9

🕋🕋🕋🕋 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕋🕋🕋🕋

🛐🛐🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన *అల్లాహ్* పేరుతో ప్రారంభిస్తున్నాను 🛐🛐🛐🛐

------------------------------------------------

       ☪☪☪☪ *ఇస్లాం చరిత్ర* ☪☪☪☪

    భాగము - 9          Date : 19/11/2017

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*దైవదూతలు లూత్ తో మాట్లాడుతున్న సందర్భం : -* 

"లూత్‌ ! మేము నీ ప్రభువు పంపిన దూతలము. వీరు నిన్నేమీ చేయలేరు. కొంత రాత్రి గడిచిన తరువాత నీ కుటుంబాన్ని తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరి వేరే చోటికి వెళ్లు జాగ్రత్త! మీలో ఏఒక్కరూ వెనక్కి తిరిగి చూడకూడదు. అయితే నీ భార్య మాత్రం నీ వెంట రాకూడదు. ఎందుకంటే నీ భార్య కూడా అల్లాహ్ ను నమ్మలేదు కాబట్టి, నీ భార్య అవిశ్వాసి కాబట్టి వారి మీద సంభవించేదే నీ భార్య మీద కూడా సంభవిస్తుంది. వారి వినాశకాలం నిర్ణయమైపోయింది, రేపు ఉదయమే వారి వినాశనం మొదలవుతుంది. ఇక ఎంతో సమయం లేదు. (ఖురాన్-11:81).

లూత్‌ ముందు గానే తనజాతిని మా పట్టు గురించి హెచ్చరించాడు. కాని వారు మా హెచ్చరికల్ని ఉత్తుత్తి హెచ్చరికలుగా భావించి తోసిపుచ్చారు. వారతడ్ని తన అతిథుల్ని కాపాడుకోనిన్వకుండా అడ్డుతగలదానికి ప్రయత్నించారు, చివరికి మేము “ఇక నా శిక్ష, నా హెచ్చరికల పర్యవసానం చవిచూడండి" అంటూ వారి కళ్ళు పోగొట్టాము. ( ఖురాన్-54:36,37 ).

 ఆ దుర్మార్గులు అందమైన యువకుల్ని చూస్తే వదలిపెట్టేవారుకాదు. లూత్‌ (అలైహి) ఇంటికి యువకుల రూపాల్లో వచ్చిన దైవదూతల్ని చెరచడానికి వచ్చినప్పుడు ఆయన వారికి నచ్చజెప్పడానికి ఎంతగానో ప్రయత్నించారు. కాని ఆ తుచ్చులు మాట వినకుండా ఇంట్లోకి చొరబడి ఆ యువకుల్ని తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అప్పుడు వారి కళ్ళు పోయాయి. దాంతో వారు తమ దురుద్దేశం మానుకొని వెళ్ళిపోయారు.

*దైవ శిక్ష , మృత్యు సముద్రం : -* 

చివరికి మరునాడు ఉదయం సూర్యుడు ఉదయించి ఉదయించగానే భయంకరమైన విస్ఫోటం వారిమీద విరుచుకుపడింది. మేము ఆ పట్టణాన్ని అమాంతం ఎత్తి కుదిపేశాము. వారి మీద కాలిన మట్టిరాళ్ళ వర్షం కురిపించాము. ఈ సంఘటనలో యోచించేవారికి గొప్ప సూచసలున్నాయి. ( ఖురాన్-15:75 ).

ఒకప్పుడు ఈ ప్రాంతం పచ్చని పొలాలతో, దట్టమైన తోటలతో కళకళ లాడుతూ అప్పటి నాగరికతను ప్రతిబింబింపజేస్తుండేది. కాని ఈనాడు భయంకరమైన ఒక పెద్ద జలాశయం. అదే ఇస్రాయీల్, జోర్డాన్ ల మధ్య ఉన్న మృత్యు సముద్రం. 5000 సంవత్సరాల క్రితం మృత్యు సముద్రం అనేది ప్రపంచం లొనే లేదంటారు శాస్త్రవేత్తలు. వారి మాటల ప్రకారం 5000 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఒక పెద్ద భూకంపం వచ్చింది. తీవ్రమైన దాని భూ ప్రకంపనాలకు భూపొరల్లో ఉన్న పెట్రోలు, అస్ఫాల్ట్, విషవాయువులు, ఇతర ఖనిజాలు ఒక్కసారిగా పైకి వెదజల్లబడ్డాయి. నీళ్ళు కూడా పొంగివచ్చాయి. ఇలా పెట్రోలు, విషవాయువులు, ఇతర ఖనిజాలతో కలసిపొయిన ఈ నీరే మృత్యు సముద్రంగా పేరుపడింది.

