25

🤚🏻✋🏻🤚🏻✋🏻 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🤚🏻✋🏻🤚🏻✋🏻

🛐🕋🛐🕋 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* ☪🕋☪🕋

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

       🕌🕋🕌🕋 *ఇస్లాం చరిత్ర* 🕋🕌🕋🕌

                         *భాగము - 25* 

____________________________________________

*యాదృచ్చిక హత్య* 

అల్లాహ్ మూసా (అలైహి) కు మంచి ఆరోగ్యం, శారీరక బలం, వివేకం, విజ్ఞానాలు ప్రసాదించాడు. బలహీనులు, అణగారిన వారు రక్షణ కోసం, న్యాయం కోసం మూసా (అలైహి) వద్దకు వచ్చేవారు.

ఒకరోజు నగరవాసులు ఏమరపాటులో ఉన్నపుడు మూసా (అలైహి) రాజధాని నగరంలోకి ప్రవేశించారు. అక్కడ ఒక చోట ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకోవడం మూస (అలైహి) చూశారు. అందులో ఒక వ్యక్తి తన జాతివాడే. ఇంకొకడు తన విరోధి జాతి కి చెందినవాడు. ఒక ఈజిప్టు వ్యక్తి మూసా (అలైహి) జాతివాడైన బనీఇస్రాయీల్ వ్యక్తిని కొడుకున్నాడు. మూస (అలైహి) ను చూసిన బనీఇస్రాయీల్ వ్యక్తి సహాయం కోసం మూసా (అలైహి) తో వేడుకున్నాడు. మూస (అలైహి) ఈ తగాదాలో జోక్యం చేసుకున్నారు. ఆ ఈజిప్టు వ్యక్తి దౌర్జన్యం చేయసాగాడు. మాటా మాటా పెరిగింది. పట్టరాని ఆగ్రహంతో మూసా (అలైహి) ఈజిప్టు వ్యక్తిని పిడుగుద్దు తో బలంగా ఒక్క గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకు వాడు అక్కడికక్కడే మరణించాడు. ఒక్క గుద్దు వల్ల ఆ దౌర్జన్యపరుణ్ణి కడతేర్చాడు మూసా (అలైహి). తన వల్ల ఒక హత్య జరిగిందని, తన వల్ల ఒక మనిషి మరణించాడని గ్రహించిన మూస (అలైహి) చాలా బాధపడ్డారు.

ఈ హఠాత్పరిణామానికి మూసా (అలైహి) కంగారుపడుతూ "ఇది షైతాన్ చర్య, షైతాన్ మానవులకు బద్ధ విరోధి, పెడదారి పట్టించే పరమ దుర్మార్గుడు." అని అన్నాడు. తర్వాత మూసా (అలైహి) అల్లాహ్ తో క్షమాభిక్షను వేడుకున్నారు. "ఓ ప్రభు! చంపాలన్న ఉద్దేశ్యం నాకు లేదు, యాధృచికంగా హత్య జరిగింది. నేను నా ఆత్మకు అన్యాయం చేసుకున్నాను, నన్ను క్షమించు." అని అల్లాహ్ కు మొరపెట్టుకున్నారు. అల్లాహ్ మూసా (అలైహి) ను క్షమించాడు. అల్లాహ్ గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు.

అల్లాహ్ క్షమించిన తర్వాత మూసా (అలైహి) కు మనసులో సంతృప్తి వంటి భావం కలిగింది. ఆ పిదప మూసా (అలైహి) ఇతరుల పట్ల అత్యంత సహనాన్ని చూపడం ప్రారంభించారు. "ఓ ప్రభు! నీవు నాకెంతో మేలు చేశావు. ఇక ముందు నేను ఎప్పుడూ నేరస్తులకు సహాయపడను." అని ప్రతిజ్ఞ చేశాడు.

ఆ తర్వాత మూసా (అలైహి) రాజశాసనానికి భయపడి, ఏమి జరగనున్నదో అని గాభరా పడసాగాడు.

