49

🤚🏻✋🏻 🕌   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*   🕌 🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

                               *భాగము - 49* 

____________________________________________

*సబ్బత్ నియమం* 

ఇస్రాయీల్ ప్రజలు వారంలో ఒకరోజు తమ పనులన్నింటినీ మానుకోవాలని ప్రవక్త మూసా (అలైహి) బోధించారు. అలా పనులన్నింటినీ మానుకోనే రోజును సబ్బత్ అంటారు. సబ్బత్ రోజున అన్ని పనులు మానుకోని కేవలం అల్లాహ్ ను ఆరాధించవలసిన ఉంది. అల్లాహ్ తమ పై కురిపించిన అనుగ్రహాలను కృతజ్ఞతలు చెల్లించవలసి ఉంది. ఈ విధంగా చేయడం వల్ల ఇస్రాయీల్ ప్రజల హృదయాలు పరిశుద్ధమవుతాయని మూస (అలైహి) బోధించారు.

[సబ్బత్ నియమమంటే, సబ్బత్ రోజునాడు ఎలాంటి ప్రాపంచిక పనులు చేపట్టకుండా, చివరకి వంటపని కూడా చేయకుండా రోజంతా సెలవు తీసుకుని అల్లాహ్ ఆరాధనలో గడపాలని ఆ పట్టణ ప్రజలకు అల్లాహ్ ఒక నియమం విధించారు. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే అల్లాహ్ ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. ఈ సబ్బత్ రోజును శనివారం నాడుగా ఎన్నుకున్నారు.]

యూదులు శనివారాన్ని తమ సబ్బత్ రోజు గా ఎన్నుకున్నారు. ఈ సంప్రదాయాన్ని అనేక తరాలు ఆచరించాయి.

*దావూద్ అలైహిస్సలామ్ కాలంలో సబ్బత్ నియమం* 

ప్రవక్త దావూద్ (అలైహి) కాలంలో ఎలాత్ ప్రాంతంలో కొందరు ఇస్రాయీల్ ప్రజలు నివసించేవారు. ఎలాత్ అనేది ఎర్ర సముద్ర తీరాన ఉన్న ఒక పట్టణం. ఆ పట్టణంలో నివసించే వారంతా చేపలు పట్టే జాలర్లు. సబ్బత్ రోజున సముద్రంలో చేపలు రెండు శిలల మధ్య గుమికూడి గుంపులు గుంపులు గా కనపడడాన్ని ఇస్రాయీల్ ప్రజలు చూశారు.

సబ్బత్ రోజున జాలర్ల వలలు తమను ఏమీ చేయవన్న విషయం సముద్రంలోని చేపలు తెలిసినట్టు, ఆ రోజునే సముద్రంలోని చేపలు తీరానికి వచ్చి ఇస్రాయీల్ ప్రజలను ఊరించేవి. ఆ చేపలను చూసి కొందరు జాలర్లు నిగ్రహాన్ని కోల్పోయారు. అత్యాశతో చివరకు కొంతమంది ఇస్రాయీల్ ప్రజలు సబ్బత్ నియమాన్ని అతిక్రమించాలని నిర్ణయించుకున్నారు.

సబ్బత్ నియమాన్ని కొంతమంది ఇస్రాయీల్ ప్రజలు ఎందుకు ఉల్లంఘిస్తుండేవారంటే, శనివారం రోజే సముద్రంలోని చేపలు సముద్ర ఉపరితలం పైకి వచ్చి వారి ముందుకు వస్తుండేవి. ఆ చేపలు శనివారం రోజు తప్ప మరే దినాలలో కూడా పైకి వచ్చేవి కావు.

ఒక సబ్బత్ రోజు ఉదయం ఈ జాలర్లు చేపలు పట్టడానికి వెళ్ళారు. కాని అల్లాహ్ పై భయము కలిగిన కొంతమంది ప్రజలు ఆ జాలర్లతో కలిసి చేపలు పట్టడానికి వెళ్లేందుకు నిరాకరించారు. కారణం అల్లాహ్ పై భయం కలిగిఉండటం. ఈ విషయం గురించి తెలిసి అల్లాహ్ ఆదేశాలను అతిక్రమించవద్దని అల్లాహ్ పై భయం ఉన్నవారు, సబ్బత్ నియమాన్ని ఉల్లంఘించి చేపలు పట్టడానికి వెళుతున్న వారికి హితోపదేశం చేశారు. కానీ దురాశకు గురైన జాలర్లు వినలేదు. అందువల్ల వారి పట్టణం నడిబొడ్డున ఒక గోడను నిర్మించి సబ్బత్ పాటించే ప్రజలు ఒకవైపు మరియు సబ్బత్ ను అతిక్రమించిన ప్రజలు మరొక వైపు ఉండవలసిందిగా పట్టణాన్ని విభజించడం జరిగింది. అల్లాహ్ శిక్ష తమపై ఎక్కడ పడుతుందో అని మంచివాళ్ళు భయపడ్డారు.

