22

🤚🏻✋🏻🤚🏻✋🏻 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🤚🏻✋🏻🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

                                 *భాగము - 22* 

____________________________________________

సమూద్ జాతి లోని కొందరు దైవ ఒంటె కొండ నుంచి రావడం చూసి ఒక మహత్యంగా సాలిహ్ (అలైహి) సందేశాన్ని సత్యమైనదిగా విశ్వసించారు. ఇది చూసినా పాలక వర్గానికి చెందిన కొందరు మరింత ఆందోళన చెందారు. ఇలా అయితే కష్టం అని సాలిహ్ (అలైహి) అనుచరులను పాలక వర్గం లోని కొందరు అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేశారు. కానీ సాలిహ్ (అలైహి) అనుచరులు తమ విశ్వాసాన్ని, సాలిహ్ (అలైహి) పై ఉన్న నమ్మకాన్ని హృదయాలలో ప్రతిష్టించుకున్నారు.

*అల్లాహ్ పంపిన ఒంటెను చంపాలని సమూద్ జాతి వారి పన్నాగం.* 

అవిశ్వాసుల నాయకులు ఆ ఆడ ఒంటె పై పలు ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. భారీ ఆడ ఒంటె బావిలో నీరు మొత్తం తాగేస్తోందని, తమ పశువులు ఆ ఆడ ఒంటె ను చూసి భయపడుతున్నాయని వారు ఆరోపించడం ప్రారంభించారు.

ఆ ఆడ ఒంటెను చంపడానికి సమూద్ జాతి ప్రజలు ఒక పథకం రచించారు. అందుకు వారు ఆడవాళ్ల సహాయం తీసుకున్నారు. తమ ఆదేశాలను మగవాళ్లు పాటించేలా ఆడవాళ్లతో చెప్పించారు.

*ఆ ఆడవాళ్లు కొందరు యువకుల తో కలిసి ఒంటెను చంపడానికి పన్నాగాలు రచించారు.* 

"మాహ్య" కుమార్తె "సాదుక్" ఉన్నత వంశానికి, సంపన్న కుటుంబానికి చెందినది.

"మహ్రాజ్" కుమారుడు "మస్దా" యువకుడు.

"మస్దా" ని ప్రలోభపెట్టిన "సాదుక్". "ఆ భారీ ఆడ ఒంటె మోకాలి కండరాన్ని తెగ్గోడితే నేను నీ దానిని అయిపోతాను" అని "మస్దా" ని ప్రలోభపెట్టింది "సాదుక్".

"అనీజా" అనే వృద్ధ మహిళ తన కుమార్తెల్లో ఒక కుమార్తె ను చూపించి "సాలిఫ్" కుమారుడు "కుదార్" ని ప్రలోభపెట్టింది. ఆ ఆడ ఒంటె ను చంపితే నా కూతురు నీదేనని చెప్పింది.

సహజంగానే ఈ కుర్రాళ్ళు ఈ ప్రతిపాదనల ప్రలోభానికి గురయ్యారు. వారు మరో ఏడుగురిని తమ సహాయానికి ఎన్నుకున్నారు. వారందరూ ఆ ఒంటె దగ్గరకు వెళ్లి, దానిని చాలా దగ్గరగా పరిశీలించారు. ఒంటె కదలికలను జాగ్రత్తగా పరికించారు.

ఆ ఒంటె బావి దగ్గరకు వెళ్లి నీళ్లు తాగే సమయం కోసం అందరూ వేచిచూస్తున్నారు. చివరికి వారు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఒంటె నీళ్లు తాగేందుకు బావి దగ్గరికి వెళ్ళింది, ఆ సమయంలో ఆ యువకులు అందరూ అక్కడికి చేరుకొని ఒంటె ను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఆ ఒంటె సరిగ్గా నీళ్లు తాగుతున్నపుడు "మస్దా" బాణం తో ఒంటె కాలికి గురిచూసి కొట్టాడు. దెబ్బతిన్న ఆ ఒంటె వారి బారి నుంచి తప్పించుకోవాలని పరిగెత్తడానికి ప్రయత్నించింది. కానీ బాణం దెబ్బకు పరుగెత్తలేకపోయింది. మెల్లగా పరిగెత్తుతున్న ఒంటె ను "కుదార్" అనుసరించి ఖడ్గం తో ఒంటె కాలి పై ఒక్క వేటు వేశాడు. దెబ్బకు కాలు తెగిపోయి వేరుగా పడిపోయింది. అలా ఆ ఒంటె నేల పై కూలిపోగానే "కుదార్" దానిని ముక్కలు ముక్కలుగా చేశాడు.

అల్లాహ్ ఆజ్ఞానుసారం ప్రకృతి ప్రక్రియకు విరుద్ధంగా ఆ ఒంటె ఒక మహిమగా సృష్టించబడింది. ఆ ఒంటె కి ఎలాంటి అపకారం చెయ్యరాదని ముందుగానే తాకీదు చేయబడింది. ఆ ఒంటె ఎలా సృష్టించబడిందో కళ్లారా చూసి కూడా అల్లాహ్ ను విశ్వసించాల్సింది పోయి, అల్లాహ్ ధిక్కారణకు పాల్పడుతూ నిర్దాక్షిన్యంగా ఆ ఒంటె ను చంపేశారు.

ఈ విధంగా సమూద్ జాతి వారు తలబిరుసుతో తమ ప్రభువు ఆజ్ఞ ఉల్లంఘించి ఒంటెను చంపేశారు. 

*యువకులకు ఘన స్వాగతం* 

ఒంటె ను చంపి, పట్టణం లోకి తిరిగి వచ్చిన ఆ యువకులకు గొప్ప స్వాగతం లభించింది. సమూద్ జాతి ప్రజలు పాటలు పాడుతూ ఆ యువకులను పొగిడారు. వారి గొప్పతనాన్ని కీర్తిస్తూ కవితలు అల్లారు. అహంభావంతో వారు సాలిహ్ (అలైహి) ను ఎగతాళి చేశారు.

సాలిహ్ (అలైహి) : - మరో మూడురోజులు జీవితాన్ని అనుభవించండి. ఆ పిదప మీ పై అల్లాహ్ శిక్ష రానుంది.

వారు తమ చేసిన తప్పు తెలుసుకుంటారని ఈ మూడు రోజుల్లో తమ ప్రవర్తనను మార్చుకుంటారని సాలిహ్ (అలైహి) ఆశించారు. కానీ వాళ్ళు ఆయనను ఎగతాళి చేస్తూ ------

సమూద్ జాతి వారు : - మూడు రోజులు ఎందుకు? ఆ శిక్ష ఏదో ఇపుడే త్వరగా రానివ్వు. (ఎగతాళి చేస్తూ)

సాలిహ్ (అలైహి) : - ప్రజలారా! మీరు మంచి కి బదులుగా చెడు కోసం తొందరపడుతున్నారు ఎందుకు? మీరు అల్లాహ్ తో క్షమాభిక్ష ఎందుకు కోరుకోవడం లేదు? ఆ విధంగా చేస్తే మీరు అల్లాహ్ కారుణ్యం పొందే అవకాశముంది కదా!

కాని వారు ఆయన మాటలను ఖాతరు చేయలేదు. పైగా "నీ ఉనికి, నీ అనుచరుల ఉనికి మాకు చెడ్డ శకునంగా దాపురించింది" అని వారు సాలిహ్ (అలైహి) తో అన్నారు.

ఆ పట్టణంలో తొమ్మిది మంది ముఠా నాయకులు ఉన్నారు. వారు దేశంలో అలజడులు రేపుతుంటారు. సమాజ సంస్కరణకు సంబంధించి ఒక్క పని కూడా చేయరు. ఒక రోజు వారు పరస్పరం కూడుకొని సాలిహ్ (అలైహి) ను, ఆయన కుటుంబసభ్యులను హతమార్చే పథకం వేశారు. "మనమంతా కలుసుకొని సాలిహ్ (అలైహి) ను, అతని కుటుంబసభ్యులను ఒక రాత్రి వేళ చంపేద్దామని అల్లాహ్ పేరు మీద ప్రమాణం చేద్దాం. ఆ తర్వాత సాలిహ్ (అలైహి) సంరక్షకునితో " సాలిహ్ (అలైహి) కుటుంబహత్య సమయంలో మేము అక్కడ లెనేలేము. మేము నిజమే చెబుతున్నాము"" అని అందాము.

దివ్య ఖురాన్ లో అల్లాహ్ దీని గురించి చెబుతూ, "వారు పథకం వేశారు. మేము కూడా ఒక పథకం వేశాము, దానిని వారు అర్థం చేసుకోవడం సాధ్యం కాదు."  అని పేర్కొన్నారు.

*ముంచుకొచ్చిన విపత్తు* 

సాలిహ్ (అలైహి) హెచ్చరించిన మూడు రోజులు గడిచిన పిదప మహా ఉరుములు దద్దలిల్లాయి. ఆసాంతం ఊపేసే మహోపద్రవం వారిపై వచ్చిపడింది. భయంకరమైన భూకంపం కుదిపేసింది. మొత్తం జాతిని, వారి ఇళ్ళను సర్వ నాశనం చేసింది. వారి బలమైన భవనాలు, కొండలను తొలచిన వారి నివాసాలు ఏవీ వారిని కాపాడలేకపోయాయి. ఈ భయంకరమైన విపత్తు ధాటికి సమూద్ ప్రజలు చిన్నాభిన్నం అయిపోయారు. దాంతో సమూద్ జాతి ప్రజలు అల్లాహ్ ధిక్కారణకు గురై తమ ఇండ్లలో బోర్లాపడి ఊపిరివిడిచారు. చూడబోతే వారంతా గాలివానకు కుప్పకూలిన రాబందుల్లా పడి ఉన్నారు. వారి ముఖాలు మట్టిలో కలిసిపోయినట్లు ఉన్నాయి.

సాలిహ్ (అలైహి) ఈ భయానక దృశ్యం చూసి "నా జాతి ప్రజలారా! నేను మీకు నా ప్రభువు సందేశం అందజేశాను. మీ శ్రేయస్సు కోసం ఎంతో నచ్చజెప్పాను. కానీ నేను ఏం చేయగలను? మీరు మీ శ్రేయోభిలాషినే ప్రేమించలేకపోయారు." అని బాధపడ్డారు.

అల్లాహ్ సాలిహ్ (అలైహి) ను, ఆయన అనుచరులను అవిశ్వాసుల కుట్ర నుంచి కాపాడారు. సాలిహ్ (అలైహి) బాధాతప్త హృదయంతో దుర్మార్గులైన తన జాతి వారిని వదిలి, తన అనుచరులతో సహా మరో ప్రదేశానికి తరలిపోయారు.

సమూద్ జాతి ప్రజలు అసలు అక్కడ నివసించలేదన్నట్లుగా, వారి నామరూపాల్లేకుండా నిర్ములించబడ్డారు. కనీసం వారు ఒకప్పుడు అక్కడ నివసించిన ఆనవాళ్లు కూడా లేనట్లుగా చేరిపివేయబడ్డారు.

ఇలా ఆద్ జాతి ప్రజల లాగానే సమూద్ జాతి వారు కూడా సన్మార్గాన్ని విశ్వసించాల్సింది పోయి, అల్లాహ్ ధిక్కరణకు గురి అయి వారి వినాశనాన్ని వారే కొనితెచ్చుకున్నారు.

ఇంతటితో *ప్రవక్త హజ్రత్ సాలిహ్ అలైహిస్సలామ్* గారి భాగము ముగిసింది. Insha Allah రేపటి భాగము - 23 లో *ప్రవక్త షుఐబ్ అలైహిస్సలామ్* గారి గురించి తెలుసుకుందాము.

*ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-* 

ప్రియమైన ముస్లిం సోదరులారా!  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి , ఇదేదో 10 మందికి send చేస్తే మంచి జరుగుతుంది , send చేయకపోతే చేడు జరుగుతుంది అనుకునే msg లు కావు . కాబట్టి మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .

®@£€€q              +97433572282

No comments:

Post a Comment