78

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము - 78* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

హజ్రత్ ఈసా అలైహిస్సలామ్ పునరాగమనం చేసిన తర్వాత, దజ్జాల్ ని వధిస్తారు. ఆ తరువాత హజ్రత్ ఈసా ఇబ్నె మర్యం (అలైహి) అక్కడి నుంచి (డెమాస్కస్ కు) తిరిగొచ్చి ప్రజలను కలుసుకుంటారు. వారి యోగక్షేమాలు విచారిస్తారు. దజ్జాల్ ఉపద్రవాల నుండి క్షేమంగా బయటపడినవారి తలలు నిమురుతారు. వారికి లభించే స్వర్గ మహాభాగ్యాలను గురించి వారికి తెలియజేస్తారు.

ఈ విధంగా హజ్రత్ ఈసా (అలైహి) ప్రజల యోగక్షేమాలు విచారిస్తుండగా విశ్వప్రభువు (అల్లాహ్) నుండి ఆయన (ఈసా) కు, (ప్రజల పైకి వచ్చే) మరో ఉపద్రవం గురించి దివ్యావిష్కృతి (వహీ) వస్తుంది.

*"నా ఈ దాసులలో వారితో పోరాడే అంతటి శక్తి లేదు. కనుక నేను వీరికి ఇక్కడి నుంచి తీసేయదలచుకున్నాను. కనుక నీవు నా ఈ దాసులను తీసుకుని తూర్ పర్వతం పైకి వెళ్ళి రక్షణ కల్పించు.”* 

ఈ అల్లాహ్ ఆజ్ఞ వెలువడగానే హజ్రత్ ఈసా (అలైహి) ముస్లింలందరినీ వెంటబెట్టుకుని తూర్ పర్వతానికి చేరుకుంటారు. ఆ రెండవ ఉపద్రవమే యాజూజ్, మాజూజ్ ల ఉపద్రవం.

*యాజూజ్, మాజూజ్ ల దాడులు* 

(రష్యా, ఉత్తర చైనా ప్రాంతాల నుంచి) యాజూజ్, మాజూజ్ అనే కొన్ని ఆటవిక జాతులు కూడా బయలుదేరి ప్రపంచంలో పెద్ద ఎత్తున అల్లకల్లోలం సృష్టిస్తాయి. అవి ఎల్లడెల్లడలా వినాశనం, విధ్వంహాలు సృష్టిస్తూ స్వైరవిహారం చేస్తాయి. వాటిని ఎవరూ అడ్డుకోలేరు.

*"ఆ రోజు మేము జనాన్ని (స్వేచ్ఛగా) వదలిపెడతాము. వారు (సముద్ర కెరటాల్లా) ఒకరిమీద ఒకరు పడిపోతారు.” (ఖుర్ఆన్ 18:99).* 

*“మేము ఏఊరిని నాశనం చేసినా ఆ ఊరి ప్రజలు తిరిగి కోలుకోవడం అనేది జరుగదు. చివరికి యాజూజ్, మజూజ్ (జాతి) లను వదిలేయడం జరుగుతుంది. వారు ప్రతి గుట్టా, మిట్టా నుండి వెలువడి (ఇతర జాతులపై) విరచుకుపడుతారు.” (ఖుర్ఆన్ 21:95, 96).* 

●పూర్వం యాజూజ్ (తాతారి), మజూజ్ (మంగోలి) జాతుల్ని నిరోధించడానికి జుల్ ఖర్ నైన్ కట్టించిన గోడ నల్ల సముద్రానికి, కాస్పియన్ సముద్రానికి మధ్య ఉన్న రష్యా భూభాగంలో ఉందని తెలుస్తుంది. ప్రళయానికి సమీపకాలంలో హజ్రత్ ఈసా(అలై) పునరాగమనం తర్వాత ఈ జాతులు దాన్ని ఛేదించి ప్రపంచంలో వినాశం, విధ్వంసాలు సృష్టిస్తాయి. వాటిని (యాజూజ్, మాజూజ్ జాతులను) నిలువరించడం ఎవరికీ సాధ్యం కాదు. వారు (యాజూజ్, మాజూజ్ ల ప్రజలు) లక్షల సంఖ్యలో ఉంటారు. వారిలో ఓ సైనికపటాలం ముందుకు సాగుతూ తబ్రియా అనే చెరువు దగ్గర ఆగి దాని నీరంతా తాగేస్తుంది. దాని వెనుక వచ్చే మరో పటాలం సైనికులు నీరులేని ఆ చెరువును చూసి “ఇందులో లోగడ తప్పకుండా నీరు ఉంది ఉంటుంది” అని చెప్పుకుంటారు. 

