16

🕋🕋🕋🕋 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕋🕋🕋🕋

🛐🛐🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన *అల్లాహ్* పేరుతో ప్రారంభిస్తున్నాను 🛐🛐🛐🛐

------------------------------------------------

       ☪☪☪☪ *ఇస్లాం చరిత్ర* ☪☪☪☪

    భాగము - 16          Date : 26/11/2017

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*రాజు గారి కల*

రాజు గారు, తనకి వచ్చిన స్వప్నం యొక్క భావం గురించి తన ఆస్థానంలో ఉన్న పండితులను, మేధావులను అడిగారు. కాని ఆ పండితులు ఇలాంటి స్వప్నభావాలా గూడార్థం గురించి మాకు తెలియదు అన్నారు.

జైలు నుంచి విడుదలైన రాజుగారి వ్యక్తిగత సేవకుడు అప్పటికి రాజుగారి కొలువులో మళ్ళి చేరి ఉన్నాడు. రాజు గారి కల గురించి, ఆ వ్యక్తిగత సేవకుడికి కూడా తెలిసింది. అపుడు అతడికి జైలులో తన కలకు అర్థం చెప్పిన యూసుఫ్ (అలైహి) గుర్తుకువచ్చారు. ఆ తర్వాత అతను రాజు గారితో “ప్రభూ ! మీ కారాగారంలో ఒక పుణ్యాత్ముడు ఉన్నారు. ఆయన కలల అర్థాన్ని వివరించే విద్యలో ప్రావీణ్యం కలిగినవారు. నన్ను మీరు ఆయన వద్దకు పంపితే నేను వెళ్ళి మీ కలకు అర్థాన్ని తెలుసుకుని వస్తాను” అన్నాడు. అది విన్న రాజుగారు అతడిని వెంటనే వెళ్ళాలని ఆజ్ఞాపించారు. (ఖురాన్ 12:42-45).

ఆ తర్వాత రాజు గారి సేవకుడు యూసుఫ్ (అలైహి) దగ్గరకు వెళ్ళి "సత్యం మూర్తీభవించిన మహానుభావా ! రాజు గారికి వచ్చిన ఈ స్వప్నం గురించి గూడార్థం ఏమిటో చెప్పు అని " ఏడు పుష్టికరమైన ఆవులు, వాటిని ఏడు బక్కచిక్కిన ఆవులు తినేన్తున్నాయి. ఏడు విరగపండిన మొక్కజొన్న పొత్తులు, మరో ఏడు ఎండిన పొత్తులను చూశారు", మీరు కనుక ఈ స్వప్న భావం ఏంటో చెప్తే, నేను వెళ్లి రాజు గారికి తెలియజేస్తాను దాంతో వారు నిన్ను, నీ విలువ ను గుర్తించవచ్చు." (ఖురాన్ 12:46).

కొద్దీ సేపటి తర్వాత రాజు గారి సేవకుడి కి యూసుఫ్ (అలైహి) ఇలా వివరించారు "రాజ్యం లో ఏడు సంవత్సరాలు పుష్కలంగా పంటలు పండుతాయి, సరియైన విధంగా సేద్యం చేస్తే మంచి దిగుబడి వస్తుంది. ప్రజల అవసరాలకు మించి పంటలు పండుతాయి. ఈ అవసరాలకు మించిన పంటలను నిలువ చేసుకోవాలి. ఆ పిదప ఏడు సంవత్సరాలు కరవు ఉ౦టు౦ది. నిలువ ఉంచుకున్న ధాన్యాన్ని ఈ కరవు కాలం లో ఉపయోగించుకోవాలి. అయితే కరువు సంవత్సరాల్లోనూ కొంత ధాన్యాన్ని మిగుల్చుకుని తర్వాతి సంవత్సరాలకు ఉంచుకోవాలి" అని యూసుఫ్ (అలైహి) తెలిపారు. ఇంకా కలకు అర్థాన్ని వివరిస్తూ “ఏడు సంవత్సరాల కరవు కాలం గతించిన తర్వాత ఒక స౦వత్సర౦ పుష్కలంగా వర్షాలు కురుస్తాయి. సరియైన విధంగా వీటిని ఉపయోగించుకుంటే ద్రాక్ష, ఆలివ్ పంటలు బాగా పండుతాయి. ఆ విధంగా ద్రాక్ష, ఆలివ్ నూనెలు ప్రజలకు పుష్కలంగా లభిస్తాయి” అని చెప్పారు. (ఖురాన్ 12:47,48,49).

