68

🛐 🕋 ☪ *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* ☪ 🕋 🛐

🕋🤚🏻✋🏻🕌 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🕌🤚🏻✋🏻🕋

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

       🕌☪🕋🛐 *ఇస్లాం చరిత్ర* 🛐🕋☪🕌

                                *భాగము - 68* 

◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆×◆

*మర్యం కుమారుడైన మసీహ్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. ఆయనకు మునుపు కూడా ఎంతో మంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి సద్వర్తనురాలు. ఆ తల్లీ కొడుకులిరువురూ అన్నం తినేవారే. (ఖుర్ఆన్ 5:75)* 

*ఆ తరువాత దైవదూతలు మర్యంతో “మర్యం! అల్లాహ్ నిన్ను (ఓ ముఖ్యమైన పని కోసం) ఎన్నుకున్నాడు. నిన్ను పరిశుద్ధపరిచాడు. యావత్ప్రపంచ మహిళలలో నీకు అత్యధిక ప్రాధాన్యమిచ్ఛి తన సేవ కోసం నియమించాడు. కనుక మర్యం! నీవిక నీ ప్రభుపుకు విధేయురాలివై ఉండు. ఆయన సన్నిధిలో సాష్టాంగపడుతూఉండు. మోకరిల్లేవారితో పాటు నీవూ మోకరిల్లి ధ్యానం చేస్తూవుండు” అని అన్నారు. (ఖుర్ఆన్ 3:42,43)*

*మర్యం అలైహిస్సలామ్* 

ప్రవక్త జకరియా (అలైహి) గారి భార్య సోదరికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు హజ్రత్ హన్నా. ఆమెకు హజ్రత్ ఇమ్రాన్ తో పెళ్ళి అయ్యింది.హజ్రత్ ఇమ్రాన్ ఇస్రాయీల్ నాయకుల్లో ఒకరు. హజ్రత్ ఇమ్రాన్ దంపతులకు చాలా సంవత్సరాల వరకు సంతానం కలుగలేదు. తమ తమ పిల్లలను ఎత్తుకున్న చాలా మంది భార్యాభర్తలను చూసినప్పుడల్లా పిల్లల కోసం హజ్రత్ హన్నా హృదయం పరితపించేది. ఈ విధంగా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా సంతానం గురించి ఆమెలో ఆశ మాత్రం సజీవంగా ఉండేది. ఏదో ఒకరోజు అల్లాహ్ తనకు సంతానం ప్రసాదిస్తారన్న నమ్మకం ఆమెలో ఉండేది. తన సంతానాన్ని అల్లారుముద్దుగా పెంచుకోవాలని హజ్రత్ హన్నా కలలు కనేది.

హజ్రత్ హన్నా, తనకు సంతానం ప్రసాదించమని, భూమి ఆకాశాల ప్రభువైన అల్లాహ్ తో ఇలా మొరపెట్టుకుంది. "ప్రభు! నీ సన్నిధి నుంచి నాకు సంతానాన్ని ప్రసాదించు. ఆ సంతానాన్ని జెరూసలేంలోని దైవగృహం సేవలో ఉంచుతాను." అని మొక్కుకుంది.

హజ్రత్ హన్నా ప్రార్థనను అల్లాహ్ విన్నారు. ఆమె మొర ఆలకించారు. ఆమెకు సంతానాన్ని ప్రసాదించారు. ఆమె కడుపులో పసిబిడ్డ పెరగడం ప్రారంభమయ్యింది. హజ్రత్ హన్నా ఆనందానికి పట్టపగ్గాల్లేవు. అల్లాహ్ కు శతవిధాల కృతజ్ఞతలు అర్పించుకుంది.

*"ఇమ్రాన్ (వంశపు) స్త్రీ అల్లాహ్ ని ఇలా వేడుకుంది : ఫ్రభు! నా గర్భంలో ఉన్న శిశువును నీకు అంకితం చేస్తున్నాను. ప్రాపంచిక వ్యవహారాలకు ఈ శిశువును దూరంగా ఉంచుతాను. నానుండి దీన్ని స్వీకరించు. నీవే (అందరి మొరలు) ఆలకించేవాడవు..." (ఖుర్ఆన్-3:35)* 

తమకు సంతానం కలుగుతోంది అని హజ్రత్ హన్నా భర్త హజ్రత్ ఇమ్రాన్ కూడా చాలా సంతోషించారు. అల్లాహ్ కు ధన్యవాదాలు తెలుపుకున్నారు. కానీ హజ్రత్ హన్నా గర్భంతో ఉన్నప్పుడే హజ్రత్ ఇమ్రాన్ చనిపోయారు. ఇందుకు హజ్రత్ హన్నా ఎంతగానో రోదించింది. తమకు పుట్టబోయే బిడ్డను చూడకముందే చనిపోయిన దురదృష్టం హజ్రత్ ఇమ్రాన్ ది. చివరకు హజ్రత్ హన్నాకు పండంటి ఆడబిడ్డ (మర్యం అలైహిస్సలామ్) పుట్టింది. అపుడు హజ్రత్ హన్నా మరలా అల్లాహ్ కు మొరపెట్టుకుంటూ....,

"ప్రభు! నేను మగబిడ్డ అనుకుంటే ఆడబిడ్డను ప్రసాదించావు. ఆడబిడ్డ మగబిడ్డ వంటిది కాదు. నేను నా బిడ్డకు మర్యం (భక్తురాలు) అనే పేరు పెట్టాను. ఆమెను, ఆమె సంతానాన్ని శాపగ్రస్తుడైన షైతాన్ బారిన పడకుండా నీరక్షణలో ఇస్తున్నాను." అని ప్రార్థించింది.

ఇపుడు హజ్రత్ హన్నా కు ఒక సమస్య ఎదురయ్యింది. ఆమె "తనకు పుట్టబోయే బిడ్డను దైవగృహం సేవకు అర్పిస్తాను." అని మొక్కుకుంది. కానీ ఆడపిల్లలను అక్కడ అనుమతించడం జరగదు. ఆమె ఈ విషయమై చాలా ఆందోళన చెందసాగింది. హజ్రత్ హన్నా సోదరి భర్త జకరియా (అలైహి), ఆమెకు ధైర్యం చెప్పేవారు. 

"హన్నా! మర్యం (అలైహి) గురించి అల్లాహ్ కు తెలుసు, నీకు పుట్టిన ఆడబిడ్డ గురించి కూడా అల్లాహ్ కి తెలుసు. మర్యం (అలైహి), తన సేవకు ఎలా అర్పితమైంది కూడా అల్లాహ్ కి తెలుసు." అని, ఈ విధంగా హజ్రత్ హన్నా కు, జకరియా (అలైహి) నచ్చజెప్పేవారు.

అందువల్ల హజ్రత్ హన్నా, తన బిడ్డ మర్యం (అలైహి) ను ఒక వస్త్రంలో చుట్టి, దైవగృహం పెద్దలకు అప్పగించింది. ఆడబిడ్డ కావడం వల్ల మర్యం (అలైహి) సంరక్షణ బాధ్యత ఎవరికి అప్పగించాలన్నది దైవగృహం పెద్దలకు ఒక సమస్యగా మారింది. తాము ఎంతగానో అభిమానించే, తమకు ఇష్టుడైన తమ నాయకుడు హజ్రత్ ఇమ్రాన్ గారి అనాధ బిడ్డ మర్యం (అలైహి) సంరక్షణ బాధ్యత స్వీకరించడానికి ఇస్రాయీల్ ప్రజల్లోని చాలా మంది ముందుకు వచ్చారు. అపుడు వారందరినీ ఉద్దేశించి జకరియా (అలైహి)....,

జకరియా (అలైహి) : - దైవగృహంలో మిగిలిన వారందరి కన్నా నేను ఈ బిడ్డకు సమీప బంధువును. కాబట్టి నేను ఆమె సంరక్షణ పట్ల మిగిలిన వారందరి కన్నా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాను.

ఈ విధంగా మర్యం (అలైహి) సంరక్షణ పట్ల ఆ ప్రజల్లో ఒక విధమైన పోటీ ఏర్పడింది. అప్పుడు ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఒక పద్ధతిని ఆచరించారు. 

"పసిబిడ్డ మర్యం (అలైహి) సంరక్షణ బాధ్యత స్వీకరిస్తామని ముందుకు వచ్చిన వారందరికీ ఒక గడ్డిపోచను ఇవ్వడం జరిగింది. ఆ గడ్డిపోచను నదిలో వేయాలనీ, ఎవరి గడ్డిపోచ మునిగిపోకుండా తేలుతూ ఉంటుందో వారే సంరక్షణ బాధ్యత తీసుకోవాలని నిర్ణయించారు."

ఈ పద్ధతిని నిర్వహించిన తర్వాత, ఒక్క జకరియా (అలైహి) వేసిన గడ్డిపోచ తప్ప మిగిలిన వారందరి గడ్డిపోచలు నదిలో మునిగిపోయాయి. ఆ తర్వాత అందరూ ఈ నిర్ణయానికి కట్టుబడి జకరియా (అలైహి) ను, మర్యం (అలైహి) సంరక్షకునిగా అంగీకరించారు.

ఆ తర్వాత దైవగృహంలో మర్యం (అలైహి) వద్దకు మిగిలినవాళ్ళు ఎవరూ వెళ్ళకుండా, జకరియా (అలైహి) అక్కడ ఒక గది కట్టించారు. కాలంతో పాటు మర్యం (అలైహి) పెరిగి పెద్దవసాగింది. ఆమె ఎక్కువ సమయం అల్లాహ్ ఆరాధనలో గడుపసాగింది. జకరియా (అలైహి) ప్రతిరోజూ వచ్చి ఆమెకు కావలసినవన్నీ ఇచ్చి వెళుతుండేవారు. ఈ విధంగా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక రోజు జకరియా (అలైహి) అక్కడికి వచ్చేసరికి అక్కడ తాజా ఫలాలు కనబడ్డాయి. వాటిని చూసి జకరియా (అలైహి) చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన ఆ పండ్లను తీసుకురాలేదు. మరొకరు ఆ గదిలోకి వచ్చే అవకాశం లేదు. అపుడు జకరియా (అలైహి), మర్యం (అలైహి) తో....,

జకరియా (అలైహి) : - మర్యం! నాకు తప్ప మరెవ్వరికి ఈ గదిలోకి ప్రవేశించే అనుమతి గానీ, అవకాశం గానీ లేదు. మరి ఈ పండ్లు ఎలా వచ్చాయి?

