48

🤚🏻✋🏻 🕌   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*   🕌 🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

                               *భాగము - 48* 

____________________________________________

*సబా జాతి ప్రజలు* 

ఎమన్ (యెమన్) లో ముఅన్నియా పరిపాలన అంతమయ్యింది. రాజ్యం సబాజాతి వారి హస్తగతమైంది. అయితే సబాజాతి ప్రజలు కూడా పాత రాజుల సంప్రదాయాలు, భాషా విధానాలనే అవలంబించారు. అతి కొద్దికాలంలోనే సబాజాతి ప్రజలు అసాధారణ ప్రగతి సాధించారు. మారిబ్ పట్టణం రాజధానిగా వారి పరిపాలన కొనసాగింది.

క్రీ.పూ. 965-926 మధ్య కాలంలో అంటే సులైమాన్‌(అలైహి) ప్రవక్తగా ఉన్న  కాలంలో సబాదేశం రాణి బిల్కిస్ తో పాటు ఆ దేశప్రజలు అత్యధికమంది సూర్యారాధన, విగ్రహపూజలను వదలి ఇస్లాం స్వీకరించారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాల తర్వాత క్రమంగా సబా జాతిలో మళ్ళీ విగ్రహారాధన చోటు చేసుకుంది.

క్రీ.పూ. 650-115 వరకు సబాజాతి ఉచ్చ స్థితిలో ఉండింది. ఆ కాలంలో సబాజాతి ప్రజలు వ్యవసాయ, వాణిజ్య రంగాల్లో ఎంతో పురోభివృద్ధి సాధించి యావత్తు జాతుల్లో గొప్ప ధనికజాతిగా ప్రసిద్దిచెందారు.

*ఆనకట్టల నిర్మాణం* 

ఎమన్ చాలా సారవంతమైన దేశం. విశాలమైన లోయలు, మైదానాలతో విరజిల్లే దేశం. కానీ నీటి సమస్య తీవ్రంగా ఉంది. అక్కడ సహజమైన నదులేవి లేవు. వర్షాకాలంలో వర్షాలు బాగా కురిసేవి, కానీ వర్షపు నీరు ఎక్కడ నిల్వ ఉండేది కాదు. మొత్తం నీరంతా ప్రవహించుకపోయేది. ఎమన్ ప్రజలు కష్టజీవులు. ఒక గొప్ప నీటిపారుదల వ్యవస్థను నిర్మించుకున్నారు. వర్షాకాలంలో కొండల పై నుండి ప్రవహించే వరద నీటికి అనేక చోట్ల ఆనకట్టలు నిర్మించి పెద్ద జలాశయం తయారు చేసుకున్నారు. వర్షపు నీటిని ఆనకట్టల ద్వారా నిలువచేసి కాలువల ద్వారా తమ అవసరాలకు తగిన విధంగా పంట భూములకు తరలించేవారు. ఆ జలాశయం నుండి కాలువలు తీసి తోటలకు, ప౦ట భూములకు మళ్లించి మొత్తం దేశాన్ని సస్యశ్యామలం చేశారు. ఈ కాలువల ఆధారంగానే వ్యవసాయం జరిగేది. అలాగే వారు భూ మార్గము మరియు సముద్ర మార్గాల ద్వారా సరుకులు ఎగుమతి దిగుమతులు చేసుకుంటూ వ్యాపార రంగాన్ని ఎంతో వృద్ధిదేశారు.

మారిబ్ పట్టణం నుంచి ఎమన్ లోని చాలా ప్రాంతాలకు నీరు సరఫరా అయ్యేది. ఈ నీటిపారుదల వ్యవస్థ వల్ల ఆ ఎడారి నెలలు చాలా వరకు సస్యశ్యామలం అయ్యాయి. మారిబ్ పట్టణం ఒక పెద్ద ఉద్యానవనంలా ఉండేది. సబాజాతి ప్రజలు చాలా కష్టించి పని చేసేవారు. ఫలితంగా పంటలు పుష్కలంగా పండేవి. పశు సంపదతో, పాడిపంటలతో దేశం అలరారేది.

తమ రాజ్యంలో భౌగోళికంగా ఎంతో కీలక ప్రదేశాలు ఉండటం వల్ల సబాజాతి ప్రజల వ్యాపారం దాదాపు వెయ్యి సంవత్సరాలపాటు మూడు పువ్వులు ఆరుకాయలుగా వికసించింది. ఆ కాలంలో వారు వెండి మరియు బంగారంతో చేయబడిన పాత్రలు ఉపయోగించేవారు. గోడలకు, కప్పులకు సైతం వెండి బంగారు నగిషీలుండేవి.

సబాజాతి ప్రజల ఆర్థికాభివృద్ధి, విలాస జీవిత గాధలు విని రోమన్లు, గ్రీకులు కూడా ఈర్ష్య పడేవారు. సబాజాతి ప్రజలు వంట చెరుకుగా గంధపు కలప, దాల్చిన చెక్కలను ఉపయోగించేవారు. కొండలను తొలచి పెద్ద పెద్ద మేడలు నిర్మించారు. మానవ చరిత్రలొనే మొట్టమొదట సనా పట్టణంలోని ఒక ఎత్తయిన కొండ ప్రదేశంలో 20 అంతస్తుల భవనం నిర్మించారు. అందులో ప్రతి అంతస్తూ 36 అడుగుల ఎత్తు ఉండేది. ఈ రాజ భవనం అనేక శతాబ్దాల వరకు ఖ్యాతిగాంచింది.

