28

🤚🏻✋🏻🤚🏻✋🏻 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🤚🏻✋🏻🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

                               *భాగము - 28* 

____________________________________________

*మూసా అలైహిస్సలామ్ కు, మాంత్రికులకు బహిరంగ పోటీ*

మాంత్రికులు, ప్రజలు, మూసా (అలైహి), ఫిరౌన్ మొద" వారు అందరూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పోటీ మొదలుకాకముందే మూసా (అలైహి) లేచి నిలబడ్డారు. గుమిగూడిన ప్రజల్లో గుసగుసలు మొదలయ్యాయి.

ఆ మాంత్రికులు వారిలో వారు ఇలా అనుకున్నారు. "మన మాయజాలంతో ప్రజలను ఆకట్టుకోవాలి. మూసా (అలైహి) ను ఒక మోసగాడిగా నిరూపించాలి. ఫిరౌన్ ఇస్తానన్న కానుకలను, సంపదను, పేరు ప్రతిష్టలను గుర్తుంచుకోండి. వీరిద్దరు మంత్రగాళ్ళు మాత్రమే. వారు తమ మంత్రబలంతో మిమ్మల్ని మీ దేశం నుంచి వెల్లగొట్టాలని, మీ మతాన్ని, మీ ఉదాత్తసంస్కృతిని తుడిచిపెట్టాలని భావిస్తున్నారు. కనుక ఈ రోజు మీ శక్తియుక్తిలన్నీ సమీకరించుకొని, సేనావాహినిగా బరిలోకి దిగండి. గుర్తుంచుకోండి, ఈ రోజు ఎవరిది పైచేయి అవుతుందో వారిదే గెలుపు."

ప్రత్యర్థి మాంత్రికులు పోటీకి సిద్ధమయ్యారు. మూసా అలైహిస్సలామ్ కూడా పోటీకి సిద్ధమయ్యారు.

పోటీ ప్రారంభమైంది. ఆ మాంత్రికులు మూసా (అలైహి) ని ఉద్దేశిస్తూ ..... "మూసా! ముందు నీ మహత్యాన్ని చూపి పోటీని ప్రారంభిస్తావా? లేక మమ్మల్ని ప్రారంభించమంటావా?" అని అన్నారు.

మూసా (అలైహి) : - లేదు. ముందు మీరే ప్రారంభించండి.

ఆ మాంత్రికులు సభలో ఉన్న వారందరినీ భీతావహ స్థితికి లోను చేస్తూ తమ మంత్రదండాలను నేల పైకి విసిరారు. అలా విసిరిన మరుక్షణం ఆ కర్రలు, తాళ్ళు పాములుగా మారి పడగలు ఎత్తి బుసలు కొట్టడం ప్రారంభించాయి. ఈ తతంగాన్ని ప్రజలు నిర్ఘాంతపోయి చూడసాగారు. ఫిరౌన్, అతడి అనుచరులు సంతోషంగా చప్పట్లు కొట్టారు.

ఇది చూసిన మూసా (అలైహి) భయపడ్డారు. కానీ ఆ తర్వాత భయపడకుండా కర్రను విసరమని అల్లాహ్ మూసా (అలైహి) కు ధైర్యాన్నిచ్చాడు. "మూసా! భయపడకు నీవే గెలుస్తావు. నీ చేతిలో ఉన్న కర్రను కింద పడేయ్యి. ఇపుడే అది వారి అభూతకల్పనలన్నింటిని తృటిలో మింగేస్తుంది. వీరు చేసినదంతా మంత్రజాలం మాత్రమే. మాంత్రికులు ఎంత అట్టహాసంగా వచ్చిన ఎన్నటికీ విజయం సాధించలేరు." అని అన్నారు అల్లాహ్.

మూసా (ప్రత్యర్థి మంత్రగాళ్లతో) : - మీరు పడవేసింది మంత్రజాలం మాత్రమే. ఇపుడు చూడండి అల్లాహ్ దాన్ని ఎలా విచ్చిన్నం చేస్తాడో! అల్లాహ్ దుర్మార్గుల పనిని నెరవేరనీయుడు. దుర్మార్గులకు ఎంత వెగటు కలిగిన అల్లాహ్ తన నిదర్శనాలతో సత్యాన్ని సత్యంగా నిరూపించి తీరతాడు.

అల్లాహ్ ఇచ్చిన ధైర్యంతో భయపడకుండా మూసా (అలైహి) తన చేతి కర్రను కిందకి విసిరారు. అది తృటిలో విజృంభించి పెద్ద కొండచిలువగా మారిపోయింది. ప్రజలు భయంతో లేచినిలబడ్డారు. ఏం జరుగుతుందో అని మెడలు నిక్కించి చూడసాగారు. ఫిరౌన్ మరియు అతడి అనుచరులు ఏం జరుగుతుందా అని నిశ్శబ్దంగా చూస్తున్నారు. ఇంతలో ప్రత్యర్థి మాంత్రికుల మంత్రబలానికి అభూతకల్పనలో నుంచి పుట్టుకొచ్చిన పాములను ఈ కొండచిలువ ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్ని పాములను చక చకా మిగేసింది. ఆ తర్వాత మూసా (అలైహి) కిందకి వంగి ఆ కొండచిలువను పట్టుకున్నారు. ఆ వెంటనే అది కర్రగా మారిపోయింది. ఈ మహత్యాన్ని తమ కళ్లారా చూసిన ప్రజలు ఒక మహా కెరటంలా లేచి కేరింతలు మీద కేరింతలు, కేరింతలు మీద కేరింతలు కొట్టారు. ఇలాంటి వింతను ఆ ప్రజలు గతంలో ఎన్నడూ చూడలేదు.

ఈ విధంగా సత్యం సత్యంగా ఋజువయ్యింది. ప్రత్యర్థి మంత్రగాళ్ళు కల్పించినవన్నీ అసత్యమని తేలిపోయింది. ఫిరౌన్ మరియు అతని అనుయాయులు ఈ పోటీలో ఘోరంగా పరాజితులయి పరాభవం పాలయ్యారు. మూసా (అలైహి) అత్యాద్భుత మహత్యాన్ని చూడగానే మంత్రగాళ్ళు తక్షణం అప్రయత్నంగా అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడ్డారు.

ప్రత్యర్థి మంత్రగాళ్ళు : - మూసా (అలైహి) చేసింది మాయాజాలం కాదు. అది అల్లాహ్ నుంచి ప్రసాదించబడిన మహిమ. మూసా (అలైహి)! మేము సర్వలోక ప్రభువును విశ్వసించాము. మూసా (అలైహి), హారూన్ లు విశ్వసించిన ప్రభువును మేము కూడా విశ్వసించాము. (అని బిగ్గరగా అరిచారు)

ఫిరౌన్ మండిపడుతూ తన మంత్రగాళ్లను ఉద్దేశించి ఇలా అన్నాడు : - ఏమిటీ! నేను అనుమతి ఇవ్వకముందే మీరు మూసా (అలైహి) ను విశ్వసిస్తారా? ఇదంతా ఈ పట్టణం నుంచి ఇక్కడి ప్రజల్ని వెల్లగొట్టడానికి మీరూ, మూసా (అలైహి) కలిసి చేసి పన్నిన పన్నాగం. మూసా (అలైహి) తప్పక మీకు మంత్ర విద్య నేర్పిన గురువు అయి ఉంటాడు. సరే కానివ్వండి! నా తడాఖా ఏమిటో ఇపుడే మీకు తెలిసిపోతుంది.

ఈ పరిణామానికి ఫిరౌన్ ఉగ్రుడైపోయాడు. మూసా (అలైహి) ను దెబ్బతీయడానికి మరో కుట్ర ఆలోచించాడు.

ఫిరౌన్ : - నా దేశ ప్రజలారా! మంత్రగాళ్లకు, మూసా (అలైహి) కు మధ్య మరో పోటీ రహస్య స్థలంలో జరుపుతాము.

మంత్రగాళ్ళు : - మీ ఈ పథకానికి మేము ఒప్పుకోము.

తమ పథకానికి ఒప్పుకోవాలని మంత్రగాళ్లపై ఒత్తిడి తెచ్చాడు ఫిరౌన్. కానీ సత్యాన్ని గుర్తించిన ఆ మంత్రగాళ్ళు ఈ పథకానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని నిక్కచ్చిగా చెప్పేశారు.