ఆ తర్వాత ఆ సైనికులు బైతుల్ మఖ్దిస్ లోని ఖమర్ కొండ దగ్గరకు చేరుకుంటారు. అక్కడ విడిదిచేసి “మనం భూవాసులను చంపేశాం. ఇప్పుడిక ఆకాశావాసుల్ని చంపేద్దాం” అని చెప్పుకుంటారు. ఈ నిర్ణయం తీసుకోగానే అందరూ ధనస్సులు ఎక్కుపెట్టి ఆకాశం వైపుకు బాణాలు వదులుతారు. అప్పుడు అల్లాహ్ వారి బాణాలను రక్తంలో ముంచి వెనక్కి పంపుతాడు. రక్తసిక్తమయ్యి తిరిగొచ్చిన తమ బాణాలు చూసి వారు మురిసిపోతూ, తాము భూమిపైనే గాకుండా ఆకాశములో కూడా విజయం సాధించగలిగామని భావిస్తారు.

ఈ విధముగా వారు గుట్టలు, మిట్టలు దాటుతూ ఉరుకులు, పరుగులు పెడుతూ, సర్వత్రా విధ్వంసం సృష్టిస్తూ ముందుకు సాగుతారు. ముస్లింలు వారి దౌర్జన్య ధాటికి నిలువలేక గగ్గోలు పెడతారు. హజ్రత్ ఈసా (అలైహి) సైతం వారి ముందు నిలువలేక ముస్లింలను వెంట బెట్టుకుని ఇంతకూ ముందే తూర్ పర్వతం ఎక్కి రక్షణ పొందుతారు. అయితే వారు అలా తూర్ కొండ మీద ఎన్నాళ్ళు ఉండవలసి వస్తుందో కాని, తీవ్రమైన ఆకలి, ఆందోళనలతో సతమతమవుతుంటారు. అప్పుడు హజ్రత్ ఈసా (అలైహి) యాజూజ్, మజూజ్ ల వినాశనం కోసం అల్లాహ్ ని ప్రార్ధిస్తారు. దాంతో ఆ ఆటవిక జాతులు అల్లాహ్ ఆగ్రహానికి గురయి, దేహాలలో పురుగులు పడి గుట్టలు గుట్టలుగా పడిచస్తారు.

వారి (యాజూజ్, మాజూజ్ ఆటవిక జాతుల) పీడా విరగడైపోయిన తర్వాత ఈసా (అలైహి), ఆయన అనుచరులు కొండ దిగి వస్తారు. అయితే నేలమీద యాజూజ్, మజూజ్ ల శవాలు కుళ్ళిపోయి దుర్వాసన నలు దిక్కులా వ్యాపిస్తుంది. అంచేత ఈసా (అలైహి), ఆయన అనుచరులు అల్లాహ్ ని ప్రార్థిస్తూ...., “అల్లాహ్! ఈ శవాల కొవ్వు, దుర్వాసనల నుండి మమ్మల్ని కాపాడు” అని మొరపెట్టుకుంటాడు. అల్లాహ్ వారి మొర ఆలకించి వాటి నిర్మూలన కోసం రాకాస్సి పక్షుల్ని పంపుతాడు, అవి ఈ శవాలను పంజాలతో పట్టుకెళ్ళి అల్లాహ్ ఆదేశించిన చోట పారేస్తాయి. ఆ తర్వాత అల్లాహ్ భారీ వర్షం కురిపిస్తాడు. దాంతో భూమి పరిశుభ్రమై పోతుంది. (సంక్షిప్తం - బుఖారి, ముస్లిం).●

యాజూజ్, మజూజ్ ల పీడా కూడా విరగడై పోయాక ప్రపంచమంతటా శాంతియుత వాతావరణం నెలకొంటుంది. హజ్రత్ ఈసా (అలైహి), ఆయన అనుచరులు సుఖ సంతోషాలతో జీవితం గడుపుతారు, అల్లాహ్ వారిని ఎంతగానో కరుణిస్తాడు. ఆయన అనుగ్రహంతో భూమి సస్యశ్యామలం అవుతుంది. ప్రతి చోటా విపరీతమైన పండ్ల చెట్లు పుట్టుకుని వస్తాయి. అవి పరిమాణంలో ఎంతో పెద్దగా వుంటాయి. ఒక్క దానిమ్మకాయనే అనేకమంది తింటారు. దాని తొక్కను పెద్ద గొడుగులా చేస్తారు. అల్లాహ్ పాలలో కూడా ఎంతో శుభం కలిగిస్తాడు. ఒక ఒంటె నుండి తీసే పాలను అనేక మంది కడుపు నిండా తాగుతారు. ఒక ఆవు నుండి పితికే పాలను ఓ పెద్ద తెగ తాగుతుంది.ఒక మేక నుండి తీసే పాలని ఒక చిన్న తెగ తాగుతుంది. ఈ విధంగా అల్లాహ్ ఆహార పదార్థాలన్నిటిలోనూ శుభం కలిగిస్తాడు.

హజ్రత్ ఈసా (అలైహి) కాలంలో సర్వత్రా శాంతి శుభాలు వెళ్లివిరుస్తాయి. అందరూ సుఖ సంతోషాలతో మనుగడ సాగిస్తారు. హజ్రత్ ఈసా (అలైహి) పునరాగమనం, ఆయన కార్య కలాపాలు చూసి లోకంలోని క్రైస్తవులంతా ఆయన్ని విశ్వసిస్తారు. ఆయన శిలువను విరగ్గొట్టి వారి అంధ విశ్వాసాలకు శాస్వతంగా తెర దించుతారు. సూకర సంహారం కూడా చేస్తారు. తద్వారా ఆయన పంది మాంసం నిషిద్ధమని ప్రకటిస్తారు. ఈ విధముగా క్రైస్తవులంతా ఇస్లాం స్వీకరించి ముస్లింలుగా మారుతారు. ఇతర మతస్తులు కూడా ఏదో విధముగా ముస్లింలుగా మారిపోతారు. ప్రపంచమంతటా ఒక్క ఇస్లాం మాత్రమే రాజ్యమేలుతుంది.

● ఈ విషయాలను గురించి అంతిమ దైవప్రవక్త (సల్లం)ఇలా ప్రకటించారు : *"హజ్రత్ ఈసా (అలైహి) పునరాగమనంతో క్రైస్తవుల అపోహలన్నీ దూరమైపోతాయి. వారికి వాస్తవం తెలిసిపోతుంది. హజ్రత్ ఈసా (అలైహి) శిలువను విరగ్గొడతారు. పందిని చంపుతారు. (అంటే ఈసా శిలువ పై చనిపోయారన్న వారి అంధ విశ్వాసాన్ని, త్రిత్వాన్ని అంతమొందించి ఇతర అనేక మూఢ నమ్మకాలతో పాటు, తమంతట తాము ధర్మ సమ్మతం చేసుకున్న పంది మాంసాన్ని సైతం నిషేధిస్తారు). దుర్జనులు నాశనమై పోగా మిగిలిపోయే ముస్లింలతో భూమి నిండి పోతుంది. ప్రపంచములోని ప్రజలందరి ధర్మం ఒకటే అవుతుంది. మానవులు అల్లాహ్ ను తప్ప మరెవరినీ ఆరాధించటం జరుగదు”.* (అహ్మద్, ఇబ్నెమాజ).●

● *హజ్రత్ ఈసా (అలైహి) కాలములో ప్రపంచమంతటా శాంతి, సౌభ్రాతృత్వం, నీతి, న్యాయాలు నెలకొంటాయి. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా శత్రుభావం ఉండదు. ధన సంపత్తి విపరీతముగా పెరిగిపోతుంది. చివరికి దానం (జకాత్) స్వీకరించే ఒక్క మనిషి కనిపించడు. శిస్తులు, పన్నులు రద్దయిపోతాయి. ఈ విధముగా హజ్రత్ ఈసా (అలైహి) ప్రపంచములో ఏడేళ్ళు (ఒక ఉల్లేఖనం ప్రకారం నలబై ఏళ్ళు) జీవించి, ఆ తరువాత (సహజ మరణం ద్వారా) తన ప్రభువు సన్నిధికి చేరుకుంటారు. మరికొన్ని ఉల్లేఖనాల ప్రకారం ఆయన వివాహం చేసుకుని సంతానం కూడా కంటారు. ఆయన (ఈసా) భౌతిక కాయాన్ని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి సమీపములో ఖననం చేయడం జరుగుతుంది.* (ముస్లిం, మిష్కాత్)●

ఇంతటితో ప్రవక్త *హజ్రత్ ఈసా అలైహిస్సలామ్* భాగము ముగిసినది. Insha Allah రేపటి భాగము - 79 లో ఈసా అలైహిస్సలామ్ గారి భాగములో గ్రహించవలసిన పాఠాలు గురించి మరియు ఇస్లాం ను అధ్యయనం చేసి, ఈ భూమి పై ఇస్లాం ఒక్కటే సత్యధర్మం అని తెలుసుకొని, ఇస్లాం ను స్వీకరించిన కొందరు క్రైస్తవుల గురించి తెలుసుకుందాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆ 
             (rafeeq)

☆☆  Salman    +919700067779 ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment