116

🕌🕌🕌       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        🕌🕌🕌

🛐🛐   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🛐🛐
🤚🏻✋🏻     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🤚🏻✋🏻

 *~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~* 

🕋🕋🕋             *ఇస్లాం చరిత్ర* *- 116*             🕋🕋🕋

☪🇸🇦☪ *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 31* ☪🇸🇦☪

 *■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■*

 *దైవవాణి నిలిచిపోవడం : -* 

దైవవాణి అవతరణ ఎన్ని రోజుల వరకు ఆగిపోయింది అనే విషయంలో, ఇబ్నె సఅద్, ఇబ్నె అబ్బాస్ ఉల్లేఖనాన్ని ఉటంకించారు. దాని ప్రకారం, ఈ నిలిపివేత కొన్ని రోజుల మట్టుకే అని తెలుస్తోంది. అన్ని కోణాలను దృష్టిలో పెట్టుకుని పరిశీలించినప్పుడు ఈ విషయం సరయినది అని నమ్మకంగా చెప్పవచ్చు, దైవవాణి మూడు సంవత్సరాల వరకు ఆగిపోయింది అనేది పూర్తిగా నిరాధారమైన విషయం. అయితే ఇక్కడ ఆధారాలను చూపే సమయం లేదు.

వహీ (దైవవాణి) నిలచిపోయిన ఈ తరుణంలో దైవ ప్రవక్త (సల్లం) ఎంతో మానసిక వ్యధకు గురయ్యారు; అయోమయ స్థితికి లోనయ్యారు. (దీని గురించి →) “సహీ బుఖారీ కితాబుత్తాబీర్” ఉల్లేఖనం ఇలా ఉంది : ↓

“వహీ ఆగిపోయినందువల్ల దైవప్రవక్త (సల్లం)కు, కొండ శిఖరాలపై నుండి దూకేసేటంత వ్యధ కలిగింది. కాని కొండ శిఖరం పైకెక్కి క్రిందికి దుమికే లోపల జిబ్రీల్ (అలైహి) ప్రత్యక్షమై, *“ఓ ముహమ్మద్ (సల్లం), మీరు అల్లాహ్ ప్రవక్త”* అని చెప్పేవారు. వ్యధ కొంత తగ్గి మనస్సుకు ఊరట కలిగేది. వెనక్కు మరలి ఇంటికి వచ్చేసేవారు. అలా తిరిగి దైవవాణి అవతరణలో జాప్యం జరిగిన కొలది తిరిగి కొండ శిఖరాన్నెక్కి క్రిందికి దూకే ప్రయత్నం చేసేవారు. జిబ్రీల్ (అలైహి) తిరిగి ప్రత్యక్షమై ఆ మాటలనే మళ్ళీ పలికేవారు.

 *మలిసారి దివ్యవిష్కృతి (వహీ) అవతరణ : -* 

హఫీజ్ ఇబ్నె హాజర్ (రహ్మలై) గారి ప్రకారం, ఈ పరిస్థితికి (అంటే దైవవాణి అవతరణ నిలచిపోవటం) కారణం, ఆయన (సల్లం)లో ఏర్పడిన ఈ భయ విహ్వలత దూరం అయిపోవాలనే. రెండవసారి దైవవాణి కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడాలన్నదే.

ఈ అయోమయ పరిస్థితి దూరమై, యదార్థం పూర్తిగా బయటపడి ఆయన (సల్లం)కు తాను దైవప్రవక్త అని పూర్తిగా నమ్మకం ఏర్పడి, తన వద్దకు వచ్చినవారు దైవవాణిని తెచ్చే దైవదూత జిబ్రీల్ (అలైహి) అని తెలియగానే దానికి ఆయన (సల్లం) పూర్తిగా సిద్దమైపోయి, ఆయన (జిబ్రీల్) కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. అప్పుడుగాని జిబ్రీల్ (అలైహి) తిరిగి దైవవాణితో ఆయన (సల్లం) వద్దకు రాలేదు.

సహీ బుఖారి గ్రంథంలో హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ ఉల్లేఖనం ఇలా ఉంది : ↓

దైవప్రవక్త (సల్లం) నోట వహీ ఆగిపోయే సంఘటన గురించి అడగగా ఆయన (సల్లం), “నేను వెడుతూ ఉండగా అకస్మాత్తుగా ఆకాశం నుండి ఓ పిలుపు వినవచ్చింది. నేను ఆకాశం వైపు తలెత్తి చూడగా, హిరా గుహలో ప్రత్యక్షమైన దైవదూత ఆకాశం మరియు భూమికి నడుమ ఓ కుర్చీపై కూర్చుని ఉండడం కనపడింది. నేను భయకంపితుడనై భూమి వైపునకు వంగిపోయాను. ఇంటికి తిరిగివచ్చి "నన్ను దుప్పటితో కప్పండి, దుప్పటితో కప్పండి" అని చెప్పాను. అలా నాపై దుప్పటి వేసి కప్పివేయడం జరిగింది. ఆ తరువాత అల్లాహ్, “యా అయ్యుహల్ ముద్దస్సిర్” మొదలు “వర్రుజ్ జ ఫహ్ జుర్” వరకు దైవవాణిని అవతరింపజేశాడు. ఆ తరువాత దైవవాణి ఎలాంటి అడ్డంకుల్లేకుండా నాపై అవతరించసాగింది.

 *(ఓ కంబళి కప్పుకున్నవాడా! లే. (లేచి జనులను) హెచ్చరించు. నీ ప్రభువు గొప్పదనాన్ని చాటిచెప్పు. నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో. అశుద్ధతను వదిలిపెట్టు. ఉపకారం చేసి ఎక్కువ (ప్రతిఫలం) పొందాలని ఆశించకు. నీ ప్రభువు కొరకు ఓర్పు వహించు.) (ఖుర్ఆన్ 74:1-7)* 

కొన్ని ఉల్లేఖనాల ప్రారంభంలో ఈ పదాలు అదనంగా కానవస్తాయి. “నేను హిరాలో ఏతికాఫ్ చేశాను, నా ఏతికాఫ్ పూర్తి అయిన తరువాత కొండ దిగి వచ్చాను. కొండలోయగుండా వెళ్ళేటపుడు నన్ను ఎవరో పిలిచారు. నేను కుడి ఎడమలు, ముందు వెనుక చూస్తే నాకెవ్వరూ కనిపించలేదు. పైకి చూద్దును కదా, హిరా కొండ గుహలో ప్రత్యక్షమైన..... చివరి వరకు.

సీరత్ చరిత్రకారులు చెప్పిన విషయాలన్నింటిని జోడిస్తే, దైవప్రవక్త (సల్లం) రమజాన్ నెలలో మూడేళ్ళ వరకు ఏతికాఫ్ లో ఉన్నారని, దైవవాణి అవతరణ జరిగిన రమజాన్ నెల మూడవది అంటే చివరి రమజాన్ నెలని తెలుస్తుంది. ఆయన (సల్లం) గారి అలవాటు ప్రకారం రమజాన్ నెల పూర్తిగా ఏతికాఫ్ లో ఉండి షవ్వాల్ మాసం మొదటి తేదీనాడు ఉదయాన్నే మక్కా చేరుకునేవారు. పై ఉల్లేఖనంతో, యా అయ్యుహల్ ముద్దస్సిర్ వాక్యాన్ని జోడిస్తే, ఇది మొదటి వహీ (దైవవాణి) అవతరించిన పదవ రోజున అంటే మొదటి షవ్వాల్ నాడు అవతరించింది. వహీని ఆపివేసిన గడవు కేవలం పది రోజులు మాత్రమే. (వల్లాహుఆలమ్)

 *వహీ (దివ్యావిష్కృతి) రకాలు : -* 

ఇప్పుడు మేము ఈ చర్చనీయాంశాన్ని కొద్దిగా ప్రక్కనబెట్టి, దైవదౌత్యం, దైవప్రవక్త (సల్లం) గారి జీవిత చరిత్రకు సంబంధించిన వివరాలను ప్రారంభించే ముందు, “వహీ” (దైవవాణి లేక దివ్యావిష్కృతి)కి సంబంధించిన రకాల గురించి కొంత వివరణ ఇవ్వాలనుకుంటున్నాం. దీనికి కారణం లేకపోలేదు. ఇది దైవదౌత్యపు మూలాధారం మరియు దైవసందేశ ప్రచారానికి ప్రాణం లాంటిది కనుక. అల్లామా ఇబ్నె ఖైమ్ (రహ్మలై), వహీకి సంబంధించిన రకాలు కొన్నింటిని ఈ క్రింది విధంగా చూపడం జరిగింది.

1. *యదార్థ స్వప్నం* : ఈ యదార్థ స్వప్నం రూపంలోనే దైవ ప్రవక్త (సల్లం) వద్దకు మొట్టమొదట వహీ (దివ్యావిష్కృతి) రానారంభించింది.

2. దైవదూత కనపడకుండానే, ప్రవక్త (సల్లం) గారి మనస్సులో విషయాన్ని నాటడం. ఉదాహరణకు దైవప్రవక్త (సల్లం) గారి ప్రవచనం ఇలా ఉంది : → “ఏ ప్రాణి అయినా, తన వంతు గ్రాసము పొందకుండా చనిపోడని, అల్లాహ్ కు భయపడుతూ దాన్ని పొందడానికి సన్మార్గాన్నే అవలంబించాలని, ఆ రోజు వారి గ్రాసం లభ్యం కావడంలో కొంత ఆలస్యమైతే దాన్ని అపమార్గాల ద్వారా పొందకూడదని, అల్లాహ్ వద్ద ఉన్నది ఆయన ఆదేశాలను శిరసావహించకుండా పొందలేమన్న విషయాన్ని రూహుల్ ఖుదుస్ (జిబ్రీల్ - అలైహి) నా మనస్సులో నాటుకునేటట్లు చేశారు”

3. దైవదూత ప్రవక్త శ్రీ (సల్లం) సమక్షాన మానవ రూపంలోనే వచ్చి ఆయన (సల్లం)ను సంబోధించేవాడు. అతడు చెప్పినదంతా గుర్తుంచుకునేవారు. దైవదూత మానవ రూపంలో వచ్చినపుడు సహాబా (ప్రవక్త అనుచరగణం) కూడా ఆయన్ను చూడటం అప్పుడప్పుడు తటస్థించేది.

4. ఆయన (సల్లం) వద్దకు వచ్చే వహీ గంట గణగణ మ్రోగినట్లు వినపడేది. ఇది అత్యంత కఠినమైన రూపం. ఇలాంటి పరిస్థితిలో దైవదూత ఆయన (సల్లం)ను కలిసేవాడు. ఇలా అవతరించిన వహీకి తీవ్రమైన చలికాలంలోను దైవప్రవక్త (సల్లం) నొసటి నుండి చెమటలు కారిపోయేవి. ఆయన ఒంటె ఎక్కి ఉంటే, అది భూమిపై కూర్చుండిపోయేది. ఓమారు ఇలానే వహీ అవతరించినప్పుడు దైవప్రవక్త (సల్లం) గారి తొడ హజ్రత్ జైద్ బిన్ సాబిత్ (రజి) గారి తొడపై ఉంది. ఆయన (జైద్) తొడపై పెద్ద భారం పడి అణిగిపోయినట్లుగా బాధ అనుభవించారు.

5. దైవప్రవక్త (సల్లం) దైవదూత జిబ్రీల్ (అలైహి)ను ఆయన అసలు రూపంలో కూడా చూడడం జరిగింది. ఈ రూపంలోనే అతను అల్లాహ్ ఆదేశాన్ని (వహీని) ఆయన (సల్లం)పై అవతరింపచేసేవాడు. ఈ సంఘటన దైవప్రవక్త (సల్లం)కు రెండుసార్లు ఎదురైంది. ఈ విషయాన్ని అల్లాహ్ తన గ్రంథంలోని నజ్మ్ సూరాలో ప్రస్తావించాడు.

6. మేరాజ్ రేయి నమాజు విధి అయిన సందర్భంలో ఏ వహీనయితే అల్లాహ్ ఆయన (సల్లం)పై అవతరింపజేశాడో, అప్పుడు ఆయన ఆకాశాల పైనే ఉన్నారు.

7. దైవదూత లేకుండానే అల్లాహ్ దైవప్రవక్త (సల్లం)తో నేరుగా మూసా (అలైహి)తో ముచ్చటించినట్లుగా ముచ్చటించడం. వహీకి సంబంధించిన ఈ రకం గురించి మూసా (అలైహి) విషయమై దివ్యఖుర్ఆన్ లో ఆధారం కూడా ఉంది. అయితే మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) గురించి దివ్యగ్రంథం ఆధారం కాకుండా కూడా మేరాజ్ హాదీసులో ఉంది.

   కొందరు వహీ రకాల్లో ఎనిమిదవ రకం గురించి కూడా చెబుతారు. అంటే అల్లాహ్ ఎదురెదురుగా ఎలాంటి అడ్డంకి లేకుండా దైవప్రవక్త (సల్లం)తో మాట్లాడటం. అయితే ఈ రకం వహీ గురించి మొదటి నుంచి అభిప్రాయభేదం ఉంటూ వచ్చింది.

 _(జాదుల్ ముఆద్ - 1/81. మొదటి మరియు ఎనిమిదవ రకం వహీ విషయంలో అసలు వాక్యాలకు కొంత వివరణ ఇవ్వడం జరిగింది.)_ 

Insha Allah రేపటి భాగములో సందేశ ప్రచారాదేశం - దాని అంతరార్థం....

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment