6

🕋🕋🕋🕋 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕋🕋🕋🕋

🛐🛐🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన *అల్లాహ్* పేరుతో ప్రారంభిస్తున్నాను 🛐🛐🛐🛐

------------------------------------------------

       ☪☪☪☪ *ఇస్లాం చరిత్ర* ☪☪☪☪

    భాగము - 6          Date : 16/11/2017

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*ఇబ్రహీం సంతానం*

త్వరలోనే బుద్ధికుశలతగల కొడుకు ఇస్ హాఖ్ మొదటి భార్య అయిన సారహ్ ద్వారా పుడ్తాడని మేము (అల్లాహ్) శుభవార్త అందజేన్తున్నాము అన్నారు. (ఖురాన్-15:53).

దానికి ఇబ్రహీం “ముందే ! ఈ ముసలితనంలో నాకు పిల్లలు పుడ్తారని శుభవార్త విన్పిస్తున్నారా మీరు, కాస్త ఆలోచించండి , ఎలాంటి వార్త విన్పిన్తున్నారో నాకు మీరు"అన్నాడు. (ఖురాన్15:54).

“మేము నీకు సత్యం తో కూడిన శుభవార్తే విన్పిన్తున్నాము. నీవు అనవసరంగా నిరాశచెందకు అన్నారు దైవదూతలు.” (ఖురాన్-15:55).

“మార్గభ్రష్టులే తమ ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు" అన్నాడు ఇబ్రహీం." (ఖురాన్-15:56).

“ఇబ్రహీం మొదటి భార్య సారాహ్ అలైహిస్సలామ్ ఈ మాట విని అరుస్తూవచ్చి, నెత్తీ నోరు బాదుకుంటూ ముసలిదాన్ని, గొడ్రాలిని నాకు సంతానమేమిటి అన్నది.” (ఖురాన్-51:29).

మేము ఆమెకు ఇస్ హఖ్ పుట్టుక గురించి, ఇస్ హాఖ్‌ తర్వాత యాఖూబ్ పుట్టుక గురించి శుభవార్త చెప్పాము.

దానికి సారహ్ "ఆయ్యో, నా పాడుగాను ! ఈ వయస్సులోనా నాకు సంతానం ? నేను పండు ముసలిదాన్నయిపోయానే ! నా భర్త కూడా ముసలివాడైపోయాడే ! చాలా విచిత్రంగా ఉందే !" అన్నది ఆశ్చర్యపోతూ (ఖురాన్ 11:71,72).

"అల్లాహ్ ఆజ్ఞ విని ఆశ్చర్యపోతున్నావా నీవు? ఇబ్రహీం కుటుంబ సభ్యులారా ! మీపై అల్లాహ్ యొక్క కారుణ్యం , ఆయన శుభాలు ఉన్నాయి. నిస్సందేహంగా అల్లాహ్ ఎంతో ప్రశంనీయుడు, మహోన్నతుడు" అన్నారు డైవదూతలు.” (ఖురాన్-11:73).

*ఇబ్రహీం ఆరాధన* 

మా ప్రభూ ! నా సంతానంలో కొందరిని పంటలు పండని కటికలోయలో, నీ పవిత్రగృహం వద్ద వసింపజేశాను. ప్రభూ ! వారు నమాజును నెలకొల్పేందుకే ఇక్కడ వదలిపెట్టాను. కనుక ప్రజలలో కొందరి మనసులు వారి వైపుకు మొగ్గేలా చేయి. వారికి తినటానికి పండ్లు ఫలాలను ప్రసాదించు వారు కృతజ్ఞులుగా మెలిగేందుకు. ప్రభూ! మేము దాస్తున్నదీ, బహిర్గతం చేస్తున్నదీ అంతా నీకు తెలుసు. భూమిలో గాని, ఆకాశాలలో గాని ఏ వస్తువూ అల్లాహ్‌ నుండి దాగి లేదు." (ఖురాన్ 14:37-38).

''ఈ ముసలితనంలో నాకు ఇస్మాయీల్‌, ఇస్‌హాఖులను ప్రసాదించిన అల్లాహ్‌కు కృతజ్ఞతలు. నిశ్చయంగా నా ప్రభువు మొరను ఆలకించేవాడు.''( ఖురాన్ 14:39).

''నా ప్రభూ! నన్ను నమాజును నెలకొల్పేవానిగా చెయ్యి. నా సంతతి నుండి కూడా ఈ వ్యవస్థను నెలకొల్పే వారిని నిలబెట్టు. ప్రభూ! నా ప్రార్థనను ఆమోదించు.'' (ఖురాన్ 14:40).

''మా ప్రభూ! నన్ను, నా తల్లిదండ్రులను, విశ్వాసులను లెక్క తేల్చే రోజున క్షమించు.'' (ఖురాన్ 14:41).

ఇబ్రహీం అల్లాహ్ ని ప్రార్థిస్తూ "ప్రభూ ! ఈ పట్టణాన్ని శాంతి నగరంగా చెయ్యి. ఇక్కడ నివసించే ప్రజల్లో దైవాన్ని, పరలోకాన్ని విశ్వసించే వారికి తినేందుకు అన్ని విధాల పండ్లు, ఫలాలు ప్రసాదించు" అన్నాడు. దానికి అల్లాహ్ "ఈ మూన్నాళ్ళ ప్రపంచంలో నేను విశ్వసించని కూడా ఎంతో కొంత ఉపాధినిస్తాను, ఈ మూన్నాళ్ల ప్రపంచంలోనే వారికి మంచి చేస్తాను. అయితే ఆ తర్వాత వారిని నరకాగ్ని వైపు ఈడుస్తాను. అదే వారికి ఘోరమైన ప్రదేశం" అని అన్నాడు. (ఖురాన్ 2:126).

*ఇబ్రహీం అలైహిస్సలామ్ తన భార్య హజీరా , కుమారుడు ఇస్మాయిల్ ను మక్కా లోని ఒక లోయ లో వదిలి వెళ్లిపోతున్న సందర్భం* 

ఇబ్రహీమ్ అలైహిస్సలాం తమ కొరకు వదిలి పెట్టి వెళ్ళిన అన్నపానీయాలు సేవిస్తూ హాజీరా, ఇస్మాయిల్ మక్కా లోయలో నివసించసాగారు. కొన్నాళ్ళకు వారి దగ్గర ఉన్న నీళ్లు అయిపోయాయి. పసి బిడ్డతో సహా ఆమె ఆకలిదప్పులతో అలమటించసాగారు. బిడ్డకు పాలు పట్టడానికి ఆమె రొమ్ముల్లో పాలు కూడా రావడం లేదు. పసిబిడ్డ ఆకలితో దయనీయంగా ఏడుస్తున్నాడు. హాజీరా కన్నీరుమున్నీరయ్యింది.ఆమె నిరాశగా పసిబిడ్డ వద్దకు వచ్చారు. బిడ్డ పరిస్థితి దయనీయంగా ఉంది. ”ఓ ప్రభూ! కరుణించు” అంటూ మొర పెట్టుకున్నారు.

బిడ్డ పరిస్థితి క్షణక్షణానికి దిగజారుతోంది. ఊపిరి మందగిస్తోంది. శ్వాస కష్టమవుతోంది. బాధాతప్త హృదయంతో, తన ఏకైక సంతానం కొన ఊపిరితో పెనుగులాడ డాన్ని ఆమె నిస్సహాయంగా చూడసాగారు. ఎండిపోయిన బిడ్డ గొంతు నుంచి ఎలాంటి ధ్వని రావడం లేదు. కేవలం కాళ్ళు కొట్టు కుంటున్న శబ్దం మాత్రం వినిపిస్తోంది. బిడ్డను అక్కడే నేల మీద వదలి నీటి కోసం, ఆహారం కోసం వెతుకాడుతూ తిరగ సాగారు.  ఆ సాద్వీమణి పిల్లవాణ్ణి ఓ చోట పండబెట్టి నీటి అన్వేషణ కొసం బయలుదేరారు.

ఆమె సమీపంలోని ‘సఫా’ కొండ పైకి ఎక్కి చూశారు ఎవరైనా బాటసారులు కనిపిస్తారని కాని ఎవరూ కనిపించకపోవడం తో ఆమె కొండ దిగి కిందికి  వచ్చారు. పిల్లవాడి పరిస్థితి చూడలేక ఆమె ఆందోళన పడుతూ ‘సఫా’ కొండ కు ఎదురుగా ఉన్న ‘మర్వా’ కొండ వైపు పరుగెత్తారు. దాని మీద ఎక్కిచూస్తే అక్కడా బాటసారులు ఎవరూ కన్పించలేదు. ఈ విధంగా ఆమె ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదికి, ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకు ఏడు సార్లు తిరిగారు.

ఏడవ సారి ‘మర్వా' కొండ ఎక్కినపుడు ఆమెకు దూరం నుంచి ఓ మానవ కంఠస్వరం విన్పించింది. మొదట్లో ఆమె అదేదో తన భ్రమ అనుకొని పట్టించుకోలేదు. జాగ్రత్తగా వి౦టే ఆ ధ్వని మాటిమాటికీ విన్పిస్తోంది. అపుడు హజ్రత్‌ హాజీరా (ఆలైహి) ధ్వని వస్తున్న వైపు తిరిగి “నేను నీ కంఠస్వరం విన్నాను. ఏదైనా సహాయం చెయగలిగితే చెయ్” అని అన్నారు. దానికి ఎలాంటి సమాధానం రాలేదు కాని, కొండ మీది నుంచి పిల్లవాడ్ని పండబెట్టిన వైపు చూస్తే అక్కడ ఓ అపూర్వదృశ్యం కనిపించింది. ఒక మనిషి ( జిబ్రాయిల్ అలైహిస్సలామ్ అల్లాహ్ యొక్క దైవదూత మనిషి ఆకారంలో వచ్చాడు )  నిలబడి కాలితో నేల మీద తట్టాడు, వెంటనే నేలలో నుంచి నీరు ఉబికి వచ్చింది.

హజ్రత్ హజీరా ఈ దృశ్యం చూడగానే గబగబా కొండ కిందికి దిగి అటువైపు పరుగెత్తారు. అక్కడకు చేరుకొని తొందర తొందరగా దొసిలితొ తోలుతిత్తిలో నీరు నింపుకున్నారు. ఆ నీటిని పిల్లవాడికి తాగించి, తాను కూడా కడుపార తాగారు. నేలలో నుంచి నీళ్లు ఇ౦కా ఉబికి వస్తూనే ఉన్నాయి. హజ్రత్ హాజీరా నీళ్లు వృధా పోకుండా ఉండేందుకు ఆ ఊట చుట్టూ ఇసుకతో కట్ట కట్టి జలధారను ఆపడానికి ప్రయత్నించారు. కట్ట కట్టగావే జలధార ఆగిపొయింది. ఆ అద్భుతమైన జలధార నే ”జమ్‌ జమ్‌” నీరు గా ప్రసిద్ధికెక్కాయి. 4000 సంవత్స రాల క్రితం నాటి ఈ జలధార నేటికి కూడా నిరంతరం ప్రవహిస్తూనే ఉంది.

*బలిదానం*  *: -* 

అపుడపుడు ఇబ్రహీమ్ అలైహిస్సలాం అక్కడికి వచ్చి, తన కుమారుడిని, భార్య ని చూసుకునేవారు. ఒకసారి అలా వచ్చినపుడు, ఇబ్రహీమ్ అలైహిస్సలాం కు ఒక కల వచ్చింది. దానిలో ఆయన తన  కుమారుడైన ఇస్మాయీల్ ను బలివ్వమని అల్లాహ్ తనను ఆజ్ఞాపించినట్లుగా ఆయన చూశారు. ప్రవక్తల స్వప్నాలు నిజ స్వప్నాలై ఉంటాయి. కాబట్టి, అప్పటికే తను ముసలివాడై చావుకు దగ్గరలొ ఉన్నా మరియు ఇస్మాయీల్ తన ఏకైక సంతానమై ఉన్నా కూడా, ఆయన అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించి , తన కుమారున్ని బలివ్వాలని నిర్ణయించుకున్నారు.

ఆత్మ విశ్వాసంతో ఇబ్రహీమ్‌ అలైహిస్సలామ్ మక్కాకు బయలు దేరారు. ఈ వార్తను తన కుమారునికి చెప్పడం ఆయనకు ఒక పరీక్ష వంటిదే. అయితే ఇస్మాయీల్‌ అలైహిస్సలామ్ కూడా తండ్రికి తగిన కుమారులు. ఆయన అనితర సాధ్యమైన ధైర్యసాహసాలను ప్రదర్శించారు.

అల్లాహ్ ఆదేశాన్ని అమలు చేయాలని ఆయన నిబ్బరంగా తన తండ్రికి చెప్పారు. ”నాన్నా! మీకు ఆజ్ఞా పించబడినట్లు చేెయండి. అల్లాహ్ కోరిన విధంగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని బదులిచ్చారు. (ఖురాన్ 37:102).

ఇస్మాయిల్ అలైహిస్సలామ్ తన దుస్తులు తొలగించారు. తల్లికి సలాము చెప్పాలని తండ్రిని కోరారు. తన గుర్తులుగా తన దుస్తులు తల్లికివ్వాలని చెప్పారు. తాను కాళ్ళు చేతులు కొట్టు కోవడం జరిగితే తన తండ్రికి బాధ కలుగుతుందన్న ఉద్దేశ్యంతో తన కాళ్ళను చేతులను కట్టేయాలని తండ్రిని కోరారు. ఇబ్రహీమ్‌ (అ) తన కత్తికి పదును పెట్టారు. ఆ విధంగా ఇస్మాయీల్‌ (అ)కు మృత్యు బాధ లేకుండా ఉండాలని భావించారు. కుమారుడిని గట్టిగా కౌగలించుకుని రోదించారు. తర్వాత ఇస్మాయీల్‌ (అ)ను పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేశారు. బాధాతప్త హృదయంతో కుమారుణ్ణి చివరిసారిగా చూసుకున్నారు.

బరువెక్కిన హృదయంతో ఇస్మాయిల్ ను బలిఇవ్వడానికి కత్తిని ఎత్తారు. ఇస్మాయీల్‌ (అ) గొంతుపై వేటు వేశారు. కాని ఆ కత్తి గొంతును కోయలేదు. తన తండ్రి తగినంత గట్టిగా కోయాలని తండ్రితో చెప్పారు. ఇబ్రహీమ్‌ (అ)అలాగే చేశారు. అయినా ఆ కత్తి గొంతును కోయలేదు. ఇబ్రహీమ్‌ (అ) ఆశ్చర్యపోయారు. (ఖురాన్ 37:103).

తన బలహీనతను క్షమించవలసినదిగా ఇబ్రహీం అల్లాహ్‌ ను వేడుకున్నారు.

ఆయన వేడుకోలుకు అల్లాహ్ ఇలా బదులిచ్చాడు. ”ఇబ్రాహీమ్‌ (అ)! నీవు నిజంగా కలను సార్థకం చేశావు. మేము నీ విధేయతకు బహుమానం ప్రసాదిస్తున్నాము” అన్నాడు. ఆ తండ్రీకొడుకులు అల్లాహ్ ఆదేశం శిరసావహిండానికి క్షణం వెనుకాడలేదు. అల్లాహ్‌ కు కావలసింది బలి కాదు. తన ఆదేశాల పట్ల వారు చూపిన నిబద్ధతనే ఆయన పరీక్షించాడు. తండ్రీ కొడుకులు అల్లాహ్ కారుణ్యం పట్ల కృతజ్ఞతలు అర్పించారు. ( ఖురాన్ 37:104-107).

ఇస్మాయీల్‌ (అ)కు బదులుగా జిబహ్‌ చెయ్యడానికి ఆ దగ్గరలోనే ఒక పెద్ద పొట్టేలు కనబడింది. అంతకు ముందు కోయడానికి మొండికేసిన కత్తి ఆ పొట్టేలు గొంతును ఒక్క వేటుకు కోసింది. ఈ సంఘటనను స్మరిస్తూ ప్రతి సంవత్సరం ఈదుల్‌ అజ్హా (ఖుర్బానీ పండుగ) సందర్భంగా ఖుర్బానీ ఇవ్వడం జరుగుతుంది.

ఆ తర్వాత ఇస్మాయీల్‌ (అ) ఒక అందమైన యువకునిగా ఎదిగారు. జుర్‌హుమ్‌ తెగవారి వద్ద ఆయన అరబీ భాషను నేర్చు కున్నారు. ఈ తెగకు చెందిన అమ్మాయినే వివాహమాడారు. ఆయన చాలా ఆనందంగా జీవితాన్ని గడుపసాగారు. ఆయన జీవితంలో ఎదురైన ఒకే ఒక్క దుఃఖకరమైన సంఘటన ఆయనను అమితంగా ప్రేమించిన మాతృమూర్తి తనువు చాలించడం. ఇస్మాయీల్‌ (అ)ను కంటికి రెప్పలా సాకిన హాజీరా అలైహిస్సలామ్ మరణించిన సంఘటన ఆయన్ను విపరీతంగా కలచివేసింది.

Insha Allah ఇస్లాం చరిత్ర లో నే ఒక ముఖ్యమైన ఘట్టం గా పేర్కొనే కాబా నిర్మాణం గురించి రేపటి భాగము - 7 లో తెలుసుకుందాము.

*ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-* 

ప్రియమైన సోదరులారా !  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరుల కు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు . పై వన్నీ తెలుసుకోవాలంటే ముందు మన ఇస్లాం చరిత్ర ఏమిటో తెలుసుకోవాలి . నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి , ఇదేదో 10 మందికి send చేస్తే మంచి జరుగుతుంది , send చేయకపోతే చేడు జరుగుతుంది అనుకునే msg లు కావు . కాబట్టి మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .

No comments:

Post a Comment