37

🤚🏻✋🏻🤚🏻✋🏻 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🤚🏻✋🏻🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

                               *భాగము - 37* 

____________________________________________

తనకంటే జ్ఞానపరుడైన మరో వ్యక్తి ఖిజర్ అలైహిస్సలామ్ ఉన్నారని, అల్లాహ్ చెప్పిన కొన్ని సూచనల ద్వారా ఖిజర్ (అలైహి) ను కలుసుకొని, ఆయన వద్ద శిష్యరికం చేయాలని భావించారు మూసా (అలైహి).

మూసా (అలైహి), ఖిజర్ (అలైహి) ను కలుసుకొని, నేను మీ వద్ద శిష్యరికం చేయాలని కోరుకుంటున్నాను అని మూసా (అలైహి) చెప్పినప్పుడు, కొన్ని షరతులకు లోబడి అందుకు అంగీకరిస్తారు ఖిజర్ (అలైహి).

తర్వాత మూసా మరియు ఖిజర్ అక్కడి నుంచి బయలుదేరారు. కొంచెం దూరం నడిచాక ఒక నది వద్దకు చేరుకోని, ఒక పడవ ఎక్కారు. ఆ పడవ యజమాని వారిద్దరి పట్ల ఒక విధమైన అభిమానాన్ని చూపించాడు. వారిద్దరిని అభిమానంగా పడవలోకి ఆహ్వానించాడు. పడవలోకి ఎక్కిన తర్వాత ఖిజర్ (అలైహి) చాలా వింతగా వ్యవహరించారు. పడవ ప్రక్కల బిగించి ఉన్న కొన్ని చెక్కలను పీకిపారేశారు. దాని వల్ల పడవకు ఒక వైపు పెద్ద రంధ్రంలా ఏర్పడింది. ఈ విచిత్ర ప్రవర్తనను చూసి నిర్ఘాంతపోయిన మూసా (అలైహి)....,

మూసా (అలైహి) : - అరే! ఎందుకు పడవను నాశనం చేస్తున్నారు? మీరు ఇందులో రంధ్రం వేశారు. పడవలోని వారందరినీ ముంచదలచారా? మీరు చాలా ఘోరమైన పనికి ఒడిగట్టారు. మన పట్ల అభిమానంగా ఆహ్వానించిన పడవ యజమానికి ఇదా మనం ఇచ్చే ప్రతిఫలం? పైగా మనమంతా మునిగిపోయే ప్రమాదం కూడా ఉందని మీరు గ్రహించడం లేదా? మీరు చేసిన పని చాలా అనుచితమైనది.

ఖిజర్ (అలైహి) : - నేను చెప్పలేదా, నీవు నాతో పాటు సహనంగా ఉండలేవని. నేను ఏం చేసినా ప్రశ్నించకూడదు అని మన మధ్య జరిగిన అంగీకారాన్ని మరచిపోయావా మూసా!

మూసా (అలైహి) : - నేను మీకు క్షమాపణలు కోరుతున్నాను. నేను చేసిన పొరపాటు గుర్తుకువచ్చింది. నా మతిమరుపుకు కోపం తెచ్చుకోవద్దు. నా బలహీనత విషయంలో కఠినంగా వ్యవహరించవద్దు. మీతో రాకుండా నివారించవద్దు. నేను నా మాటకు కట్టుబడి ఉండడానికి ఈసారి పూర్తిగా ప్రయత్నం చేస్తాను.

అందుకు అంగీకరించిన ఖిజర్ (అలైహి), మూసా (అలైహి) ను వెంట తీసుకుని బయలుదేరారు.

*ఒక పిల్లవాడిని హతమార్చిన ఖిజర్ (అలైహి)* 

మూసా మరియు ఖిజర్ లు వారి ప్రయాణం ముందుకు సాగించారు. వారికి ఆ దారిలో ఒక పిల్లవాడు తన మిత్రులతో ఆడుకుంటూ కనపడ్డాడు. ఖిజర్ (అలైహి) ఆ పిల్లవాడిని మిత్రబృందం నుంచి వేరు చేసి ఒక ప్రక్కకు తీసుకువెళ్లి హతమార్చారు. ఈ అఘాయిత్యం చూసి మూసా (అలైహి) నిర్ఘాంతపోయారు.

మూసా (అలైహి) : - మీరు ఏ పాపం ఎరుగని ఒక అమాయక పిల్లవాడిని దారుణంగా చంపేశారు. పాపం ఆ పిల్లవాడు ఏ తప్పు చేయలేదే? ఇది నిజంగా అమానుషం. మీరు చాలా చెడ్డపని చేశారు. (అని అరిచారు)

ఖిజర్, మూసా వైపు తీక్షణంగా చూస్తూ....,

ఖిజర్  (అలైహి) : - ఏమిటి మళ్ళీ మరచిపోయావా? నేను చేసే పనులను మరిసారి ప్రశ్నిస్తే ఇక నాతో రావడం ఉండదు. నీవు నాతో పాటు సహనంగా ఉండలేవు.

