75

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము - 75* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

*భేదాభిప్రాయాలు* 

తాము ఈసా (అలైహి) ని చంపి, శిలువపైకి ఎక్కించామని యూదులు తలపోశారు. ఈ విధంగా సైమన్ అనే ఆ వ్యక్తిని చంపిన యూదులు, సిగ్గు ఎగ్గూ లేకుండా “మేము దైవప్రవక్త మసీహ్ ఇబ్నె మర్యంని సంహరించాం.” అని మహాగర్వంగా చెప్పుకున్నారు.

ఈ సంఘటన జరిగిన అనేక సంవత్సరాలకు ఈసా (అలైహి) ను విశ్వసించి క్రైస్తవులైనవారు దీన్ని గురించి ఎన్నో భేదాభిప్రాయాలకు గురయ్యారు. 

దైవప్రవక్త ఈసా (అలైహిస్సలాం) రూపురేఖలను పోలిఉన్న వ్యక్తిని చంపిన తరువాత, "తాము ఈసా (అలైహి) ను తుదముట్టించాము." అని వారిలోని ఒక వర్గ౦ గట్టిగా నమ్మసాగింది.

కానీ మరో వర్గం సందేహంలో పడింది. "శిలువ పైకి ఎక్కించబడిన వ్యక్తి ఈసా (అలైహి) కాదు, అతను మరో వ్యక్తి." అనీ వారి అనుమానం. హజ్రత్‌ ఈసా (అలైహి) శిలువపైకి ఎక్కించబడ్డారన్న విషయాన్నిఈ వర్గ౦ త్రోసిపుచ్చసాగింది.

"ఈసా (అలైహి) ఆకాశం వైపుకు సాగిపోవటం కూడా వారు చూశారు." అని కొంతమంది చెబుతారు.

ఇక్కడ విభేదం అంటే స్వయంగా క్రెస్తవ వర్గాల్లో ఉన్న విభేదాలని మరికొంతమంది తలపోశారు. ఎందుకంటే క్రైస్తవుల్లోని నస్తూరియా వర్గం, "ఈసా (అలైహి) శారీరకంగానయితే శిలువపైకి ఎక్కారు కానీ, దైవికంగా కాదు." అని అంటుంది.

అయితే, "ఈ హత్య శారీరకంగానూ, దైవికంగానూ కూడా పరిపూర్తి అయింది." అని మల్కానియా వర్గం నమ్ముతోంది. మొత్తం మీద వారు అనుమానానికి, సంశయానికి లోనై ఉన్నారు.

"యూదులు, రోమ్‌ సైనికులు కలసి సిలువ వేసిన వ్యక్తి మసీహ్ కాదు, మసీహ్ రూపంలో ఉన్న వేరొక వ్యక్తి, మసీహ్ వారి తెలివిమాలినతనం పట్ల నవ్వూతూ అక్కడే ఓ చోట నిల్చున్నాడు." అని కొందరు అభిప్రాయపడ్డారు. 
"సిలువ పై ఎక్కించబడినవాడు మసీహ్ యే కానీ, ఆయన సిలువ మీద మరణించలేదు, సిలువ నుండి దించిన తర్వాత ఆయన బ్రతికేఉన్నాడు." అని మరికొందరు భావించారు.

"కాదు, మసీహ్ సిలువపైనే చనిపోయాడు, ఆ తర్వాత ఆయన బ్రతికి దాదాపు పదిమంది శిష్యుల్ని కలుసుకొని మాట్లాడాడు" అని ఇంకొందరి కథనం.

"మసీహ్ చనిపోయిన తరువాత తిరిగి బ్రతికాడు, అప్పుడు సశరీరంగా పైకి ఎత్తుకోబడ్డాడు." అని మరికొందరి నమ్మకం.

"ఈసా (అలైహి) సజీవంగా, సశరీరంగా పైకి ఎత్తుకోబడ్డారు." అన్న ఈ నమ్మకమే ఈసా (అలైహి) కు దైవత్వాన్ని అపాదించింది. అల్లాహ్ దివ్యాసందేశాన్ని ప్రవక్తలకు చేరవేసే దైవదూతను “పరిశుద్ధాత్మ" అని ఖుర్ఆన్ లో ప్రస్తావిస్తే, క్రైస్తవులు "అది దేవుని పరిశుద్ధాత్మ అని, ఆ పరిశుద్ధాత్మ మసీహ్‌లో అంతర్లీనమైపోయిందని." భావించారు. 

యూద మతంలో మానవులను దేవుని కుమారులుగా పిలిచే సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయానికి ప్రభావితులైన క్రైస్తవులు ఈసా (అలైహి) ని దేవుని ఏకైక కుమారునిగా చేశారు. ఇలా వారు దేవుడు ఒక్కడేనని నమ్ముతూనే ముగ్గురు దేవుళ్ళను సృష్టించుకున్నారు.

దేవకుమారునిగా కల్పించబడిన ఈసా (అలైహి) మానవుల పాపాలకు ప్రాయశ్చిత్తంగా సిలువపై బలైపోయారని, అందువల్ల మానవులు ఎలాంటి పాపాలు, ఎన్ని పాపాలు చేసినా ఏసుక్రీస్తు ని విశ్వసిస్తే చాలు మోక్షం  లభిస్తుందని ఓ గొప్ప మత సిద్ధాంతాన్ని ఉనికిలోకి తెచ్చారు. ఈ సిద్ధాంతాన్ని కనిపెట్టి ప్రచారం చేసిన ఘనత సెయింట్ పాల్ (పౌలస్) కు దక్కుతుంది. ఈ సిద్ధాంతానికి ప్రారంభంలో కొన్ని సమస్యలు, అభ్యంతరాలు ఎదురైనా ఆ తరువాత క్రమేణా ఇది క్రైస్తవజగత్తులో బాగా ప్రాచుర్యం పొ౦ది౦ది.

*ఇంకా   - ''మర్యమ్   పుత్రుడగు దైవప్రవక్త   ఈసాను మేము హతమార్చాము''   అని అనటం వల్ల - (వారు   శిక్షను చవిచూశారు). నిజానికి   వారు ఆయన్ని చంపనూలేదు, శిలువ   పైకి ఎక్కించనూ లేదు. నిజం ఏమిటంటే,   వారి కొరకు ఆయన్ని పోలిన వ్యక్తి రూపొందించబడ్డాడు.   ఈసా విషయంలో విభేదిం చినవారు ఆయన వ్యవహారంలో సందేహానికి   లోనయ్యారు. అంచనాలను అనుసరించటం తప్ప వారికి ఈ విషయమై ఖచ్చితంగా   ఏమీ తెలియదు. అసలు వారు ఆయన్ని చంపలేదు,*
*(Quran - 4 : 157)*

*పైగా   అల్లాహ్   ఆయన్ని తన   వైపునకు ఎత్తుకున్నాడు.   అల్లాహ్ సర్వాధిక్యుడు, మహావివేకి.*
*(Quran - 4 : 158)*

హజ్రత్ ఈసా అలైహిస్సలామ్ గారి రెండవ రాకడ గురించి తెలుసుకునేముందు, Insha Allah క్రైస్తవ విశ్వాసాలు మరియ త్రిత్వం (Trinity) గురించి రేపటి భాగములో తెలుసుకుందాము.

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment