117

🕌🕌🕌       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        🕌🕌🕌

🛐🛐   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🛐🛐
🤚🏻✋🏻     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🤚🏻✋🏻

 *~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~* 

🕋🕋🕋             *ఇస్లాం చరిత్ర* *- 117*             🕋🕋🕋

☪🇸🇦☪ *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 32* ☪🇸🇦☪

 *■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■*

          *సందేశ ప్రచార ఆదేశం - దాని అంతరార్థం* 

 *యా అయ్యుహల్ ముద్దస్సిర్ (1) ఖుమ్ ఫఅన్'జిర్ (2) వరబ్బక ఫకబ్బిర్ (3) వసియాబక ఫతహ్హిర్ (4) వర్'రుజ్'జ ఫహ్'జుర్ (5) వలా తమ్ నున్ తస్'తక్'సిర్ (6) వ లిరబ్బిక ఫస్'బిర్ (7)* 

 _(↑ పై దివ్య ఖుర్ఆన్ వాక్యాల తెలుగు తర్జుమా ↓)_ 

 *ఓ కంబళి కప్పుకున్నవాడా (1) లే (లేచి జనులను) హెచ్చరించు (2) నీ ప్రభువు గొప్పదనాన్ని చాటిచెప్పు (3) నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో (4) అశుద్ధతను వదిలిపెట్టు (5) ఉపకారం చేసి ఎక్కువ (ప్రతిఫలం) పొందాలని ఆశించకు (6) నీ ప్రభువు కొరకు ఓర్పు వహించు (7) {ఖుర్ఆన్ 74:1-7}* 


“ముద్దస్సిర్” అధ్యాయపు మొదటి వాక్యాల్లో - “యా అయ్యుహల్ ముద్దస్సిర్ నుండి వ లిరబ్బిక ఫస్'బిర్” వరకు - దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం)కు అనేక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చూడటానికి అవి ఎంతో సంక్షిప్తంగా, సాదాగా కనబడినప్పటికీ, యదార్థంగా ఎంతో సుదూర లక్ష్యాల కోసం ఇవ్వబడ్డ ఆదేశాలు. జీవన శైలిపై వారి ప్రభావాలు ఎంతైనా పడగలవు.

 *1.* “ఇన్'జార్” (హెచ్చరించడం) యొక్క ఉచ్చస్థితి ఏమిటంటే, ఈ విశ్వంలో అల్లాహ్ అభీష్టానికి విరుద్ధంగా ఏ కార్యకలాపాలైతే కొనసాగుతున్నాయో వాటి దుష్పరిణామాలను గురించి ప్రజల్ని హెచ్చరించడం, ఆ హెచ్చరిక కూడా దైవశిక్ష భయం వల్ల ఎదుటివాని మనోమస్తిష్కాల్లో ఓ తుఫాను చెలరేగేటట్లు ఉండాలి.

 *2.* దేవుని ఔన్నత్యం, ఘనతలను చాటడం. దీని తుది ధ్యేయం, భూ మండలంపై మరెవ్వరి ఔన్నత్యాన్ని మిగిలి ఉంచడానికి వీల్లేకుండా చేయడం. సరికాదా అలా తమ ఔన్నత్యాలను, ఘనకీర్తిని చాటుకునే వారి నడ్డిని విరిచి వారి ఘనతను భూస్థాపితం చేయడం. చివరికి ఒక్క అల్లాహ్ ఔన్నత్యమే మిగలి ఉండేటట్లు పాటుబడడం.

 *3.* వస్త్రాల పరిశుభ్రతను, పరిశుద్ధతను పాటించడం. అంటే బాహ్య మరియు అంతర్గత హృదయ పరిశుద్ధత, నైర్మల్యం అన్నమాట. అన్ని రకాల కల్మషాలు, కాపట్యాల నుండి హృదయాన్ని పరిశుద్ధపరచుకునే అత్యున్నత స్థాయికి చేరుకోవడం. ఇది అల్లాహ్ కారుణ్య ఛాయలోనే మరియు పరిరక్షణలోనే సాధ్యం అయ్యే పని. ఇలా తన శరీరాన్ని, హృదయాన్ని అశుద్ధత నుండి కాపాడుకుంటూ మానవ సమాజానికి ఓ మార్గదర్శకునిగా అలరారడం. అప్పుడుగాని పరిశుద్ధ ఆత్మలు ఆయన వైపునకు మొగ్గు చూపలేవు. ఆయన (సల్లం) గారి ఔన్నత్యం, గాంభీర్యతను చూసి చెడు స్వభావులంతా భయంతో ప్రకంపించిపోవాలి. ఇలా ప్రపంచం అంతా కేవలం “అనుకూలం” లేదా “ప్రతికూలం” అనే రెండే రెండు విషయాల్లో ఆయన (సల్లం) గారిని చుట్టుముట్టవలసి ఉంటుంది.

