18

🤚🏻✋🏻🤚🏻✋🏻 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🤚🏻✋🏻🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

    *భాగము - 18          Date : 28/11/2017* 

____________________________________________

యూసుఫ్ (అలైహి) సోదరులు, తమ చిన్న సోదరుడైన బెన్యామీన్ తీసుకుని ఈజిప్టు రాజ్యానికి వచ్చి ధాన్యాన్ని కొని తీసుకపోతుండగా, ఒక రాజ భటుడు వచ్చి, తమ రాజ్యానికి తిరిగి వెళ్తున్న యూసుఫ్ (అలైహి) సోదరులను ఆపి "రాజ మందిరం లో ఒక బంగారు పాత్ర కనబడటంలేదని మీ సామగ్రి ని తనిఖీ చేయవలసి ఉంటుంది" అని చెప్పారు.

అపుడు యూసుఫ్ (అలైహి) తన తమ్ముడి సామగ్రి కాకుండా మిగిలిన వారి సామగ్రి ని తనిఖీ చేయించాడు. కానీ వాటిలో ఆ బంగారు పాత్ర దొరకలేదు. తర్వాత బెన్యామీన్ సంచుల్లో ఉన్న సామగ్రి ని కిందకి బోర్లించడం జరిగింది. అందులో పోయిన రాజుగారి బంగారు పాత్ర బయటపడింది. దీనిని చూసిన అందరూ నిర్ఘాంతపోయారు.

అపుడు ఆ సోదరులందరిని నిర్భంధించి యూసుఫ్ (అలైహి) ముందు హాజరుపరచటం జరిగింది. విచారణ లో మిగిలిన సోదరులు బెన్యామీన్ నిజాయితీని, మంచితనాన్ని, సధ్వర్తనాన్ని వివరించకుండా " ఇతను (బెన్యామీన్) దొంగతనానికి పాల్పడ్డాడంటే అందులో ఆశ్చర్యమేమి లేదు, ఇంతకు ముందు బెన్యామీన్ అన్న (యూసుఫ్) కూడా ఇలాగే దొంగతనానికి ఒడిగట్టాడు" అని అన్నారు. తమ ఈర్ష్యాసూయలను ప్రకటించే మరో అవకాశం వారికి లభించినందుకు వారు చాలా సంబరపడ్డారు. తనను కూడా దొంగను చేసి వారు తన ముందే మాట్లాడడాన్ని యూసుఫ్ (అలైహి) సహనంతో విన్నారు. మీరు చెప్పేది నిజమో కాదో అల్లాహ్ కు బాగా తెలుసని యూసుఫ్ (అలైహి) మెల్లగా అన్నారు. (ఖురాన్ 12:77).

ఆ తర్వాత దొంగను జైల్లో పెట్టాలని యూసుఫ్ (అలైహి) ఆదేశించారు. అయితే బెన్యామీన్ లేకుండా ఇంటికి వెళ్ళి తమ తండ్రికి ముఖం చూపించలేమన్నది వారికి బాగా తెలుసు. యూసుఫ్ (అలైహి) కు నచ్చజెప్పి బెన్యామీన్ ను తీసుకవేళ్ళాలని అనుకున్నారు.

సోదరులు : - రాజ్యాధిపతి! మా తండ్రి 80 సంవత్సరాల వృద్ధుడు, ఈ వార్త ఆయన ను చాలా కలచివేస్తుంది. కావున మీరు బెన్యామీన్ కు బదులుగా తమలో ఎవరినన్నా నిర్బంధించి బెన్యామీన్ ను వదలిపెట్టండి. చూస్తే మీరు పరోపకారిలా, దయామయుడిలా కనిపిస్తున్నారు. మేము అల్లాహ్ శరణు కోరుతున్నాం.

యూసుఫ్ (అలైహి) : - ఎవరి దగ్గర మా వస్తువు దొరికిందో అతడ్ని వదిలి వేరొకరికి ఎలా బంధిస్తాం? అలా చేస్తే మేము దుర్మార్గుల్లో చేరినట్లవుతుంది. (ఖురాన్ 12:78,79).

దాంతో వారు నిరాశచెంది ఒక మూల కు వెళ్లి పరస్పరం సంప్రదించుకోసాగారు. అపుడు వారందరిలో పెద్దవాడు అయిన యాహుదా తన అభిప్రాయం ఇలా వెలిబుచ్చాడు "మన తండ్రి మన చేత అల్లాహ్ పేరు మీద ప్రమాణం చేయించిన సంగతి మనకు తెలిసిందే. ఇంతకు పూర్వం యూసుఫ్ (అలైహి) విషయంలో మీరు చేసిన దౌర్జన్యాలు మీకు గుర్తుండే ఉంటాయి. నేను మాత్రం నా తండ్రి అనుమతి లేనిదే ఇక్కడి నుంచి రాను. లేదా నా విషయం లో అల్లాహ్ ఏదైనా పరిష్కారం చేయాలి. అల్లాహ్ అందరికంటే మిన్నగా పరిష్కారం చేసేవాడు. కాబట్టి మీరు వెళ్లి నాన్నగారికి ఇలా చెప్పండి "నాన్నగారు! మీ చిన్న కొడుకు బెన్యామీన్ దొంగతనం చేశాడు. మేము మాత్రం అతను దొంగతనం చేస్తుండగా చూడలేదు. మేము చెబుతున్నదే మాకు తెలిసిన సంగతి. అగోచర విషయాల్ని మేము గమనించలేము కదా! కావాలంటే వెళ్లొచ్చిన నగరం లోని ప్రజల్ని, మాతో పాటు వచ్చిన బాటసారుల్ని అడిగి చూడండి. మేము చెబుతున్నది ముమ్మాటికీ నిజం." అని నాన్నగారి తో చెప్పండి" అని యాహుదా చెప్పాడు. (ఖురాన్ 12:80,81,82).

ఆ తర్వాత యాహుదా ని వదిలిపెట్టి మిగిలిన సోదరులు యాహుదా కి కావలసిన ఆహార పదార్థాలు వదిలిపెట్టి వెళ్లిపోయారు. యాహుదా అక్కడే ఉండి బెన్యామీన్ కు ఎలాంటి విచారణ జరుగుతుందో అని ఎదురుచూస్తూ ఉండిపోయారు.

*అంతా ఒక పథకం* 

తర్వాత యూసుఫ్ (అలైహి) తన భవనంలో బెన్యామీన్ ను అతిథిగా ఉంచుకున్నారు.

యూసుఫ్ (అలైహి) : - నీ సామగ్రి లో రాజుగారి బంగారుపాత్ర ను వేసింది ఎవరు అయిఉంటారో చెప్పు?

బెన్యామీన్ : - ఏమో! నాకు తెలియదు.

యూసుఫ్ (అలైహి) : - నిన్ను నా వద్దే ఉంచుకునేందుకు నేనే ఆ బంగారుపాత్ర ను, నీ సామగ్రి లో ఉంచాను. ఆ విధంగా నిన్ను కాపాడుకోవాలని.

యాహూదా బెన్యామీన్ కొసం అక్కడే ఉండిపోయాడని తెలిసి యూసుఫ్ (అలైహి) చాలా సంతోషించారు. యాహూదా స్వతహాగా మంచివాడే. యాహుదా మంచిచెడ్డలు గమనించడానికి యూసుఫ్ (అలైహి) రహస్యంగా ఏర్పాట్లు చేశారు. మిగిలిన సోదరులను వెనక్కి పంపడంలో యూసుఫ్ (అలైహి) వివేచన దాగి ఉంది. వారు తమ సోదరుల కోసం తిరిగి వస్తారో లేదో చూడాలని ఆయన భావించారు.

*ఇంటికి వెళ్లి జరిగినది తమ తండ్రికి వివరించే సందర్భం* 

ఆ తర్వాత వారు స్వదేశానికి తిరిగి వెళ్లి తమ తండ్రి కి జరిగిన వృత్తాంతాన్ని  వివరించారు. అది విని యాఖూబ్ (అలైహి) తీవ్ర మనస్తాపానికి గురై, వారి నుంచి మొహం తిప్పుకుని ఇలా అన్నాడు "కాదు అసలు సంగతి అది కాదు. మళ్ళీ మీరేదో కథ అల్లి చెబుతున్నారు. సరే కానివ్వండి. దీన్ని కూడా నేను మౌనంగా భరిస్తాను. అల్లాహ్ వారందర్నీ నా దగ్గరకు తీసుకురావచ్చు. అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఆయన సర్వం ఎరిగినవాడు, మహాయుక్తిపరుడు." *ఇంత కాలం ఆయన తనకు అత్యంత ఇష్టుడైన కుమారుడు యూసుఫ్ (అలైహి) కోసం దుఃఖిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన తనకు ఇష్టులైన మరో ఇద్దరు కుమారులను కోల్పోయారు. ఈ బాధతో నిర౦తర౦ రోదిస్తూ ఉండటం మూలంగా యాఖూబ్ (అలైహి) కంటిచూపు కూడా కోల్పోయారు.* (ఖురాన్ 12:83,84).

బెన్యామీన్ విషయమై యాఖూబ్ (అలైహి) చాలా బాధకు గురయ్యారు. దైవప్రార్థన మాత్రమే ఆయనకు సాంత్వననిచ్చేది. ఆ విధంగా ఆయన ధార్మిక విశ్వాసాన్ని బలోపేతం చేసుకునేవారు, సహనం వహించేవారు. 

మిగిలిన కుమారులు యాఖూబ్ (అలైహి) తో, “నాన్నగారు! మీరు ఉత్తములైన ప్రవక్త. అల్లాహ్ పంపిన గొప్ప సందేశహరులు. మీ వద్దకు దైవసందేశం అవతరిస్తోంది. ప్రజలు మీ నుంచి మార్గదర్శకత్వాన్ని పొందుతున్నారు. ధార్మిక విశ్వాసాన్ని పొందుతున్నారు. మీరు ఎందుకు ఈ విధంగా మిమ్మల్ని మీరు కృశింపచేన్తున్నారు. మీరు ఇలాగే ఎప్పుడు యూసుఫ్‌ (అలైహి) తలచుకుంటూ బాధపడుతుంటే జబ్బుపడతారు. లేదా ఆ జబ్బుతో చివరికి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు" అని అన్నారు. దానికి యాఖూబ్ (అలైహి) వారితో “ఇలాంటి మాటల వల్ల నా దుఃఖం తగ్గేది కాదు. నేను నా బాధ గురించి అల్లాహ్ తో తప్ప ఎవరితోనూ చెప్పుకోవడం లేదు. అల్లాహ్ గురించి నాకు తెలిసినంత మీకు తెలియదు. నా కుమారులు తిరిగి వస్తేనే నా దుఃఖం ఉపశమిస్తుంది. కుమారులారా! వెళ్ళండి, వెళ్ళి యూసుఫ్‌ (అలైహి), బెన్యామీన్ ల గురించి ఆరా తీయండి. అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందవద్దు. అవిశ్వాసులు మాత్రమే అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు” అన్నారు. (ఖురాన్ 12:85,86,87).

యూసుఫ్ (అలైహి) ను ఎక్కడ వెతకాలో వారికి అర్థం కాలేదు. ఆయన బ్రతికి ఉన్నారో చనిపోయారో కూడా వారికి తెలియదు. యూసుఫ్ (అలైహి) ను చీకటి బావిలో వారు క్రూరంగా నెట్టేశారు. తాము చేసిన దానికి ఇప్పుడు సిగ్గుపడుతున్నారు. అయితే బెన్యామీన్, యాహూదాలు ఎక్కడ ఉన్నారో వారికి తెలుసు. అందువల్ల మళ్ళీ ఈజిప్టుకు వెళ్లి అక్కడి అధికారులకు నచ్చజెప్పి బెన్యామీన్ విడుదలకు ప్రయత్నించాలని భావించారు.

వారు మళ్ళీ ఈజిప్టు లో ఉన్న యూసుఫ్ (అలైహి) దగ్గరకు వెళ్ళి "రాజ్యాధిపతి! మేము, మా భార్యాపిల్లలు పెద్ద ఆపదలో చిక్కుకున్నాము. మా దగ్గర పెట్టుబడి తక్కువగా ఉంది. ఈ సారి కూడా మాకు పూర్తి ధాన్యం ఇప్పించండి. దయచేసి దానం చేయండి. దానం చేసేవారికి అల్లాహ్ మంచి ప్రతిఫలం ఇస్తాడు." అని ప్రాధేయపడ్డారు. (ఖురాన్ 12:88). అలాగే "రాజ్యాధిపతి! మా సోదరుడు (బెన్యామీన్) ను విడుదల చేయవలసింది గా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. మా తండ్రిగారి దుఃఖాన్ని ఈ విధంగా మేము తగ్గించగలము. దయ చూపండి. దయ చూపేవారిని అల్లాహ్ కనికరిస్తాడు” అన్నారు.

*తాను ఎవరో చెప్పవలసిన సమయ౦ ఆసన్నమైందని యూసుఫ్ (అలైహి) గ్రహించారు.* 

“మిమ్మల్ని షైతాన్ తప్పుదారి పట్టించిన రోజు మీకు గుర్తున్నదా? చాలా కాలం క్రితం మీరు నన్ను చీకటి బావిలో నెట్టేసిన రోజు మరచిపోయారా? అప్పుడు నేనెంత బ్రతిమాలినా మీ మనసు కరగలేదు కదా!” అన్నారు. (ఖురాన్ 12:89).

అపుడు వారంతా ఆశ్చర్యం తో యూసుఫ్ (అలైహి) వైపు చూస్తుండిపోయారు. వారిలో ఒకడు అసంకల్పికంగా “నువ్వు యూసుఫ్‌వా?” అని పలికాడు. దానికి యూసుఫ్ (అలైహి) “అవును నేను యూసుఫ్‌ నే . అల్లాహ్ నా పై అనుగ్రహించాడు. అల్లాహ్ నిస్సందేహంగా అపారకృపాశీలుడు” అని అన్నాడు.

యూసుఫ్ (అలైహి) మాటలు విన్న ఆ సోదరులు భయంతో కంపించసాగారు, చెమటలు పడుతూ వారి శరీరం వణికిపోసాగింది.

తరువాత జరిగిన విషయమై Insha Allah రేపటి భాగము - 19 లో తెలుసుకుందాము.

*ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-* 

ప్రియమైన ముస్లిం సోదరులారా!  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి , ఇదేదో 10 మందికి send చేస్తే మంచి జరుగుతుంది , send చేయకపోతే చేడు జరుగుతుంది అనుకునే msg లు కావు . కాబట్టి మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .

★★★★★★★★★★★★★★★★★★

         ®@£€€q                    +97433572282

★★★★★★★★★★★★★★★★★★

No comments:

Post a Comment