23

🤚🏻✋🏻🤚🏻✋🏻 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🤚🏻✋🏻🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

            భాగము - 23       

____________________________________________

*హజ్రత్ షుఐబ్ అలైహిస్సలామ్ : - - : మద్యన్ జాతి* 

మద్యన్ ప్రాంత వాసులు అరబ్బులు. వారు మఆన్ రాజ్యంలో నివసించేవారు. నేడు ఇది సిరియాలో ఒక భాగంగా ఉంది. వారు అత్యాశపరులైన ప్రజలు. వారికి అల్లాహ్ ఉనికి పట్ల ఎలాంటి నమ్మకం ఉండేది కాదు. అన్ని విధాలా చెడులతో నిండిన జీవితాన్ని వారు గడిపేవారు. తూనికలు, కొలతల్లో మోసాలు చేసేవారు. తాము అమ్మే వస్తువులలోని లోపాలు దాచిపెట్టి చాలా గొప్ప వస్తువులుగా పొగిడేవారు. వినియోగదారులకు అబద్ధాలు చెప్పి మోగించేవారు.

వారి వద్దకు అల్లాహ్ తన ప్రవక్తను పంపించాడు. ఆయనే హజ్రత్ షుఐబ్ అలైహిస్సలామ్. ఆయనకు అల్లాహ్ కొన్ని మహత్తులు కూడా ఇచ్చి పంపాడు. షుఐబ్ (అలైహి) వారికి హితబోధ చేయడం ప్రారంభించారు.

మేము మద్యన్ ప్రజల వద్దకు వారి సోదరుడైన షుఐబ్‌ (అలైహిస్సలాం)ను పంపాము. అతను తన జాతి వారితో ---

షుఐబ్ (అలైహి) : - నా జాతి వారలారా! మీరు అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి. అల్లాహ్ తప్ప మీరు ఆరాధించదగిన వేరొక దైవం లేడు. మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుంచి స్పష్టమయిన నిదర్శనం వచ్చేసింది. కాబట్టి మీరు కొలతలు, తూనికలలో ఖచ్చితంగా (పూర్తిగా) వ్యవహరించండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. ధరణి లో శాంతిసామరస్యాలు ఏర్పడ్డాక అరాచకం సృష్టించకండి. మీరు గనక విశ్వాసులు అయితే అందులోనే మీ శ్రేయస్సు ఉంది. (ఖురాన్ 7:85).

షుఐబ్ (అలైహి) : - అల్లాహ్‌ను విశ్వసించేవారిని బెదిరించే ఉద్దేశంతో, అల్లాహ్‌ మార్గం నుంచి అడ్డుకునే ఆలోచనతో, అందులో వక్రతలను వెతుకుతూ రహదారుల్లో కూర్చోకండి. మీరు అల్పసంఖ్యాకులుగా ఉన్న రోజులు గుర్తుచేసుకోండి. అల్లాహ్‌ మీ జనసంఖ్యను అధికం చేసిన సంగతిని కాస్త గుర్తుచేసుకోండి. కల్లోలాన్ని రేకెత్తించే వారి కథ ఎలా ముగిసిందో కూడా చూడండి! అల్లాహ్‌ నాకిచ్చి పంపిన సందేశాన్ని మీలో కొందరు విశ్వసించగా, మరికొందరు విశ్వసించలేదు. కాబట్టి అల్లాహ్‌ మన మధ్య తీర్పుచేసే వరకూ ఓపిక పట్టండి. ఆయన అందరి లోకెల్లా అత్యుత్తమంగా తీర్పు చెప్పేవాడు. (ఖురాన్ 7:86,87).

మద్యన్ జాతివారు : - ఓ షుఐబ్‌! మేము మా తాతముత్తాతలు కాలం నుంచి వస్తున్న ఈ దైవాలను ఆరాధించడం మేము మానుకోవాలా ?, మా ధనాన్ని మా ఇష్టప్రకారం ఖర్చు పెట్టుకునే హక్కు మాకు లేదా ? ఇదేనా నీ ప్రార్థన నీకు నేర్పుతున్నది ? మా అందరిలో సాధుస్వభావి, సన్మార్గగామివి నువ్వు ఒక్కడివే మిగిలావు కాబోలు! (ఖురాన్ 11:87).

షుఐబ్ (అలైహి) : - ఓ నా జాతిసోదరులారా! చూడండి, నేను నా ప్రభువు వద్ద నుంచి ఒక స్పష్టమైన నిదర్శనాన్ని పొంది ఉన్నాను. ఆయన నాకు తన వద్ద నుండి అత్యుత్తమమైన ఉపాధిని ప్రసాదించాడు.(అలాంటప్పుడు నేను అక్రమార్జనకు పాల్పడగలనా?)ఏ విషయాలను మానుకోమని మిమ్మల్ని గట్టిగా చెబుతున్నానో, వాటి వైపుకు నేను స్వయంగా మొగ్గిపోయే ఉద్దేశం నాకు లేనే లేదు. శాయశక్తులా దిద్దుబాటుచేయాలన్నదే నా ఉద్దేశం. నా ఈ సద్వర్తన అంతా అల్లాహ్ సహాయం పైనే ఆధారపడి ఉంది. నేను ఆయన్నే నమ్ముకున్నాను. ఆయన వైపుకే మరలుతున్నాను. (ఖురాన్ 11:87,88).