 *4.* మేలు (ఇహ్సాన్) చేసి దాన్ని మరచిపోవడం. అంటే తన కృషికి, ఘనకార్యాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండడం. సరికదా, ఒక దాని తరువాత మరో సదాచరణ కోసం పాటుపడుతూ ఉండాలి. సతతం కష్టపడుతూ పెద్ద త్యాగాలు చేసినప్పటికీ. ఇది తాను చేసిన ఘనకార్యాలుగా ఉబ్బిపోకుండా, ఇదంతా దైవకటాక్షం వల్ల జరిగినదే తప్ప మరేదీ కాదు అని తలచడం. అంటే, దైవస్మరణ, ఆయన ఎదుట జవాబు చెప్పుకోవలసి ఉంది అనే భావన ఈ కృషిని, త్యాగాలను గుర్తురాకుండా చేసేటట్లు నడచుకోవడం అన్నమాట.

 *5.* చివరి ఆయత్ (వాక్యం)లో, అల్లాహ్ తరఫున సందేశ ప్రచార ఉద్యమం చేపట్టిన వెంటనే శత్రువుల నుండి వ్యతిరేకత, ఎగతాళి, నవ్వులాట, అపహాస్యం రూపంలో హింసించడం మొదలు, ఆయన (సల్లం)ను, ఆయన అనుచరగణాన్ని హతమార్చే మరియు ఆయన చుట్టూ చేరిన విశ్వాసులందరిని తుదముట్టించేటంతటి దుస్సాహాసాలు కూడా జరుగుతాయి అని హెచ్చరించడం జరిగింది. అవన్నీ మున్ముందు మీకు (దైవప్రవక్త(సల్లం)కు) ఎదురవుతాయి అని చెప్పడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో దైవప్రవక్త (సల్లం) ఎంతో ధైర్యంగా, దృఢంగా వాటన్నింటిని ఎదుర్కోవడానికి సహనం వహించవలసి ఉంటుందని ఉద్భోదించడం జరిగింది. ఈ సహనం, సంయమనాలకు ఫలితంగా ఆయన తన కోరికలు తీర్చుకోవడం కాకుండా కేవలం అల్లాహ్ సంతుష్టి కోసం, ఆయన ధర్మోన్నతి కోసమే ఇదంతా చెయ్యాలని హెచ్చరించడం జరిగింది. ( *వలిరబ్బిక ఫస్'బిర్ – నీ ప్రభువు కోసం ఓర్పు వహించు* ).

 *అల్లాహ్ అక్బర్! ఈ ఆదేశాలు చూడడానికి ఎంత సాదాసీదాగా ఉన్నాయి. ఈ వాక్యాల కూర్పు ఎంత శాంతంగా, మనసును అలరించేదిగా ఉంది! అయితే ఆచరణ మరియు ధ్యేయసాధన రీత్యా ఈ ఆదేశాలు ఎంత భారమైనవి, మహోన్నతమైనవి, ఎంత కఠినతరమైనవో ఆలోచించండి! వీటి ఆచరణ ఫలితంగా ఎలాంటి తుఫాను చెలరేగుతుంది! అది ప్రపంచ మూల మూలన ఎంతటి సంచలనం సృష్టిస్తుంది!!* 

  దివ్య ఖుర్ఆన్ లోని పై ఆయత్ లలో (వాక్యాలలో) సందేశ ప్రచారానికి సంబంధించిన సరంజామ అంతా ఉంది. మానవాళి ఆచరించే ఆచరణలు కొన్నింటి పరిణామాలు బహు చెడ్డవి. ప్రపంచంలో మనిషి చేసిన సత్కార్యాలకుగాని, దుష్కార్యాలకుగాని పూర్తి ప్రతిఫలం లభించజాలదు. అందుకని ఆయత్ లో “ఇన్జార్” అనే పదాన్ని తరచి చూడగా, ప్రపంచంలోని కాలపరిమితే కాకుండా, ప్రతి కర్మకు తగిన ప్రతిఫలం లభించే ఓ దినం ఎంతైనా అవసరం. ఈ దినమే ప్రళయ దినం. పూర్తి ప్రతిఫలాన్ని పొందే దినం. ఈ రోజు కర్మలకు ప్రతిఫలం లభించాలంటే, మనం ఈ ప్రపంచంలో గడిపే జీవితమే కాకుండా మరో జీవితం ఎంతైనా అవసరమన్న సంగతి ఇట్టే గ్రహించగలం.

  తక్కిన వాక్యాల్లో దైవదాసులు స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసన (తౌహీద్)ను అవలంభించాలని, తమ వ్యవహారాలన్నీ అల్లాహ్ కే అప్పగించాలని, దైవ అభీష్టాన్ని పొందాలంటే మనిషి తన కోరికల్నీ, ప్రజల అభీష్టాలనూ విడనాడాలని ఆదేశించడం జరిగింది. ఇలా సందేశ ప్రచారమంతా ఈ క్రింది విషయాలపై ఆధారపడి ఉంది.

 *1.* ఏకేశ్వరోపాసన (తౌహీద్)

 *2.* ప్రళయ దినాన్ని విశ్వసించడం.

 *3.* మనస్సును పరిశుద్ధపరచడం. అంటే దుష్పరిణామాల వరకు గొనిపోయే చెడు, అశ్లీల కార్యాలను విడనాడి, సత్కార్యాలు, మేలు, శాంతి మార్గాన్ని అవలంబించే ప్రయత్నం చేయడం.

 *4.* మనిషి తన వ్యవహారాలన్నింటినీ అల్లాహ్ కే అప్పజెప్పడం.

 *5.* దైవప్రవక్త (సల్లం) గారి దైవదౌత్యాన్ని విశ్వసించి, ఆయన చూపిన మహోన్నత నాయకత్వంపై మార్గం పై ఆయన అడుగుజాడల్లో నడవడం.

     ఇదే కాదు, ఈ వాక్యాలు దైవం తరఫున అవతరించినవారికి, వీటిలో దైవప్రవక్త (సల్లం)ను ఈ మహోన్నత కార్యం కోసం లేచినిలబడాలని, నిదుర మత్తును వదలి “జిహాద్” (సతతం దైవమార్గంలో కృషి చేయడం) కోసం పురిగొల్పడం జరిగింది. “యా అయ్యుహల్ ముద్దస్సిరు ఖుమ్ ఫ అన్జిర్” (వస్త్రం కప్పుకుని పడుకున్న ఓ మనిషీ! లే; లేచి హెచ్చరించు) అని సంబోధించటం జరిగింది. అంటే, తన కోసమే బ్రతుకదలచిన వానికి కష్టాలతో పనిలేదు, హాయిగా బ్రతుకవచ్చు. అయితే ఓ ప్రవక్తా! నీవు ఏ పెద్ద భారాన్నయితే మోస్తున్నావో దానికీ, నిదురకు ఎలాంటి సంబంధం లేదు. నీకు సుఖంతో పనేమిటి. వెచ్చటి పడక అవసరం ఏమిటి? ప్రశాంత జీవనం, హాయినిగొలిపే వస్తుసామాగ్రితో నిమిత్తమేమిటి?? లే; లేచి నీకై ఎదురుచూస్తున్న ఆ మహోన్నత కార్యంలో నిమగ్నమైపో. నీ కోసమే సమకూర్చబడిన ఆ భారాన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నించు. లే, లేచి నిలబడు, ఆ అలుపెరుగని పరిశ్రమ కోసం. ఇది నిదురపోవడానికి, సేద తీర్చుకోవడానికి సమయం కాదు. ఆ కార్యం కోసం సంసిద్ధంగా ఉండు అంటూ హెచ్చరించడం జరుగుతోంది.

      ఇది ఎంత భయంగొలిపే వాక్యం! ఎంత మహోన్నతమైన వచనం!! దైవప్రవక్త (సల్లం)ను శాంతమైన గృహవాతావరణం నుండి, వెచ్చటి ఒడి నుండి, సుతిమెత్తని పరుపు నుండి బయటకు లాగి పెనుతుఫాను, ఉప్పెనలతో అతలాకుతలమైవున్న సముద్ర లోతుల్లోనికి విసిరేసినట్లయింది.

      తరువాత దైవప్రవక్త (సల్లం) లేచి నిలబడ్డారు. అలా ఇరవై సంవత్సరాల వరకు అవిశ్రాంతంగా దైవసందేశ ప్రచారం కోసం లేచి నిలబడే ఉన్నారు. సర్వసౌఖ్యాలను త్యజించారు. తన కోసంగాని, తన పరివారం కోసంగాని జీవించే ధ్యాసే లేకుండా పోయిందాయనకు. ఆయన (సల్లం) ఆపని కేవలం అల్లాహ్ మార్గం వైపునకు ప్రజల్ని ఆహ్వానిచడం. నడ్డివిరిచే ఈ మహోన్నత భారాన్ని భుజస్కంధాలపై ఎలాంటి ఒత్తిడికి గురికాకుండానే ఎత్తుకున్నారు. ఆ భారం ఏమిటి? భూ మండలంపై అమానతు (Trust) భారం. సర్వమానవ జాతి భారం. సంపూర్ణమైన విశ్వాస భారం. వివిధ రంగాల్లో జిహాద్, రక్షణల భారమది. ఇరవై ఏళ్ళ కంటే అధికంగానే ఈ సర్వతోముఖ పోరాటంలో జీవితం గడచిపోయింది. ఈ జీవిత కాలమంతా అంటే, ఆ ఆకాశవాణి విన్నపటి నుంచి, ఈ బాధ్యతా భారం నెత్తినపడ్డప్పటి నుంచి, సర్వసన్నద్ధంగా, జాగరూకతగా మెలిగారాయన. అల్లాహ్, ఆయన (సల్లం)కు మన తరపున, సర్వమానవాళి తరఫున అత్యుత్తమమైన ప్రతిఫలం ఒసరుగాక. (అమీన్)

      రాబోయే పుటల్లో మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) గారి ఈ సుదీర్ఘమైన విశ్రాంతి రహిత జిహాద్ (పరిశ్రమ)కు సంబంధించిన సంక్షిప్త రూప చిత్రీకరణ గురించే చదువగలరు. ↓

Insha Allah రేపటి భాగము నుంచి....,

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment