40

🤚🏻✋🏻 🕌   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*   🕌 🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

                               *భాగము - 40* 

____________________________________________

*దావూద్ అలైహిస్సలామ్ : - - : క్రీ.పూ. 1030-970* 

*జాలూత్ ద్వంద యుద్ధ ప్రకటన* 

తాలూత్ సైన్యం మరియు శత్రువులు జాలూత్ సైన్యం ఒకదానికొకటి బలంగా ఢీకొన్నప్పుడు, నువ్వా నేనా అన్నట్లు యుద్ధం సాగుతోంది. యుద్ధం హొరాహొరిగా జరుగుతున్న ఇలాంటి సమయంలో శత్రుసైనికుల నాయకుడు జాలూత్ ద్వంద యుద్దానికి సవాలు విసిరాడు.

జాలూత్ : - తాలూత్ సైనికులారా! చూశారా మా పరాక్రమము. మీలో ఎవరైనా నాతో తలపడేందుకు సరిపడే సైనికుడు ఉంటే రండి. దమ్ముంటే ఎవరైనా నాతో యుద్ధం చేసేందుకు వచ్చి తలపడి పోరాడండి.

కానీ ఈ ప్రకటనతో, మహాకాయుడైన జాలూత్ తో తలపడేందుకు తాలూత్ సైన్యం లో నుంచి ఏ ఒక్కరు ముందుకు రాలేదు. తాలూత్ తన సైన్యంలో ఎంతో ఉత్సాహం నింపాడు. "జాలూత్ తో తలపడితే నా కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తాను." అని ప్రకటించిన కూడా బెంబేలెత్తిన ఇస్రాయీల్ సైన్యం లో కొత్త ఉత్సాహాన్ని నింపలేకపోయింది. ఏ ఒక్క సైనికుడు ముందడుగు వేయలేదు. 

అప్పుడే ఆశ్చర్యంగా తాలూత్ సైన్యం లో నుంచి, శత్రుపక్షం రాజు అయిన జాలూత్ తో తలపడేందుకు నేను సిద్ధం అంటూ ఒక బాలుడు ముందుకు వచ్చాడు.

బాలుడు : - అవిశ్వాసుల రాజు, శత్రుపక్ష నాయకుడు, అహంకారంతో విర్రవీగుతున్న జాలూత్ తో తలపడేందుకు నేను సిద్ధం.

ఆ బాలుడిని చూసి శత్రుసైన్యం పక పక నవ్వడం ప్రారంభించింది. చివరకు తాలూత్ సైనికులు కూడా ఆ బాలుడిని తక్కువగానే చూశారు.

ఆ బాలుని ధైర్యం తాలూత్ కు చాలా నచ్చింది. బాలుని కి సలహా ఇస్తూ....,

తాలూత్ : - బాబు! నీ ధైర్యాన్ని అభినందిస్తున్నాను. కానీ ఆ యుద్ధవీరుడికి నీవు సరిజోడి కావు. బలమైన మన సైనికులు వస్తారులే! నువ్వు వెనక్కి వెళ్ళు.

కాని దావూద్ (అలైహి) మాత్రం పోరాడాలనే నిర్ణయించుకున్నాడు.

దావూద్ (అలైహి) : - మహారాజ! నా ఆకారం చూసి నన్ను తక్కువగా అంచనా వేయొద్దు. నేను ముందు రోజే ఒక సింహాన్ని చంపాను. నేను నా గొర్రెలను మేపేందుకు అడవికి తీసుకెళ్ళినపుడు అక్కడ ఒక సింహం నా గొర్రెలను తినడానికి ప్రయత్నించింది. అపుడు ఆ సింహాన్ని నేను మట్టికరిపించాను. అంతకు ముందు ఒక ఎలుగుబంటి ని కూడా చంపాను. నేను వయసులో చిన్నవాడిని గుండె ధైర్యంలో కాదు. నేను మనుషులకు గాని, జంతువులకు గాని ఎవ్వరికీ భయపడను. (అని ధైర్యంగా జవాబిచ్చారు)

ఈ మాటలు విన్న తాలూత్, దావూద్ (అలైహి) ధైర్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు.

తాలూత్ : - నీ ధైర్యాన్ని ప్రశంసిస్తున్నాను. నీవు నిర్ణయించుకుంటే ఆ బలవంతుడిని సంహరిస్తావు. అల్లాహ్ నీకు శక్తి ని ఇచ్చి కాపాడుగాక! (ఆమీన్)

మహారాజు తాలూత్, దావూద్ (అలైహి) కు యుద్ధ కవచం తొడిగి, ఖడ్గం చేతికిచ్చారు. యుద్ధరంగ దుస్తులు ధరించే అలవాటు దావూద్ (అలైహి) కు లేదు. దావూద్ (అలైహి)కు ఆ దుస్తులు చాలా అసౌకర్యంగా అనిపించాయి. పైగా ఆ దుస్తుల్లో కదలడం కూడా చాలా కష్టంగా ఉంది. అందువల్ల ఆ యుద్ధ కవచాన్ని తీసిపారేశారు.