ఫిరౌన్ : - మీరు కనుక మేము చెప్పినట్టు మా పథకానికి ఒప్పుకోకపోతే, చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మిమ్మల్ని హతమార్చడం జరుగుతుంది.

మంత్రగాళ్ళు : - మీరు ఎంత బెదిరించిన అల్లాహ్ పట్ల తిరస్కారానికి పాల్పడేది లేదు.

ఫిరౌన్ : - ఖచ్చితంగా ఒప్పుకతీరాలి లేకుంటే, మీ కాళ్ళు చేతులు పరస్పరం వ్యతిరేఖ దిశలో నరికిస్తాను. మిమ్మల్ని ఖర్జూరపు చెట్ల మొదళ్ళ మీద ఉరి తీయించి, శిలువ వెయిస్తాను.

మంత్రగాళ్ళు : - పరవాలేదు! మేము ఎటూ మా ప్రభువు దగ్గరికి పోవాల్సినవాళ్ళమే. మేము అందరి కంటే ముందు అల్లాహ్ ని విశ్వసించాము. అంచేత మా ప్రభువు మా పాపాలు మన్నిస్తాడని మాకు నమ్మకం ఉంది.

మమ్మల్ని పుట్టించిన సృష్టికర్త సాక్షి! మా ముందుకు స్పష్టమైన అల్లాహ్ నిదర్శనాలు వచ్చిన తర్వాత కూడా సత్యాన్ని విశ్వసించకుండా నీకు ప్రాధాన్యం ఇవ్వడం మా వల్ల కాదు. నీవు చేయదలుచుకున్నది ఏమిటో చేసుకో.

ఫిరౌన్! నీవు మహా అయితే ఇహలోక జీవితంలో మాత్రమే మమ్మల్ని ఏదైనా చేస్తావు. మేము మా ప్రభువును విశ్వసించాము. అల్లాహ్ మా తప్పులను క్షమిస్తాడు. నీ ఒత్తిడి వల్ల మేము ప్రయోగించిన ఆ మంత్రజాలాన్ని క్షమిస్తాడు. అల్లాహ్ శ్రేష్ఠుడు, శాశ్వతంగా ఉండేవాడు. (అని అన్నారు నిర్భయంగా)

ఆ మాంత్రికులు అల్లాహ్ పై తమ విశ్వాసాన్ని ప్రకటించగానే, ఫిరౌన్ వారి చేతులను కాళ్ళను ఎదురెదురు కాళ్ళను మరియు చేతులను నరికివేసి శిలువ పైకి ఎక్కించాడు. కానీ ఆ మాంత్రికులు ఈ శిక్షను ఎంతో సహనంగా ఓర్చుకున్నారో గానీ, ఫిరౌన్ కఠిన శిక్షలకు భయపడి వెనుదిరగలేదు. అలా ఆ మంత్రగాళ్ళు అల్లాహ్ మార్గంలో తమ ప్రాణాలర్పించి, నిజమైన ముస్లిములుగా ఈ లోకాన్ని వీడినారు.

ఫిరౌన్ జాతి నాయకులు ఫిరౌన్ ను మరింత ఎగదోస్తూ : - ప్రభూ! మీరు మూసా (అలైహి) ను, అతని జాతిప్రజలను దేశంలో అరాచకం సృష్టించడానికి అలాగే వదిలిపెడతారా? వారు మిమ్మల్ని, మీ దైవాలను ఆరాధించడం మానేస్తే మీరు చూస్తూ ఊరుకుంటారా?

ఫిరౌన్ (ఆగ్రహంతో) : - మనం అధికారంలో ఉన్నాము. మనం వారి మగసంతానాన్ని (కొడుకుల్ని) హతమార్చుదాం. ఆడవారిని (కూతుళ్ళని) మాత్రమే బ్రతకనిద్దాం. వారి మీద మాకు పూర్తి అధికారం ఉంది.

ఫిరౌన్, తన ఆగ్రహాన్ని బనీఇస్రాయీల్ ప్రజలపై ప్రదర్శిస్తూ, వారిని ఊచకోతలకు గురిచేసి భీభత్సాన్ని సృష్టించాడు.

మూసా (అలైహి), తన జాతి ప్రజలను ఓదారుస్తూ : - అల్లాహ్ సహాయం వేడుకోండి. సహనం వహించండి. ఈ భూమి అల్లాహ్ ది. అల్లాహ్ తన దాసులలో తాను కోరిన విధంగా భూమికి వారసులుగా చేస్తాడు. అల్లాహ్ పట్ల భయభక్తులతో మసులుకునేవారిదే అంతిమ విజయం.

బనీఇస్రాయీల్ ప్రజలు : - మూసా! నీవు రాక ముందు కూడా మేము దౌర్జన్యాలను భరించాం. కానీ ఇపుడు నీవు వచ్చిన తర్వాత కూడా మాపై దౌర్జన్యాలు అనేక రెట్లు పెరిగిపోయాయి.

మూసా (అలైహి), వారికి ధైర్యం చెబుతూ : - బాధపడకండి. మీ ప్రభువు త్వరలోనే మీ శత్రువులను తుదిముట్టించి, వారి స్థానంలో మిమ్మల్ని ఈ పుడమిపై తన ప్రతినిధులుగా నియమిస్తాడు. అపుడు మీరెలా నడుచుకుంటారో చూస్తాడు. అల్లాహ్ పట్ల తమ విధులను నిర్వర్తించినవారికి మంచి జరుగుతుంది.
నా జాతి ప్రజలారా! మీరు నిజంగా అల్లాహ్ ని విశ్వసిస్తే అల్లాహ్ మీదే భారం వేయండి. మీరు చిత్త శుద్ధి కలిగిన ముస్లింలు అయితే నా హితవులు పాటించండి.

బనీఇస్రాయీల్ ప్రజలు : - మేము అల్లాహ్ మీదే భారం వేశాము. అల్లాహ్! మమ్మల్ని ఈ దుర్మార్గుల కొరకు పరీక్షగా చేయకు. నీ కారుణ్య కటాక్షాలతో మమ్మల్ని అవిశ్వాసుల బారి నుండి రక్షించు.

అపుడు అల్లాహ్ మూసా అలైహిస్సలామ్ ని, అతని సోదరుడు హారూన్ ని ప్రేరేపిస్తూ.... "మీ జాతి ప్రజల కోసం ఈజిప్టు లో కొన్ని ఇండ్లు సిద్ధం చేసుకోండి. వాటిని ఆరాధన దిశగా చేసుకొని సామూహిక నమాజు వ్యవస్థను నెలగొల్పండి. విశ్వాసులకు శుభవార్త ను వినిపించండి." అని అన్నారు.

అపుడు మూసా (అలైహి) ఇలా ప్రార్థించారు.... "ఓ ప్రభు! నీవు ఫిరౌన్ కు, అతని అధికారులకు ఐహిక జీవితంలో ఐశ్వర్యం, సకలసాధనసంపత్తులు ఇచ్చావు. ప్రభు! ప్రజల్ని నీ మార్గంలోకి రాకుండా నిరోధించడానికా ఇచ్చింది? ప్రభు! వారి సిరిసంపదలు నాశనం చెయ్యి. దుర్భర శిక్ష చూడనంతవరకు సత్యాన్ని విశ్వసించనీయకుండా వారి హృదయ కవాటాలు మూసి వెయ్యి.

అల్లాహ్ : - మీ ఇద్దరి వేడుకోలు స్వీకరించబడింది. ధర్మంలో స్థిరంగా ఉండండి. మూఢుల మార్గం అనుసరించకండి.

ఫిరౌనీయులలో సత్యం పట్ల స్పృహ రావడానికి అల్లాహ్ కొన్ని సంవత్సరాల పాటు ప్రకృతి విపత్తులు కురిపించాడు. అయినా కూడా వారిలో మార్పు రాలేదు.

ఆ ప్రకృతి విపత్తులు ఏవి? అల్లాహ్ ఫిరౌన్ ను మరియు అతని జాతి ప్రజలను ఏ విధంగా శిక్షించాడు? అనే విషయాలలో వివరణను Insha Allah రేపటి భాగము - 29 లో తెలుసుకుందాము.

*ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-* 

ప్రియమైన ముస్లిం సోదరులారా!  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి , ఇదేదో 10 మందికి send చేస్తే మంచి జరుగుతుంది , send చేయకపోతే చేడు జరుగుతుంది అనుకునే msg లు కావు . కాబట్టి మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .

☆☆ ®@£€€q       +97433572282 ☆☆

No comments:

Post a Comment