మూసా (అలైహి) : - క్షమించండి. నేను మిమ్మల్ని మళ్ళీ క్షమాపణలు కోరుతున్నాను. నేను మరోసారి ఈ పొరపాటున చేస్తే నన్ను మీ వెంట రాకుండా చేయండి. ఇపుడు మాత్రం నా వైపున మీకు సాకు దొరికింది.

ఖిజర్ (అలైహి) మరోసారి మూసా (అలైహి) ను మన్నించారు.

అక్కడి నుంచి వారు ముందుకు సాగుతూ ఒక గ్రామానికి చేరుకున్నారు. అక్కడి గ్రామస్తులతో మూసా మరియు ఖిజర్ ఆహారాన్ని, ఆశ్రయాన్ని కోరారు. కానీ పిసినారి ప్రజలు వారికి ఆతిథ్యమివ్వడానికి నిరాకరించారు. అందువల్ల వారిద్దరూ అలాగే ప్రయాణం కొనసాగించవలసి వచ్చింది. వారిద్దరూ వెళుతున్నపుడు ఆ ఊర్లో ఒక చోట ఒక గోడ కూలడానికి సిద్ధంగా ఉండడాన్ని వాళ్ళు చూశారు. వెంటనే ఖిజర్ (అలైహి) ఆ గోడను మరమ్మత్తు చేయడానికి పూనుకున్నారు. ఇది చూసిన మూసా (అలైహి) ఉండబట్టలేక....,

మూసా (అలైహి) : - మీరు భలే విచిత్రమైన మనిషి. ఈ స్వార్థపరుల పట్ల మీరు సానుభూతి చూపుతున్నారు. ఆ ఊరి వాళ్ళు కనీసం మనకు అన్నం అయిన పెట్టలేదు. వారి కోసం అంత కష్టం ఎందుకు చేశారు. పైగా మీరు చేస్తున్న కష్టానికి ప్రతిఫలం కూడా కోరడం లేదు. మనం చేసిన కష్టానికి వారి నుంచి ప్రతిఫలం తీసుకొని మన ప్రయాణానికి కొద్దిగా ఆహారాన్ని సమకూర్చుకునేవాళ్ళం.

తన పనులకు తగిన వివరణ ఇచ్చే వరకు వాటిని మూసా (అలైహి) భరించలేరని ఖిజర్ (అలైహి) కు అర్థమయ్యింది.

ఖిజర్ : - ఇక చాలు...., నా దగ్గర నీ శిష్యరికం ముగిసింది. ఇక మనం ఎవరి దారి వారు వేరవ్వడం మంచిది. మీకు సహనం లేదు. అయితే మనం వేరు అయ్యే ముందు నేను చేసిన ఈ పనులకు కారణాలు వివరిస్తాను. నీవు సహనం వహించలేకపోయిన వ్యవహారాల గురించి వాస్తవం ఏమిటో చెబుతా విను....,

*పడవకు రంధ్రం వేసిన సంగతి* 

ఆ పడవ కొందరు పేదవాళ్ళది. నేను నష్టపరచిన పడవను కిరాయికి నడుపుకుని ఆ పడవ యజమాని, అతని భార్య బతుకుతున్నారు. వారి జీవన ఉపాధి కోసం నదిలో ఆ పడవ నడుపుకుంటూ బ్రతుకుతున్నారు. నేను ఆ పడవను ఎందుకు నష్టపరచానంటే, నది అవతల పడవలను స్వాధీనం చేసుకునే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పడవలను స్వాధీనం చేసుకొని పెద్ద నౌకాదళాన్ని తయారు చేయాలని చూస్తున్నాడు. అతను మంచి పడవలను మాత్రమే స్వాధీనం చేసుకుంటాడు. ఈ పడవను నష్టపరచటం వల్ల దీన్ని చూసిన కూడా పనికిరానిదిగా భావించి రాజు ఆ పడవని వదిలేస్తాడు. అందువల్ల నేను పడవకు ఏదైనా లోపం కలిగించాలనుకున్నాను. మూసా! నేను చేసిన పని చూడడానికి బాధ్యత లేని పనిగా కనపడినా...., నేను నిజానికి ఆ పడవను కాపాడడానికి, పడవ యజమాని పై సానుభూతితో చేసిన పని.

*అమాయకపు పిల్లవాడిని చంపిన సంగతి* 

నేను చంపిన పిల్లవాడి తల్లితండ్రులు నిజమైన విశ్వాసులు. కానీ ఆ పిల్లవాడిలో ఉన్న దుర్మార్గం నాకు తెలిసింది. ఆ బాలుడు పెరిగి పెద్ద అయిన తర్వాత, తన తిరస్కారం తలబిరుసుతనాలతో తన తల్లితండ్రులను వేధిస్తాడని నేము భయపడ్డాం. కన్నకొడుకు కాబట్టి ఆ తల్లితండ్రులు అతడి దుర్మార్గాన్ని భరిస్తారు. కానీ, చివరకు వాడి దుర్మార్గాలు ఆ తల్లితండ్రులను కూడా ప్రభావితం చేస్తాయని నేను గ్రహించాను. ఆ పిల్లవాడిని చంపి నేను ఆ తల్లితండ్రుల విశ్వాసాన్ని కాపాడాను. అల్లాహ్ వారికి మంచి గుణగణాలలో, దయాభిమానలలో ఆ బాలుడి కన్నా మంచి సంతానాన్ని ప్రసాదించాలని నేను ప్రార్థిస్తున్నాను.

*తమకు ఆహారం కూడా వారి కోసం పడిపోతున్న గోడను పునర్నిర్మించడం* 

నేను ఆ గోడను నిర్మించినది స్వార్థపరులైన గ్రామస్తుల కోసం కాదు, ఆ గోడ ఇద్దరు అనాధలైన బాలలది. ఆ గోడ కింద గుప్తనిధి ఒకటి పాతిపెట్టబడి ఉందని అల్లాహ్ నాకు తెలియజేశాడు. ఆ పిల్లల తండ్రి పుణ్యాత్ముడు. దానధర్మాలు చేసేవాడు. ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యే వరకు ఆ గుప్తనిధి రహస్యంగా ఉండడం చాలా అవసరం. వారు పెద్దయిన తర్వాత అల్లాహ్ వారికి ఆ నిధిని చూపిస్తారు. ఆ గోడ పడిపోతే స్వార్థపరులైన ఆ గ్రామస్తులు ఆ నిధిని దోచుకుంటారు.

ఇవే నేను చేసిన మూడు పనులకు గల కారణాలు. కాబట్టి నేను చేసిన ప్రతీ పని మన ప్రభువు కారుణ్య, కటాక్షాల వల్ల చేసిన పని. నేను ఏ పని నా స్వంతంగా చేయలేదు. నీవు సహనం వహించలేకపోయిన విషయాల వెనుక ఉన్న మర్మహేతువు ఇదే.

ఈ మాటలు చెప్పి ఖిజర్ అలైహిస్సలామ్ వేగంగా నడుచుకుంటూ వెళ్లిపోయారు.

*గ్రహించవలసిన పాఠాలు* 

----→ జ్ఞానం పొందిన వ్యక్తి తానొక్కడినే కాదన్న విషయం తెలిసిన వెంటనే మూసా (అలైహి) మరింత జ్ఞానం సంపాదించడానికి కష్టసాధ్యమైన ప్రయాణానికి పూనుకున్నారు. జ్ఞానం సులభంగా లభించేది కాదు. జీవితంలో విజయం సాధించాలంటే మనిషి కష్టపడి పని చేయవలసి ఉంటుంది.

----→ అల్లాహ్ ఆదేశాల మర్నాలన్నింటినీ మనం అర్థం చేసుకోలేము. మనకు తప్పుగా కనపడుతున్న విషయం నిజానికి ఒక అనుగ్రహం కావచ్చు. తాను చేసేది అల్లాహ్ కె బాగా తెలుసు.

ఖిజర్ (అలైహి), మూసా (అలైహి) సమక్షంలో ఒక పడవకు రంధ్రం వేసి నష్టం కలిగించడం. ఏ పాపం ఎరుగని బాలుణ్ణి హతమార్చడం. తమకు ఆతిథ్యమివ్వడానికి నిరాకరించిన ఊళ్ళో పడిపోయే గోడను పునర్నిర్మించడం. కానీ మూసా (అలైహి) కు ఇవన్నీ అర్థంకాక ప్రతిసారీ అసహనాన్ని వెలిబుచ్చుతారు. చివరకు ఇవన్నీ తాను అల్లాహ్ ఆజ్ఞతోనే చేశానని ఖిజర్ (అలైహి) చెబుతారు. దీన్ని బట్టి ఖిజర్ అలైహిస్సలామ్ మానవమాత్రుడు కాదని, మానవ రూపంలో వచ్చిన దైవదూత అయి ఉంటారని కొందరు ధర్మవేత్తలు అభిప్రాయపడ్డారు.

Insha Allah రేపటి భాగము - 38 నుంచి, మహారాజుగా మారిన పశువుల కాపరి తాలూత్ గురించి, దావూద్ అలైహిస్సలామ్ గురించి తెలుసుకుందాము.

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్రను మన ముస్లిం సోదరులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

☆☆ ®@£€€q  +97433572282  ☆☆

No comments:

Post a Comment