ఆ కల కు గల అర్థాన్ని తీసుకుని రాజు గారి వ్యక్తిగత సేవకుడు రాజు గారి వద్దకు వచ్చి, ఆయనకు వినిపించాడు. యూసుఫ్‌(అలైహి) తన కలకు చెప్పిన అర్థం రాజు గారికి ఆసక్తికరంగా కనబడింది. కల యొక్క అర్థాన్ని విన్న రాజు గారు చాలా సంతోషపడ్డారు. ఎందరో మేధావులు, పండితులు చెప్పలేని కలకు గల అర్థాన్ని వివరించిన వ్యక్తిని తప్పకుండా కలవాలనుకున్నారు, వెంటనే యూసుఫ్‌ (అలైహి) ను పిలుచుకు రావలసిందిగా ఒక భటునికి ఆజ్ఞాపించి, పంపించారు.

ఆ భటుడు జైలులో ఉన్న యూసుఫ్ (అలైహి) దగ్గరకు వెళ్ళి, రాజు గారు "మిమ్మల్ని విడిపించి, తీసుకరమ్మన్నారు" అని అన్నాడు.  కాని యూసుఫ్ (అలైహి) మాటలు విని ఆ భటుడు ఆశ్చర్య పోయాడు. జైలు నుంచి విముక్తి లభిస్తుందంటే ఏ ఖైదీ అయినా సంతోషం తో కేరింతలు కొడతాడు. కాని యూసుఫ్‌ (అలైహి) మాత్రం "ముందు తనపై మోపబడిన అబద్ధపు ఆరోపణలను ఉప సంహరించుకుంటేనే జైలు నుంచి బయటకు వస్తానని" చెప్పారు. నా ప్రభువుకు మాత్రం ఆ జిత్తులమారి స్త్రీ ల సంగతి బాగా తెలుసు. (ఖురాన్ 12:50).

యూసుఫ్ (అలైహి) భటునితో ఈ విషయాలు చెబుతూ “రాజుగారి వద్దకు వెళ్ళి చెప్పు, ఆయన ను అవసరమైతే గవర్నరు గారి భార్య ఇచ్చిన విందుకు హాజరైన మహిళలను విచారించమని చెప్పు. నాకు ఎందుకు జైలు శిక్ష విధించారో వారిని అడగమను” అని చెప్పి పంపించారు.

తర్వాత భటుని ద్వారా ఈ విషయం తెలుసుకున్న రాజు గారు వెంటనే విచారణ జరిపించాలని ఆ స్త్రీ లను పిలిపించారు. అపుడు ఆ రాజు వారితో "మీరు యూసుఫ్ (అలైహి) ను మరులు గొల్పడానికి ప్రయత్నించినపుడు మీ అనుభవం ఏంటి ?" అని అడిగారు. దానికి ఆ స్త్రీలంతా "దేవా దేవా ! మేము అతని లో చెడు కు సంబంధించిన ఛాయా కూడా చూడలేదు" అని ముక్తకంఠంతో పలికారు. అపుడు ఆ గవర్నరు గారి భార్య ముందుకు వచ్చింది,అప్పటికి గవర్నరు గారి భార్య కూడా వయసైపోయింది. యూసుఫ్ (అలైహి) ను వలలో వేసుకోవడానికి ప్రయత్నించింది నేనే, యూసుఫ్ (అలైహి) కష్టాలకు తానే కారణమని ఒప్పుకుంది. తాను మానవమాత్రురాలినని, తనకూ బలహీనతలు ఉండడం సహజమని ఆమె చెప్పుకుంది. కాని ఇప్పుడు తాను అల్లాహ్ శరణు వేడుకుంటున్నానని, చెడు ఆలోచనలు మానుకున్నానని, తనను క్షమించాలని రాజు గారిని వేడుకుంది. ఆమె పట్ల జాలితో రాజు గారు ఆమెను క్షమించారు. "యూసుఫ్(అలైహి) మాత్రం సచ్చిలుడే, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు" అని కూడా చెప్పింది. (ఖురాన్ 12:51).

యూసుఫ్ (అలైహి) జరిగిన ఈ వృత్తాంతాన్ని రాజాదూత ద్వారా విని ఇలా అన్నారు "ఆ స్త్రీలను విచారణ జరిపించమనడంలో నా ఉద్యేశ్యం ఒక్కటే, గవర్నరు గారు ఇంట్లో లేనప్పుడు ఆయనకు నేను నమ్మకద్రోహం తలపెట్టలేదని రాజు గారికి తెలియాలి. అసలు ఆ స్త్రీలే నమ్మకద్రోహానికి పాల్పడ్డారు. వారి కుట్రలను అల్లాహ్ ఏమాత్రం సాగనివ్వడు అని వారు తెలుసుకోవాలి. నేను నా ఆత్మ శుద్ధి గురించి గొప్పలు చెప్పుకోవడం లేదు. నా ప్రభువు కారుణ్యభాగ్యం లభిస్తే తప్ప మనసు ఎపుడూ చెడు వైపు పురిగొల్పుతుంది. (ఖురాన్ 12:52,53).