మరునాడు ఉదయం మూసా (అలైహి) భయపడుతూ, ప్రమాద సూచనలు పసిగడుతూ నగరంలోకి ప్రవేశించారు. అపుడు అకస్మాతుగా నిన్నటిలాగా అదే బనీఇస్రాయీల్ వ్యక్తి మరో ఈజిప్టు వ్యక్తితో పోట్లాడుతూ కనపడ్డాడు. మూస (అలైహి) ని చూసిన ఆ బనీఇస్రాయీల్ వ్యక్తి మళ్ళీ మూసా (అలైహి) ని సహాయం కోసం పిలిచాడు. మూసా (అలైహి) అతని వద్దకు వెళ్లి "నువ్వు చాలా దుర్మార్గుడిలా, జగడాలమారిలా, తంపులమారిగా వున్నావే. ప్రతిరోజూ ఎవరో ఒకరితో పోట్లాడుతుంటావా?" అని అన్నారు. ఆ తర్వాత మూసా (అలైహి) ఈజిప్టు జాతికి చెందిన వాడిపై దాడి చేయబోయాడు. మూస (అలైహి) తనను కూడా కొడతారేమో అని ఆ బనీఇస్రాయీల్ వ్యక్తి భయపడ్డాడు. భయంతో గట్టిగా అరుస్తూ "మూస (అలైహి) నిన్న వాడిని చంపినట్టుగా, నేడు నన్ను కూడా చంపేస్తావా? నువ్వు ఈ దేశంలో క్రూరుడిగా ఉండదలిచావా, సంస్కరణ కార్యాలు చేయడం ఇష్టం లేదా!" అని అన్నాడు. అపుడు ఆ బనీఇస్రాయీల్ వ్యక్తి తో పోట్లాడుతున్న ఈజిప్టు వ్యక్తి ఈ మాట విన్నాడు. మూస (అలైహి) గురించి వెంటనే రాజాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ అధికారులు విచారణ జరపాలని నిర్ణయించుకున్నారు. నిందితులు ఎవరైనా సరే శిక్షించాలని అనుకున్నారు. రాజ్యాధికారులు మరణశిక్ష విధించడం కోసం మూసా (అలైహి) ని వెతకడం ప్రారంభించారు. ఒక వ్యక్తి ని అకారణంగా చంపితే, చంపిన వ్యక్తి కి కూడా మరణశిక్ష అమలు చేసేవిధంగా అక్కడి చట్టం అమలులో ఉంది.

ఆ తర్వాత రాజదర్బారులోని ఒక సజ్జనుడు నగరం అగ్రభాగాన నుంచి మూసా (అలైహి) వద్దకు పరుగున వచ్చి, "మూస! అధికారులు నీపై ఫిర్యాదులు స్వీకరించారు. నీ కోసం వెళుతున్నారు. దీనిపై విచారణ జరగొచ్చు, ఉన్నతాధికారులు నిన్ను చంపే విషయమై చర్చలు జరుపుతున్నారు, నువ్వు తొందరగా ఎటయిన పారిపో. నీ శ్రేయోభిలాషిని చెబుతున్నా" అని సలహా ఇచ్చాడు. ఈ సంగతి వినగానే మూసా (అలైహి) భయపడి, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఒక ఈజిప్టు వాడిని చంపితే మరణశిక్ష పడుతుందని చట్టం ఆ విధంగా ఉందని మూసా (అలైహి) కు తెలుసు.

*నగరాన్ని విడిచిన మూసా (అలైహి)* 

అలా భయంతో రాత్రి చీకటిలో మూస (అలైహి) నగరాన్ని విడిచి వెళ్లిపోయారు. "అల్లాహ్! నన్ను ఈ దుర్మార్గుల నుంచి కాపాడు." అని మూసా (అలైహి) అల్లాహ్ ను ప్రార్థిస్తూ నగరం దాటారు. మద్యన్ దిశగా పయనించారు. ఆ సమయంలో మూసా (అలైహి) "నా ప్రభువు నన్ను సరైన దారిలో నడిపిస్తాడు అని ఆశిస్తున్నాను" అని అనుకున్నాడు. సిరియా, ఈజిప్టు లకు మధ్యన ఉన్న జనావాస ప్రాంతం అది. వేడి గాల్పుల ఆ ఎడారి దారిలో ఆయన ఒంటరిగా, కేవలం అల్లాహ్ తోడుగా ప్రయాణించారు. మూస (అలైహి) వెంట ఉన్న సామగ్రి దైవభీతి మాత్రమే. దారిలో ఆకలి తీర్చుకోవడానికి గడ్డిపరక కూడా లభించలేదు. వేడి ఇసుక ఆయన కాళ్లను కాల్చసాగింది. కానీ ఫిరౌన్ సైన్యం తనను వెంటాడుతోందని ఆందోళన వల్ల ఆయన ప్రయాణం ఆపలేదు. ఆ విధంగా మూస ఎనిమిది రాత్రులు ప్రయాణించారు. పగటిపూట ఎక్కడైనా దాక్కుని గడిపేవారు.

ఆ విధంగా ప్రధాన ఎడారి భాగాన్ని దాటిన తర్వాత, మూస (అలైహి) మద్యన్ ప్రాంతంలోని ఒక బావి వద్దకు చేరుకున్నారు. అక్కడ అనేకమంది గొర్రెల కాపరులు తమ గొర్రెల కు నీళ్లు తాగిస్తూ కనిపించారు. మూసా (అలైహి) ఆ బావి దగ్గర కూర్చున్నారు. నీళ్లు తాగడానికి తనవంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అక్కడకి కొంచెం దూరంగా ఇద్దరు అమ్మాయిలు తమ గొర్రెలను ఆపుకొని నీటి కోసం నిరీక్షిస్తూ నిలబడి ఉండటాన్ని మూస (అలైహి) గమనించారు. ఆయనలో ఆసక్తి కలిగింది. మూసా (అలైహి) వారి వద్దకు వెళ్ళి "మీ సమస్య ఏమిటి?" అని అడిగారు. దానికి ఆ అమ్మాయిలు "అక్కడ ఉన్న గొర్రెల కాపరులు చాలా మొరటవాళ్లు, మేము ఆడవాళ్లం అయినందువల్ల మా గొర్రెలకు నీళ్లు పట్టడానికి అవకాశం దొరకడం లేదు, ఈ కాపరులు తమ గొర్రెలకు నీళ్లు తాగించి తొలుకుని వెల్లనంతవరకు, మేము మా గొర్రెలకు నీళ్లు త్రాగించలేము. మా తండ్రి చాలా ముసలివారు, అందువల్ల గొర్రెలకు తామే నీళ్లు పట్టి తీసుకువెళ్ళవలసి ఉంటుంది." అని తెలిపారు. ఈ సంగతి విన్న మూస (అలైహి) వారి గొర్రెలను తీసుకొని నీళ్లు పట్టడానికి బావి వద్దకు వెళ్లారు. పొడవుగా బలిష్టంగా ఉన్న మూసా (అలైహి) ను చూసిన ఆ గొర్రెల కాపరులు దారి విడిచారు. తర్వాత మూసా (అలైహి) గొర్రెలకు నీళ్లు పట్టి, నీటి సంచులు నింపి, తాను కడుపారా నీళ్లు తాగారు.

ఆ పిదప బావి దగ్గర నీడలో సేద తీర్చుకుంటూ కూర్చున్నారు మూస (అలైహి). అల్లాహ్ సహాయం కోసం, మార్గదర్శకత్వం కోసం ప్రార్థించసాగారు. "ప్రభు! నీవు నాకు ఎలాంటి శ్రేయస్సు పంపిన అది నాకు ఎంతో అవసరం" అని అన్నారు.

ఆ అమ్మాయిలు అక్కడి నుంచి ఇంటికి వెళ్లే ముందు మూసా (అలైహి) వద్దకు వచ్చి కృతజ్ఞతలు తెలిపి ఇంటికి వెళ్లిపోయారు. అపుడు ఆ అమ్మాయిలు ప్రతిరోజు కన్నా కాస్త ముందుగానే ఇంటికి చేరుకున్నారు. త్వరగా ఇంటికి చేరుకున్న వారిని చూసి వారి తండ్రి ఆశ్చర్యపోయారు. "ఈ రోజు చాలా త్వరగా వచ్చేశారే!" అని వారి తండ్రి ప్రశ్నించగా, ఆ అమ్మాయిలు జరిగిన వృత్తాంతాన్ని తమ తండ్రికి వివరించారు. మూస (అలైహి) వల్ల తాము త్వరగా ఇంటికి రావడం సాధ్యమైందని చెప్పారు. దానికి ఆ తండ్రి మూసా (అలైహి)ని ఇంటికి పిలుచుకు రావలసిందిగా తన ఇద్దరి అమ్మాయిలలో ఒక అమ్మాయిని పంపించాడు.

తర్వాత ఆ అమ్మాయి సిగ్గుపడుతూ మూస (అలైహి) వద్దకు వెళ్లి తన తండ్రి పంపిన సందేశాన్ని వినిపించింది. "మీరు చేసిన సహాయానికి మా నాన్నగారు చాలా చాలా కృతజ్ఞతలు తెలిపారు. మీరు మా పశువులకు నీరు తాగించి చేసిన మేలుకు మా తండ్రిగారు మీకు ప్రతిఫలం ఇవ్వడానికి ఇంటికి ఆహ్వానించారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావలసి ఉంటుంది." అని చెప్పింది. మూస (అలైహి) ఈ ఆహ్వానాన్ని మన్నించారు. ఆ అమ్మాయి వెంట వారి ఇంటికి వెళ్లారు. వారి ఇంటికి చేరుకున్న మూసా (అలైహి), అక్కడ ఆ కుటుంబసభ్యులు సౌకర్యవంతంగా, సంతోషంగా జీవిస్తున్న కుటుంబంగా గుర్తించారు. ఆ వృద్ధునికి తనను తాను పరిచయం చేసుకున్నారు మూస (అలైహి). ఆపై తన పై వచ్చిన ఆపద గురించి వివరించారు. ఈజిప్టు వదిలి ఎందుకు రావాల్సి వచ్చిందో కూడా తెలియజేశారు. ఆ వృద్ధుడు ఆయనకు ఊరటనిస్తూ భయపడవద్దని దుర్మార్గాల నుంచి తప్పించుకుని వచ్చేసినట్టేనని అని, మూసా (అలైహి) భయాన్ని పోగొట్టాడు.

మూసా (అలైహి) సఛ్ఛీలాన్నీ, సద్వర్తలను ఆ వృద్ధుడు మరియు ఆతని కుమార్తెలు గమనించారు. మూసా (అలైహి) ను తన ఇంటనే ఉండవలసిందిగా ఆ వృద్ధుడు కోరాడు. దానికి మూసా (అలైహి) అంగీకరించారు. ఆ కుటుంబసభ్యులు అల్లాహ్ కి భయపడే సద్వర్తనులు.

వృద్ధుని కుమార్తెలలో ఒక అమ్మాయి : - మూసా (అలైహి) లాంటి బలిష్టుడిని, నిజాయితిపరుణ్ణి ను మన వద్దే పనిలో పెట్టుకుంటే బావుంటుంది. మూసా (అలైహి) బలిష్టంగా ఉన్న యువకుడు, నమ్మకస్తుడు. కాబట్టి పనిలో పెట్టుకోవడం మంచిది (అని తన తండ్రితో సలహా ఇచ్చింది.)

[మూసా (అలైహి) వంటి యువకుడి అవసరం వారికి ఉంది. ముఖ్యంగా బావి వద్ద, మొరటు జనం గుమిగూడే ప్రాంతాల్లో అలాంటి యువకుని అవసరం ఎంతయినా ఉంది.]

వృద్ధుడు : - మూసా (అలైహి) నమ్మకస్తుడని స్వల్పకాలం చెప్పడం లో ఎలా సాధ్యం?

