడిన ఒక గుహలా ఉంది. అంతా చాలా చీకటిగా ఉంది. కానీ చాలా మృదువుగా, మెత్తగా ఉంది. యూనుస్ (అలైహి) కు కుదుపులు తగులుతున్నాయి. అలలలో పడవకు తగిలే కుదుపుల వంటివి. తాను ఒక పెద్ద చేప కడుపులో ఉన్నట్టు ఆయన గుర్తించారు. తుఫాను సముద్రంలో యూనుస్ (అలైహి) కాపాడడానికి గాను అల్లాహ్ ఆయనను ఒక పెద్ద చేప మింగేసేలా చేశారు.
యూనుస్ (అలైహి) వెంటనే అల్లాహ్ ను తలచుకొని తాను చేసిన తప్పుకు పశ్చాతాపం వ్యక్తం చేశారు. "అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేరు. ఔనత్యం ఆయనదే. అల్లాహ్ పరిశుద్ధుడు. నేను నిజంగా దుర్మార్గుణ్ణయ్యాను. ఈ విధంగా నేను తప్పు చేశాను." అన్నారు. అనంత కరుణామయుడు అపారంగా క్షమించేవాడైన అల్లాహ్,యూనుస్ (అలైహి) ప్రార్థనను ఆలకించారు. యూనుస్ (అలైహి) బాధ, పరితాపాల నుంచి అల్లాహ్ విముక్తి కలిగించారు.
ఆ వెంటనే తాను బలవంతంగా బయటకు తోయబడిన అనుభూతి యూనుస్ (అలైహి) కు కలిగింది. దఢాలున యూనుస్ (అలైహి) మెత్తని నేలపై వచ్చి పడ్డారు.
యూనుస్ (అలైహి) బయటకు కక్కేసేలా, ఆ చేప కు అల్లాహ్ ఆజ్ఞాపించారు. యూనుస్ (అలైహి) వెంటనే అల్లాహ్ కు కృతజ్ఞతలు చెల్లించారు.
యూనుస్ (అలైహి) ఒక నిర్జన ప్రదేశంలో ఉన్నారు. అనారోగ్యంతో బలహీనంగా, ఒంటరిగా మిగిలిపోయారు. ఆయన పెద్ద పెద్ద ఆకులున్న ఒక పొదలో పడి ఉన్నారు. ఎండ వేడిమి నుంచి ఆ ఆకులు రక్షణ కల్పిస్తున్నాయి. అక్కడ చాలా సొరకాయలు ఉన్నాయి. వాటితో ఆయన తన ఆకలిని తీర్చుకున్నారు. నెమ్మదిగా యూనుస్ (అలైహి), తన శక్తిని పుంజుకున్నారు.
*స్వస్థలానికి పయనం*
విగ్రహాలను ఆరాధిస్తున్న అసీరియా జాతి ప్రజలకు, పూర్తిగా అల్లాహ్ ను ఆరాధించేలా తీర్చిదిద్దే బాధ్యత యూనుస్ (అలైహి) కు అల్లాహ్ అప్పగించారు. కానీ యూనుస్ (అలైహి), అల్లాహ్ అనుమతి లేనిదే తన పనిని మధ్యలో వదిలివేశారు. తిమింగలం కడుపు నుంచి బయటపడిన తర్వాత యూనుస్ (అలైహి), తను చేసిన తప్పు సరిదిద్దుకోవాలని భావించారు.
ఆ తర్వాత యూనుస్ (అలైహి) తమ స్వస్థలం నైనవాహ్ కు ప్రయాణమయ్యారు. యూనుస్ (అలైహి) అక్కడికి చేరుకోగానే, అసీరియా జాతి ప్రజలు సత్యాన్ని గ్రహించి, ముస్లింలుగా మారిపోయారు. వారు విగ్రహారాధనను పూర్తిగా మానేసి, అల్లాహ్ ను ఆరాధించడంలో లీనమైపోయారు. ఆ ప్రజలలో వచ్చిన ఈ మార్పును చూసి చాలా యూనుస్ (అలైహి) చాలా ఆనందించారు. అసీరియా జాతి ప్రజలంతా ఆయనను చాలా ఆదరంగా స్వాగతించారు.
అసీరియా ప్రజలు : - ఓ సత్యం మూర్తీభవించిన దైవప్రవక్తా! మేము అజ్ఞానధకారంలో ఉన్నపుడు మీ హితబోధనలను మరియు తౌహీద్ ను తిరస్కరించాము. మీరు వెళ్లిన తర్వాత, అల్లాహ్ మాకు సత్యాన్ని అనుగ్రహించారు. మేమంతా ఇపుడు అల్లాహ్ ను విశ్వసించడం ప్రారంభించాము.
అపుడు అసీరియా జాతి ప్రజలంతా కలిసి అల్లాహ్ కు కృతజ్ఞత సూచకంగా ప్రార్థనలు చేశారు.
ఇంతటితో యూనుస్ అలైహిస్సలామ్ కథ ముగిసినది.
_యూనుస్ (అలైహి), తిమింగలం కడుపులో ఎంతకాలం గడిపారో భిన్నమైన వాదనలు ఉన్నాయి. కొందరు ఉల్లేఖులు, యూనుస్ (అలైహి) భారీ చేప కడుపులో మూడు రోజులు గడిపారని, మరికొందరు ఏడు రోజుల గడిపారని, కొందరు నలభై రోజులని చెప్పారు. ఇంకొందరు "ఉదయం అతన్ని మింగివేసి, సాయంత్రం అతన్ని కక్కివేసింది." అని భిన్నమైన వాదనలు ఉన్నాయి._
_యూనుస్ (అలైహి) జాతి, ప్రస్తుత ఇరాఖ్‌కు చెందిన అసీరియా జాతి ప్రజలు. అయితే ఇస్రాయీల్ సంతతికి చెందిన యూనుస్ (అలైహి) సు అల్లాహ్ అసీరియా ప్రజలకు సన్మార్గం చూపేందుకు పంపినందున వారు యూనుస్ జాతి ప్రజలుగా ఖురాన్ లో ప్రసిద్ధి చెందారు. ఈ జాతి క్రీ.పూ 860-784 మధ్య కాలంలో ఉండేదని తెలుస్తోంది._
*గ్రహించవలసిన పాఠాలు : -*
◇□○ యూనుస్ (అలైహి), అసీరియా జాతి ప్రజలకు సత్యాన్ని తెలియజేయమని తనకు అప్పగించిన పనిని మధ్యలో విడిచిపెట్టి పట్టణాన్ని వదిలి వెళ్లిపోయారు. ఆయన అల్లాహ్ ను మార్గదర్శనం కోరకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. తన నిర్లక్ష్యానికి శిక్షను అనుభవించారు.
◇□○ తమ పై శిక్ష పడే సూచనలు కనపడగానే అసీరియా జాతి ప్రజలు, తమ తప్పును గుర్తించి అల్లాహ్ ను క్షమాబిక్ష కోసం ఆర్థిస్తూ కారుణ్యం కోసం ప్రార్థించారు. అల్లాహ్, తన ఆగ్రహాన్ని ఉపసంహరించుకుని వారిని సురక్షితంగా విడిచిపెట్టారు. యూనుస్ (అలైహి) విషయంలోనూ ఇదే జరిగింది. అల్లాహ్ యూనుస్ (అలైహి) ను ఒక విచిత్రమైన, భయంకరమైన సంఘటనకు గురిచేశారు. ఆయన తన తప్పును గుర్తించి అల్లాహ్ ను క్షమాపణ కోరారు. అల్లాహ్ కరుణ చూపి ఆయనను కాపాడారు.
◇□○ యూనుస్ (అలైహి) చేసిన సరళమైన, చిన్న ప్రార్థన చాలా ప్రాముఖ్యం కలిగినది.
◇□○ హజ్రత్ సాద్ బిన్ అబీ వక్కాస్ ఉటంకం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ (స.అ.వ) ఇలా చెప్పారు : - కష్టాల్లో ఉన్న ముస్లిం, యూనుస్ (అలైహి) చేసిన ప్రార్థనతో అల్లాహ్ కు మొరపెట్టుకుంటే అల్లాహ్ ప్రతిస్పందిస్తారు. ఇది అల్లాహ్ చేసిన వాగ్దానంగా భావించబడుతుంది.
*లా ఇలాహా ఇల్లా అంత సుబహానక, ఇన్నీ కుంతు మినజ్జాలిమీన్.*
Insha Allah రేపటి భాగము - 59 లో, వంద సంవత్సరాలు నిద్రపోయిన మనిషి ఉజైర్ అలైహిస్సలామ్ గురించి తెలుసుకుందాము.
☆☆ ®@£€€q +97433572282 ☆☆
Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.
No comments:
Post a Comment