52

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము - 52* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

     *అయ్యూబ్ అలైహిస్సలామ్*

ఈ రోజు కథ యొక్క సారాంశం ఏమనగా!, మనిషి తన జీవితంలో ఎన్నో కష్టాలను మరియు సుఖాలను ఎదుర్కొంటాడు. మనిషికి అతని విశ్వాస స్థాయికి అనుగుణంగా పరీక్షించడం జరుగుతుంది. మనిషి బలమైన విశ్వాసం కలిగినవాడైతే కఠినమైన పరీక్షలకు గురి చేయడం జరుగుతుంది. ఈ విధంగా అల్లాహ్ మనిషి విశ్వాసాన్ని పరీక్షిస్తారు. ఈ పరీక్షల్లో సహనం వహించేవారికి తన కారుణ్యంతో ప్రతిఫలం ప్రసాదిస్తారు. అల్లాహ్ ఈ విధంగానే ప్రవక్త హజ్రత్ అయ్యూబ్ అలైహిస్సలామ్ ను పరీక్షించారు. అల్లాహ్ పెట్టిన ఈ పరీక్షలో అయ్యూబ్ అలైహిస్సలామ్ సహనానికి మారుపేరుగా నిలిచారు. అయ్యూబ్ అలైహిస్సలామ్ వంటి సహనం కలిగిన వ్యక్తిగా ఎవరినైనా ప్రశంశించడమంటే భావం అత్యంత ఉత్తమ స్థాయి సహనం కలిగినవాడని అర్థం.

కావున అయ్యూబ్ అలైహిస్సలామ్ గారి వృత్తాంతాన్ని మనమందరం మన జీవితాల్లో స్ఫూర్తిగా తీసుకోవాలి. అయ్యూబ్ అలైహిస్సలామ్ గారిలా అత్యంత సహనం వహించాలి. జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాల గురించి ప్రత్యక్షంగా ఒకరి మీద నిందలు వేయకూడదు. చివరకు "అల్లాహ్ మమ్మల్ని కరుణించలేదు" అని అల్లాహ్ పై కూడా నిందలు వేయకూడదు. మనం చేయవల్సిందల్లా అల్లాహ్ కరుణ కోసం ఎదురుచూడడం, పూర్తి విశ్వాసంతో అల్లాహ్ తో దుఆ చేయడం. (Insha Allah)

*అయ్యూబ్ (అలైహి) గురించి ఖురాన్ లోని ఒక ప్రస్తావన* 

మరి అయ్యూబ్ (స్థితిని కూడా ఓసారి మననం చేసుకోండి.). అతను "నాకు ఈ వ్యాధి సోకింది. నువ్వు కరుణించే వారందరిలోకి అపారంగా కరుణించేవాడవు" అని తన ప్రభువును మొరపెట్టుకున్నప్పుడు, మేము అతని ప్రార్థనను ఆలకించి, ఆమోదించాము. అతని బాధను దూరం చేశాము. అతనికి అతని ఇంటివారలను ప్రసాదించాము. పైగా వారితోపాటు వారిని పోలిన మరి అంతే మందిని మా ప్రత్యేక కటాక్షంతో అతనికి వొసగాము - నికార్సయిన దాసుల కొరకు ఇదొక గుణపాఠం కావాలని! (ఖురాన్ 21:83,84)

*అయ్యూబ్ అలైహిస్సలామ్*

*దైవదూతల సంభాషణ : - - : ఇబ్లీస్ పగ* 

కొందరు దైవదూతలు అల్లాహ్ సృష్టిలోని కొన్ని ప్రాణులు గురించి మాట్లాడుకోసాగారు. విధేయత చూపి అల్లాహ్ ప్రసన్నతను పొందిన వారి గురించి ఆ దైవదూతలు చర్చించుకోసాగారు. అలాగే అహంభావంతో విర్రవీగి అల్లాహ్ ఆగ్రహాన్ని కొని తెచ్చుకున్న వారి గురించి సంభాషిస్తుండగా, ఒక దైవదూత ఒక వ్యక్తి గురించి ఇలా ప్రశంసించారు...., ఆ వ్యక్తే ప్రవక్త హజ్రత్ అయ్యూబ్ అలైహిస్సలామ్.

"ప్రస్తుతం భూమి పై ఉన్న వారిలో అత్యుత్తముడు అయ్యూబ్ (అలైహి). ఆయన ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వాడు. గొప్ప సహనశీలి. ఎల్లప్పుడు అపార కరుణామయుడు విశ్వప్రభువైన అల్లాహ్ ను స్మరిస్తూ ఉంటాడు. అల్లాహ్ ను ఆరాధించే వారికి అయ్యూబ్ (అలైహి) గొప్ప ఆదర్శం. అందుకు ప్రతిఫలంగా అల్లాహ్ అయ్యూబ్ (అలైహి) దీర్ఘాయుష్షు ప్రసాదించారు. అపార సిరి సంపదలు ఇచ్చారు. అయ్యూబ్ (అలైహి) ఎన్నడూ అహంభావానికి పాల్పడలేదు. స్వార్థం ఆయనలో లేనేలేదు. ఆయన సేవకులు, అవరసరార్దులు, బీదలు అందరూ ప్రవక్త అయ్యూబ్ (అలైహి) సంపదలో భాగం పొందుతున్నారు. అయ్యూబ్ (అలైహి) బీదలకు అన్నం పెడతారు. వారికి దుస్తులు ఇస్తారు. బానిసలకు స్వేచ్ఛ ప్రసాదించడం కోసం బానిసలను కొని స్వేచ్ఛగా వదిలేస్తారు. తన నుంచి దానధర్మాలు పొందేవారు తనకు ఉపకారం చేస్తున్నట్లుగా ఆయన వ్యవహరిస్తారు. అయ్యూబ్ (అలైహి) చాలా ఉదార స్వభావి, చాలా మంచివాడు." ఈ విధంగా ఆ దైవదూతలు ప్రవక్త అయ్యూబ్ (అలైహి) గురించి ప్రశంసించారు.

ప్రవక్త అయ్యూబ్ (అలైహి) గురించి ప్రశంసిస్తూ, ఈ విధంగా సంభాషించుకుంటున్న దైవదూతల మాటలను అక్కడే ఉన్న సత్యతిరస్కారి ఇబ్లీస్ విన్నాడు. అయ్యూబ్ (అలైహి) కు అల్లాహ్ పై ఉన్న భక్తి, విశ్వాసాల గురించి తెలిసి ఇబ్లీస్ కి చాలా కోపం వచ్చింది. అయ్యూబ్ (అలైహి) ను ఎలాగైనా ప్రలోభపెట్టి ఆయన ధార్మిక విశ్వాసాన్ని దెబ్బతీయాలని, అయ్యూబ్ (అలైహి) పతనం చేయాలని ఇబ్లీస్ భావించాడు. ఆ వెంటనే అయ్యూబ్ (అలైహి) వద్దకు పోయాడు. అయ్యూబ్ (అలైహి) ప్రార్థనలను చెడగొట్టడానికి ప్రయత్నించాడు. ప్రపంచంలోని సుఖభోగాల గురించి అయ్యూబ్ (అలైహి) లో భావాలను రేకెత్తించడానికి చూశాడు. కానీ, అయ్యూబ్ (అలైహి) నిజమైన విశ్వాసి. చెడు భావాలు తనను వశపరుచుకోకుండా ఆయన జాగ్రత్తపడ్డారు. ఇది చూసి ఇబ్లీస్ మరింత అసహనానికి లోనయ్యాడు. అయ్యూబ్ (అలైహి) అంటే ఇబ్లీస్ లో మరింత ద్వేషం పెరిగింది.

_{ఆదమ్ అలైహిస్సలామ్ విషయంలో ఇబ్లీస్ ఎలా వ్యవహరించాడో, ఏ విధంగా తిరస్కారానికి పాల్పడి అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యాడో, ఎలా స్వర్గం నుంచి బహిష్కరించబడ్డాడో పాఠకులు ఇంతకు ముందు ఆదమ్ అలైహిస్సలామ్ కథలో చదివారు. ఇబ్లీస్ కు తీర్పుదినం వరకు అల్లాహ్ వ్యవధిని ఇచ్చారు. అప్పటివరకూ ఇబ్లీస్ తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే స్వేచ్ఛను కలిగి ఉన్నాడు.}_ 

*తను పన్నిన కుట్రలో భాగంగా, అయ్యూబ్ (అలైహి) పై అల్లాహ్ కు ఫిర్యాదు చేసిన ఇబ్లీస్* 

అయ్యూబ్ (అలైహి) ని చెడగొట్టడం ఈ విధంగా అవ్వదని ఇబ్లీస్ ఒక పథకం వేశాడు. అల్లాహ్ కు అయ్యూబ్ (అలైహి) గురించి ఫిర్యాదు చేశాడు. అపుడు ఇబ్లీస్ మరియు అల్లాహ్ ల మధ్య ఈ విధంగా సంభాషణ జరిగింది....,

ఇబ్లీస్ : - అల్లాహ్! అయ్యూబ్ (అలైహి) గురించి కొన్ని నిజాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. అయ్యూబ్ (అలైహి) నిరంతరం మిమ్మల్ని స్మరిస్తున్నప్పటికీ అదంతా స్వార్థంతో చేస్తున్నదే, ఆయన నిజాయితీగా అల్లాహ్ స్మరణ చేయడం లేదు. మీరు తనకు ఇచ్చిన సంపదను వెనక్కి తీసుకుంటారన్న భయంతో మాత్రమే ఆయన మీ స్మరణ చేస్తున్నాడు. అయ్యూబ్ (అలైహి) అంతా ప్రదర్శన మాత్రమే. దురాశతో మిమ్మల్ని నమ్మించడానికి ప్రదర్శిస్తున్న దైవభక్తి మాత్రమే. మీరు గనుక అయ్యూబ్ (అలైహి) కు ఇచ్చిన సంపద వెనక్కి తీసుకుంటే, ఇక మీ నామస్మరణ ఎప్పటికీ చేయడు. నమాజులు మానేస్తాడు.

అల్లాహ్ : - ఇబ్లీస్! అయ్యూబ్ (అలైహి) నిజాయితీ కలిగిన నా భక్తుడు, కేవలం సంపద కోసం నన్ను ఆరాధించే వ్యక్తి కాదు. హృదయపూర్వకంగా నా పట్ల భక్తి విశ్వాసాలు కలిగిన వ్యక్తి. ఇంకా చెప్తాను విను, భౌతిక సంపదలకు - అయ్యూబ్ (అలైహి) భక్తి విశ్వాసాలకు ఎలాంటి సంబంధం లేదు.

ప్రవక్త అయ్యూబ్ (అలైహి) భక్తి విశ్వాసాలు, ఆయన సహనశీలం గురించి ఇబ్లీస్ కు అర్థమయ్యేలా చేయడానికి అల్లాహ్ నిర్ణయించుకున్నారు. అపుడు అల్లాహ్ ఇబ్లీస్ తో....,

అల్లాహ్ : - ఇబ్లీస్! నువ్వు, నీ సహాయకులు అయ్యూబ్ (అలైహి) సంపద విషయంలో మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. అందుకోసం నేను మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాను. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా దాసుడు అయ్యూబ్ (అలైహి) మదిలో ఇసుక రేణువంత విశ్వాసాన్ని కూడా మీరు చెరపలేరు. (అని సూచించారు.)