ఆ అమ్మాయి జవాబిస్తూ : - నేను మూసా (అలైహి) ని ఇంటికి రమ్మని ఆహ్వానించినపుడు, మూసా(అలైహి) నన్ను తన వెనుక నడవమన్నాడు. ఆ విధంగా నేను ముందు నడవడం, నాపై తన దృష్టి పడటం జరగకుండా జాగ్రతపడ్డాడు. ఏ విధమైన వికారాలకు అవకాశం లేకుండా మసులుకున్నాడు.

ఈ మాటలు విని వృద్ధునికి నమ్మకం కలిగింది. అపుడు ఆ వృద్ధుడు మూసా (అలైహి) వద్దకు వెళ్లి.......

వృద్ధుడు : - నా ఇద్దరు కుమార్తెలలో ఒక అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. కానీ ఒక షరతు, నువ్వు ఎనిమిది సంవత్సరాలు నా వద్ద పని చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవాలి. పది సంవత్సరాలు పని చేయాలనుకుంటే ఇంకా మంచిది, అది నీ ఇష్టం. అల్లాహ్ తలిస్తే నీవు నన్ను మంచివాడిగా చూస్తావు.

[ఆ కాలంలో యువకులు కష్టపడి పనిచేసి పెళ్లికి అర్హులుగా నిరూపించుకోవలసి ఉండేది.]

మూసా (అలైహి) : - మీ ప్రతిపాదన నాకు నచ్చింది. ఈ వ్యవహారం మీకు, నాకు మధ్య జరిగింది. ఎనిమిది (లేక) పది సంవత్సరాల గడువులో ఏదో ఒకదాన్ని పూర్తి చేస్తాను. ఆ తర్వాత నా మీద మరెలాంటి భారం వేయకూడదు. మనం చేసుకున్న ఈ ఒప్పందానికి అల్లాహ్ నే సాక్షి.

[కొత్త దేశంలో అపరిచితునిగా వచ్చిన మూసా (అలైహి) కు ఆశ్రయం, ఉపాధి ఎలాగూ అవసరమే. మూసా (అలైహి) ఆ ఇద్దరు అమ్మాయిలలో ఒక అమ్మాయి ని వివాహం చేసుకొని వృద్ధుని పశువుల సంరక్షణ చూడసాగారు. ఆ విధంగా తన ఒప్పందం కన్నా రెండు సంవత్సరాలు ఎక్కువగా పది సంవత్సరాల పాటు అక్కడ పని చేశారు.]

*ఈజిప్టు కి తిరుగు పయనం* 

మూసా (అలైహి) ఎలాంటి సమస్య లేని జీవితం గడుపుతున్నప్పటికి ప్రశాంతంగా ఉండలేకపోయారు. ఆయనకు ఎల్లప్పుడూ తన జాతి ప్రజలైన బనీఇస్రాయీల్ ప్రజల కష్టాలు, సమస్యలే గుర్తుకువచ్చేవి. శిక్ష గురించిన భయం వెంటాడుతున్నప్పటికి, నిర్ణీత సమయం ముగిశాక అల్లాహ్ పై భారం వేసి తన భార్య తో సహా ఈజిప్టు రాజ్యానికి బయలుదేరారు. తనను అల్లాహ్ కాపాడుతాడనే నమ్మకంతో ప్రయాణమయ్యారు. మూసా (అలైహి) కు వ్యక్తిగత స్వార్థాలు ఏవీ లేవు. ఆయన కోరేది బానిసత్వంలో మగ్గుతున్న తన ప్రజలను రక్షించడం.

ఈజిప్టు రాజ్యానికి వెళ్లిన తర్వాత, అక్కడ ఏమి జరిగిందన్న విషయమై Insha Allah రేపటి భాగము - 26 లో తెలుసుకుందాము.

*ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-* 

ప్రియమైన ముస్లిం సోదరులారా!  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి , ఇదేదో 10 మందికి send చేస్తే మంచి జరుగుతుంది , send చేయకపోతే చేడు జరుగుతుంది అనుకునే msg లు కావు . కాబట్టి మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .

®@£€€q                    +97433572282

No comments:

Post a Comment