*అల్లాహ్ ఆగ్రహం* 

ఈ సుఖాలు, భోగ భాగ్యాలు సబాప్రజల పై అల్లాహ్ అనుగ్రహం ఉన్నంత కాల౦ కొనసాగాయి. సబాజాతి ప్రజలు, వారి ప్రభువు అల్లాహ్ ప్రసాదించిన ఉపాధిని అనుభవిస్తూ, అల్లాహ్ పట్ల కృతజ్ఞులుగా చూపలేదు. సబాజాతి ప్రజలు ఈ సౌభాగ్యం అల్లాహ్ ప్రసాదించిందని మర్చిపోతే సంపద, భోగభాగ్యాలు కూడా శాపాలుగా పరిణమిస్తాయి. చివరికి సబా జాతి ప్రజల ఐశ్వర్యం, వారి ప్రాపంచిక వ్యామోహాలు వారి హృదయాల నుండి ధైవభీతిని దూరంచేశాయి. భోగభాగ్యాల జీవితం సబాజాతి ప్రజల్ని ఏమరపాటు కు గురి చేసింది. అల్లాహ్ ని మరచిపోయేలా చేసింది. అనేక రకాలు చెడులు వారిలో చోటుచేసుకున్నాయి. వారు స్వార్థపరులుగా, అహంకారులుగా తయారయ్యారు. చివరకు సోమరితనానికి గురయ్యారు. ఆనకట్టల నిర్వహణ విషయంలో అశ్రద్ధ చూపారు. ఈ విధంగా వారిలో అల్లాహ్ పట్ల కృతఘ్నత, ధిక్కార ధోరణులు హద్దుమీరిపోవడంతో అల్లాహ్ ఆగ్రహం విరుచుకుపడింది. పొరుగురాజ్యాల నుండి తట్టుకోలేని దాడులు ప్రారంభమయ్యాయి.

చివరికి క్రీ.శ. 45 లో భయంకరమైన తుఫాను, వరదలు వచ్చి విపత్తు విరుచుకుపడింది. జలాశయానికి పెద్ద గండ్లు పడ్డాయి. అతిపెద్ద ఆనకట్ట తెగింది. కట్ట తెంచుకున్న నీరు ఒకదాని తర్వాత ఒకటిగా అనేక ఆనకట్టలను ధ్వంసం చేసింది. దాంతో సబాజాతి ప్రజల తోటలు, పంట భూములు వరద ముంపుకు గురయి సర్వనాశనమయ్యాయి. ఆ మహా వరదలో యావత్తు దేశం సర్వనాశనం అయింది. నీటిపారుదల వ్యవస్థ యావత్తూ కుప్పకూలిపోయింది.

ఒకప్పుడు ఉద్యానవనంలా అలరారిన దేశం ఒక శిథిల నగరంగా మారింది. పూర్వం మధురఫలాలతో నిండిన తోటల స్థానంలోనే చేదు పండ్లు పండే మరో రెండు తోటలుగా, అడవి చెట్లు, పిచ్చిమొక్కలు, చింతపండు వంటి ఫలాలు తప్ప మరేమీ పండని నేల గా రూపాంతరం చెందింది. కాకపోతే ఆ తోటలలో అక్కడక్కడ కొన్ని రేగుచెట్లు, వెదురు చెట్లు మాత్రమే ఉన్నాయి.

చివరకు ఒకప్పుడు ఉద్యానవనాల్లో కిలకిలరావాలతో ఆహ్లాదపరిచిన పక్షులు కూడా వలస పోయాయి. సబాజాతి ప్రజలు తమ ఇల్లు, వాకిళ్ళు వదిలి ఇతర ప్రాంతాలకు తరలిపోవలసి వచ్చింది. కొందరు సిరియా వెళ్లిపోయారు. కొందరు మక్కాలోను, కొందరు ఎస్రిబ్ లోనూ, ఇతర ప్రదేశాలలోను వెళ్ళి స్థిరపడ్డారు. ఆ విధంగా సబా జాతి ప్రజలు చెల్లాచెదురయ్యారు.

ఈ విధంగా సబాజాతి ప్రజలు తమకు తాము అన్యాయం చేసుకున్నారు. చివరకు అల్లాహ్ వారిని చెల్లాచెదురు చేసి చరిత్ర గర్భంలో కలిపేశారు. కృతజ్ఞులు, సహణశీలులకు ఇందులో గొప్ప సూచనలు ఉన్నాయి.

ఇది సత్యతిరస్కారులకు అల్లాహ్ ఇచ్చిన ప్రతిఫలం. కృతఘ్నులైనవారికి తప్ప మరెవ్వరికి ఇలాంటి ప్రతిఫలం ఇవ్వడం జరగదు.

*సబాజాతి ప్రజలకు ఎదురైన విపత్తు గురించి తర్వాతి తరాలు కథలు కథలుగా చెప్పుకున్నాయి. అల్లాహ్ కారుణ్యం వల్ల అపరిమిత సౌభాగ్యాలు పొందిన వారు అల్లాహ్ అని మరిచిపోయి ఏవిధంగా నాశనమయింది అనేక తరాల వారికి గుణ పాఠంగా మిగిలిపోయింది.* 

Insha Allah రేపటి భాగము - 49 లో మూసా అలైహిస్సలామ్ కాలంలో ప్రవేశపెట్టి దావూద్ అలైహిస్సలామ్ కాలం వరకు కొనసాగిన సబ్బత్ నియమం గురించి తెలుసుకుందాము.

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

☆☆   ®@£€€q  +97433572282 ☆☆

No comments:

Post a Comment