మర్యం (అలైహి) : - (జకరియా!) ఆ పండ్లు అల్లాహ్ పంపినవి. ప్రతిరోజూ ఉదయం ఆ పండ్లు నా గదిలో ఉంటున్నాయి. అల్లాహ్, తానూ తలుచుకున్నవారికి ఏమైనా అపరిమితంగా ప్రసాదిస్తారు.

ఈ మాటలు విన్న తర్వాత అల్లాహ్, మర్యం (అలైహి) కు ఉన్నత హొదా ఇచ్చారని, మిగిలిన మహిళలు ఎవ్వరికీ లభించని ఉత్కృష్ట హొదా మర్యం (అలైహి) కు లభించిందని జకరియా (అలైహి) కు అర్థమయ్యింది. అప్పటి నుంచి మర్యం (అలైహి) వద్ద మరింత అధిక సమయం గడుపుతూ ఆమెకు దైవధర్మాన్ని జకరియా (అలైహి) బోధించేవారు. ఈ విధంగా మర్యం (అలైహి) ఒక ధర్మపరాయణురాలైన మహిళగా, అల్లాహ్ ను రాత్రింబవలు ఆరాధించే మహిళగా ఎదిగారు.

_(కొందరు దివ్యఖుర్ఆన్ వ్యాఖ్యతల ప్రకారం, ఆ కాలంలో లభించే అవకాశంలేని ఫలాలు ఆమె వద్ద జకరియా (అలైహి) కనపడ్డాయి.)_ 

*ముహమ్మద్ (స)! ఈ గ్రంథంలో మర్యం (అలైహి) వృత్తాంతం ప్రస్తావించు. ఆమె ప్రజల నుండి వేరయి, తూర్పు వైపున ఏకాంత కుహరంలోకి వెళ్ళి తెరవేసుకొని కూర్చున్నది. అప్పుడు మేము ఆమె దగ్గరికి మా ఆత్మ (దైవదూత)ను పంపాము. అతను పరిపూర్ణ మానవాకారంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు.* *(ఖురాన్ 19:16,17)* 

*ప్రవక్త హజ్రత్ ఈసా అలైహిస్సలామ్ పుడతారని శుభవార్త* 

మర్యం (అలైహి) దైవగృహంలో అల్లాహ్ ఆరాధనలో ఉన్నప్పుడు ఒక దైవదూత పురుషుని రూపంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. మర్యం (అలైహి) భయంతో వణుకుతూ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. అపుడు మర్యం (అలైహి), ఆ పురుషుని రూపంలో వచ్చిన దైవదూతను ఉద్దేశించి....,

మర్యం (అలైహి) : - నీవే గనుక అల్లాహ్ కి భయపడేవానివైతే నా దగ్గరకు రాకు (ఇక్కడి నుంచి వెళ్లిపో), నేను నీబారి నుండి కరుణామయుడైన అల్లాహ్ శరణు కోరుతున్నాను. (అంటూ అల్లాహ్ ని ప్రార్థించింది.)

దైవదూత : - మర్యం (అలైహి)! భయపడవద్దు. నీకు ఎలాంటి ప్రమాదమూ లేదు. నేను నీ ప్రభువు పంపగా వచ్చిన దూతను మాత్రమే. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్, నన్ను నీ వద్దకు పంపారు. నీకు సన్మార్గుడైన మరియు పరిశుద్ధుడైన ఒక కుమారుడిని ప్రసాదించే ఉద్దేశ్యంతో విశ్వప్రభువు అల్లాహ్, నన్ను నీ వద్దకు పంపారు.

ఈ మాటలు విని మర్యం (అలైహి) నిర్ఘాంతపోయింది. అపుడు ఆమె, దైవదూత చెప్పిన మాటలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ....,

మర్యం (అలైహి) : - ఏమిటీ! నాకు కుమారుడు ఎలా పుడతాడు. నన్ను ఏ పురుషుడూ తాకనైనా తాకాలేదే. నేను శీలంలేని స్త్రీని కూడా కాదే!! (అని అన్నది కంగారుపడుతూ....)

ఈ మాటలకు దైవదూత సమాధానమిస్తూ....,

తరువాత జరిగినది Insha Allah రేపటి భాగము - 69 లో తెలుసుకుందాము.

☆☆ ®@£€€q  +97433572282 ☆☆

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

No comments:

Post a Comment