ఈ సముద్రం లో చేపలు, మొసళ్ళు లేవు. విషఖనిజాలు పెల్లుబికిరావడం వల్ల దాని చుట్టుప్రక్కల ప్రాంతాలు కూడా నిరుపయోగమయ్యాయి. జొర్డాన్‌కు చెందిన అల్కరూక్‌ పట్టణం లోని ఏదైనా ఎత్తు ప్రదేశం ఎక్కిచూస్తే, మృత్యు సముద్రానికి దక్షిణదిక్కు వైపున్న ప్రాంతం అక్కడక్కడ నల్లని పిచ్చిచెట్ల తో, బండరాళ్లతో ఎంతో భయోత్పతం కలిగిస్తుంది. ఇక్కడ ఒక విధమైన నల్లని ఈగలు కన్పిస్తాయి. ఇవి మనిషికి కుట్టెతే కాల్చిన ఇనుపకడ్డీ అంటినట్లు శరీర౦ మంటెక్కిపోతుంది. ఈ సముద్రం లో నీటి సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల ఇందులో మనిషి మునగడు.

లూత్ ప్రవక్త (అలైహి)ను తిరస్కరించడం వల్ల విశ్వ ప్రభువు ను౦డి లూత్ జాతి ప్రజల పై విరుచుకుపడిన భయంకర శిక్ష ఇది. ఈ శిక్షకు ఇతర కారణాలేమిటో కూడా ఖురాన్ వివరించింది. లూత్ జాతి ప్రజలు లైంగిక తృప్తి కోసం స్త్రీ లను వదిలి పురుషుల వెంటపడ్డారు. ( ఖురాన్ 26:165, 166; ఖురాన్ 7:81 ).

అసహజమైన, పరమ అసహ్యకరమైన ఈ చేష్టలతో పాటు వారిలో మరో రెండు చెడులు కూడా చోటుచేసుకున్నాయి. వారు దారులు కొడుతూ బాటసారుల్ని దోచుకునేవారు. తమ సమావేశాల్లో పూర్తిగా సిగ్గువిడిచి తోటి సభికుల ముందే వ్యభిచారం చేసేవారు. ( ఖురాన్ 29:29 ).

హజ్రత్ లూత్ (అలైహి) వారిలొ దైవభీతి కలిగించి వారి అవినీతి, అశ్లీల చేష్టలను అరికట్టేందుకు ఎంతో ప్రయత్నించారు, కాని కొందరు తప్ప ఎవరూ దారికి రాలేదు. అపుడు అల్లాహ్ హజ్రత్ లూత్ ని, ఆయన అనుచరుల్ని వేరేటోటికి తరలించి ఆ ప్రదేశంపై శిక్ష దించాడు. బ్రహ్మాండమైన పేలుడు తో భూమి బ్రద్దలైపోయి తీవ్రమైన పెనుగాలులతొ కూడిన రాళ్ళ వర్షం కురిసింది. అదే సమయంలో భూ ప్రకంపనాల వల్ల ఎక్కడికక్కడ పగుళ్ళు ఏర్పడి, విషపదార్థాలతొ కూడిన వేడినీరు ఒక్కసారిగా పైకి ఎగజిమ్మడం తో మొత్తం పట్టణం క్షణాల్లో పెద్ద శ్మశానం గా మారిపోయింది. ఈ సముద్రం పరిసరాల్లో ఇప్పటికీ ఆ పట్టణం అవశేషాలుగా గోడ శిథిలాలు, కుండ పెంకులు, ఎముకలు మనకు కన్పిస్తాయి. బుద్ధిమంతులకు ఇందులో గుణపాఠం ఉంది.

ఇంతటితో లూత్ అలైహిస్సలామ్ భాగము ముగిసింది. Insha Allah  రేపటి భాగము - 10 లో ఇబ్రాహీమ్ అలైహిస్సలామ్ రెండవ కుమారుడు ఇస్ హాఖ్ అలైహిస్సలామ్ గురించి తెలుసుకుందాము.

*ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి :-*

ప్రియమైన ముస్లిం సోదరులారా!  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి , ఇదేదో 10 మందికి send చేస్తే మంచి జరుగుతుంది , send చేయకపోతే చేడు జరుగుతుంది అనుకునే msg లు కావు . కాబట్టి మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .

No comments:

Post a Comment