అల్లాహ్ ఇచ్చిన ఈ స్వేచ్ఛ వల్ల ఇబ్లీస్ చాలా ఆనందించాడు. అపుడు ఇబ్లీస్ తన సహాయకులు అందరిని ప్రోగు చేసుకున్నాడు. అయ్యూబ్ (అలైహి) పశుసంపదను, పొలాలను, సేవకులను, భోగభాగ్యాలన్నీ నాశనం చేసి, అయ్యూబ్ (అలైహి) వద్ద చిల్లిగవ్వ కూడా లేకుండా చేయడానికి ఇబ్లీస్ బయలుదేరాడు.

ఇబ్లీస్ తను అనుకున్న విధంగానే అయ్యూబ్ (అలైహి) సంపదను మరియు భోగభాగ్యాలనంతా అయ్యూబ్ (అలైహి) కు కాకుండా చేశాడు. ఇక ఆ తర్వాత మిగిలినది అయ్యూబ్ (అలైహి) విశ్వాసాన్ని చెడగొట్టడం.

(అయ్యూబ్ (అలైహి) విశ్వాసాన్ని చెడగొట్టేందుకు, ఇబ్లీస్ తన పథకాలను నాలుగు కుట్రలుగా అమలుపరుస్తాడు.)

*మొదటి కుట్ర : -* 

అల్లాహ్ ఇచ్చిన స్వేచ్ఛ వల్ల అయ్యూబ్ (అలైహి) సంపద, భోగభాగ్యాలను నాశనం చేసి, ఆయన విశ్వాసాన్ని దారి తప్పించేందుకు సంతోషంతో అయ్యూబ్ (అలైహి) వద్దకు ఇబ్లీస్ వచ్చాడు. ఇబ్లీస్, తన పై అనుమానం రాకుండా ఒక వృద్ధజ్ఞాని రూపంలో అయ్యూబ్ (అలైహి) ముందు హాజరయ్యాడు. అపుడు అయ్యూబ్ (అలైహి) తో....,

ఇబ్లీస్ : - అయ్యూబ్! నీ సంపద మొత్తం పోయింది. నువ్వు దానధర్మాలకు చాలా ఖర్చు చేస్తావు, కాబట్టి అల్లాహ్ ను ప్రార్థిస్తూ నీ సమయాన్నంతా వృధా చేస్తున్నందువల్ల నీ సంపద నాశనం అయింది అని బయట కొందరు చెబుతున్నారు. నీ శత్రువులకు ఆనందం కలిగించడానికే అల్లాహ్ ఇదంతా చేశాడని మరికొందరు అంటున్నారు. నీకు నష్టం కలగకుండా కాపాడే శక్తి అల్లాహ్ కు ఉన్నట్లయితే నీ సంపదను అల్లాహ్ కాపాడి ఉండేవాడు. కాబట్టి నువ్వు నీ విశ్వాసాన్ని మానుకో!

నిజమైన విశ్వాసి అయ్యూబ్ (అలైహి) : - చూడండి వృద్ధజ్ఞాని! నా నుంచి అల్లాహ్ తీసుకున్నదంతా నిజానికి అల్లాహ్ కు చెందినదే. నాకు కేవలం కొంతకాలానికి మాత్రమే ఆ సంపద నా ఆధీనం చేయబడింది. అల్లాహ్ తనకు ఇష్టం వచ్చిన వారికి ఇస్తాడు. తనకు ఇష్టం వచ్చిన వారి నుంచి తీసుకుంటాడు. (అని చెప్పి అయ్యూబ్ (అలైహి) అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడ్డారు.)

ఇదంతా దగ్గరుండి చూసిన ఇబ్లీస్ చాలా నిరాశకు గురయ్యాడు. ఇబ్లీస్ చేసిన ఈ మొదటి కుట్ర బెడిసికొట్టడంతో, తను నిరాశ చెందకుండా మళ్ళీ ఇంకొక కుట్ర చేయడానికి సిద్ధమయ్యాడు. అందుకు అయ్యూబ్ (అలైహి) పై మరింత అధికారం కోసం మళ్ళీ అల్లాహ్ వద్దకు వెళ్లి....,

Insha Allah తరువాత జరిగినది రేపటి భాగము - 53 లో తెలుసుకుందాము.

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆

No comments:

Post a Comment