యూసుఫ్ (అలైహి) నిర్దోషి అని ఋజువయ్యింది. రాజు గారు ఈ విషయం యూసుఫ్‌ (అలైహి) కు తెలియజేయండి అని రాజాదూతలను ఆదేశించారు.

యూసుఫ్ (అలైహి) ని రాజభవవానికి ఆహ్వానించారు. యూసుఫ్ (అలైహి) ను చూడగానే ఆయన ఔన్నత్యాన్ని గుర్తించారు.

*ఈజిప్టు దేశ సర్వాధికారి గా యూసుఫ్ (అలైహి)* 

రాజు : - మీరు నిర్దోషి అని తేలింది, ఇపుడు మీకు మా దగ్గర హొదా, గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి. మీ నిజాయితీ మాకు నచ్చింది.

యూసుఫ్ (అలైహి) : - అయితే దేశ వనరులన్ని నాకు అప్పగించండి, నేను వాటిని కాపాడుతాను, నా దగ్గర తగిన జ్ఞాన సంపత్తి కూడా ఉంది.

ఇలా అల్లాహ్ ఆ దేశంలో యూసుఫ్ (అలైహి) పరిపాలన కోసం దారి సుగమం చేశారు. అతనిపుడు సర్వాధికారి. ఆ దేశంలో అతను తాను కోరుకున్న చోటల్లా స్థావరం ఏర్పరచుకోగలడు. అల్లాహ్ తలుచుకున్న వారికి తన కారుణ్యభాగ్యం ప్రసాదిస్తాడు. (ఖురాన్ 12:54-56).

రాజు గారు యూసుఫ్ (అలైహి) తన దర్బారులో ఉన్నత పదవి ని కట్టబెట్టారు. రాజ్యం లోని ధాన్య గారాల నియంత్రణ బాధ్యతలు ఆయనకు అప్పగించారు. ఆ విధంగా ఆయన రాజ్యం లోని పంటల విషయం లో జాగ్రత్తలు తీసుకుని రానున్న కరవు కాలాల్లో ఇబ్బందులు ఎదురవ్వకుండా తగిన ఏర్పాట్లు చేస్తారని రాజు గారు ఆశించారు.

*ఏడు సంవత్సరాల వ్యవధి* 

కాలచక్రం గిరగిర తిరిగింది. కల గురించి యూసుఫ్ (అలైహి) చెప్పినట్టే పుష్కలంగా పంటలు పండే మొదటి ఏడు సంవత్సరాల కాల౦ మొదలయింది. యూసుఫ్ (అలైహి) ఆ కాలం లో రాజ్యం లోని పంటల విషయం లో పూర్తిగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాతి ఏడు సంవత్సరాలు రాజ్యం లో కరవు కాలం వచ్చిపడింది. ఆ ప్రాంతమంతట కరవు అలముకుంది. యూసుఫ్ (అలైహి) స్వదేశం కన్ఆన్ లో కూడా కరవు అలముకుంది. తమ రాజ్యంలో పుష్కలంగా ధాన్యం నిలువ ఉంది కాబట్టి అవసరం ఉన్న రాజ్యాలకు తగిన ధరకు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని అమ్మవచ్చని యూసుఫ్ (అలైహి) రాజు గారికి సలహా ఇచ్చారు. రాజు గారు ఈ సలహాను అంగీకరించారు.

యూసుఫ్ (అలైహి) స్వదేశంలో కూడా కరువు అలుముకుంది, ఈజిప్టు దేశంలో ధాన్యం నిలువలు అమ్ముతున్నారన్న వార్త విన్న యాఖూబ్ అలైహిస్సలామ్ (యూసుఫ్ తండ్రి), తన మిగితా కొడుకుల్ని ఈజిప్టు దేశానికి వెళ్ళి ధాన్యాన్ని కొనుక్కరమ్మని ఆదేశించారు.

యూసుఫ్ (అలైహి) సోదరులు ఈజిప్టు దేశానికి రాక Insha Allah రేపటి భాగము - 17 లో తెలుసుకుందాము.

*ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-* 

ప్రియమైన ముస్లిం సోదరులారా!  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి , ఇదేదో 10 మందికి send చేస్తే మంచి జరుగుతుంది , send చేయకపోతే చేడు జరుగుతుంది అనుకునే msg లు కావు . కాబట్టి మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .

No comments:

Post a Comment