ఆ తర్వాత దావూద్ (అలైహి) కొన్ని రాళ్లు సేకరించి తన తోలు సంచిలో వేసుకున్నారు. ఆ సంచిని తన భుజానికి తగిలించుకున్నారు. తన వడిసెల పక్కన వేలాడదీసుకున్నారు. చేతిలో ఉన్న తన కర్రతో శత్రువు వైపు నడవడం ప్రారంభించారు.

తాలూత్ (ఆందోళనతో) : - బాబు! వడిసెల, కంకరరాళ్లతో ఆ మహాకాయుడిని ఎలా ఎదుర్కొంటావు?

దావూద్ (అలైహి) : - భయంకరమైన ఎలుగుబంటి గోళ్ళ నుంచి, క్రూరమైన సింహం పంజా నుంచి నన్ను కాపాడిన అల్లాహ్ తప్పకుండా ఈ మహాకాయుడి నుంచి కూడా కాపాడుతారు.

శత్రుపక్ష నాయకుడు జాలూత్ తో తలపడేందుకు దావూద్ (అలైహి), జాలూత్ వైపు నడుస్తున్నారు. తన వైపు వస్తున్న ఆ బాలుడిని చూస్తూ జాలూత్ బిగ్గరగా నవ్వుతూ....,

జాలూత్ : - నీ తోటి కుర్రాళ్లతో కర్ర యుద్ధం చేయడానికి వస్తున్నావా? లేక బతకడం చికాకు అనిపించి నా చేతిలో చావడానికి వస్తున్నావా? నా ఖడ్గం తో ఒకే ఒక్క వేటుతో నీ తలను నీ మొండెం నుంచి వేరు చేస్తాను.

దావూద్ (అలైహి) : - నీ దగ్గర యుద్ధ కవచం, డాలు, ఖడ్గం, విల్లు, బాణాలు, విల్లంబులు ఉన్నాయి. కానీ నా దగ్గర నా చేతి కర్ర, వడిసెల తప్ప ఏమీ లేవు. నీకు నాకు వయసులో చాలా వ్యత్యాసం ఉంది. అయిన కుడా నేను అల్లాహ్ పేరుతో నీతో తలపడటానికి వస్తున్నాను. అల్లాహ్ ఆదేశాలను నువ్వు అపహాస్యం చేశావ్. ఈ రోజు నీ ప్రాణాలు తీసేది కత్తి కాదు అని, అల్లాహ్ అభిష్టమేనని నువ్వు తెలుసుకుంటావు.

దావూద్ (అలైహి) ఈ మాటలు అంటూనే; తన తోలు సంచి లో నుంచి ఒక కంకరరాయిని తీసి, ఆ రాయిని వడిసెల లో ఉంచి శత్రుసైన్యాధిపతి జాలూత్ వైపు గురి చూసి విసిరారు. వడిసెల నుంచి రివ్వున బయలుదేరిన రాయి శరవేగంగా వెళ్లి జాలూత్ తలకు బలంగా తగిలింది. ఆ వెంటనే జాలూత్ తల నుంచి నెత్తుటి ధార బయటకు చిమ్మింది. ఆ దెబ్బతిన్న వెంటనే జాలూత్ కు రెండు కళ్ళు బయర్లుగమ్మాయి. జాలూత్ ఆ దెబ్బకు దిమ్మెరపోయి నేలపై కూలిపోయాడు. జాలూత్ కి తన ఖడ్గాన్ని తీసే సమయం కూడా దక్కలేదు. నేలపై కూలబడ్డ జాలూత్ అలాగే ప్రాణాలు కోల్పోయాడు.

*ఇస్రాయీల్ ప్రజల విజయం* 

తమ సైన్యాధిపతి ఈ విధంగా హతంకావడం చూసి శత్రు సైన్యం ఒక క్షణం పాటు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ హఠాత్పరిణామం వల్ల శత్రు సైన్యం మానసికంగా బలహీనులయ్యారు. శత్రు సైన్యంలో సంకల్పం లోపించింది. ఇదే అదునుగా భావిస్తున్న ఇస్రాయీల్ సైన్యం ఆ మిగిలిన శత్రుసైనికులను కూడా వేటాడడం ప్రారంభించింది. దొరికినవాన్ని దొరికినట్టుగా వధిస్తూ వెళ్లారు. శత్రువుల రక్తం యేరులా పారసాగింది. ఇస్రాయీల్ సైన్యం శత్రువుల చేతుల్లో అనేక సంవత్సరాలుగా పడిన బాధలకు, చేసిన చాకిరికి ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టారు. ఇస్రాయీల్ సైన్యం, తమ వల్ల సాధ్యమైనంత శత్రుసైనికులను హతమార్చారు. ఈ యుద్ధంలో ఇస్రాయీల్ ప్రజలు తాము చాలా కాలం క్రితం పొగుట్టుకున్న అధికారాన్ని, గౌరవాన్ని తిరిగి సంపాదించుకున్నారు.

ఈ విధంగా అల్లాహ్ అనుగ్రహంతో, చిన్న సైన్యం అయిన ఇస్రాయీల్ సైన్యం, పెద్ద సైన్యం అయిన శత్రుసైన్యాన్ని చిత్తుగా ఓడించారు. నూనూగు మీసాల యువకుడు దావూద్ (అలైహి), తన కంటే ఎంతో బలవంతుడైన జాలూత్ ని సంహరించిన తర్వాత దావూద్ (అలైహి) పేరు రాజ్యంలో మారుమ్రోగిపోయింది.

ఆ తర్వాత తాలూత్ తన మాట నిలబెట్టుకుంటూ, తన కూతురును ఇచ్చి దావూద్ (అలైహి) తో వివాహం చేశారు. దావూద్ (అలైహి)ని, తాలూత్ తన ముఖ్య సలహాదారునిగా నియమించుకున్నారు. తాలూత్ మరణించిన తర్వాత దావూద్ (అలైహి) రాజుగా బాధ్యతలు స్వీకరించారు.

అల్లాహ్ దావూద్ (అలైహి) కు రాజ్యాధికారం, బుద్ధికౌశల్యం ప్రసాదించారు. ఇంకా కావలసినవన్నీ దావూద్ (అలైహి) కు నేర్పాడు. ఈ విధంగా కొందరి ద్వారా కొందరిని నిర్మూలించకపోతే ప్రపంచం అరాచకం, అల్లకల్లోలాలతో నిండిపోతుంది.

*దావూద్ అలైహిస్సలామ్ గురించి : -* 

దావూద్ (అలైహి) బెత్లెహమ్ పట్టణానికి చెందినవాడు. దావూద్ (అలైహి) తండ్రి చాలా ముసలివాడు. ఆయన తన ముగ్గురు కుమారులను, జాలూత్ తో యుద్ధం సంధర్బంగా తాలూత్ సైన్యంలోకి పంపించాడు. ఆ ముగ్గురిలో దావూద్ (అలైహి) చిన్నవాడు. తాను చిన్నవాడు అయినందున యుద్ధం లో పాల్గొనవద్దని దావూద్ (అలైహి) కు తన తండ్రి చెప్పారు. సైన్యానికి ఇతర విధాలుగా సహాయం చేయాలని, ప్రత్యక్ష పోరాటంలో పాల్గొనరాదని తన తండ్రి ప్రత్యేకంగా చెప్పి పంపించాడు. యుద్ధ రంగంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు చెప్పాలని కూడా తన తండ్రి నిర్దేశించాడు.

[వడిసెల అనగా...., అరచేతి వెడల్పుతో అంతే పొడవున్న దారాలతో అల్లిన చిన్నవల. దానికి రెండు చివరలలో రెండు దారాలను అమర్చి ఆధార కొసలను కలిపి కుడి చేత్తో పట్టుకొని వల మధ్య లో ఒక రాయిని పెట్టి వేగంగా తిప్పి ఒక దారాని వదిలేస్తే అందులోని రాయి అతి వేగంగా చాల దూరం వెళ్లి పడుతుంది.]

*గ్రహించవలసిన పాఠాలు : -* 

›----» తాలూత్ ఒక పశువుల కాపరి. అల్లాహ్ తాలూత్ ని ఉన్నత స్థానానికి చేర్చాడు.

›----» నాయకుడిని వంశం ఆధారంగా, తెగ ఆధారంగా, కుటుంబం ఆధారంగా ఎన్నుకోవడం జరగదు. రాజ్యపాలన భారాన్ని మోసే యోగ్యత ఆధారంగా ఎన్నుకోవడం జరుగుతుంది.

›----» మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం) ఏమన్నారంటే, "తనకన్నా అర్హత, యోగ్యత ఉన్నవారు చాలా మంది ఉన్నారని తెలిసి కూడా అధికారం కోసం ప్రయత్నించే వ్యక్తి అల్లాహ్ ను, అల్లాహ్ ప్రవక్తను, విశ్వాసులను మోసగించేవాడు." అంతే కాదు, అధికారం కోసం ప్రయత్నించే వ్యక్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా ఆయన హెచ్చరించారు.

›----» ప్రవక్త ముహమ్మద్ (సల్లం) ముఖ్య సహచరుల్లో ఒకరైన హాజ్రత్ అబూబకర్ (రజి) తాను ఖలీఫాగా నియమించబడినపుడు ప్రజలను ఉద్దేశించి, "నేను మీ కన్నా గొప్పవాడిని కాబట్టి నన్ను ఖలీఫాగా నియమించారని భావించొద్దు. మీ వ్యవహారాల్లో నేను అల్లాహ్ కు, అల్లాహ్ ప్రవక్తకు విధేయంగా పనిచేస్తే నాకు సహాయం చేయండి. నేను అవిధేయంగా వ్యవహరిస్తే నన్ను సరిచేయండి." అని అన్నారు.

›----» రాజ్యవ్యవహారాల్లో సైనికబలం కన్నా నైపుణ్యం ముఖ్యమైనది.

తరువాతి భాగము Insha Allah రేపటి భాగము 41 లో తెలుసుకుందాము.

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్రను మన ముస్లిం సోదరులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

☆☆   ®@£€€q +97433572282 ☆☆

No comments:

Post a Comment