66

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము - 66* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

ఈ రోజు భాగములో అగడ్త బాధితుల గురించి తెలుసుకోవాలని అనుకున్నాము. కానీ, ఆ కథ *హజ్రత్ ఈసా అలైహిస్సలామ్* గారి తర్వాత జరిగినది. కావున అగడ్త బాధితుల గురించి, *హజ్రత్ ఈసా అలైహిస్సలామ్* గారి కథ తర్వాత తెలుసుకుందాము.

ఈ రోజు కథలో భాగంగా *ప్రవక్త జకరియా అలైహిస్సలామ్* గురించి తెలుసుకుందాము.

*ప్రవక్త జకరియా అలైహిస్సలామ్* 

జకరియా (అలైహి) కు వయసు మీదపడింది. ఆయన ముసలివారయ్యారు. వయసుతో పాటు మనిషి కూడా వంగిపోయారు. ఆయన తొంభై సంవత్సరాల జీవన సంధ్యలో ఉన్నారు. వయసు సహకరించకపోయినా ఆయన ఆరాధనాలయానికి రోజూ వెళ్ళి తన ప్రసంగాలు వినిపించేవారు.

జకరియా (అలైహి) సంపన్నుడు కాదు. అయినప్పటికీ అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగా ఉండేవారు. ఆయనకు జీవితంలో ఉన్న ఒకే ఒక్క అసంతృప్తి సంతానం లేకపోవడం. పిల్లలు లేకపోవడం వల్ల ఆయన చాలా బాధపడేవారు. తన పనిని, తన తర్వాత కొనసాగించేవారు ఎవరూ ఉండరన్న భావన ఆయనను ఆందోళనకు గురిచేసేది. ప్రజలకు బలమైన నాయకుని అవసరం ఉంది. ఆ ప్రజలను అలాగే వదిలేస్తే వారు అల్లాహ్ చూపించిన మార్గాన్ని వదిలి, అల్లాహ్ పంపిన చట్టాలను తమకు అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంది.

*మర్యం అలైహిస్సలామ్* 

(మర్యం అలైహిస్సలామ్, హజ్రత్ ఈసా అలైహిస్సలామ్ (యేసు క్రీస్తు) గారి తల్లి. మర్యం అలైహిస్సలామ్ కు సంరక్షకునిగా జకరియా (అలైహి) ను అల్లాహ్ నియమించారు. మర్యం అలైహిస్సలామ్ గురించిన పూర్తి కథ తర్వాతి పుటల్లో రానుంది.)

ఆరాధనాలయంలో ఒక మారుమూల గది లో ఒంటరిగా మర్యం (అలైహి) నివసించేవారు. జకరియా (అలైహి) ఆరాధనాలయానికి ప్రతి రోజూ వెళ్లేవారు. ఒక రోజు జకరియా (అలైహి), మర్యం (అలైహి) ను చూడడానికి అక్కడికి వెళ్లారు. ఆ గదిలో తాజా ఫలాలు ఆయనకు కనపడ్డాయి. పైగా ఆ కాలంలో లభించని పండ్లు అవి. ఆయన ఆశ్చర్యపోయారు. తనకు తప్ప మరెవ్వరికీ ఆ గదిలోకి ప్రవేశించి అనుమతి లేదు. అందువల్ల ఆ పండ్లు ఎలా వచ్చాయి అన్న సందేహం ఆయన మనసులో కలిగింది. అపుడు జకరియా (అలైహి) మర్యం (అలైహి) తో....,

జకరియా (అలైహి) : - మర్యం! నాకు తప్ప మరెవ్వరికి ఈ గదిలోకి ప్రవేశించే అనుమతి లేదు. మరి ఈ పండ్లు ఎలా వచ్చాయి?

మర్యం (అలైహి) : - (జకరియా!) ఆ పండ్లు అల్లాహ్ పంపినవి. ప్రతిరోజూ ఉదయం ఆ పండ్లు నా గదిలో ఉంటున్నాయి.

కాని ఈ విషయమై ఆయన ఎందుకు అంతా ఆశ్చర్యపోతున్నారో ఆమెకు అర్థం కాలేదు. అదే విషయం ఆయనను అడిగారు. అపుడు మర్యం (అలైహి)....,

మర్యం (అలైహి) : - (జకరియా) అల్లాహ్ తానూ కోరిన వారికి అపరిమితంగా ప్రసాదిస్తాడన్న విషయం మీకు తెలియదా?

