19

🤚🏻✋🏻🤚🏻✋🏻 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🤚🏻✋🏻🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

    *భాగము - 19          Date : 29/11/2017* 

____________________________________________

*యూసుఫ్ (అలైహి) సోదరులు, తమ తమ్ముడు బెన్యామీన్ ను వదిలేయాలని యూసుఫ్ (అలైహి) వద్ద ప్రాధేయపడుతున్న సందర్భం.* 

"రాజ్యాధిపతి! మా సోదరుడు (బెన్యామీన్) ను విడుదల చేయవలసింది గా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. మా తండ్రిగారి దుఃఖాన్ని ఈ విధంగా మేము తగ్గించగలము. దయ చూపండి. దయ చూపేవారిని అల్లాహ్ కనికరిస్తాడు” అన్నారు.

తాను ఎవరో చెప్పవలసిన సమయ౦ ఆసన్నమైందని యూసుఫ్ (అలైహి) గ్రహించారు.

యూసుఫ్ (అలైహి) : - మిమ్మల్ని షైతాన్ తప్పుదారి పట్టించిన రోజు మీకు గుర్తున్నదా? చాలా కాలం క్రితం మీరు యూసుఫ్ (అలైహి) ను చీకటి బావిలో నెట్టేసిన రోజు మరచిపోయారా? మీరు అజ్ఞానంధకారం లో పడి యూసుఫ్ (అలైహి) పట్ల, అతని తమ్ముడి పట్ల మీరు ఎలా ప్రవర్తించారో మీకేమైనా గుర్తుందా? (ఖురాన్ 12:89).

[ఈ మాట విని వారు ఉలిక్కిపడి ఆశ్చర్యం తో యూసుఫ్ (అలైహి) వైపు చూస్తుండిపోయారు. వారిలో ఒకడు అసంకల్పికంగా “నువ్వు యూసుఫ్‌వా?” అని పలికాడు.

యూసుఫ్ (అలైహి) : - అవును నేను యూసుఫ్‌ నే . ఇతను (బెన్యామీన్) నా తమ్ముడు. అల్లాహ్ మాకెంతో మేలు చేశాడు. పాపకార్యాలకు దూరంగా ఉంటూ, కష్టకాలంలో సహనం వహించే సజ్జనులకు అల్లాహ్ వద్ద అన్యాయం జరగదు. వారి ప్రతిఫలం ఎన్నటికి వృధా పోదు.

సోదరులు : - "అల్లాహ్ సాక్షి! అల్లాహ్ మీకు మాకంటే ఎక్కువ ఔన్నత్యం ప్రసాదించాడు. మేము నిజంగా పాపాత్ములం" అని అన్నారు. (ఖురాన్ 12:90,91).]

*సోదరులను క్షమించిన యూసుఫ్ (అలైహి)* 

యూసుఫ్ (అలైహి) : - ఈ రోజు మీ గురించి ఎలాంటి ఆరోపణలు, ఆక్షేపణలు లేవు. అల్లాహ్ మిమ్మల్ని క్షమించుగాక! ఆయన ఎంతో దయామయుడు. ఇక వెళ్ళండి. ఇదిగో నా చొక్కా తీసుకువెళ్లి నా తండ్రి ముఖం పై వేయండి. ఆయనకు చూపు తిరిగొస్తుంది. మీ భార్యాపిల్లలు కుటుంబాన్ని మొత్తం నా దగ్గరకు పిలుచుకరండి. (ఖురాన్ 12:92,93).

అపుడు పరస్పరం అందరూ ఆలి౦గన౦ చేసుకున్నారు. వారంతా ఆనందభాష్పాలు రాల్చారు. ఆ రాజ్యంలో యూసుఫ్ (అలైహి) ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు. తన స్తానంలో మరొకరిని నియమించకుండా అక్కడి నుంచి తప్పుకోవడం ఆయనకు సాధ్యం కాదు. కాబట్టి ఆయన తన సోదరులను తక్షణం ఇంటికి వెళ్ళి తల్లితండ్రులను, భార్యాపిల్లలను వెంటబెట్టుకుని ఇక్కడికే వచ్చేయండి అన్నారు. సోదరులకు తన చొక్కా ఒకటి ఇచ్చి ఆ చొక్కాను తన తండ్రి కళ్ళ పై వేయమని చెప్పారు. ఆ విధంగా ఆయనకు కంటిచూపు మరలా వస్తుందని చెప్పారు.

తన వారిని కలవాలన్న ఆతృత యూసుఫ్ (అలైహి) ను నిలువనీయలేదు.