షూఐబ్ (అలైహి) : - ఓ నా జాతివారలారా! నాకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న మీ మొండి వైఖరి నూహ్‌ జాతిపై, హూద్‌ జాతిపై, సాలెహ్‌ జాతిపై వచ్చిపడిన శిక్షల్లాంటి శిక్షలకే మిమ్మల్ని కూడా పాత్రులుగా చేస్తుందేమో (జాగ్రత్త!) ఇక లూతు జాతి వారైతే మీకు ఎంతో దూరాన కూడా లేరు. మీరు క్షమాపణ కోసం మీ ప్రభువును వేడుకోండి. మరి ఆయన వైపుకే మరలండి. నిశ్చయంగా నా ప్రభువు అమిత దయామయుడు, అపార ప్రేమమయుడు.

మద్యన్ జాతి వారు : - ఓ షుఐబ్‌! నువ్వు చెప్పే వాటిలో చాలా విషయాలు మాకు అర్థం కావటం లేదు. మేము నిన్ను మా మధ్య ఎంతో బలహీనునిగా చూస్తున్నాము. నీ వంశస్థులే లేకపోతే ఈ పాటికి నీపై రాళ్ళు రువ్వి ఉండేవాళ్ళం. మా దృష్టిలో నువ్వు ఘనాపాటివి ఏమీకావు.

షుఐబ్ (అలైహి) : - ఓ నా జాతివారలారా! మీ దృష్టిలో నా వంశస్థులు అల్లాహ్‌ కన్నా ఎక్కువ గౌరవనీయులా? తత్కారణంగానే మీరు ఆయన్ని వెనక్కి నెట్టేశారా? నిశ్చయంగా నా ప్రభువు మీ కార్యకలాపాలన్నింటినీ పరివేష్ఠించి ఉన్నాడు.''(షుఐబ్‌ ఇంకా ఇలా అన్నాడు:) ''ఓ నా జాతిసోదరులారా! మీరు మీ స్థానాలలో మీ పనులు చేస్తూ ఉండండి. నేనూ నా పని చేసుకుంటాను. పరాభవానికి లోను చేసే శిక్ష ఎవరికి పడుతుందో,అసత్యవాది ఎవరో అతిత్వరలోనే మీకు తెలిసిపోతుంది. మీరూ ఎదురు చూడండి, మీతో పాటు నేనూ ఎదురుచూస్తాను. (ఖురాన్ 11:89,93).

మద్యన్ జాతి వారు : - అసలు నువ్వు చేతబడికి గురైన వాడివి. నువ్వూ మాలాంటి ఒక మనిషివే. నువ్వు అబద్ధం చెప్పే వారిలో ఒకడివని మేము భావిస్తున్నాము. ఒకవేళ నువ్వు సత్యవంతులలో ఒకడివైతే ఆకాశం నుంచి ఏదైనా తునకను మాపై పడవెయ్యి.

షుఐబ్ (అలైహి) : - మీరు చేసేదంతా నా ప్రభువుకు బాగా తెలుసు. (ఖురాన్ 26:185-188).

మద్యన్ జాతి నాయకులు అధికారగర్వం తో విర్రవీగుతూ "షుఐబ్ (అలైహి)! నువ్వు, నిన్ను విశ్వసించినవారు (మర్యాదగా) మా మతంలోకి తిరిగి వచ్చేయండి. లేదంటారా , మిమ్మల్నందరినీ మా పట్నం నుంచి గెంటివేస్తాం" అని అన్నారు. (ఖురాన్ 7:88).

షుఐబ్ (అలైహి) : - ఏమిటీ, ఆ మతం మాకే మాత్రం ఇష్టం లేకపోయినా మేము అందులో కలసి పోవలసిందేనా? అల్లాహ్‌ మమ్మల్ని మీ ధర్మం నుంచి విముక్తి కలిగించిన తరువాత మళ్లీ మేము గనక అందులోకే వచ్చి కలసిపోతే, మేము అల్లాహ్‌కు పెద్ద అబద్ధాన్ని అంటగట్టిన వాళ్ళం అవుతాము. మీ మతంలోకి మేము తిరిగి రావటమనేది జరగదు. మా ప్రభువైన అల్లాహ్‌ రాసిపెట్టినదయితే అది వేరే విషయం. మా ప్రభువు జ్ఞానం అన్నింటినీ ఆవరించి ఉంది. మేము అల్లాహ్‌నే నమ్ముకున్నాము. ఓ ప్రభూ! మాకూ, మా జాతివారికీ మధ్య న్యాయంగా తీర్పు చెయ్యి. నీవు అందరికన్నా ఉత్తమంగా తీర్పు చేసేవాడవు. (ఖురాన్ 7:89).

ఆ మద్యన్ జాతి లో సత్యాన్ని తిరస్కరించిన నాయకులు (ఒక రోజు సమావేశమయి) "మనం కనుక షుఐబ్ (అలైహి) ని అనుసరిస్తే నాశనం అయిపోతాం" అని చెప్పుకున్నారు. (ఖురాన్ 7:90).

చివరికి మద్యన్ జాతి ప్రజలు ఆగ్రహించి షుఐబ్ (అలైహి), ఆయన అనుచరులు వస్తుసంపద మొత్తం లాక్కున్నారు. వారందరినీ పట్టణం నుంచి బయటకు తరిమివేశారు. అపుడు ప్రవక్త షుఐబ్ (అలైహి) అల్లాహ్ సహాయం కోసం ప్రార్థించారు. ఆయన ప్రార్థనకు జవాబు లభించింది. అల్లాహ్ ఆ పట్టణం పైకి బొబ్బలెక్కించే వేడిని పంపాడు. ఈ వేడికి మద్యన్ ప్రజలు అల్లాడిపోయారు. ఆకాశంలో ఒక మేఘాన్ని చూసి, హమ్మయ్య ఇక చల్లగా వర్షం పడుతుందని భావించారు. కానీ ఆ మేఘం తీవ్రఘర్జనలతో పిడుగులు కురిపించింది. పైనుంచి గుండెలవిసే ఉరుములు వినబడ్డాయి. ఆ శబ్దానికి మద్యన్ ప్రజల కళ్ళ క్రింది భూమి కంపించింది. భయభీతులతో దుర్మార్గులు నాశనమయ్యారు. ఆ దుర్మార్గుల అంతాన్ని దూరంగా నిలబడి షుఐబ్ (అలైహి) చూశారు.

*దైవాగ్రహం, ప్రకృతి ప్రకోపం* 

చివరికి మా ఆజ్ఞ వచ్చేసింది, అపుడు మేము షుఐబ్ (అలైహి) ను, అతని పాటు విశ్వసించిన వారిని మా ప్రత్యేక కటాక్షంతో కాపాడాము. అన్యాయం, అక్రమాలకు పాల్పడిన అతి తీవ్రమైన విస్ఫోటనం విరుచుకుపడింది. దాంతో వారు తమ ఇంట్లో బోర్లా పడి సర్వ నాశనమయ్యారు. అసలు వారక్కడ ఎప్పుడూ నివసించనే లేదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. వినండి! సమూద్ వారు దూరం చేయబడినట్లే మద్యన్ వారు కూడా (దైవ కారుణ్యానికి) దూరం అవుదురుగాక! (ఖురాన్ 11:94-95).

మొత్తానికి వారు షుఐబ్ (అలైహి) ని ధిక్కరించిన కారణంగా (కారు మబ్బుతో కూడిన) ఛాయావృత దినపు విపత్తు వారిని కబళించింది. నిజంగానే అది మహాదినపు శిక్ష! నిశ్చయంగా ఇందులో గొప్ప నిదర్శనం ఉంది. మరైతే వారిలో చాలా మంది విశ్వాసులు కారు. (ఖురాన్ 26:189,190).

షుఐబ్ (అలైహి) ధిక్కరించినవారి పరిస్థితి ఆ ఇండ్లలో వారెప్పుడూ నివసించనే లేదన్నట్టుగా మారిపోయింది. షుఐబ్ (అలైహి) ని ధిక్కరించినవారే నష్టపోయారు. అప్పుడు షుఐబ్‌ (అలైహి) వాళ్లనుండి ముఖం తిప్పుకొని మరలిపోతూ, ''ఓ నా జాతి జనులారా! నా ప్రభువు ఆదేశాలను నేను మీకు అందజేశాను. నిత్యం మీ బాగోగులను కోరుకున్నాను. అలాంటప్పుడు ఈ తిరస్కారుల (దుర్గతి)పై నేనెందుకు బాధపడాలి?'' అని అన్నారు. (ఖురాన్ 7:92-93).

"ఓ ప్రజలారా! ప్రభువు సందేశాన్ని నేను మీకు చేరవేశాను. మీకు మంచి సలహాలు ఇచ్చాను. సత్యాన్ని తిరస్కరించిన ప్రజల పట్ల నేను ఎలా సానుభూతి చూపగలను" అని అన్నారు.

ఇంతటితో ప్రవక్త *షుఐబ్ అలైహిస్సలామ్* గారి భాగము ముగిసినది. Insha Allah రేపటి భాగము - 24 లో ప్రవక్త *హజ్రత్ మూసా అలైహిస్సలామ్* గారి గురించి తెలుసుకుందాము.

*ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-* 

ప్రియమైన ముస్లిం సోదరులారా!  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి , ఇదేదో 10 మందికి send చేస్తే మంచి జరుగుతుంది , send చేయకపోతే చేడు జరుగుతుంది అనుకునే msg లు కావు . కాబట్టి మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .

★★★★★★★★★★★★★★★★★★ ®@£€€q         +97433572282 ★★★★★★★★★★★★★★★★★★

No comments:

Post a Comment