ఆ పవిత్రమైన కన్య అడిగిన ప్రశ్న ఆయనకు కనువిప్పు కలిగించింది. "ఈ ముసలివయసులో ఒక శిశువును ప్రసాదించమని అల్లాహ్ ను ఎందుకు ప్రార్థించరాదు?" అన్న భావన జకరియా (అలైహి) మనసులో కలిగింది. ఆయన భార్యకు పిల్లలు కనే వయసు దాటిపోయింది. కానీ అపార కరుణామయుడైన అల్లాహ్ కి సాధ్యం కానిది ఏదీ లేదు. అపుడు ఆయన వెంటనే ఆరాధనాలయంలోకి వెళ్ళి ఇలా ప్రార్థించారు....,

"ప్రభూ! నా ఎముకలు బలహీనమాయ్యాయి. నా వెంట్రుకలు నెరిసిపోయాయి. నేను మీ ఆరాధనలను ఎన్నడూ విస్మరించలేదు. ప్రభు! నీ సన్నిధి నుండి నాకు ఉత్తమమైన సంతానం ప్రసాదించు. నాకు ఒక వారసుడిని ప్రసాదించు. నిస్సందేహంగా నీవే మొర ఆలకించేవాడివి." అని ప్రార్థించారు.

జకరియా (అలైహి) ఈ విధంగా ప్రార్థనగదిలో నిలబడి ప్రార్థనచేస్తుండగానే దైవదూతలు వచ్చి జకరియా (అలైహి) ను పిలిచారు. తన ముందు దైవదూతలు ప్రత్యక్షమయ్యేసరికి, జకరియా (అలైహి) తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. అపుడు దైవదూతలు....,

దైవదూతలు : - జకరియా! నీ వేడుకోలు అల్లాహ్ దగ్గర స్వీకరించబడింది. అల్లాహ్, నీకు ఒక కుమారుడు పుడతాడని శుభవార్తను తెలియజేస్తున్నారు. ఆ శిశువుకు "యహ్యా" అనే పేరు పెట్టాలి. అతడు అల్లాహ్ నుండి వెలువడే ఒక వాణి (ఈసా అలైహిస్సలామ్)ని ధృవపరుస్తాడు. పైగా అతను నాయకత్వపు లక్షణాలతో భాసిల్లుతూ ఎంతో నిగ్రహశక్తి కలవాడై ఉంటాడు. దైవప్రవక్త అవుతాడు. సజ్జనులలో పరిగణించబడతాడు.

దైవదూతల మాటలు విన్న జకరియా (అలైహి) ఆశ్చర్యపోయారు. తన చెవులను తానే నమ్మలేకపోయారు.

జకరియా (అలైహి) : - దైవదూతలు! మీరు వినిపించిన ఈ సంతాన శుభవార్త నిజమేనా? అయినా నేను చాలా ముసలివాడినైపోయాను. నా భార్య కూడా చాలా ముసలిదైపోయింది. నా భార్య గొడ్రాలు కూడాను. ఇక పిల్లలు ఎలా పుడతారు?

దైవదూతలు : - జకరియా! అలాగే జరుగుతుంది. అల్లాహ్, తాను చేసిన పని చేసి తీరతాడు. "మీరు అసలు లేనప్పుడు మిమ్మల్ని సృష్టించాను. అలాంటి నాకు అలా చేయడం చాలా తేలిక." అని అల్లాహ్ చెప్పారు.

జకరియా (అలైహి) : - అయితే! ఈ శుభ సంఘటనకు ఏదైనా గుర్తును ప్రసాందించండి.

దైవదూతలు : - ఈ సంఘటనకు గుర్తు ఏమంటే, నీవు మూడు రోజుల పాటు ఎవరితోనూ మాట్లాడలేవు, కేవలం సంజ్ఞలు మాత్రమే చేయగలవు. నీవు నీ ప్రభువును ఎక్కువగా స్మరిస్తూ ఉండు. ఉదయం, సాయంత్రం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉండు.

దైవదూతలు చెప్పిన ఈ మాటలను విన్న జకరియా (అలైహి) సంతోషంతో బయటకు పరుగెత్తారు. ప్రజలందరికీ ఈ విషయం చెప్పాలని, ప్రజలు అల్లాహ్ ని రాత్రింబవలు స్తుతించేలా అందరికీ తెలియజేయాలని భావించారు.

ఆ తర్వాత కొంత కాలానికే యహ్యా (అలైహి) జన్మించారు.

Insha Allah రేపటి భాగము - 67 లో ప్రవక్త యహ్యా అలైహిస్సలామ్ గురించి తెలుసుకుందాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment