86

☪☪☪   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*    ☪☪☪

🕋🕋   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🕋🕋
🕋🕋 *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*  🕋🕋

●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●○●

🛐🛐🛐          *ఇస్లాం చరిత్ర* *- 86*          🛐🛐🛐

🇸🇦🇸🇦🇸🇦 *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 01* 🇸🇦🇸🇦🇸🇦 
◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆◇◆

*ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి వంశావళి : -* 

దైవప్రవక్త (స) వంశావళిని మూడు భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగం, చరిత్రకారులు, వంశజ్ఞులు అందరూ ఏకీభవించిన భాగం. ఈ వంశావళి "అద్ నాన్" వరకు వెళ్ళి ఆగిపోతుంది. రెండవ భాగం గురించి చరిత్రకారుల మధ్య అభిప్రాయభేదం ఉంది. కొందరు దీనిని ఒప్పుకుంటారు, కొందరు నిరాకరిస్తారు. ఈ వంశావళి "అద్ నాన్" పైన "హజ్రత్ ఇబ్రాహీం (అలైహి)" వరకూ వెళ్ళి ఆగుతుంది. ఇక మూడవ భాగం. ఇందులో కొన్ని తప్పులు దొర్లాయి. ఈ వంశావళి "హజ్రత్ ఇబ్రాహీం (అలైహి)" నుండి పైకి హజ్రత్ "ఆదం (అలైహి)" వరకూ వెళ్ళి ఆగుతుంది. వెనుకటి పుటల్లో ఈ విషయాన్ని చూచాయగా చెప్పుకోవడం జరిగింది. మనకు ఇప్పుడు సమయం లేనందువల్ల ఈ మూడు భాగాల గురించి తెలుసుకోవడం కంటే దైవప్రవక్త (స) గారి ముత్తాత హాషిమ్ నుంచి తెలుసుకుందాము.

*● ముహమ్మద్ (స.అ.వసల్లం) తండ్రి అబ్దుల్లాహ్.* 

*● అబ్దుల్లాహ్ తండ్రి అబ్దుల్ ముత్తలిబ్ (షైబా).* 

*● అబ్దుల్ ముత్తలిబ్ తండ్రి హాషిమ్ (అమ్రూ).* 

*● హాషిమ్ తండ్రి అబ్దె మునాఫ్ (ముగీరా).* 

దైవప్రవక్త (సల్లం) గారి వంశావళి ఆయన ముత్తాత హాషిమ్ బిన్ అబ్దె మునాఫ్ తో గల సంబంధం రీత్యా హాషిమీ వంశంగా పేరు గాంచింది. కాబట్టి హాషిమ్, ఆ తరువాతి కొందరు వ్యక్తులు వివరాలను క్లుప్తంగా తెలియజేయడం అవసరమనిపిస్తోంది.

*హాషిమ్ బిన్ అబ్దె మునాఫ్* 

ఇదివరకు మేము చెప్పినట్లు, బనూ అబ్దె మునాఫ్ మరియు బనూ అబ్దుద్దార్ నడుమ హొదాల పంపకం విషయమై రాజీ కుదిరినప్పుడు అబ్దె మునాఫ్ సంతానంలో హాషిమ్ ఒక్కడికే "సికాయా" మరియు "రిఫాదా" అంటే హజ్ యాత్రికులకు నీళ్ళు త్రాపే, వారికి ఆతిథ్యం ఇచ్చే హొదాలు లభించాయి. హాషిమ్ మంచి గౌరవం, సంపద కలిగిన వ్యక్తి. మొట్టమొదట హాజీలకు మాంసపు చారులో రొట్టె ముక్కలను వేసి తినిపించే ఆనవాయితీ వేసిన మొదటి వ్యక్తి ఆయన. ఈయన అసలు పేరు అమ్రూ. అయితే రొట్టెల్ని ముక్కలుగా చేసి చారులో కలపడం వలన ఆయనకు హాషిమ్ అనే పేరు వచ్చింది. హాషిమ్ అంటే ముక్కలుగా చేసేవాడని అర్థం. అదే కాదు, ఖురైష్ కోసం ఎండా కాలం, చలికాలాల్లో ఏడాదికి రెండు వ్యాపార బిడారాలను పంపే పునాది వేసిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఈ హాషిమే. ఈయన గురించి ఓ కవి ఇలా పొగిడాడు :

“కరువుపీడిత సమయాల్లో తన బలహీన జాతికి మక్కాలో రొట్టెలను త్రుంచి మాంసపు చారులో వేసి తడిపి తినిపించినవాడూ, ఎండా కాలం, చలికాలాల్లో రెండు ప్రయాణాలను ప్రారంభించినవాడూ ఈ అమ్రూయే.”

*వర్తక బృందం : -* 

సిరియాలో తమ వ్యాపారాన్ని ముగించుకొని, మిగిలిన వ్యాపార సరుకులతో సిరియా నుంచి తిరిగివస్తున్న ఓ వర్తక బృందం, యస్రిబ్ (మదీనా) పట్టణాన్ని సమీపించి, పట్టణం వెలుపల విడిది చేసింది. వ్యాపారస్తులు తమ ఒంటెలపై కట్టిన తమ వ్యాపార సామగ్రిని క్రిందికి దించి, విశ్రాంతి కోసం ఒంటెలను వదిలిపెట్టారు. కొంతమంది ఆ ఒంటెలకు నీరు, మేత పెట్టడంలో నిమగ్నులయ్యారు. మరి కొంతమంది వంట చేస్తున్నారు. బాగా అలసిపోయిన ఇంకొంతమంది, చల్లని చెట్ల నీడ చాటున విశ్రాంతికి ఉపక్రమించారు.

ఆ వర్తక బృందంలో కాబా ధర్మకర్త అయిన ఖురైష్ తెగ నాయకుడు హాషిమ్ బిన్ అబ్దె మునాఫ్ కూడా ఉన్నారు. హాషిమ్ కూడా బాగా అలసిపోయినందువల్ల, ఓ చెట్టు నీడన విశ్రాంతి కోసం నడుం వాల్చారు.

ఈ వర్తక బృందంలో మక్కా పట్టణానికి చెందిన వర్తకులు ఎక్కువ మంది ఉన్నారు. మదీనా పట్టణానికి చెందిన వర్తకులు కూడా కొందరు ఉన్నారు. సిరియా నుంచి మక్కాకు వెళ్లే దారిలోనే మదీనా ఉంది. అందువల్ల ఒక్కొక్కసారి వర్తకులు మదీనాలో ఒకటి లేదా రెండు రోజులు విడిది చేసి, విశ్రాంతి తీసుకుంటారు.

*అందమైన యువతి : -* 

ఈ వ్యాపార బృందంలో, తమ వ్యాపారస్తులు కూడా సిరియా దేశం నుంచి తిరిగివచ్చారని తెలుసుకొన్న ఒక అందమైన యువతి, తన సేవకులతో కలిసి తన వ్యాపారస్తులు దగ్గరికి చేరుకుంది. ఆమె అక్కడికి చేరుకోగానే మదీనా పట్టణం నుంచి పంపిన తన వర్తకులను ఉద్దేశించి...., "ఈ సంవత్సరం అమ్మకాలు ఎలా ఉన్నాయి? ఎంత లాభం వచ్చింది? సిరియా దేశంలో ఏ ఏ సామాగ్రి కొన్నారు?" ఇలాంటి అనేకమైన విషయాలను అడగడం ప్రారంభించింది.

ఆ అపురూప సౌందర్యవతికి కొద్ది దూరంలో నిల్చున్న హాషిమ్ చెవిలో ఆమె మాటలు పడ్డాయి. వెనువెంటనే హాషిమ్ దృష్టి అప్రయత్నంగా ఆమె వైపు మళ్ళింది. ఆ యువతి రూపురేఖల్లో హుందాతనం ఉట్టిపడుతోంది. ఆమె మాటల్లో అపార వ్యాపారనుభవం, ముఖ వర్చస్సులో సఛ్ఛీలం తొణికిసలాడుతోంది.

ఆమె వైపు చూసిన ఆ కొన్ని క్షణాల్లోనే హాషిమ్ కు ఆమె వ్యక్తిత్వం ఎంతగానో ఆకట్టుకుంది. సంభ్రమాశ్చర్యాలకులోనైన హాషిమ్, ఆ యువతి వైపు చూస్తూ...., "ఎవరు ఈమె?" అని సహవర్తకులతో అడిగారు.

సహవర్తకులు : - ఆ యువతి ఖజ్రజ్ తెగలోని బనీ నజ్జార్ తెగకు చెందిన స్త్రీ. ఆమె పేరు సల్మా బింతే అమ్రూ. ఆవిడ తండ్రి పేరు అమ్రూ.

హాషిమ్ : - ఆవిడకు పెళ్ళి అయ్యిందా?

సహవర్తకులు : - ఇంకా అవ్వలేదు! సల్మా బింతే అమ్రూ, యావత్తు మదీనాలో గొప్పింటి బిడ్డ. ఎంతో ఆత్మాభిమానం, స్వతంత్ర భావాలు కలిగిన యువతి. తన ఆత్మాభిమానం, స్వేఛ్ఛాస్వాతంత్ర్యాలకు భంగం కలిగించని యువకుడు లభిస్తే, అలాంటి యువకుడిని పెళ్ళి చేసుకోవాలని భావిస్తోంది.

హాషిమ్ : - అలా అయితే నన్ను పెళ్ళి చేసుకోవడం ఆవిడకి ఇష్టమేమో అడిగి చూడండి!

ఆ సహవర్తకులు వెళ్ళి ఈ పెళ్ళి సంగతి సల్మా కు తెలియజేశారు. హాషిమ్ గురించి మరియ అతని కుటుంబగౌరవం గురించి సల్మా ఇదివరకే విని ఉండటం వల్ల వెంటనే ఈ పెళ్ళికి తన అంగీకారం తెలిపింది. మరునాడు పెద్దల సమక్షంలో హాషిమ్, సల్మాల పెళ్ళి నిరాడంబరంగా జరిగింది. ఆ తర్వాత హాషిమ్, నూతన వధువుని తీసుకొని తన సహవర్తకులతో కలిసి మక్కాకు తిరిగొచ్చాడు.

సల్మా, హాషిమ్ ల దాపత్య జీవితం సుఖంగా గడచిపోతోంది. ఎండలు క్రమంగా తీవ్రం కాసాగాయి. వేసవికాలం తిరిగి సమీపించడంతో మక్కా పట్టణప్రజలలో వ్యాపార పర్యటన గురించిన ఆలోచనలు మొదలయ్యాయి. వర్తకులు ఎగుమతి సరుకుల సమీకరణలో నిమగ్నులయిపోయారు. కొన్ని రోజుల్లోనే వర్తకబిడారాలు సిద్దమయ్యాయి.

హాషిమ్ కూడా తన వ్యాపారసామగ్రి తీసుకొని, తోటి వర్తకులతో కలిసి సిరియా బయలుదేరాడు. ఈ సారి హాషిమ్, సల్మాను వెంటబెట్టుకొని ప్రయాణమయ్యాడు. మెట్టింటికి వచ్చిన తర్వాత సల్మా శరీరంలో అనిర్వచనీయమైన మార్పు వచ్చింది. పచ్చపచ్చగా కానరాసాగింది. అది గమనించిన హాషిమ్ ఓరగా చూసినప్పుడల్లా సల్మా సిగ్గుతో కుంచించుకుపోతుండేది.

అలా వారందరూ సిరియాకు వెళుతుండగా దారిలో మదీనా వచ్చింది. సల్మా సంతోషంలో పొంగిపోయింది. హాషిమ్ మదీనాలోకి ప్రవేశించాడు. సల్మాను, తన పుట్టింటిలో దించి వ్యాపార నిమిత్తం సిరియా వెళ్ళడానికి ఉపక్రమించాడు. సల్మా, హాషిమ్ వైపు బాధగా చూసింది. హాషిమ్ కూడా సల్మా వైపు బాధగా చూస్తూ బలవంతంగా ఓ చిరునవ్వు నవ్వాడు. ఆ తరువాత ఒంటె ఎక్కి చరచరా వెళ్ళిపోయాడు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు, తనను పుట్టింటనే వదిలి సిరియాకు వెళ్ళిపోయాడు హాషిమ్.

కొన్ని రోజుల తర్వాత ఆ వర్తకబృందం సిరియాకు చేరుకుంది. ఆ సంవత్సరం పాలస్తీనాలోని గజ్జా పట్టణం వారి వ్యాపారానికి కేంద్రమయ్యింది. వ్యాపారస్తులు తమ తమ సరుకులను దించుకున్నారు. అమ్మకాలు, కొనుగోళ్ళకు ప్రారంభమయ్యాయి.

అయితే హాషిమ్ గజ్జా పట్టణానికి వచ్చిన కొన్నాళ్లకే జబ్బు బారిన పడ్డాడు. ఎన్ని విధాలుగా చికిత్స చేసిన ఆ జబ్బు బారి నుంచి హాషిమ్ కోలుకోలేకపోయాడు. చివరకి ఆ జబ్బు నయంకాక తుదిశ్వాస విడిచాడు.

ఈ విధంగా, తన భార్య సల్మా గర్భవతిగా ఉన్నప్పుడు, శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు హాషిమ్ బిన్ అబ్దె మునాఫ్.

*మగబిడ్డకు జన్మనిచ్చిన సల్మా : -* 

అటు మదీనాలో సల్మా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లవాని తలవెంట్రుకల్లో తెలుపు వెంట్రుకులు ఉన్నందున సల్మా ఆ పిల్లవానికి "షైబా" అని పేరు పెట్టింది. తన భర్త హాషిమ్ కోసం ఎదురుచూసి సల్మా చాలా నిరాశచెందింది. కాలం గడిచిపోతోంది. షైబా పెరిగి పెద్దవసాగాడు. క్రమంగా మాటల నుండి చేతలకు ఎదిగాడు. శుక్లపక్షం చంద్రుడిలా దినదిన ప్రవర్ధమానమవుతున్నాడు.

ఆ పిదప కొన్ని రోజుల తర్వాత, మక్కాకు తిరిగి వచ్చిన వర్తకబృందం ద్వారా హాషిమ్ చనిపోయాడన్న సంగతి సల్మాకు తెలుసింది.

ఇక్కడ గమనించదగ్గ విషయమేమిటంటే, హాషిమ్ కు పుట్టిన "షైబా" గురించి హాషిమ్ కుటుంబసభ్యులకు చాలా కాలం వరకు ఏమీ తెలియదు.

హాషిమ్ కు మొత్తం నలుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉండేవారు.

కుమారులు : - అసద్, అబూ సైఫీ, నజ్లా మరియు అబ్దుల్ ముత్తలిబ్ (షైబా)

కుమార్తెలు : - షిఫా, ఖాళిదా, జయీఫా, రుఖియా మరియు జంతా.

*హాషిమ్ సోదరుడు ముత్తలిబ్* 

హాషిమ్ చనిపోయిన తర్వాత, హాషిమ్ సోదరుడు ముత్తలిబ్ ఖురైష్ తెగకు అగ్రనాయకుడై, కాబా మందిరం నిర్వహణ బాధ్యతలు చేపట్టాడు. అయితే పది సంవత్సరాల తరువాత తన సోదరుడు హాషిమ్ కు కొడుకు పుట్టాడని, అతను మదీనాలో తన తల్లి సంరక్షణలో పెరుగుతున్నాడని తెలుసుకున్న ముత్తలిబ్, ఆ అబ్బాయిని తీసుకురావడానికి మదీనాకు బయలుదేరాడు.

హాషిమ్ సోదరుడు ముత్తలిబ్ గురించి Insha Allah రేపటి భాగములో మరింత వివరణగా తెలుసుకుందాము.

🖊🖊     ®@£€€q +97433572282  🖊🖊
                 (rafeeq)

🖊🖊  Salman      +919700067779 🖊🖊

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment