47

🤚🏻✋🏻 🕌   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*   🕌 🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

                               *భాగము - 47* 

____________________________________________

సులైమాన్ (అలైహి) పాలనలో అనేక పనులను జిన్నులే చేస్తుండేవి. జిన్నుల చేసిన పాపాలకు శిక్షగా వాటితో ఈ పనులు చేయించడం జరిగేది. అగ్నితో సృష్టించబడిన జిన్నులు తమకు సమస్త శక్తులు ఉన్నాయని, తాము అగోచరాలను కూడా చూడగలమని, భవిష్యత్తును తెలుసుకోగలమని ప్రజలను నమ్మించడం వంటి పాపాలకు పాల్పడేవారు.

తన అనుచరులలో ఇలాంటి తప్పుడు విశ్వాసాలు చోటుచేసుకోకుండా చూడవలసిన బాధ్యత ఒక ప్రవక్తగా సులైమాన్ (అలైహి) పై ఉంది. భవిష్యత్తు తెలుసుకునే శక్తి జిన్నులకు గానీ, ప్రవక్తలకు గానీ, మరేవరికీ లేదని, కేవలం అల్లాహ్ కు తప్ప అలాంటి శక్తి మరెవ్వరికీ లేదని ప్రజలు తెలుసుకునేలా చేయడం సులైమాన్ (అలైహి) బాధ్యత. ఈ దిశగా సులైమాన్ (అలైహి) చేసిన ప్రయత్నాలు ఆయన మరణానంతరం కూడా కొనసాగడం చెప్పుకోదగిన విశేషం.

*సులైమాన్ అలైహిస్సలామ్ మరణం* 
ఒక గనిలో జిన్నుల పనిని పర్యవేక్షిస్తూ సులైమాన్ (అలైహి) తన చేతి కర్రను ఆనుకొని కూర్చున్నారు. ఆ విధంగా కూర్చున్న స్థితిలోనే సులైమాన్ (అలైహి) తుదిశ్వాస విడిచారు. చాలా సమయం వరకు సులైమాన్ (అలైహి) మరణం గురించి ఎవరికీ తెలియదు. ఆయన అక్కడ కూర్చున్నట్లే చాలా మందికి కనబడ్డారు. సులైమాన్ (అలైహి) చూస్తున్నారన్న భయంతో జిన్నులు విరామం లేకుండా వాటి పనిని కొనసాగిస్తూ పోయారు.

*ఈ సంఘటనను దివ్య ఖురాన్ ఇలా వివరించింది.* 

"ఆ తర్వాత సులైమాన్ (అలైహి) పై మేము మరణ నిర్ణయాన్ని అమలు జరిపినప్పుడు, జిన్నాతులకు సులైమాన్ (అలైహి) మరణం గురించి తెలియజేసిన వస్తువు అతని చేతి కర్రను తింటున్న చెద పురుగు తప్ప మరొకటేది కాదు."

ఇలా చేతికర్రకు చెదపట్టి సులైమాన్ (అలైహి) భౌతికకాయం నేలకొరిగిపోగానే జిన్నులకు సులైమాన్ (అలైహి) మరణించిన విషయం తెలిసింది.

ఈ విధంగా సులైమాన్ (అలైహి) పడిపోగా, "తమకు అగోచర విషయాలు తెలిసి ఉంటే అవమానకరమైన ఈ బాధకు గురి అయి ఉండేవారము కాము." అని జిన్నాతులను స్పష్టంగా తెలిసిపోయింది.

ఆ విధంగా సులైమాన్ (అలైహి) మరణం కూడా ఆయన అనుచరులైన జిన్నాతులను ఒక గుణపాఠంగా మిగిలింది. జిన్నులే కాదు, ఎవరూ కూడా భవిష్యత్తు గురించి తెలుసుకునే అవకాశం లేదన్నది అందరికీ తెలిసివచ్చింది.

*గ్రహించవలసిన పాఠాలు : -* 

【◆】 సరైన విధంగా న్యాయం చేయాలంటే, తీర్పు చెప్పే ముందు ఇరుపక్షాల వాదనను పూర్తిగా వినాలి. న్యాయం జరిగిందని ప్రజలు తెలుసుకునేలా ఉండాలి.

【◆】 వయసులో చిన్నవాడైన కూడా తన కుమారుడు సులైమాన్ (అలైహి) వివేకాన్ని గుర్తించి, తండ్రి దావూద్ (అలైహి) తన సొంత నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.

【◆】 ప్రార్థనలతో సహా వివిధ పనులకు తగిన విధంగా సమయాన్ని విభజించుకోవాలి. ప్రవక్తలు, చాలా మంది పాలకులు ఇహలోకం మరియు పరలోకాల విధులు నిర్వర్తించడానికి తగిన విధంగా సమయాన్ని విభజించుకునేవారు.

【◆】 మనిషి ఆధ్యాత్మిక శక్తి అతని ధార్మిక విశ్వాసం లో ఉంది.

【◆】 మంచి పనులు జాతిని పతనానికి గురి కాకుండా కాపాడతాయి. అయితే విదేశీ దాడుల నుంచి కాపాడుకోవడానికి సైనిక ఏర్పాట్లు అవసరం.

【◆】 *ఆత్మ సమీక్ష : -* మనిషి తన ఆచరణల విషయంలో ఏమాత్రం అనుమానం వచ్చినా తక్షణం అల్లాహ్ వైపునకు మరలి మార్గదర్శనం కోసం ప్రార్థించాలి.

【◆】 అల్లాహ్ సృష్టి పట్ల సులైమాన్ (అలైహి) చాలా శ్రద్ధ తీసుకునేవారు, చివరకు ఒక చీమకు కూడా హాని చేయడాన్ని సులైమాన్ (అలైహి) ఇష్టపడలేదు.

【◆】 వివేక విజ్ఞానాలు ఉన్న సులైమాన్ (అలైహి) కూడా ఒక పక్షి నుంచి నేర్చుకున్నారు. ఆ పక్షి సలహా తీసుకొని దాని ప్రకారం వ్యవహరించారు.

【◆】 *పరస్పర సంప్రదింపులు : -* బిల్కిస్ ఒక స్త్రీ, ఆమె ఒక పాలకురాలు కూడా. అయినప్పటికీ అల్లాహ్ ఆమె పాలనశైలిని గుర్తించారు. ఆమె ఇతరులతో సంప్రదింపులు జరిపింది, కానీ వారు ఇచ్చిన తప్పుడు సలహాలను పాటించలేదు.

【◆】 శాంతి అన్నది సంతోషాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. యుద్ధాలు, పోరాటాలు వినాశనానికి కారణమవుతాయి.

【◆】 లంచాలకు, అవినీతిని ఎన్నడూ లొంగ రాదు.

【◆】 సులైమాన్ (అలైహి) మరణం కూడా మానవాళికి గుణపాఠం వంటిది. మనిషి జిన్నులను కూడా పాలించగలడు. అవి మనిషి పై ఆధిపత్యాన్ని సాధించలేవు. వాటికి భవిష్యత్తును తెలుసుకునే శక్తిగానీ, అగోచరాలను గ్రహించే శక్తి కాని లేవు.

【◆】 బైబిలులో కింగ్స్.. చాప్టర్ 2 లో సులైమాన్ (అలైహి) దేవుని ఆదేశాలకు విరుద్ధంగా 700 మంది మహిళలను వివాహం చేసుకున్నారని, 300 మంది మహిళలను ఉంచుకున్నారని, ఆ మహిళలు సులైమాన్ (అలైహి) ని విగ్రహారాధన చేసేలా ప్రలోభపెట్టారని, ఆయన అనేక విగ్రహారాధన ఆలయాలు కట్టించాడని, తన భార్యల కోసం బలిపీఠాలు కట్టించాడని ఇలాంటి అనేక అసత్య ఆరోపణలు ఉన్నాయి. కానీ దివ్యఖురాన్ ఈ అసత్య ఆరోపణలను, అలాగే బ్లాక్ మ్యాజిక్ కు పాల్పడ్డాడన్న ఆరోపణలన్నింటినీ ఖండిస్తోంది.

ఇంతటితో దావూద్ అలైహిస్సలామ్ మరియు సులైమాన్ అలైహిస్సలామ్ ల కథ ముగిసినది. Insha Allah రేపటి భాగము - 48 లో సబా రాణి బిల్కిస్ రాజ్యం అయిన సబా రాజ్యంలోని సబా ప్రజల గురించి తెలుసుకుందాము.

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

☆☆   ®@£€€q +97433572282 ☆☆

No comments:

Post a Comment