ఆ దుర్మార్గులు ప్రతి సబ్బత్ రోజున నిర్భయంగా, నిస్సంకోచంగా చేపల వేట కొనసాగించేవారు. చివరకు వాళ్లు తమ ఇళ్ళకు దగ్గరగా కందకాలు తవ్వి సముద్రం నీటి నుంచి చేపలు తమ ఇళ్ళ దగ్గరకు వచ్చేలా చేసేవారు. ఇస్రాయీల్ ప్రజలు ఒక రోజు ముందుగా సముద్రతీరాన గుంతలు తవ్వి నీటితో నింపేవారు. శనివారం నాడు ఆ గుంటల్లోకి చేపలు వచ్చాక వాటిని పట్టుకునేవారు.

ఆ ఇస్రాయీల్ ప్రజల దుశ్చర్యలను బట్టబయలు చేయడానికే అల్లాహ్ వారికి అలా పరీక్ష పెట్టారు.

ఆ తర్వాత ప్రవక్త దావూద్ (అలైహి) స్వయంగా, సబ్బత్ నియమాన్ని ఉల్లంఘించిన ఇస్రాయీల్ ప్రజలను హెచ్చరించడానికి వెళ్లారు. అల్లాహ్ ఆదేశాలను అతిక్రమిస్తే అల్లాహ్ శిక్ష మిమ్మల్ని పట్టుకుంటుందని నచ్చజెప్పారు. కాని వారు వినలేదు. ఈ వైఖరిని చూసి కొందరు వారిని వారి ఖర్మకు వదిలేయడమే మంచిది అని చెప్పారు.

ప్రవక్త దావూద్ (అలైహి) ఈ విషయమై అల్లాహ్ సహాయం కోసం ప్రార్థించారు. చివరకు ఒక పెద్ద భూకంపం నగరాన్ని కుదిపేసింది. సబ్బత్ నియమ ఉల్లంఘన పాపాన్ని సహించిన విశ్వాసాలు కూడా ఆ భూకంపం ప్రభావానికి గురయ్యారు. దుర్మార్గులు పాల్పడే చెడ్డ పనులను వ్యతిరేకించి అభ్యంతరపెట్టిన వారిని మాత్రం అల్లాహ్ రక్షించాడు. సబ్బత్ నియమాన్ని ఉల్లంఘించి దుర్మార్గానికి పాల్పడిన వారిని అల్లాహ్ భూకంపం ద్వారా అంతమొందించాడు. ఈ విధంగా వారు శనివార నియమాన్ని ఉల్లంఘించి అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యారు.

భూకంపంలో నాశనమయ్యే ముందు ఆ పట్టణ ప్రజల్ని "కోతులుగా మారి తుచ్ఛమైన బ్రతుకు బ్రతకండి." అని అల్లాహ్ శపించారు. ఆ విధంగా సబ్బత్ నియమాన్ని ఉల్లంఘించిన వారు కోతులుగా మారిపోయారు.

*గ్రహించవలసిన పాఠాలు : -* 

■ నేటికి కూడా యూదులు శనివారం రోజును సబ్బత్ గా పాటిస్తారు.

■ ప్రవక్త ఈసా (అలైహి) కూడా సబ్బత్ పాటించేవారు. తర్వాత క్రైస్తవులు సబ్బత్ ను ఆదివారంగా మార్చుకున్నారు. ప్రాచీన రోమన్లు ఆరాధించిన సూర్యదేవునికి చెందిన రోజైన ఆదివారాన్ని క్రైస్తవులు తమ కోసం సబ్బత్ గా ఎన్నుకున్నారు.

■ దేవుడు పూర్తి ప్రపంచాన్ని ఆరు రోజుల్లో సృష్టించాడని ఏడవ రోజున విశ్రమించాడని క్రైస్తవులు విశ్వసిస్తారు. (జెనిసిస్ 2-2). కానీ దేవుడు కూడా మానవుల మాదిరిగా అలసిపోతాడని, విశ్రాంతి అవసరమని ముస్లింలు ఎన్నటికీ భావించరు.

■ శుక్రవారం ముస్లింలకు సంబంధించి సబ్బత్ ఎంతమాత్రం కాదు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో పనులన్నీ మానుకొని తప్పనిసరిగా సామూహిక ప్రార్థనలకు హాజరుకావల్సి ఉందన్న మాట నిజమే, కానీ ఆ ప్రార్థనలు మహా అయితే అరగంట కన్నా అధిక సమయం ఉండవు. ఆ పిదప వారు తమ ఉపాధి కార్యక్రమాల్లో నిమగ్నం కావచ్చు.

Insha Allah రేపటి భాగము - 50 లో మహావివేకి లుక్మాన్ అలైహిస్సలామ్ గురించి తెలుసుకుందాము.

Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.

☆☆   ®@£€€q +97433572282 ☆☆

No comments:

Post a Comment