21

🤚🏻✋🏻🤚🏻✋🏻 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🤚🏻✋🏻🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

               *భాగము - 21* 

____________________________________________

*హజ్రత్ సాలిహ్ అలైహిస్సలామ్ : - - : సమూద్ జాతి*

సమూద్ జాతి వారు అరేబియాలోని తబూక్ - మదీనా నగరాలకు మధ్యన గల మదాయనే సాలెహ్ (హిజ్ర్) అనే ప్రదేశంలో ఉండేవారు. ఆద్ జాతి వినాశనం తర్వాత భూమండలం పైకి వచ్చిన జాతి ఇది.

ఆద్ జాతి ప్రజల వినాశనం తర్వాత సమూద్ జాతి వైభవోపేత స్థానాన్ని ఆక్రమించుకుంది. అయితే సమూద్ జాతి ప్రజలు కూడా విగ్రహారాధనకు లోనయ్యారు. భౌతిక సంపద పెరిగిన కొద్దీ వారి దుష్ట స్వభావం కూడా అధికమయ్యింది. సన్మార్గం కనుమరుగయ్యింది. ఆద్ జాతి ప్రజల మాదిరిగా వీరు కూడా ఎత్తయిన భవనాలను మైదాన ప్రాంతాల్లో నిర్మించారు. కొండలను తొలచి అందమైన సౌధాలను నిర్మించారు. అణచివేతలు, దౌర్జన్యాలు వారిలో నిత్యకృతమై పోయాయి. దుష్టులు, దుర్మార్గులు రాజకీయాధికారాన్ని ఆక్రమించుకున్నారు.

అప్పుడు సమూద్ జాతి వద్దకు ప్రవక్త సాలిహ్ అలైహిస్సలాం పంపబడ్డారు. 
హజ్రత్ సాలిహ్ (అలైహి) కూడా అందరి ప్రవక్తల లాగానే తన జాతి వారిని ఏకదైవారాధన (తౌహీద్) వైపునకు పిలుపిచ్చారు.

సాలిహ్ (అలైహి) : - నా జాతి ప్రజలారా! మీరు బహుదైవారాధనకు గురి అయి ఉన్నారు. మన ఆరాధనలు అల్లాహ్ కి మాత్రమే చెందాలి. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు. అల్లాహ్ నే మిమ్మల్ని నేల నుండి పుట్టించి, ఇక్కడ మీకు వసతి సౌకర్యం కల్పించాడు. కనుక మీరు అల్లాహ్ నే క్షమాపణ కోరుకోండి. అల్లాహ్ వైపు మరలండి. అల్లాహ్ మానవులకు అతి సమీపంలోనే ఉన్నాడు.

కానీ సాలిహ్ (అలైహి) సందేశాన్ని కేవలం నిరుపేదలు, అణగారిన ప్రజల మాత్రమే స్వీకరించారు. సంపన్నులు, అధికారం కలిగిన వారు ఆయన ప్రవక్త పదవి నిరాకరించారు. అబద్ధాలు చెబుతున్నాడని వారు ఆయనను దూషించారు. 

సమూద్ జాతివారు : - నీవు చాలా కాలంగా మా మధ్య నివసిస్తున్నావు. నీ తెలివితేటలు, నీ వివేకం మాకు ఉపయోగపడతాయి అని అనుకున్నాము. మేము నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాము. కానీ ఇపుడు ఏమైంది నీకు? మా తాతముత్తాతల కాలం నుండి వస్తున్న ఈ దైవాలను పూజించుకోనీయకుండా మమ్మల్ని వారిస్తున్నావు! మా పూర్వీకులు పూజించిన దేవుళ్లను వదులుకోవాలని చెబుతావా? నీవు బోధిస్తున్న విషయం పట్ల మాకు చాలా అనుమానంగా ఉంది. అది మమ్మల్ని తీవ్రమైన సందిగ్ధంలో పడవేసింది.

సాలిహ్ (అలైహి) : - ఆద్ జాతి తర్వాత మీ ప్రభువు ఆ జాతికి మిమ్మల్ని వారసులుగా చేసిన విషయం జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు మీ నాయకులను, వారి దృష్ట మార్గాలను అనుసరించడం మానండి. వారు ఔచిత్యాన్ని పూర్తిగా కోల్పోయారు. అల్లాహ్ మీకు ఎంతో ఔన్నత్యం ప్రసాదించాడు. తద్వారా ఈనాడు మీరు చదునైన మైదానాల్లో అద్భుతమైన మేడలు కడుతున్నారు. కొండలను చెక్కి ఇండ్లు ను నిర్మిస్తున్నారు. కనుక అల్లాహ్ అనుగ్రహాలు విస్మరించకండి. ధరణిలో అరాచకం, అలజడులు సృష్టించకండి.
           --- ఈ తోటలు, కాలువలు, పచ్చని పొలాలు, పండ్లతో నిండిన ఈ ఏడారివనాల మధ్య హాయిగా మిమ్మల్ని ఎల్లకాలం ఉండనివ్వడం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? పైగా మీరు బడాయి కోసం పెద్ద పెద్ద కొండలను తొలచి భారీ కట్టడాలను నిర్మిస్తున్నారే! కాస్త అల్లాహ్ కు భయపడండి. మీరు సాఫల్యాన్ని పొంది ఏకైక మార్గం అల్లాహ్ కు భయపడటం మాత్రమే. మీకు నా నిజాయితీ గురించి బాగా తెలుసు. అల్లాహ్ సందేశాన్ని ప్రచారం చేయడం లో నాకు వేరే రహస్యాలు, ఉధ్యేశాలు ఏవీ లేవు.

సాలిహ్ అలైహిస్సలాం తన సందేశ ప్రచారాన్ని మానుకునేలా లేడని సమూద్ జాతి వారు భావించారు. సాలిహ్ (అలైహి) ను అనుసరించే వారి సంఖ్య పెరుగుతుందన్న భయం వారికి పట్టుకుంది. తర్వాత సమూద్ జాతి వారు అందరూ కలుసుకొని సమావేశం ను ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో సాలిహ్ (అలైహి) ని నిరోధించడానికి ఒక పథకం వేశారు.

ఆ తర్వాత అందరూ కలుసుకొని సాలిహ్ (అలైహి) తో ఇలా అన్నారు.

సమూద్ జాతి వారు : - ఓ సాలిహ్! (అలైహి) నీవు అల్లాహ్ ప్రవక్తవి అన్న విషయాన్ని మాకు నిరూపించు. ఏదయినా ఒక స్పష్టమైన మహత్యాన్ని మాకు చూపించు.

సాలిహ్ (అలైహి) : - ఎలా నిరూపించాలో మీరే తెలియజేయండి.

సమూద్ జాతి వారు : - (అలా అయితే) కొండల్లో నుంచి ఒక విశిష్టమైన ఒంటె ను బయటకు వచ్చేలా చెయ్యి.

తర్వాత సాలిహ్ (అలైహి) అల్లాహ్ తో దుఆ చేశారు. సాలిహ్ అలైహిస్సలాం కు అల్లాహ్ ఈ మహత్యాన్ని ప్రసాదించాడు. ఒక విశిష్టమైన భారీకాయం కలిగిన ఆడ ఒంటె కొండ నుంచి బయటకు వచ్చింది. అది చూసిన సమూద్ జాతి వారు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఈ మహత్యాన్ని కళ్లారా చూసినా కూడా వారు సన్మార్గం వైపు నడవలేదు. 

సమూద్ జాతి ప్రజలు ఆ ఒంటెను చంపుతారన్న భయం సాలిహ్ (అలైహి) కు కలిగింది. సాలిహ్ (అలైహి) తన జాతి ప్రజలను విధంగా హెచ్చరించారు. "ఓ నా జాతి ప్రజలారా! మీరు ఆ ఒంటెకు ఏ విధమైన హాని కలిగిస్తే అల్లాహ్ శిక్ష ను ఆహ్వానించడమే అవుతుంది. ఆ ఒంటె మీకు అల్లాహ్ చిహ్నం. మీ జీవితాలు ఇప్పుడు ఆ ఒంటె తో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్నాయి. మీ పొలాల్లో ఆ ఒంటెను స్వేచ్ఛగా మేయనీయండి. బావి నీటిని ఒక రోజు మొత్తం ఆ ఒంటె ని తాగడానికి వదిలేయండి. మరుసటి రోజు మీరు, మీ పశువులు బావి నీటిని వాడుకోండి. అలా కాదని ఆ ఒంటెకు మీరు చెడు తలపెట్టాలని చూస్తే అల్లాహ్ శిక్ష పై విరుచుకుపడుతుంది" అని చెప్పారు.

కొంతకాలం వాళ్లు ఆ ఒంటెను స్వేచ్ఛగా మేయడానికి, నీరు తాగడానికి వదిలేశారు. కానీ మనసులో వారందరూ ఆ ఒంటెను ద్వేషించడం ప్రారంభించారు. అయితే సమూద్ జాతిలో కొందరు, ఆ ఒంటె కొండ నుంచి రావడం చూసి ఒక మహత్యంగా సాలిహ్ (అలైహి) సందేశాన్ని సత్యమైనదిగా విశ్వసించారు. ఇది చూసినా పాలక వర్గానికి చెందిన కొందరు మరింత ఆందోళన చెందారు. ఇలా అయితే కష్టం అని సాలిహ్ (అలైహి) అనుచరులను పాలక వర్గం లోని కొందరు అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేశారు. కానీ సాలిహ్ (అలైహి) అనుచరులు తమ విశ్వాసాన్ని, సాలిహ్ (అలైహి) పై ఉన్న నమ్మకాన్ని హృదయాలలో ప్రతిష్ఠించుకున్నారు.

అవిశ్వాసుల నాయకులు ఆ ఆడ ఒంటె పై పలు ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. భారీ ఆడ ఒంటె బావిలో నీరు మొత్తం తాగేస్తోందని, తమ పశువులు ఆ ఆడ ఒంటె ను చూసి భయపడుతున్నాయని వారు ఆరోపించడం ప్రారంభించారు.

*దైవ ఒంటె ను చంపడానికి పన్నాగం* 

ఆ ఆడ ఒంటెను చంపడానికి సమూద్ జాతి ప్రజలు ఒక పథకం రచించారు. అందుకు వారు ఆడవాళ్ల సహాయం తీసుకున్నారు. తమ ఆదేశాలను మగవాళ్లు పాటించేలా ఆడవాళ్లతో చెప్పించారు.

చివరకు ఆ ఆడవాళ్లు కొందరు యువకులతో కలిసి ఒంటెను చంపడానికి పన్నాగాలు రచించారు.

సాలిహ్ అలైహిస్సలామ్ గారు భయపడినట్టే సమూద్ జాతి ప్రజలు ఆ దైవ ఒంటెను చంపారా లేదా అన్న విషయంలోని వివరణను Insha Allah రేపటి భాగము - 22 లో తెలుసుకుందాము.

*ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-* 

ప్రియమైన ముస్లిం సోదరులారా!  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి , ఇదేదో 10 మందికి send చేస్తే మంచి జరుగుతుంది , send చేయకపోతే చేడు జరుగుతుంది అనుకునే msg లు కావు . కాబట్టి మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .

®@£€€q      +97433572282

No comments:

Post a Comment