*తర్వాత యూసుఫ్ (అలైహి) సోదరులు బృందాలుగా ఈజిప్టు నుంచి బయలుదేరి, తమ దేశానికి (కన్ఆన్) దగ్గరలో ఉన్న సందర్భం.* 

బాటసారుల బృ౦ద౦ బయలుదేరింది. అపుడు (కన్ఆన్ లో ఉన్న) వారి తండ్రి ( విచిత్రమైన ఒక ప్రశాంతత తనను ఆవహించుకున్న భావన యాఖూబ్ అలైహిస్సలామ్ కు కలిగింది.) నాకు యూసుఫ్ (అలైహి) కు సంబంధించిన సువాసన ఏదో వస్తున్నట్లు అనిపిస్తోంది. నేను ముసలితనంలో మతిభ్రమించి ఇలా అంటున్నానని మీరనుకోవచ్చు. (కాని ఇది నిజం) అన్నాడు. (ఖురాన్ 12:94).

“అయ్యో దేవా! మీరు ఇంకా అదే పిచ్చి లో ఉన్నారు" అని అన్నారు అతని కుటుంబసభ్యులు. ఆ తర్వాత కొన్నాళ్ళకు శుభవార్తాహరుడు వచ్చాడు. రాగానే యూసుఫ్‌ (అలైహి) చొక్కా తీసి యాఖూబ్ (అలైహి) ముఖం పై వేశాడు. అంతే మరుక్షణమే యాఖూబ్ (అలైహి) కు చూపు వచ్చింది. అపుడు యాఖూబ్ అలైహిస్సలామ్ (సంతోషిస్తూ) "నేను చెప్పలేదూ! (యూసుఫ్ దగ్గరి నుంచి సువాసన వస్తోందని) మీకు తెలియని విషయాలెన్నో అల్లాహ్ తరఫున నాకు తెలుసు" అన్నాడు. దానికి ఆ అన్నతమ్ములు ముక్తకంఠం తో "నాన్నగారు! మేము నిజంగా పాపాత్ములం. మా పాపాల మన్నింపు కోసం అల్లాహ్ ని ప్రార్థించండి" అని అన్నారు. (ఖురాన్ 12:95,96,97).

యాఖూబ్ (అలైహి) వారితో “నాకు మీ పై ఎలాంటి అధికారము" లేదు. మీకు అల్లాహ్ శిక్ష విధించకుండా నేను కాపాడలేను. నేను కేవలం మీ క్షమాపణ కోసం అల్లాహ్‌ను ప్రార్థించగలను. ఆయన చాలా క్షమించేవాడు. పరమ దయామయుడు” అని అన్నారు. (ఖురాన్ 12:98).

ఆ తర్వాత కొన్నాళ్ళకు వారంతా ఈజిప్టు లో యూసుఫ్ (అలైహి) దగ్గరకు చేరుకున్నారు. అప్పుడు యూసుఫ్ (అలైహి) తన తల్లితండ్రుల్ని ఘనంగా స్వాగతించాడు. వారిని దగ్గర కూర్చోబెట్టుకొని (అన్నదమ్ములు, ఇతర బంధువులతో) "పదండి, నగరం లోకి ప్రవేశించండి. దైవం కోరితే (ఇక నుంచి) మీరంతా శాంతిసుఖాలతో జీవితం గడుపుతారు" అని చెప్పాడు. (ఖురాన్ 12:99).

(ఇలా ఆనందోత్సాహాలతో వారు నగరం లోకి ప్రవేశించారు.) తర్వాత యూసుఫ్ (అలైహి) తల్లిదండ్రుల్ని సింహాసనం పై తనపక్కన కూర్చోబెట్టుకున్నాడు. అపుడు అందరూ అప్రయత్నంగా అతనికి గౌరవసూచకంగా అభివాదం చేశారు.

తర్వాత యూసుఫ్ (అలైహి), తన నాన్నతో  “నాన్నా! నేను ఆ రోజు చూసిన కలలోని గూఢార్ధం ఇదే. ( సూర్యుడు, చంద్రుడు, పదకొండు నక్షత్రాలు యూసుఫ్ (అలైహి) ముందు సాష్టాంగప్రణామం చేసినట్లు కల, ఆ పదకొండు నక్షత్రాలు తన పదకొండు మంది అన్నదమ్ములు, సూర్యచంద్రులు, తన తల్లితండ్రులు.)
నా ప్రభుపు దాన్ని (ఈరోజు) ఇలా నిజం చేసి చూపాడు. ఆయన తన అనుగ్రహంతో నన్ను జైలు నుంచి విడుదల చేయించాడు. అంతేకాదు, మిమ్మల్నందరినీ ఎడారి ప్రాంతం నుండి తీసుకొచ్చి నాతో కలిపాడు. అంతకు ముందు షైతాన్ నాకు, నా సోదరులకు మధ్య కలహం సృష్టించాడు. (అల్లాహ్ దాన్ని తిప్పికొట్టాడు.) వాస్తవం ఏమిటంటే నా ప్రభువు ఇతరులెవరూ గ్రహింలేని అద్భుతమైన యుక్తులతో తన పథకాన్ని అమలుపరుస్తాడు. ఆయన సమస్తం ఎరిగినవాడు, మహా వివేకవంతుడు.” (ఖురాన్ 12:100).

"నా ప్రభూ! నీవు నాకు రాజ్యాన్ని ప్రసాదించావు. ఇంకా, నీవు నాకు కలల భావార్థాన్ని వివరించే విద్యను నేర్పావు. ఓ భూమ్యాకాశాల సృష్టికర్తా! ఇహంలోనూ, పరంలోనూ నువ్వే నా సంరక్షకుడవు. ముస్లింగా ఉన్న స్థితిలోనే నాకు మరణంవొసగు. నన్ను సజ్జనులలో చేర్చు.'' అని వేడుకున్నాడు. (ఖురాన్ 12:101).

యూసుఫ్‌ (అలైహి) తన తల్లితండ్రులను రాజుగారి వద్దకు తీసుకువెళ్ళారు. వారందరూ ఈజిప్టులో స్థిరపడడానికి అనుమతి కోరారు. రాజ్యంలో యూసుఫ్ (అలైహి) ఒక ముఖ్యమైన అధికారి. రాజు చాలా సంతోషంగా యూసుఫ్ (అలైహి) కుటుంబం రాజ్యంలో ఉండడానికి అనుమతిచ్చారు. యూసుఫ్ (అలైహి) కృతజ్ఞతతో అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడ్డారు.

◆ తల్లితండ్రులు తమ పిల్లలందరినీ ప్రేమిస్తారు, కానీ కొందరి పట్ల ఎక్కువ ఇష్టం చూపుతారు. అందులంటూ కారణం ఆ పిల్లల మంచి గుణగణాలు. అయితే ఈ ప్రేమాభిమానాలు వ్యక్తం చేయడంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. సంతానంలో కొ౦దరి పట్ల ఎక్కువ ఇష్టాన్ని ప్రదర్శిస్తే మిగిలిన వారిలో అసహనం, అసూయలు జనించడానికి అవకాశం ఉంది.

◆ అసూయ వల్ల బాధలకు గురయినవానికి అల్లాహ్ రక్షణ లభిస్తుంది. యూసుఫ్ (అలైహి) సోదరులు ఆయనను బానిసగా అమ్ముడుపోయేలా చేయడానికి పన్నిన కుట్ర నిజానికి ఆయన జీవితంలో ఉన్నత స్థానానికి చేర్చింది.

◆ తాను చాలా ప్రేమించే తన కుమారుడు యూసుఫ్ (అలైహి) మరణించాడని విన్నప్పుడు యాఖూబ్ (అలైహి) చాలా బాధపడ్డారు. కాని ఆయన నిరాశ చెందలేదు. సహనాన్ని, అల్లాహ్ కారుణ్యాన్ని ఆయన కోరుకున్నారు. అల్లాహ్ పై భారం వేసి తాను అధికంగా ప్రేమించే మరో కుమారుడు బెన్యామీన్ నమ్మకస్తులుకాని కుమారుల చేతుల్లో పెట్టడానికి ఆయన సిధ్దమయ్యారు. ఈసారి కూడా ఆయన నమ్మకం వమ్ము అయినట్టు కనబడింది. అయితే సృష్టికర్త పట్ల ఆయన విశ్వాసం చెక్కు చెదరలేదు. ఫలితంగా ఆయనకు అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహాలు లభించాయి.

◆ అల్లాహ్ ఏకత్వాన్ని ప్రజలకు తెలియజేయడమే ప్రవక్తల ముఖ్య ఉద్దేశ్యం. అన్ని పరిస్థితుల్లోనూ, చివరకు జైలు గోడల మధ్య కూడా యూసుఫ్ (అల్లాహ్) ఖైదీలకు అల్లాహ్ ఏకత్వాన్ని బోధించారు. ముస్లిములు అందరూ ఈ వైఖరిని కలిగి ఉండాలని అల్లాహ్ కోరుతున్నాడు.

◆ స్త్రీ పురుష కలివిడి సాంప్రదాయం వల్ల ప్రమాదాలు వాటిల్లుతాయి. యూసుఫ్ (అలైహి) తన యజమానురాలి వెంట ఎల్లప్పుడూ ఉండేవారు. అందువల్ల ఆమె మనసులో కామవాంఛ తలెత్తింది. ఆమె యూసుఫ్ (అలైహి) ను లోబరుచుకోవాలని అనుకున్నప్పుడు, యూసుఫ్ (అలైహి) అల్లాహ్ కి భయపడేవారు కాబట్టి, బలమైన నైతికస్థాయి కలిగిన వారు కాబట్టి ఆమె కోరికను యూసుఫ్ (అలైహి) తిరస్కరించారు.

        ఇంతటితో ప్రవక్త *యూసుఫ్ అలైహిస్సలామ్* భాగము ముగిసింది. Insha Allah రేపటి భాగము - 20 లో *హుద్ అలైహిస్సలామ్* గురించి తెలుసుకుందాము.

*ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-* 

ప్రియమైన ముస్లిం సోదరులారా!  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి , ఇదేదో 10 మందికి send చేస్తే మంచి జరుగుతుంది , send చేయకపోతే చేడు జరుగుతుంది అనుకునే msg లు కావు . కాబట్టి మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .

No comments:

Post a Comment